mla jaggireddy
-
ప్రజలకు చేస్తున్నది ప్రభుత్వ సొమ్ముతోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు మతి లేనివి -ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం (కొత్తపేట): ప్రజాధనాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు వినియోగిస్తూ అది తన సొంత నిధులతో చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం చూస్తే ఆయనకు వయసు పైబడటమో మతి భ్రమించిందో అర్థం కావడం లేదని రాష్ట్రంలోని వైద్యులు ఆయనకు ఉచితంగా చికిత్సను అందజేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అదేదో తన హెరిటేజ్ సంస్థ ఆదాయం ద్వారానో లేక తన సొంత రెండెకరాల భూమి ఆదాయం ద్వారానో చేస్తున్నట్టుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తన ఓట్లు వేయకపోతే పింఛన్‌ను ఇవ్వను రేషన్ ఇవ్వను అంటూ ప్రజలను కించపర్చేలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారుతున్నారన్నారు. తనకు ఓటు వేయని గ్రామాలకు దండం పెడతానే తప్ప ఎలాంటి పనులు చేయనని, తాను వేసిన రోడ్లపై నడుస్తున్నారని ఆయన చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఆయన పుట్టకముందు నుంచే రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ ఉందని ప్రభుత్వమే రోడ్లు వేస్తుందని ఆయనకు మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీకి ఓట్లు వేయకపోతే ఏమీ చేయనని బహిరంగంగా చంద్రబాబు బెదిరింపులు ప్రలోభాలకు పాల్పడుతున్నారన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని, జాతీయ జెండాకు వందనం చెప్పడం రాని లోకేష్ విశాఖ భూముల కుంభకోణంపై సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన అసమర్థతను గుర్తించే చంద్రబాబు ప్రజల నుంచి నెగ్గలేడని భావించి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. దమ్ముంటే నంద్యాల ఉప ఎన్నికలో లోకేష్ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, కముజు సత్యనారాయణ, అప్పన రామకృష్ణ, జక్కంపూడి లక్ష్మినారాయణ, సఖినేటి కృష్ణంరాజు, తదితరులు ఉన్నారు. -
బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున రూ. 21 వేల ఆర్థిక సాయం తాడితోట (రాజమహేంద్రవరం)/ ఆత్రేయపురం: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో గాయాల పాలైన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 15 మందిని గురువారం ఆయన రాజమహేంద్రవరం హాస్పటల్లో పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు రూ. 21 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు పరామర్శకు వచ్చిన మంత్రులు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వాగ్దానం చేసి మర్చిపోతున్నారన్నారు. రెండేళ్ల క్రితం జొన్నాడలో గోదావరి గేట్లు ఎత్తివేసినప్పుడు ముగ్గురు మృతి చెందారని, వారి కుటుంబాలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఆ హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇప్పటి వరకూ బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో గాయ పడిన, ప్రాణాలు కోల్పోయినవారు 4 వేల మంది వరకూ ఉంటారన్నారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకూ ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదన్నారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని అన్నారు. ర్యాలి ప్రమాద బాధితులందరూ కూలీలు కనుక వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రావులపాలెం ఎంపీపీ కోట బాలయ్య, ర్యాలి ఎంపీటీసీ సభ్యు డు బోణం సాయిబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మెర్ల వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగి రెడ్డి, ఆత్రేయపురం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ముప్పిడి పండు, ప్రధాన కార్యదర్శి తలపాకుల మోహన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కాకినాడలోని ప్రముఖ వైద్యశాలకు తరలించినట్టు ఆత్రేయపురం మండలం ఉచ్చిలిలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తెలిపారు. -
35 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు?
స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదు సామాజిక బాధ్యత మరిచారు ఓఎన్జీసీపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం ఆలమూరు (కొత్తపేట) : మండపేట కేజీ బేసి¯ŒS పరిధిలో ఓఎ¯ŒSజీసీ తవ్వకాలు చేపట్టిన 35 యేళ్ల నుంచి ఆలమూరు పరిసర ప్రాంతాల్ని ఎందుకు అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను నిలదీసారు. ఆలమూరు మండలంలోని కలవచర్లలో కొత్తగా చేపట్టబోయే షేల్ గ్యాస్ తవ్వకాలపై శనివారం స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ జే రాధాకృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ప్రధాన అధికారి డి.రవీంద్రబాబు సమక్షంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి ఎమ్మె ల్యే హాజరై ఓఎ¯ŒSజీసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిం చారు. మండలం చుట్టూ ఏడు బావుల్లో చమురు, సహజ వాయువు నిక్షేపాల నుంచి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఓఎన్జీసీ స్థానిక ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. స్థానికుడొక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తవ్వకాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్థానికుల భద్రతపైనా భరో సా ఇవ్వడం లేదన్నారు. ఒక్క గ్రామాన్ని కూడా మోడల్ విలేజీగా నిర్మించక పోవడంపై సంస్థ పక్షపాత వైఖరి స్పష్టమవుతోం దన్నారు. సామాజిక బాధ్యత కింద గ్రామాల అభివృద్ధి చేయకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కలవచర్ల చమురు బావిలో పనులు ప్రారంభించేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఎంతవరకూ సమంజమన్నారు. చమురు బావిలో ఎగసిన మంటలు ఆలమూరు : ఆలమూరు–మండపేట రోడ్డులోని కొత్తూరు సెంటర్లో ఓఎ¯ŒSజీసీ వెలికి తీస్తున్న చమురు, సహజ వాయు బావిలో శనివారం మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించగలిగారు. ఓఎ¯ŒSజీసీ రిగ్ పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన రోజునే హఠాత్తుగా మంటలు వెలువడటంపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. పక్కనే ఉన్న కొత్తూరు సెంటర్ వాసులు మూకుమ్మడిగా వెళ్లి ఓఎ¯ŒSజీసీ అధికారులను నిలదీశారు. పరిశీలనలో భాగంగానే సహజవాయువును ఒక్కసారిగా వదిలివేయడం వల్ల మంటలు అధికంగా వ్యాపించినట్లు ఓఎ¯ŒSజీసీ అధికారులు తెలిపారు. కార్యకలాపాలను అడ్డుకోవడం తమ అభిమతం కాదు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాలను అడ్డుకోవడం తమ అభిమతం కాదని, సంస్థ తన బాధ్యత మరువకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి గ్రామాలను ఆదుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణపై సర్పం చ్‌కు కూడా సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా డీఎస్పీ ఎ¯ŒSబీఎం మురళీకృష్ణ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.44 కోట్ల వ్యయంతో గ్యాస్ వెలికితీత మండలంలోని కలవచర్లలో రూ.44 కోట్ల వ్యయంతో ఓఎ¯ŒSజీసీ షేల్ గ్యాస్ ను వెలికి తీస్తుందని ఆసంస్థ ప్రతినిధులు పి.చంద్రశేఖర్, బి.ప్రసాదరావు, ఎ.కామరాజు తెలిపారు. పర్యావరణానికి ఏవిధమైన హాని జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నిదానంగా తవ్వకాలు చేపట్టి దాదాపు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఓఎ¯ŒSజీసీ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఆలమూరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. జాతీయ ఓఎ¯ŒSజీసీ శాఖ నిబంధనల మేరకు కలవచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటూ గత ఏడాది డిసెంబర్ మూడున ఆదేశించిందని, అందులో భాగంగానే ఈఏడాది జనవరి మూడున పత్రిక ప్రకటన జారీ చేయడంతో పాటు పరిసర పంచాయతీలకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశీయ ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాలకు మద్దతును ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక చమురు బావిలో త్రవ్వకాలు చేపట్టే విధానం, ఓఎ¯ŒSజీసీ కార్యకలపాలను అధికారులు దృశ్య రూపంలో వివరించారు. సమాచారం లేదు ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిం చిన ప్రజాభిప్రాయ సేకరణపై రైతులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని ప్రజా సంఘాల నాయకు లు, స్థానికులు ఆరోపించారు. చమురు తవ్వకాల వల్ల కలిగే అనర్థాలను సభికులకు వివరించారు. ఓఎ¯ŒSజీసీ నిర్లక్ష్య పోకడల వల్ల జిల్లా వాసులు ఏవిధంగా నష్టపోతున్నదీ జన విజ్ఞాన వేదిక, మానవ హక్కుల వేదిక, ఎంఆర్పీఎస్, జాగృతి సేవాసంస్థ, రైతుకూలీ సంఘం ప్రతినిధులు చేపట్టిన ప్రసంగం స్థానికులను ఆలోచింపజేసింది. -
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
జిల్లా చెకుముకి సై¯Œ్స సంబరాల్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట : విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే శాస్రీ్తయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి చెకుముకి సై¯Œ్స సంబరాలు–2016 (సై¯Œ్స ప్రతిభా పరీక్ష) జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట కాంతిభారతి హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జేవీవీ మండల శాఖ అధ్యక్షుడు బండారు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఆదివారపుపేట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు–కాంతిభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ టి సత్యవాణి పర్యవేక్షణలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ ఆర్ఎస్, జేవీవీ పతాకాన్ని ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీహెచ్ స్టాలి¯ŒS ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ చెకుముకి సై¯Œ్స ప్రతిభా పరీక్షలు భవిష్యత్‌లో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిన కాంతిభారతి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు. ఎమ్మెల్సీ ఆర్ఎస్ మాట్లాడుతూ ఈ దేశభవిష్యత్తు గురువులు, విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అనాగరికత నుంచి నాగరికతలోకి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చామంటే దాని వెనుక సై¯Œ్స హస్తం ఉందన్నారు. ఎందరో శాస్త్రవేత్తల మేధస్సుతో సై¯Œ్స తద్వారా దేశం ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎండీ ఖాజామొహిద్దీన్, కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ఎంఈఓ వై. సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. -
కూలీల పొట్టకొడితే సహించేది లేదు
ఉచిత ఇసుకను సక్రమంగా అందించండి l ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అంకంపాలెం (ఆత్రేయపురం): ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నామంటూ ర్యాంపులు తెరిచి చేతులు దులుపుకోవడం వల్ల కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుకను పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి సక్రమంగా అందించాలని , అలాఅని కూలీల పొట్ట కొడితే సహించేదిలేదన్నారు.పేద ప్రజలకు ఇసుక అందించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నిరంతరంగా పర్యవేక్షించాల్సిందిగా స్దానిక తహశీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జేఏ ఝూన్సీ, పోలీస్ సిబ్బందిని అదేశించారు. కూలీలతో మాట్లాడిన ఆయన ర్యాంపులో ఏవిధమైన ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, మాజీ సర్పంచి గారపాటి అబ్బులు చౌదరి, వైఎస్సార్సీపీ నేతలు కరుటూరి పట్టాబి, కరుటూరి కృష్ణ , ఆర్.ఐ. హుసేన్, వీఆర్వో హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికి తిలోదకాలు
కొత్తపేట : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీలోదకాలు వదిలేసిందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వజమెత్తారు.శనివారం కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలకులకు రూ వేల కోట్లతో రాజధాని, ఎత్తిపోతల పథకాల నిర్మాణంపై ఉన్న ప్రేమ పేద, సామాన్యుల గృహాల నిర్మాణంపై లేదని విమర్శించారు.. ఎ¯ŒSటీఆర్ హౌసింగ్ అంటూ రూ 290 లక్షలతో పక్కా గృహాలు నిర్మిస్తున్నామని గొప్పలకు పోయి ఆర్బాటంగా శంకుస్థాపనలు చేశారని, మంచి పథకమని తామూ ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, తీరా ఆ పథకానికి దశ, దిశ లేకుండా చేశారన్నారు. ఇంటింటికీ తాగునీరు లేదు గానీ మద్యం మాత్రం సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసూనూరి వెంకటేశ్వరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1600 కోట్లు ప్రజాధనం వృథా
కమీషన్ల కోసమే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపణ పేరవరం(ఆత్రేయపురం): రూ.1600 కోట్లతో పురషోత్తపట్నం ఎత్తిపోతల ప«థకం నిర్మించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్ లో ఎత్తిపోతల పథకం నిర్మాణం వ్యయం రూ.1600 కోట్లులో 22.5 శాతం టెండర్లు ఖారారు చేసి తద్వారా వచ్చే రూ.400 కోట్లు కమీషన్లు సీఎం చంద్రబాబు , లోకేష్ జేబుల్లోకి చేరుతాయని ఆరోపించారు. నదుల అనుసందానం పేరుతో నిధుల అనుసంధానం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గెలుపించినందువల్ల ఇక్కడి రైతులకు ఏవిధమైన ప్రయోజనం ప్రభుత్వం చేకూర్చలేదని కేంద్రం ఇచ్చిన పథకాలు మినహ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పధకాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రక్టర్‌కే ఈ కాంట్రక్టు దక్కుతుందని రైతుల పేరు చెప్పి కోట్లు ప్రజాధనం దోపిడి చేయడం దారణమన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి బహిరంగగా పార్టీలు మార్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై ప్రశ్నించినట్లు తెలిపారు. పరోక్షంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రజాస్వామ్యహితం గా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని కేంద్రం ముందు తాకట్టుపెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు ప్రతి సంవత్సరం నియోజక అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓడిన వారికి నిధులు కేటాయిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్, జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం సభ్యులు రాయి వెంకటేశ్వరరావు, జిల్లా వైఎస్సార్సీపీ కార్యదర్శి మార్గన గంగాదరరావు, ఎంపీపీ కోట చెల్లయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం కోసం
స్వయంగా దోమల మందు పిచికారీ చేసిన ఎమ్మెల్యే చిర్ల పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై వినూత్న నిరసన ఆలమూరు : ప్రభుత్వం జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేపట్టలేక పోతే వైఎస్సార్ సీపీ ఆ బాధ్యత చేపట్టి ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం పినపళ్లలో శుక్రవారం నిర్వహించిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పారిశుద్ధ్య పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ఇలాంటి దుస్థితి వల్లే జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వినూత్నరీతిలో ఎత్తిచూపాలని సంకల్పించారు. గ్రామంలోని రైతుల నుంచి స్ప్రేయర్లు, క్రిమి సంహారక మందులు తెప్పించి, మాస్క్‌ను ధరించి గ్రామంలోని పలు వీధుల్లో స్వయంగా పిచికారీ చేశారు. పార్టీ శ్రేణులు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే.., అంటు వ్యాధుల వ్యాప్తిపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే పార్టీ శ్రేణులతో కలిసి పారిశుద్ధ్యం మెరుగుదల పనులు చేశామని జగ్గిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అంటు వ్యాధుల నివారణకు, డెంగీ కేసులు నియంత్రణకు చర్యలు తీసుకోకుంటే పార్టీ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు కర్రి నాగిరెడ్డి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, చల్లా ప్రభాకరరావు, యనమదల నాగేశ్వరరావు, మార్గని గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, తమ్మన శ్రీనివాసు, దొమ్మేటి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సుపాసుల పంపిణీ అభినందనీయం
వైఎస్సార్సీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి రావులపాలెం : కొత్తపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ఆయన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు నిధులతో నియోజకవర్గంలోని వేలాది మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు ఇవ్వడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. చిర్ల సోమసుందరరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విద్యార్థులకు ఏడాది కాలానికి ఉచిత బస్సుపాసుల పంపిణీ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టబ్బాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహానాయకుడని అన్నారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జగ్గిరెడ్డి తండ్రి పేరుతో చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ద్వారా సుమారు 3 వేల మందికి ఉచిత బస్సుపాసులు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీలు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీలు గుడిమెట్ల శారద, కొండేపూడి రామకృష్ణ, ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు తేతలి పద్మనాభరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, ప్రచార కార్యదర్శి మసునూరి వెంకటేశ్వరరావు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, మాజీ జెడ్పీటీసీలు అప్పారి విజయకుమార్, బొక్కా వెంకటలక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, ముత్యాల వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులది ప్రేక్షకపాత్రే..
జిల్లా ఎస్పీకి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫిర్యాదు కొత్తపేట/ఆత్రేయపురం : జాతీయ నాయకుల విగ్రహాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, వాటిని ధ్వంసం చేసిన కేసులను నీరుగారుస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ఆయా కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ మేరకు కాకినాడలో ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆత్రేయపురంలో మంగళవారం ఆయ న విలేకరులకు తెలిపారు. కొత్తపేట మండలం లో మోడేకుర్రు, గంటి, వానపల్లి, ఆత్రేయపురం మండలంలో వెలిచేరు, బొబ్బర్లంక గ్రామాల్లో, రావులపాలెం మండలంలో పొడగట్లపల్లి, ఆల మూరు మండలంలో గుమ్మిలేరు గ్రామాల్లో అం బేడ్కర్ విగ్రహాలకు అవమానాలు జరిగాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు కేసుల నమోదుతో సరిపెట్టారు మినహా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేడ్కర్ విగ్రహాలకు అవమానాలు జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో కాపు నాయకుడు దివంగత వంగవీటి మెహనరంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి, అవమానపరిచిన కేసులో పోలీసులు ఇంతవరకూ దోషులను పట్టుకోలేక పోయారని విమర్శించారు. ఆయా అంశాలపై జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు దళిత నాయకులతో కలసి ఫిర్యాదు చేశామన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, పలువురు దళిత నాయకులున్నారు.