Free sand
-
జీఎస్టీ చెల్లించాలి..మీరే తవ్వించుకోవాలి
సాక్షి, అమరావతి : ఉచిత ఇసుక పథకంలో ప్రభుత్వం మరో కొత్త మెలిక పెట్టింది. వినియోగదారులే రీచ్‌లకు కార్మికులను తీసుకెళ్లి, తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని తెలిపింది. అలా తవ్వించుకోలేకపోతే అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు వారికి డబ్బు చెల్లించి తవ్వించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలా ఉచిత ఇసుక పథకంలో పలు మార్పులు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక రీచ్‌లను ఇప్పటికే ప్రైవేటు వారికి అప్పగించిన ప్రభుత్వం.. వారు ఇసుక సరఫరా చేయాలంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు ఇతర రుసుములు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చెల్లించిన వాటికి రశీదులు కూడా ఇస్తారని తెలిపింది. ఒకవేళ వారితో పని లేదనుకుంటే సొంతంగా రీచ్‌కు లేబర్ని తీసుకువెళ్లి ఇసుకను తవ్వించి, రవాణా వాహనాల్లోకి లోడ్ చేయించుకుని తీసుకెళ్లాలని తెలిపింది. ఇలా చేయడం ఏ వినియోగదారుడికీ సాధ్యమయ్యే పరిస్థితి ఉండదని తెలిసి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం గమనార్హం. అంటే ఎవరైనా తప్పనిసరిగా ప్రైవేటు వారిపై ఆధారపడాల్సిందే. వారికి డబ్బు కట్టాల్సిందే. అందుకే ఇసుక రీచ్‌లన్నింటినీ ప్రైవేటు ఏజెన్సీలే నిర్వహిస్తాయని మార్గదర్శకాల్లో తెలిపింది. ఒకవేళ ఎవరైనా లేబర్‌ను తీసుకెళ్లి తవ్వుకోవాలని ప్రయత్నించినా, అక్కడున్న ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు అంగీకరించరన్నది సుస్పష్టం. ఏతావాతా ఉచితం పేరుకే కానీ, నయా పైసలతో సహా వసూలు చేయాలన్నది చంద్రబాబు సర్కారు వ్యూహంలా ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇసుక తవ్వకాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జరుగుతాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బల్క్ వినియోగదారుల కోసం ఇసుక కమిటీలు ప్రత్యేకంగా ఇసుక వనరులను రిజర్వు చేయవచ్చని తెలిపింది.తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక ఇలా తీసుకెళ్లాలి» అనుమతించిన రీచ్‌లు, డీసిల్టేషన్ పాయింట్ల (సరఫరా ప్రదేశాలు) నుంచి మాత్రమే ఇసుక సరఫరా అవుతుంది. » ఇసుక కోసం ఆన్లైన్లో లేదా సరఫరా పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి» రిజిస్టర్ చేసుకున్నాక జారీ అయ్యే ఈ–ట్రాన్సిట్/పర్మిట్ ద్వారా వినియోగదారుడు సొంత వాహనం లేదా మైనింగ్ శాఖ రిజిస్టర్ చేసిన వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి» ఆ వాహనం ఖర్చును వినియోగదారులు నేరుగా రవాణాదారులకే చెల్లించాలి» ఆ తర్వాత రవాణాదారు లేదా వినియోగదారు ఇసుక పాయింట్ వద్ద ఉన్న ఇన్‌ఛార్జి వద్దకు వెళ్లి డెలివరీ తేదీ, టైమ్ స్లాట్ తెలుసుకోవాలి»టైమ్ స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయానికి రవాణాదారు రీచ్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గానీ, సొంత కార్మికుల ద్వారా గానీ ఇసుకను తవ్వించుకుని వాహనంలో లోడ్ చేయించుకోవాలి» లేబర్‌ను తీసుకెళ్లలేక అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు ఏజెన్సీ సహాయాన్ని పొందాలనుకుంటే జిల్లా ఇసుక కమిటీలు నిర్ణయించిన రేట్లు చెల్లించాలి» అలా డబ్బు కట్టి తీసుకెళ్లే వాహనానికి ‘ఉచిత ఇసుక రవాణా వాహనం’ అనే పేరుతో ఉన్న బ్యానర్‌ను తప్పనిసరిగా ఉండాలి. » స్థానికంగా ఉన్న ఇసుకను ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యక్తిగత, కమ్యూనిటీ పనుల కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లలో మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలా తీసుకెళ్లే ఇసుకను యంత్రాలతో కాకుండా మనుషులతో మాత్రమే తవ్వించుకొని తీసుకెళ్లాలి. ఈ తవ్వకాలు, తరలింపు సమాచారాన్ని ఆన్లైన్లో లేదా స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగానే ఇవ్వాలి.» ప్రభుత్వం, మైనింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ఇసుక రీచ్‌లలో మిగిలిన ఇసుకను జిల్లా కమిటీలు ఇసుక రీచ్‌లు లేని జిల్లాల కోసం రిజర్వు చేస్తాయి. ఇందుకోసం ఇసుక రీచ్‌లు లేని జిల్లాల కమిటీలు వాటి జిల్లాల్లో ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసి, వాటికి మినరల్ డీలర్ లైసెన్సులు (ఎండీఎల్) జారీ చేయాలి. లైసెన్సు పొందిన ఏజెన్సీలు నిర్దేశించిన రీచ్ నుంచి, నిర్దేశించిన ధరకు ఇసుకను తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలి. ఇందులోనే రవాణా, ఆపరేషన్, నిర్వహణ ఛార్జీలు ఉంటాయి.సీనరేజికి మాత్రమే మినహాయింపు.. జీఎస్టీ చెల్లించాల్సిందే..ఇసుకకు సీనరేజితోపాటు జీఎస్టీ కూడా రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ, మార్గదర్శకాల్లో మాత్రం సీనరేజిని మాత్రమే మినహాయించారు. టన్నుపై రూ.88గా వసూలు చేస్తున్న సీనరేజి ఫీజును మాత్రమే వసూలు చేయకుండా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
ఉచితంగా ఇసుక ఎక్కడైనా ఇచ్చారా?
ఇసుక పేరిట దోపిడీకి ఎంత దారుణంగా స్కెచ్ గీశారంటే... అందరూ దసరా పండుగ హడావుడిలో ఉండగా 108 రీచ్‌లకు టెండర్లు పిలిచారు. బిడ్ల దాఖలుకు కేవలం రెండు రోజులే గడువు ఇచ్చారు. రెండు రోజుల్లో టెండర్ దాఖలు చేయడం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా? ఎందుకంటే అన్ని రీచ్‌లు టీడీపీ కూటమి మాఫియా సభ్యులకే కట్టబెట్టడం... ఆ తర్వాత నీకు ఇంతా.. నాకు ఇంతా.. అని పంచుకోవడమే వారి లక్ష్యం. ప్రభుత్వం దగ్గరుండి తమ వారితో కలిసి దోచేసే కార్యక్రమం చేస్తోంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. మరి రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్కరికైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా?’’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు.దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇసుక టెండర్లకు కేవలం రెండు రోజులే సమయం ఇచ్చారని.. అదీ దసరా పండుగలో అందరూ నిమగ్నమై ఉన్నప్పుడు తన మాఫియాకు ఇసుక రీచ్‌లను చంద్రబాబు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధిక ధరలకు ఇసుక అమ్ముకుంటూ ఎమ్మెల్యేలు, చంద్రబాబు నీకింత నాకింత అంటూ దోచేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..దోపిడీకి నిదర్శనం టెండర్ నోటిఫికేషన్ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇసుక టెండర్ డాక్యుమెంటే నిదర్శనం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందేమో మీరే పరిశీలించండి. దసరా పండుగ సమయంలో 108 రీచ్‌లకు టెండర్లు పిలిచారు. బిడ్డింగ్‌కు రెండే రెండు రోజులు గడువిచ్చారు. ఈనెల 8న టెండర్లు ఆహ్వానించారు. బిడ్ దాఖలుకు తుది గడువుగా పదో తేదీని నిర్ణయించారు. రెండు రోజుల్లో టెండర్ దాఖలు చేయడం ఎక్కడైనా చూశామా? ఎందుకంటే బయట వాళ్లెవరూ టెండర్లలో బిడ్లు వేయకూడదనే! ఒకవేళ ఇతరులు టెండర్లో బిడ్ దాఖలు చేస్తే వాళ్లను బెదిరించే మాఫియా తయారవుతుంది. బయట వారికి చాన్స్ ఇవ్వకుండా అన్ని రీచ్‌లు తమ మాఫియా సభ్యులకే కట్టబెట్టడం, ఆ తర్వాత నీకు ఇంత.. నాకు ఇంత! అని పంచుకోవడం. ప్రభుత్వం దగ్గరుండి తమ వారితో కలిసి దోచేసే కార్యక్రమం చేస్తోంది. ఇదీ ఇసుక మాఫియా తీరు. 2014–19 మధ్య కూడా ఇదే రకమైన మోడస్ ఆపరండా సాగింది. అప్పట్లో ఇసుక మాఫియా గురించి చెప్పాలంటే... తొలుత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత ఉచిత ఇసుక అని మెమో ఇచ్చి తమకు కావాల్సిన మనుషులకు ఇసుక రీచ్‌లు అప్పగించారు. చంద్రబాబు ఇంటి పక్కనే పొక్లెయిన్లు పెట్టి యథేచ్చగా ఇసుకను తవ్వేయడం మనమంతా కళ్లారా చూశాం. ఈరోజు మళ్లీ సేమ్ టూ సేమ్.. అదే దోపిడీ పునరావృతమవుతోంది. ఇప్పుడు బీజేపీకి భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉండడంతో భయం.. భక్తి లేకుండా నిస్సిగ్గుగా బట్టలిప్పేసి మరీ దోచుకుంటున్నారు. టెండర్లకు 2 రోజులు గడువు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం.లారీ ఇసుక రూ.60 వేలుఖజానాకు ఆదాయం సున్నాఉచిత ఇసుక పేరిట దోపిడీకి ఎంత దారుణంగా స్కెచ్ గీశారో చూడండి.. ఇసుక ధర చాలా ఎక్కువగా ఉందంటూ ఎన్నికలకు ముందు దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు అదే చంద్రబాబు.. కూటమి నేతలను అడుగుతున్నా. రాష్ట్రంలో దాదాపుగా 141 నియోజకవర్గాల్లో సగటున లారీ ఇసుక రూ.20 వేలకుపైగా ఉంది. 53 నియోజకవర్గాల్లో రూ.30 వేలు ఉంటే.. కొన్ని నియోజకవర్గాల్లో లారీ ఇసుక ఏకంగా రూ.60 వేలు పైగా ఉంది. ఒకవైపు ఇసుకేమో ఉచితం అంటారు. మరోవైపున చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సున్నా అయిపోయింది. రేట్లు చూస్తే గతం కంటే రెండింతలు.. మూడింతలు పెరిగాయి. మరి ఉచిత ఇసుక అంటే ఇదేనా? వైఎస్సార్సీపీ హయాంలో వర్షాకాల అవసరాల కోసం మేం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే అందులో సగానికిపైగా ఇసుకను దోచేయడం వాస్తవం కాదా? వాళ్ల దోపిడీకి స్టాక్ యార్డులన్నీ ఖాళీ అయిపోయాయి. పారదర్శకంగా ఇసుక పాలసీ అమలు చేశాంమా ప్రభుత్వంలో ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేశాం. ఎక్కడా దోపిడీకి అవకాశం లేకుండా మా పాలసీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ ఫారమ్ ద్వారా ఈ–టెండరింగ్ పిలిచాం. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు ఆదాయం వచ్చేలా అధిక ధరకు కోట్ చేసిన బిడ్డర్లను ఎంపిక చేశాం. టన్ను ఇసుకకు రూ.475తో మైనింగ్ చేసే విధంగా కాంట్రాక్టు ఇచ్చి.. అందులో రూ.375 ప్రభుత్వానికి రాయిల్టీ రూపంలో చెల్లించేలా చేశాం. అలా సంవత్సరానికి రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేశాం. కానీ.. ఈ రోజు పేరుకు మాత్రమే ఉచిత ఇసుక. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా. ఎక్కడైనా, ఎవరికైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా? గతంలో నియోజకవర్గాల వారీగా ఎంత రేటుకు ఇసుక అమ్మాలో ధరలు నిర్ణయించి ప్రతి వారం దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చాం. అంతకు మించి ఎక్కువకు అమ్మితే రూ.2లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష అని హెచ్చరిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాం. ఈరోజు ఇసుక కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. -
ఖనిజ సంపద దోపిడీకి బాబు స్కెచ్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపద దోపిడీకి మాస్టర్ స్కెచ్ వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఇసుక దోపిడీని వ్యవస్థీకృతం చేసి ప్రత్యక్ష దోపిడీకి దిగారని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రజలంతా దసరా సందడిలో ఉంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని చెప్పారు. ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్‌ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ.. దోపిడీకి తెరలేపిందన్నారు.ఆ బిడ్ల వెనుక మర్మమేమిటి? టన్ను ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120గా బేస్ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ.50 నుంచి రూ.60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుక మర్మమేంటని టీజేఆర్ నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 రీచ్‌లకు 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్లు స్వీకరించి ఖరారు చేసేశారని, కర్నూలులో అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఒకే టెండర్ వస్తే బిడ్‌ను ఆమోదించారన్నారు.వైఎస్సార్, పల్నాడు, ఉభయ గోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చిత్తూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బీజేపీ, జనేసేన నేతలతో కలసి టీడీపీ నాయకులు బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
కూటమి నిర్వాకాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రాలు
-
ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది
-
ఇసుక రవాణా చార్జీలకు ఆరు శ్లాబ్‌లు
సాక్షి, అమరావతి: ఒకవైపు ఉచిత ఇసుక అంటూనే... మరోవైపు రకరకాల చార్జీలను ప్రజలపై మోపుతోంది టీడీపీ ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానంలో రవాణా చార్జీలు రాష్ట్రమంతా ఒకేలా ఉండేలా జీవో జారీ చేసింది. కిలో మీటర్ల ప్రకారం ఆరు శ్లాబులుగా రవాణా చార్జీలను నిర్ణయించింది. ఇసుక సరఫరా పాయింట్ నుంచి వినియోగదారునికి చేరే వరకు ఉన్న దూరాన్ని బట్టి శ్లాబు ఉంటుంది. ఈ శ్లాబుల ప్రకారం వాహనాల్లోని ఇసుక పరిమాణం, కిలోమీటర్ల దూరాన్ని లెక్కించి రవాణా చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని ఒప్పందం చేసుకుని ఇసుక రవాణా చేసే వాహనాల యజమానులతో అగ్రిమెంట్లు చేసుకోవాలని, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూనే ఇలా రవాణా చార్జీలను ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తవ్వకం, లోడింగ్ చార్జీలను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఇక అది ఇసుక విధానం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఉచిత ఇసుక.. నేటి ధరలు..
ఇసుక ఉచితం... ఉచితం... ఉచితం... అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారు...? ఎవరికి ఇస్తున్నారు...? ఎప్పుడు ఇస్తున్నారు...? ఎవరైనా చెప్పగలరా..? అని సామాన్యులు అడిగితే మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఎక్కడా ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదు. ఇటు స్టాక్ పాయింట్లు... అటు రీచ్‌ల వద్ద టీడీపీ నేతలు డంపయ్యారు. డిమాండ్‌ను బట్టి ఇసుక ధరను నిర్ణయిస్తున్నారు.ఇసుకను అత్యంత ఖరీదైన వస్తువుగా మార్చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు నియోజకవర్గంలో సోమవారం 18 టన్నుల ఇసుక లారీ ధర రూ.54వేలు పలకడమే ఇందుకు నిదర్శనం. చంద్రగిరి నియోజకవర్గంలో రూ.43,600, గూడూరు నియోజకవర్గంలో రూ.42,660, వెంకటగిరి నియోజకవర్గంలో రూ. 42,620 చొప్పున అత్యధిక ధర పలుకుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా 18 టన్నుల ఇసుకకు రూ.36వేలు చెల్లించాల్సి వస్తోంది.ఇలా 175 నియోజకవర్గాల్లో ఇసుక ధరలను ‘సాక్షి’ పరిశీలించగా... ఎక్కడా ప్రభుత్వం చెబుతున్నట్లు సామాన్యులు పన్నులు మాత్రమే చెల్లించి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే పరిస్థితి లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి. నియోజకవర్గంలో ఇసుక అసెంబ్లీ తీసుకువెళ్లడానికి నియోజకవర్గాలు అయ్యే ఖర్చు రూపాయల్లో... (18 టన్నుల లారీ) 1. కర్నూలు 54,0002. చంద్రగిరి 43,6003. గూడూరు 42,660 4. వెంకటగిరి 42,6205. అరకు 38,0006. కుప్పం 36,000 7. పాడేరు 36,0008. నగరి 36,0009. గుడివాడ 35,00010. కందుకూరు 35,00011. డోన్ 32,00012. మైదుకూరు 31,50013. శ్రీకాళహస్తి 30,60014. యలమంచిలి 30,550 15. సూళ్లూరుపేట 30,37016. పాయకరావుపేట 30,050 17. చోడవరం 30,05018. మాడుగుల 30,550 19. పుంగనూరు 30,000 20. మదనపల్లె 29,70021. మంత్రాలయం 28,000 22. ఇచ్ఛాపురం 27,720 23. యర్రగొండపాలెం 27,000 24. సత్యవేడు 26,600 25. విశాఖ తూర్పు 26,60026. పామర్రు 26,100 27. రంపచోడవరం 26,00028. పుట్టపర్తి 26,000 29. రైల్వేకోడూరు 26,00030. ప్రత్తిపాడు 26,00031. గాజువాక 25,660 32. విశాఖ వెస్ట్ 25,66033. అనకాపల్లి 25,66034. పెందుర్తి 25,660 35. విశాఖ నార్త్ 25,600 36. విశాఖ సౌత్ 25,600 37.భీమిలి 25,600 38. పలాస 25,200 39. అవనిగడ్డ 25,200 40. గజపతినగరం 25,000 (బొబ్బిలి రీచ్ నుంచి బొండపల్లికి) 41. ఉంగుటూరు 25,000 42. కోవూరు 25,000 43. శ్రీశైలం 25,000 -
ఉచితం పేరుతో ఇసుక దోపిడీ.. ఇదేం పనయ్యా బాబూ..!
సాక్షి, విశాఖపట్నం: ఉచితం పేరుతో చంద్రబాబు సర్కార్ ఇసుక దోపిడీకి తెరలేపింది. ఉచితంగా ఇసుక ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేశారంటున్న ప్రజలు.. ఇదేమి ఉచిత ఇసుక విధానమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టన్ను ఇసుక ధర పెంచేశారు. భీమిలిలో టన్ను ఇసుక ధర రూ.758 నుంచి రూ.1076 పెరిగింది. ఒకేసారి రూ.318 పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే ఉచిత ఇసుక అనేది అబద్ధమని తేలిపోయింది. అధికారంలోకి రాగానే ఉచితం మాట పక్కన పెట్టి దోపిడీకి తెరతీశారు. కూటమి నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక దోచుకున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఉచిత ఇసుక అంటూనే రూ.17,000 నుంచి రూ. 18,000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
‘ఉచిత’ నాటకం! ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. వర్షాకాలంలో కొరత లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉంచింది. తాజాగా టీడీపీ సర్కారు దీన్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినా అన్నిచోట్లా టన్నుకి నిర్దేశిత ధర చెల్లించాలని తేల్చి చెప్పడంతో ఇసుక కోసం వచ్చిన వారు కంగు తిన్నారు. చీరాల సమీపంలోని వేటపాలెం స్టాక్‌యార్డులో టన్ను ఇసుక రూ.675గా బోర్డు పెట్టారు. దీంతో ఉచితంగా ఇసుక తీసుకెళదామని ట్రాక్టర్లతో వచ్చిన పలువురు మోసపోయామని గ్రహించి వెనుతిరిగారు. అన్ని స్టాక్ యార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఎలాంటి మేలు చేయని.. ఖజానాకు ఆదాయం సమకూరని తాత్కాలిక కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీనిల్ల అటు ప్రజలు, ఇటు ఖజానాకు నష్టం వాటిల్లుతుండగా టీడీపీ నేతలు మాత్రం జేబులు నింపుకునేందుకు మార్గం సుగమం అయింది. పేరుకు ఉచిత ఇసుక అని ప్రకటించినా ప్రజలు మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇదే ఉచిత ఇసుక విధానంలోని ప్రత్యేకత. ఉచిత ఇసుక విధానం పేరుతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ సోమవారం జీవో ఎంఎస్ నెంబర్ 43 జారీ చేశారు. గత సర్కారు హయాంలో అమలైన విధానం స్థానంలో తాత్కాలికంగా ఉచిత విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల ఆదాయం సమకూరగా ప్రజలకు సులభంగా, అందుబాటు ధరలో లభ్యమయ్యేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖజానాకు ఒక్క రూపాయి ఆదాయం రాదు. మరోవైపు ప్రజలు డబ్బులిచ్చి మరీ ఉచిత ఇసుకను కొనుగోలు చేయాల్సిన ఆగత్యం దాపురించింది!ఇదీ కొత్త విధానం..జిల్లా స్థాయిలో కమిటీలు ఆయా రీచ్‌ల్లో ఇసుక ధరలను నిర్ణయిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఎస్పీ, జేసీ, ఆర్డీఓ తదితర అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఇసుక కమిటీలు తమ పరిధిలోని ఇసుక స్టాక్ యార్డులను స్వాధీనంలోకి తీసుకుని ధరలు నిర్ణయించాయి. సీనరేజి ఫీజు, ఇతర పన్నులు, తవ్వకం, లోడింగ్, రవాణా, ర్యాంపు నిర్వహణ, పరిపాలనాపరమైన ఖర్చులన్నీ లెక్కించి టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. యార్డులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లేదా వీఆర్ఓ, వీఆర్ఏలను ఇన్ఛార్జీలుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినియోగదారులు స్టాక్ పాయింట్ల వద్ద నేరుగా ఇసుక కొనుగోలు చేయవచ్చని, తరలించేందుకు వారే లారీలు తెచ్చుకోవాలని సూచించారు. స్టాక్ పాయింట్లలో నగదు లావాదేవీలు కాకుండా డిజిటల్‌గా మాత్రమే డబ్బులు స్వీకరించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇసుక కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేసే విధానం రూపొందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇసుక ఆపరేషన్స్ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్, రాష్ట్ర స్థాయిలో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తామని తెలిపారు. ఒక వ్యక్తి ఒక రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తామన్నారు.సగం ‘స్టాక్’ స్వాహాఅధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇష్టానుసారం విక్రయించేశారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల వరకూ ఇసుకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచింది. గత నెల 4వ తేదీ నుంచి అధికారం అండతో టీడీపీ నేతలు ఇసుక యార్డులను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను బెదిరించి తరిమేశారు. ఇప్పటికే చాలా వరకూ ఇసుకను అమ్మేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ యార్డుల్లో ఉందని గనుల శాఖ చెబుతోంది. అంటే మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు నెలరోజుల్లోనే మింగేసినట్లు స్పష్టమవుతోంది.ఉసూరుమంటూ..ఉచితంగా ఇసుక దొరుకుతుందని భావించిన నిర్మాణదారులు ఉదయాన్నే ట్రాక్టర్లలో స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చి బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల బోర్డులు చూసి విస్తుపోయారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ఊరించి టన్నుల లెక్కన డబ్బులు కట్టాలని బోర్డులు ఏర్పాటు చేయటాన్ని చూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. కొత్త ఇసుక విధానంలో బాపట్ల జిల్లా చీరాలలో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక కొనుగోలు చేయాలంటే రూ.3,034 అవుతుంది. ఒక్కో ట్రాక్టర్లో 4.50 టన్నులు లోడింగ్ చేయవచ్చు. దీనికి రవాణా ఛార్జీలు మరో రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ట్రక్కు ఇసుక రూ.4 వేలు సమర్పించుకుని కొనుగోలు చేయాల్సిన పరిíస్థితి నెలకొంది.తిరిగి వెళ్లిపోతున్న వినియోగదారులు..స్టాక్ పాయింట్ల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీతో రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా ఇసుక అని పేర్కొంటూ షరతులు వర్తిస్తాయి అనే మాదిరిగా టన్ను ఇసుక రూ.675 అని బోర్డులు పెట్టారు. అక్కడకు వచ్చిన వారంతా బోర్డులు చూసి ఈ ధరలకు కొనలేమని తిరిగి వెళ్లిపోతున్నారు. వేటపాలెం స్టాక్ పాయింట్‌కి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 20 ట్రాక్టర్లు రాగా అన్నీ ఖాళీగా తిరిగి వెళ్లిపోయాయి. ఒక్కరూ కూడా ఇసుక కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మోసపోయాం..టీవీలు, పేపర్లలో ఇసుక ఉచితంగా అందిస్తామని, కేవలం రూ.88కే అని ప్రకటించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభించారని స్టాక్ పాయింట్‌కి వచ్చాం. ఇక్కడ బోర్డు పెట్టి టన్ను రూ.575, ట్రాక్టర్ ఇసుక రూ. 3,038 అని చెప్పారు. మోసపోయామని గ్రహించి కొనుగోలు చేయకుండా తిరిగి వెళ్లిపోయాం. – నాగార్జున, వేటపాలెం30 కి.మీ. నుంచి వచ్చా..ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. – శ్రీనివాస్‌నాయక్, పూనూరు, యద్దనపూడి మండలంరవాణా ముసుగులో దోపిడీకి స్కెచ్!ఇసుకపై కొత్త విధానంలో ఉచితం అనేది ఒక మాయ కాగా రవాణా అనేది మరో సరికొత్త దోపిడీకి స్కెచ్‌గా కనిపిస్తోంది. రవాణా ముసుగులో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇసుకను తామే రవాణా చేస్తామనడం వెనుక ఉద్దేశం అదేనని భావిస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను అధికారం మారగానే కూటమి సర్కారు మాయం చేసింది. దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను గత 40 రోజుల్లో లెక్కాపత్రం లేకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అమ్మేసుకున్నారు. అదే తరహాలో రవాణా పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొత్త విధానానికి రూపకల్పన చేశారు. పేరుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ఇసుక కమిటీలు అమ్మకాలను పర్యవేక్షిస్తాయని చెబుతున్నా స్థానిక టీడీపీ నేతలే ఇసుక వ్యవహారాలను నియంత్రించే పరిస్థితి నెలకొంది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్చల్ చేయడమే ఇందుకు ఉదాహరణ. ఉచితంగా ఇసుకను అందిస్తున్నామంటూ బ్యానర్లతో స్టాక్ పాయింట్లు వద్ద ర్యాలీలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. దీన్నిబట్టి స్టాక్ యార్డులు ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పటివరకు జిల్లా ఇసుక కమిటీలు స్టాక్ పాయింట్ల వద్ద పూర్తిస్థాయిలో ఇన్చార్జీలను కూడా నియమించలేదు. యార్డుల్లో ఎంత ఇసుక ఉందో కచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేదు. వర్షాకాలం సీజన్ వరకు ఉచిత ఇసుక పేరుతో దోపిడీని కొనసాగించి ఆ తర్వాత పూర్తిస్థాయి విధానాన్ని తెచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు స్పష్టమవుతోంది.30 కి.మీ. నుంచి వచ్చా..ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. – శ్రీనివాస్‌నాయక్, పూనూరు, బాపట్ల జిల్లా యథేచ్ఛగా తరలింపుకూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే టీడీపీ నేతలు ఇసుక స్టాక్ యార్డుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో ఇసుక నిల్వల లెక్కలకు, గతంలో కాంట్రాక్టర్ నిల్వ చేసిన ఇసుకకు పొంతనలేకపోవడం దీనికి బలం చేకూర్చుతోంది. విజయనగరం జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడంతో డెంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్ సెంటర్, కొత్తవలస వద్ద ఇసుక స్టాక్ యార్డులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని స్టాక్‌యార్డ్ నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక ఇక్కడ నుంచి ప్రభుత్వ ధరలకు ఇసుకను సరఫరా చేసేది. బొబ్బిలిలో లక్షా14వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉండగా, ఇప్పుడు అధికారుల లెక్కల ప్రకారం 72,466 మెట్రిక్ టన్నులు ఉన్నట్టు తేలింది. కొత్తవలసలో 11,805 మెట్రిక్ టన్నులు, డెంకాడలో 9,756 మెట్రిక్ టన్నులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నా... ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి.వందలాది వాహనాలతో..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ముందు నాటికి ఎనిమిది చోట్ల ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఒక్కొక్క డంపింగ్ యార్డులో 5 లక్షల నుంచి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు అప్పటి యార్డుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా మర్రిపాడు యార్డులో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉండగా ఎన్నికల కౌంటింగ్ అయిన రాత్రి నుంచి టీడీపీ నేతలు వందలాది వాహనాలతో ఇసుకను ఖాళీ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడుకు చెందిన ఓ వ్యక్తి (ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనాయణరెడ్డి అనుచరుడు) ఇసుక డంప్‌ను రూ.2 కోట్లకు కొనేసి.. చెన్నై, బెంగళూరు తదితర మహా నగరాలకు తరలించడం బహిరంగ విషయమే. నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెంలో డంపింగ్ యార్డులో 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు పూర్తిగా ఖాళీ చేశారు. అయితే తాజాగా జిల్లా అధికారులు ప్రకటించిన విధంగా జిల్లాలోని మూడు స్టాక్ యార్డుల్లో ప్రస్తుతం 1,75,301 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. మర్రిపాడు యార్డులో 1,25,211 మెట్రిక్ టన్నులు, మినగల్లులో 41,885 మెట్రిక్ టన్నులు, పల్లిపాడులో 8,205 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన యార్డుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి తవ్వి నిల్వ చేసిన ఇసుకను అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. -
కూలీల పొట్టకొడితే సహించేది లేదు
ఉచిత ఇసుకను సక్రమంగా అందించండి l ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అంకంపాలెం (ఆత్రేయపురం): ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నామంటూ ర్యాంపులు తెరిచి చేతులు దులుపుకోవడం వల్ల కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుకను పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి సక్రమంగా అందించాలని , అలాఅని కూలీల పొట్ట కొడితే సహించేదిలేదన్నారు.పేద ప్రజలకు ఇసుక అందించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నిరంతరంగా పర్యవేక్షించాల్సిందిగా స్దానిక తహశీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జేఏ ఝూన్సీ, పోలీస్ సిబ్బందిని అదేశించారు. కూలీలతో మాట్లాడిన ఆయన ర్యాంపులో ఏవిధమైన ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, మాజీ సర్పంచి గారపాటి అబ్బులు చౌదరి, వైఎస్సార్సీపీ నేతలు కరుటూరి పట్టాబి, కరుటూరి కృష్ణ , ఆర్.ఐ. హుసేన్, వీఆర్వో హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా కళ్లల్లో ఇసుక!
కమీషన్ చెల్లించని ప్రభుత్వం జుత్తాడ ఇసుక ర్యాంపుల్లో ఉద్యమించిన మహిళలు హనాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత కమీషన్ చెల్లించే వరకు విరమించేది లేదని స్పష్టీకరణ అడ్డుకుంటే అరెస్టు చేస్తాం : పోలీసుల హెచ్చరిక జుత్తాడ గ్రామంలోని ప్రభుత్వ ఉచిత ఇసుక ర్యాంపు వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు ఇచ్చే వరకు ఒక్క లారీని కూడా వెళ్లనీయమని డ్వాక్రా మహిళలు భీష్మించి కూర్చున్నారు. అడ్డుకుంటే అరెస్టు చేస్తామని పోలీసులు, అధికారులు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. ఒక దశలో అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నింనా కమీషన్ చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదనిమహిళలు స్పష్ట చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. - చోడవరం గతంలో అధికారిక ఆన్లైన్ ఇసుక తవ్వకాల సమయంలో ఈ రీచ్ నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. వాటికి సంబంధించిన కమీషన్ ప్రభుత్వం ఇప్పటికీ తమ ఖాతాల్లో జమచేయలేదని డ్వాక్రా మహిళలు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, అధికారులు తమను మోసం చేశారంటూ ఆగ్రహిస్తూ పెద్ద ఎత్తున వారు ఉచిత ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. రెండ్రోజులుగా లారీల నుంచి కొంత సొమ్మును కూడా వారు వసూళ్లు చేస్తున్నారు. దీనిపై లారీ యజమానులు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు రావలసిన కమీషన్ వచ్చేవరకు వసూలు చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. మోసగించిన ప్రభుత్వం ఈ నేపథ్యంలో తవ్వకాలను అడ్డుకుంటే అరెస్టు చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చోడవరం పోలీసులు భారీగా మహిళా పోలీసులతోపాటు వాహనాలను కూడా తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలంతా వందలాదిగా ర్యాంప్ దగ్గరికి వచ్చారు. ఇంతలో తహసీల్దార్ పి.రామునాయుడు, ఎస్ఐ రమణయ్య, ర్యాంప్ ఇన్చార్జి అధికారి ఇరిగేషన్ ఏఈ వచ్చి డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉచిత ఇసుక ర్యాంప్ వద్ద వసూళ్లు చేయకూడదని, అడ్డం పెట్టకూడదని వారు హెచ్చరించారు. దీనిపై ఆగ్రహించిన మహిళలు తమను ప్రభుత్వం మోసంచేసిందని, రావలసిన కమీషన్ డబ్బులు ఇప్పటికీ వేయకపోవడం వల్లే మేము ఈవిధంగా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇసుకను ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసు అధికారులకంటూనే వేలాది లారీలు తరలించుకుపోయారని, సామాన్య జనం ఎవరూ రాలేదని మహిళలు ధ్వజమెత్తారు. పది రోజుల్లో కమీషన్ డబ్బులు వేస్తామని ఉన్నతాధికారులు చెప్పారని మహిళలకు తహసీల్దార్ తెలిపారు. అయినా స్థానిక మహిళలు, రైతులు శాంతించలేదు. తవ్వకాలతో పంట కాలువలకు నష్టం శారదానదిలో తమ గ్రామం వద్ద ఇసుకను పూర్తిగా ఇప్పటికే తవ్వేశారని, నదిని ఆనుకొని ఉన్న పంటకాలువలకు 10 అడుగుల కిందకు లోతుగా తవ్వేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల నదిలో నీరు కాలువల్లోకి వెళ్లే అవకాశం లేనందున వ్యవసాయానికి సాగునీటికే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం వచ్చిందని రైతులు ధ్వజమెత్తారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు చేయవద్దని నీరు లేక పంటలు ఎండిపోయి తాము కూడా వలసలు పోయే పరిస్థితి తేవద్దని రైతులు వేడుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ తొమ్మిది వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉచితంగా తవ్వడానికి అనుమతి ఉందని అధికారులు చెప్పడంతో మేము లారీలను వెళ్లనీయమని మహిళలు భీష్మించుకొని కూర్చుకున్నారు. వివాదం ముదరడంతో లారీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. తాత్కాలికంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. నిబంధన ప్రకారం ఇసుక తవ్వకాలు జరుగుతాయని పోలీసులు చెబుతూ పహారా కాశారు. సాయంత్రం వరకు మహిళలు కూడా ఇక్కడ ఉండిపోవడంతో ఇసుక తరలింపు మాత్రం ఒక కొల్కిరాలేదు. తవ్వకాలు నిలిపివేయాలి ఇసుక లేకపోయినా నదిని తవ్వేస్తున్నారు. కాలువల్లోకి నీరు రాక పంటలు కూడా ఎండిపోతున్నాయి. డిగ్రీ చదువుకున్న ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వారికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయకపోగా మా వ్యవసాయం కూడా దెబ్బతినేలా చేస్తున్నారు. నదిలో ఇసుక తవ్వేసి కాలువల్లోకి సాగునీరు పారకుండా చేస్తున్నారు. రైతులు కూడా వలసలు పోయి అడుక్కుతినేలా సీఎం వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయకుంటే ఉద్యమిస్తాం. -మళ్ల అప్పలనర్సమ్మ, డ్వాక్రా మహిళ, రైతు, జుత్తాడ. -
'ఆ పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు'
విజయవాడ: ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు. అవినీతికి తావులేకుండా ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జన్నభూమి కమిటీలతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని మండిపడ్డారు. ఆ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యాయని పార్థసారథి విమర్శించారు. -
'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'
హైదరాబాద్: ఉచిత యిసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయాలు లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా ఉచిత యిసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీల అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్డీఎఫ్ ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని ఆక్షేపించారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించడానికి సీఎంకు అధికారం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదన్నారు. విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులు నిలుపుదల చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
వారు తవ్విందే రేవు.. చెప్పిందే రేటు..
ఏటిపట్టున ఆగని ఇసుకాసురుల హవా తెల్లబోతున్న ‘ఉచిత ఇసుక’ పథకం ఎక్కడికక్కడ యథేచ్ఛగా తవ్వకాలు రోజూ 1,500 వాహనాలపై రవాణా లారీకి రూ.10 వేల వరకూ వసూలు రాజానగరం/సీతానగరం : తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఎడమగట్టును ఆనుకుని సీతానగరం మండలంలో ఉన్న వ్యావసాయక ప్రధానమైన గ్రామాలను ‘ఏటిపట్టు’గా వ్యవహరిస్తుంటారు. గట్టుకు ఇవతల ‘గింజ నాటితే గాదెడు పంట’ పండే సారవంతమైన భూములున్నాయి. అయితే.. కొన్నాళ్లుగా ఏటిపట్టులోని కొన్ని గ్రామాల్లో గట్టుకు ఇవతల పొలాల్లో కన్నా.. అవతల గోదాట్లోనే కొందరు అక్రమార్కుల పంట పుష్కలంగా పండుతోంది. నీటిపట్టున రూ.కోట్లు పండించుకుంటున్న ఆ సేద్యం పేరే ఇసుక అక్రమ వ్యాపారం. గత రెండు సంవత్సరాలుగా సీతానగరం మండలంలోని ఏటిపట్టు ప్రాంతం ఇసుక అక్రమ రవాణాతో నిత్యం వార్తల్లోనే ఉంటోంది. కోర్టు నిషేధంతో జిల్లాలో ఇసుక ర్యాంపులు మూతపడ్డ సమయంలోనూ.. లంక భూముల్లో ఇసుక మేటల తొలగింపునకు అనుమతి మాటున.. నిత్యం గోదావరి కడుపును కొల్లగొట్టి, దండుకున్న కోట్లలో ‘పచ్చ’ ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకూ వాటాలు వేసుకున్నారన్నది గోదారి ఇసుక పసిడిరంగులో ఉంటుందన్నంత పచ్చినిజం. ఇప్పుడు పాలకులు ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. కేవలం లోడింగ్, రవాణా చా ర్జీలు భరిస్తే చాలంటున్నారు. అయితే వారు చెప్పే మాటలకు, ఆచరణలో జ రుగుతున్న దానికీ ఎక్కడా పొంతనలే దు. ఉచిత ఇసుక పథకం పేదలకు మే లు చేయకపోగా యథాప్రకారం పచ్చచొక్కాల జేబులు మాత్రం తేర సొమ్ము తో పుష్కలంగా నిండుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గోదారి ఇసుక నుంచి నిత్యం సొమ్ములు పిండుకోవడం మరిగిన కొందరు ఏటిపట్టు పెద్దలు.. ఇప్పుడు ఉచిత ఇసుక పథకాన్నీ తమ రాబడికి రాచమార్గంగా మార్చేసుకున్నారు. ‘తా ము తవ్విందే రేవు, చెప్పిందే రేటు’ అన్నట్టు ఏటిపట్టు పరీవాహక ప్రాంతం లో ఇసుకను దోచేస్తున్నారు. ఒకప్పటిలాగే ఇప్పుడూ ఇక్కడి నుంచి నిత్యం దాదాపు 1,500 వాహనాల్లో ఇసుక తరలిపోతోంది. ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్లపై, ఆపై లారీల్లోకి మార్చి దూరప్రాంతాలకు తరలించి భారీ ధరకు విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు కావడమేగాని ఏ అధికారీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అనుమతి ముగ్గళ్లకే అయినా.. ఉచిత ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నది ముగ్గళ్ల రేవు నుంచే అయినా అనధికారికంగా ఏటిపట్టంతటా రవాణా జరుగుతూనే ఉంది. రాత్రి వేళ అధికార పార్టీ పెద్దల అండదండలతో బొబ్బిలిలంక, ములకల్లంక, కాటవరం, ముని కూడలి, రాజంపేట, ఎదుళ్లపల్లి, ఇనగంటివారిపేట, ముగ్గళ్లలోని అనధికారిక రేవు, రఘుదేవపురం, సీతానగరం, సింగవరం, వంగలపూడిల నుంచి వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. నదీగర్భంలో, బయట జేసీబీ లు ఏర్పాటు చేసి ట్రాక్టర్లపై తెచ్చిన ఇసుకను 10 చక్రాల లారీలపై లోడు చేసి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఏ కష్టం లేకుండా పెద్దలే ఇలా దండుకోగా లేనిది కష్టపడే మేము సొమ్ము చేసుకుంటే ఏమిటన్నట్టు.. ఉచిత రవాణా జరిగే ముగ్గళ్ల రేవు నుంచి కూలీలు ట్రాక్టరు లోడింగ్‌కు రూ.175 తీసుకోవలసి ఉండగా రూ.6 వందల వరకు వసూలు చేస్తున్నారు. తరచూ ట్రాఫిక్‌కు అంతరాయమే.. అక్రమ ఇసుక రవాణాతో సీతానగరం - రాజమహేంద్రవరం రోడ్లో పగలు, రాత్రి వ్యత్యాసం లేకుండా తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూనే ఉంది. ఏటిపట్టు రోడ్డు ఇసుక వాహనాలతో కిక్కిరిసిపోతున్నారుు. ఈ వాహనాల రాకపోకలతో రోడ్లు పాడైపోతున్నారుు. వీటి రొద వల్ల ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థులు ఇంటి వద్ద చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం కొరవడుతోంది. ప్రభుత్వాధికారులు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఉచిత ఇసుకకు సరైన మార్గదర్శకాలు ఏ ర్పాటు చేయూలని, తమకు ఇబ్బంది లే ని రీతిలో రవాణా జరిగేలా చర్యలు తీ సుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉచితంపై అక్రమార్కుల కన్ను
కడియం : ఇసుకను ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఊరుకుంది. దీనిపై విధివిధానాలు కూడా కలెక్టర్ సమీక్షలో నిర్దేశించారు. కానీ మండలంలోని వేమగిరి ఇసుక ర్యాంపు వద్ద ఇంకా ఉచిత ఇసుక సామాన్యుడికి అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించింది మొదలు అక్రమార్కుల కన్ను ఈ ర్యాంపుపై పడింది. పొక్లెయిన్లు, లారీలున్న వాళ్లదే ఇక్కడి పెత్తనమని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ విధివిధానాలతో సంబంధం లేకుండా వీళ్లు ర్యాంపులోకి ప్రవేశించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ర్యాంపు వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు. ప్రస్తుతం ర్యాంపులోకి వె ళ్లేందుకు బాట తామే వేశామంటూ కొందరు నాయకులు అక్కడికి చేరి, ఎగుమతి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కాక, లారీకి రూ. 600 అదనంగా చెల్లించాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. పలువురు వాహనదారులు దీనిని వ్యతిరేకించడంతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎప్పటికి అందుబాటులోకొస్తుందో? ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వరకు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇసుక ఎప్పటికి అందుబాటులో కొస్తుందన్న దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ర్యాంపులోకి మార్గం నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలేమీ సిద్ధమైన దాఖలాల్లేవు. పర్యావరణ అనుమతుల ప్రకారం ఇసుకను ఎక్కడ, ఎంత లోతు తవ్వాలన్న దానిపై కూడా స్పష్టత లేదు. వ్యాపార అవసరాల కోసం తరలించుకుపోయే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనిని నియంత్రించడం ఎలా? దీనిపై పర్యవేక్షణ ఎవరిది? స్టాక్ పాయింట్లో మూడేళ్లుగా నిల్వ ఉన్న దాదాపు రూ.80 లక్షల ఇసుక అక్రమార్కుల పాలైంది. దీనినే కాపాడలేని పోలీస్, రెవెన్యూ అధికారులకు ర్యాంపు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే ఎంత వరకు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది? తదితర సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు అడ్డుకున్నాం.. మైన్స్ అధికారుల సూచనల మేరకే ర్యాంపులో ఇసుకను తవ్వాల్సి ఉందని తహశీల్దార్ పిల్లా రామోజీ చెప్పారు. ఇష్టారాజ్యంగా తవ్వేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. గోదావరిలో ఇసుకను తవ్వేందుకు 17 వాహనాలొచ్చినట్టు శుక్రవారం గుర్తించామన్నారు. తనకందిన ఫిర్యాదు మేరకు ర్యాంపు వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా అక్కడి వాహనాలు వెళ్లిపోయాయన్నారు. సంబంధిత వాహనాల నంబర్లతో ఆర్టీవోకు ఫిర్యాదు చేస్తున్నట్టు రామోజీ చెప్పారు. వీరిపై నిబంధనల మేరకు చర్యలుంటాయన్నారు. సామాన్యుడికి చేరని ఇసుక.. పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఉచిత ఇసుక సామాన్యుడికి చేరడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తమతమ సొంత వాహనాలతో వచ్చి ఇసుకను తీసుకు వెళ్లారని సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి పనులకు వినియోగించే నిమిత్తం స్టాక్ పాయింట్ నుంచి అనుమతిచ్చిన 275 క్యూబిక్ మీటర్ల ఇసుక కూడా వ్యాపార అవసరాలకే తరలిపోయిందంటున్నారు. అనధికారికంగా తవ్వకాలు మాత్రం సాగిపోతున్నాయి. -
ఉచితం వెనుక స్వీయ హితం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉచితం... ఇసుక కూడా ఉచితం! ఈ మాట అన్నది ఎవరో కాదు... సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్ర బాబు! సీజన్ ప్రారంభమైనా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక దొరక్క అల్లాడిపోతున్న ప్రజలకు ఇదేదో బాగుందే అనిపించింది! మరి అధికార పార్టీ నాయకులకు ఎలా ఉంటుంది? ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడినవారు ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తామంటే - ఊరుకుంటారా? కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు! అక్కడే ఏదో మతలబు ఉందని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగింత అనే విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తొలుత ప్రకటించినా తెరవెనుక చక్రం తిప్పింది అధికార పార్టీ నాయకులే అనేది బహిరంగ రహస్యం. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఇటీవలే ఈ-టెండర్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. అదికూడా బెడిసికొట్టడంతో చంద్రబాబు ఫ్రీ అస్త్రాన్ని ప్రయోగించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉచితమే అయినా రీచ్‌ల్లో ఇసుకను తవ్విపోసే బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించాలనే ప్రతిపాదన అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది. మూణ్ణాళ్ల ముచ్చటేనా? రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, రవాణా పర్యవేక్షణ, ర్యాంపు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర బాధ్యతలను దక్కించుకుంటే మళ్లీ చక్రం తిప్పవచ్చనే ఆలోచనతో సిండికేట్లు ఉన్నాయి. దీంతో నామమాత్ర రుసుంతో ర్యాంపులను తమకు అప్పగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బంధువులైన టీడీపీ నాయకుల ద్వారా ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. లేదంటే జన్మభూమి కమిటీలకే ‘స్థానిక సంస్థల’ ముసుగులో అప్పగిస్తే బాగుంటుందనే వాదనలను తీసుకొస్తున్నట్టు తెలిసింది. బెడిసికొట్టిన ఈ-టెండర్లు.. జిల్లాలో 20 ర్యాంపులకు ఇటీవల ఆన్లైన్లో ఈ-టెండర్ల ప్రక్రియను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 277 మంది టెండర్లు వేశారు. వీరిలో 247 మందిని ఈ-వేలంకు అర్హులుగా అధికారులు ఎంపిక చేశారు. కానీ తెరవెనుక ర్యాంపుల వారీగా బిడ్డర్లు అంతా రెండుసార్లు సమావేశమై సిండికేట్‌కు తెరలేపారు. ఈ వేలంలో క్యూబిక్ మీటరు ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.500 కంటే ఎక్కువగా బిడ్డర్లు కోట్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రూ.500 కంటే ఎక్కువ, రూ.150 కంటే తక్కువ కోట్ చేసిన బిడ్డర్లను పక్కన పెట్టారు. మిగిలిన వాటిలో ఎక్కువ కోట్ చేసినవారికి ర్యాంపులను అప్పగించే ప్రక్రియ చేపట్టారు. పులిదిండి ర్యాంపునకు ఒకే టెండర్ దాఖలు కావడం, గోపాలపురం ర్యాంపుపై కోర్టులో వివాదం ఉండటంతో నిలిపివేశారు. ఊబలంక ర్యాంపునకు 20 మంది బిడ్డర్లు సిండికేటై రూ.164 అత్యధిక ధరకు టెండర్ వేశారు. కానీ ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి రూ.354కు కోట్ చేయడంతో అధికారులు తప్పుడు టెండర్లు దాఖలైనట్టు గుర్తించి నిలిపివేశారు. అంకంపాలెం ర్యాంపులో కూడా ఇదే తరహా సమస్యతో నిలిపివేశారు. మిగిలిన 16 ర్యాంపుల్లో ఎనిమిది ర్యాంపులను బిడ్డర్లకు అప్పగించారు. అయినవిల్లి-వీరవల్లిపాలెం రూ.204, వాడపాలెం- నారాయణలంక రూ.172, వద్దిపర్రు రూ.222, రాజవరం-వెలిచేరు రూ.206, కోరుమిల్లి రూ.202, కపిలేశ్వరపురం-2 రూ.206, బ్రిడ్జిలంక రూ.152, కేతవానిలంక రూ.202 కోట్ చేసినవారికి అప్పగించారు. ముగ్గళ్ల రూ.498, జొన్నాడ రూ.490, బొబ్బర్లంక- పేరవరం రూ.498, కపిలేశ్వరపురం-1 రూ.498, రాయన్నపేట రూ.498, ఎక్కువ మంది కోట్ చేయడంతో డ్రా తీసి ర్యాంపులు అప్పగిస్తారని, వేమగిరి- కడియపులంక, ఆత్రేయపురం, మందపల్లి ర్యాంపులకు రూ.150 కంటే తక్కువ రూ.500 కంటే ఎక్కువ కోట్ చేసిన వారు ఉండటంతో కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకొంటారని భావించారు. ఇంతలో ముఖ్యమంత్రి ఉచిత ఇసుక ప్రకటన చేయడంతో ఆ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. ఇసుకు మాఫియా యత్నాలు ఉచిత ఇసుక విధానం సాధ్యం కాదని రాజకీయ వర్గాల నుంచే వాదనలు వినిపించడంతో ఇసుక మాఫియాలు తిరిగి ర్యాంపులను పాత బిడ్లతో దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని ర్యాంపులపై స్టేలు తెచ్చేందుకు సన్నాహాలు చేయడంతోపాటు కోనసీమలోని ఓ నియోజకవర్గంలో ర్యాంపులను సిండికేటు చేయడానికి మంగళవారం ఒక రహస్య ప్రాంతంలో మాఫియా సమావేశమైనట్టు తెలిసింది. కొందరు బిడ్డర్లు అడ్డం తిరగడంతో బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొట్టాయి.