ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు.
విజయవాడ: ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు. అవినీతికి తావులేకుండా ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జన్నభూమి కమిటీలతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని మండిపడ్డారు. ఆ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యాయని పార్థసారథి విమర్శించారు.