ఏటిపట్టున ఆగని ఇసుకాసురుల హవా
తెల్లబోతున్న ‘ఉచిత ఇసుక’ పథకం
ఎక్కడికక్కడ యథేచ్ఛగా తవ్వకాలు
రోజూ 1,500 వాహనాలపై రవాణా
లారీకి రూ.10 వేల వరకూ వసూలు
రాజానగరం/సీతానగరం : తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఎడమగట్టును ఆనుకుని సీతానగరం మండలంలో ఉన్న వ్యావసాయక ప్రధానమైన గ్రామాలను ‘ఏటిపట్టు’గా వ్యవహరిస్తుంటారు. గట్టుకు ఇవతల ‘గింజ నాటితే గాదెడు పంట’ పండే సారవంతమైన భూములున్నాయి. అయితే.. కొన్నాళ్లుగా ఏటిపట్టులోని కొన్ని గ్రామాల్లో గట్టుకు ఇవతల పొలాల్లో కన్నా.. అవతల గోదాట్లోనే కొందరు అక్రమార్కుల పంట పుష్కలంగా పండుతోంది. నీటిపట్టున రూ.కోట్లు పండించుకుంటున్న ఆ సేద్యం పేరే ఇసుక అక్రమ వ్యాపారం. గత రెండు సంవత్సరాలుగా సీతానగరం మండలంలోని ఏటిపట్టు ప్రాంతం ఇసుక అక్రమ రవాణాతో నిత్యం వార్తల్లోనే ఉంటోంది. కోర్టు నిషేధంతో జిల్లాలో ఇసుక ర్యాంపులు మూతపడ్డ సమయంలోనూ.. లంక భూముల్లో ఇసుక మేటల తొలగింపునకు అనుమతి మాటున.. నిత్యం గోదావరి కడుపును కొల్లగొట్టి, దండుకున్న కోట్లలో ‘పచ్చ’ ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకూ వాటాలు వేసుకున్నారన్నది గోదారి ఇసుక పసిడిరంగులో ఉంటుందన్నంత పచ్చినిజం. ఇప్పుడు పాలకులు ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. కేవలం లోడింగ్, రవాణా చా ర్జీలు భరిస్తే చాలంటున్నారు. అయితే వారు చెప్పే మాటలకు, ఆచరణలో జ రుగుతున్న దానికీ ఎక్కడా పొంతనలే దు. ఉచిత ఇసుక పథకం పేదలకు మే లు చేయకపోగా యథాప్రకారం పచ్చచొక్కాల జేబులు మాత్రం తేర సొమ్ము తో పుష్కలంగా నిండుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గోదారి ఇసుక నుంచి నిత్యం సొమ్ములు పిండుకోవడం మరిగిన కొందరు ఏటిపట్టు పెద్దలు.. ఇప్పుడు ఉచిత ఇసుక పథకాన్నీ తమ రాబడికి రాచమార్గంగా మార్చేసుకున్నారు. ‘తా ము తవ్విందే రేవు, చెప్పిందే రేటు’ అన్నట్టు ఏటిపట్టు పరీవాహక ప్రాంతం లో ఇసుకను దోచేస్తున్నారు. ఒకప్పటిలాగే ఇప్పుడూ ఇక్కడి నుంచి నిత్యం దాదాపు 1,500 వాహనాల్లో ఇసుక తరలిపోతోంది. ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్లపై, ఆపై లారీల్లోకి మార్చి దూరప్రాంతాలకు తరలించి భారీ ధరకు విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు కావడమేగాని ఏ అధికారీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అనుమతి ముగ్గళ్లకే అయినా..
ఉచిత ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నది ముగ్గళ్ల రేవు నుంచే అయినా అనధికారికంగా ఏటిపట్టంతటా రవాణా జరుగుతూనే ఉంది. రాత్రి వేళ అధికార పార్టీ పెద్దల అండదండలతో బొబ్బిలిలంక, ములకల్లంక, కాటవరం, ముని కూడలి, రాజంపేట, ఎదుళ్లపల్లి, ఇనగంటివారిపేట, ముగ్గళ్లలోని అనధికారిక రేవు, రఘుదేవపురం, సీతానగరం, సింగవరం, వంగలపూడిల నుంచి వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. నదీగర్భంలో, బయట జేసీబీ లు ఏర్పాటు చేసి ట్రాక్టర్లపై తెచ్చిన ఇసుకను 10 చక్రాల లారీలపై లోడు చేసి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఏ కష్టం లేకుండా పెద్దలే ఇలా దండుకోగా లేనిది కష్టపడే మేము సొమ్ము చేసుకుంటే ఏమిటన్నట్టు.. ఉచిత రవాణా జరిగే ముగ్గళ్ల రేవు నుంచి కూలీలు ట్రాక్టరు లోడింగ్‌కు రూ.175 తీసుకోవలసి ఉండగా రూ.6 వందల వరకు వసూలు చేస్తున్నారు.
తరచూ ట్రాఫిక్‌కు అంతరాయమే..
అక్రమ ఇసుక రవాణాతో సీతానగరం - రాజమహేంద్రవరం రోడ్లో పగలు, రాత్రి వ్యత్యాసం లేకుండా తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూనే ఉంది. ఏటిపట్టు రోడ్డు ఇసుక వాహనాలతో కిక్కిరిసిపోతున్నారుు. ఈ వాహనాల రాకపోకలతో రోడ్లు పాడైపోతున్నారుు. వీటి రొద వల్ల ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థులు ఇంటి వద్ద చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం కొరవడుతోంది. ప్రభుత్వాధికారులు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఉచిత ఇసుకకు సరైన మార్గదర్శకాలు ఏ ర్పాటు చేయూలని, తమకు ఇబ్బంది లే ని రీతిలో రవాణా జరిగేలా చర్యలు తీ సుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వారు తవ్విందే రేవు.. చెప్పిందే రేటు..
Published Thu, Mar 24 2016 1:25 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement