ప్రజా సంక్షేమానికి తిలోదకాలు | tdp government very bad .. no use | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమానికి తిలోదకాలు

Published Sat, Nov 12 2016 11:50 PM | Last Updated on Fri, Aug 10 2018 5:54 PM

tdp government very bad .. no use

కొత్తపేట : 
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీలోదకాలు వదిలేసిందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వజమెత్తారు.శనివారం కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలకులకు రూ వేల కోట్లతో రాజధాని, ఎత్తిపోతల పథకాల నిర్మాణంపై ఉన్న ప్రేమ పేద, సామాన్యుల గృహాల నిర్మాణంపై లేదని విమర్శించారు.. ఎ¯ŒSటీఆర్‌ హౌసింగ్‌ అంటూ రూ 290 లక్షలతో పక్కా గృహాలు నిర్మిస్తున్నామని గొప్పలకు పోయి ఆర్బాటంగా శంకుస్థాపనలు చేశారని, మంచి పథకమని తామూ ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, తీరా ఆ పథకానికి దశ, దిశ లేకుండా చేశారన్నారు. ఇంటింటికీ తాగునీరు లేదు గానీ మద్యం మాత్రం సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసూనూరి వెంకటేశ్వరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement