ఉచిత ఇసుక.. నేటి ధరలు.. | Free Sand: Today Prices in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఉచిత ఇసుక.. నేటి ధరలు..

Published Tue, Aug 6 2024 6:31 AM | Last Updated on Tue, Aug 6 2024 6:31 AM

Free Sand: Today Prices in Andhra pradesh

ఇసుక ఉచితం... ఉచితం... ఉచితం... అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారు...? ఎవరికి ఇస్తున్నారు...? ఎప్పుడు ఇస్తున్నారు...? ఎవరైనా చెప్పగలరా..? అని సామాన్యులు అడిగితే మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఎక్కడా ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదు. ఇటు స్టాక్‌ పాయింట్లు... అటు రీచ్‌ల వద్ద టీడీపీ నేతలు డంపయ్యారు. డిమాండ్‌ను బట్టి ఇసుక ధరను నిర్ణయిస్తున్నారు.

ఇసుకను అత్యంత ఖరీదైన వస్తువుగా మార్చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు నియోజకవర్గంలో సోమవారం 18 టన్నుల ఇసుక లారీ ధర రూ.54వేలు పలకడమే ఇందుకు నిదర్శనం. చంద్రగిరి నియోజకవర్గంలో రూ.43,600, గూడూరు నియోజకవర్గంలో రూ.42,660, వెంకటగిరి నియోజకవర్గంలో రూ. 42,620 చొప్పున అత్యధిక ధర పలుకుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా 18 టన్నుల ఇసుకకు రూ.36వేలు చెల్లించాల్సి వస్తోంది.

ఇలా 175 నియోజకవర్గాల్లో ఇసుక ధరలను ‘సాక్షి’ పరిశీలించగా... ఎక్కడా ప్రభుత్వం చెబుతున్నట్లు సామాన్యులు పన్నులు మాత్రమే చెల్లించి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే పరిస్థితి లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి.  

    నియోజకవర్గంలో ఇసుక  అసెంబ్లీ తీసుకువెళ్లడానికి నియోజకవర్గాలు అయ్యే ఖర్చు రూపాయల్లో...
    (18 టన్నుల లారీ) 
1. కర్నూలు    54,000
2. చంద్రగిరి    43,600
3. గూడూరు    42,660     
4. వెంకటగిరి    42,620
5. అరకు    38,000
6. కుప్పం    36,000     
7. పాడేరు    36,000
8. నగరి    36,000
9. గుడివాడ    35,000
10. కందుకూరు     35,000
11. డోన్‌    32,000
12. మైదుకూరు     31,500
13. శ్రీకాళహస్తి    30,600
14. యలమంచిలి    30,550     
15. సూళ్లూరుపేట    30,370
16. పాయకరావుపేట    30,050     
17. చోడవరం    30,050
18. మాడుగుల    30,550 
19. పుంగనూరు    30,000     
20. మదనపల్లె    29,700
21. మంత్రాలయం    28,000    
22. ఇచ్ఛాపురం    27,720 
23. యర్రగొండపాలెం    27,000     
24. సత్యవేడు    26,600     
25. విశాఖ తూర్పు    26,600
26. పామర్రు    26,100     
27. రంపచోడవరం    26,000
28. పుట్టపర్తి    26,000     
29. రైల్వేకోడూరు    26,000
30. ప్రత్తిపాడు    26,000
31. గాజువాక    25,660     
32. విశాఖ వెస్ట్‌    25,660
33. అనకాపల్లి    25,660
34. పెందుర్తి    25,660     
35. విశాఖ నార్త్‌    25,600     
36. విశాఖ సౌత్‌    25,600     
37.భీమిలి    25,600     
38. పలాస    25,200    
39. అవనిగడ్డ    25,200 
40. గజపతినగరం    25,000
      (బొబ్బిలి రీచ్‌ నుంచి బొండపల్లికి)  
41. ఉంగుటూరు     25,000     
42. కోవూరు    25,000     
43. శ్రీశైలం    25,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement