- ఉచిత ఇసుకను సక్రమంగా అందించండి l
- ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
కూలీల పొట్టకొడితే సహించేది లేదు
Published Mon, Nov 14 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
అంకంపాలెం (ఆత్రేయపురం):
ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నామంటూ ర్యాంపులు తెరిచి చేతులు దులుపుకోవడం వల్ల కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుకను పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి సక్రమంగా అందించాలని , అలాఅని కూలీల పొట్ట కొడితే సహించేదిలేదన్నారు.పేద ప్రజలకు ఇసుక అందించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నిరంతరంగా పర్యవేక్షించాల్సిందిగా స్దానిక తహశీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జేఏ ఝూన్సీ, పోలీస్ సిబ్బందిని అదేశించారు. కూలీలతో మాట్లాడిన ఆయన ర్యాంపులో ఏవిధమైన ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, మాజీ సర్పంచి గారపాటి అబ్బులు చౌదరి, వైఎస్సార్‌సీపీ నేతలు కరుటూరి పట్టాబి, కరుటూరి కృష్ణ , ఆర్.ఐ. హుసేన్, వీఆర్వో హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement