no use
-
పెద్దవాళ్లు విటమిన్–డి తీసుకున్నా వృథానే!
మెల్బోర్న్: పెద్ద వయస్కులు విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల వారిలో ఎముకల సాంద్రత మెరుగు పడే అవకాశాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. ఎముకలు విరగటాన్ని ఈ సప్లిమెంట్లు నిరోధించలేవని వెల్లడైంది. పెద్ద వయస్కుల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉండేందుకు గత కొంత కాలంగా డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్లను సిఫార్సు చేయడం తెల్సిందే. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్‌కు చెందిన పరిశోధకులు సుమారు 81 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అసలు విటమన్–డి సప్లిమెంట్ల వల్ల అనుకున్నంత ప్రయోజనంలేదని తేలింది. ఈ సప్లిమెంట్లు వల్ల పూర్తిగా, పాక్షికంగా విరిగిన ఎముకలు కేవలం 15 శాతం అతుక్కుంటున్నట్లు తేల్చారు. -
తాళం తెరవలే..!
భద్రాచలం : భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.18.14 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను గత ఏడాది జూలైలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆస్పత్రి తాళాలే తెరుచుకోలేదు. దీంతో ఇవి నిధులు ఖర్చు చేయడానికే తప్ప మరెందుకూ పనికి రావనే భావన వ్యక్తమవుతోంది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు తోడు మరో వంద పడకలు మంజూరైన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసగఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రధానంగా గిరిజనులకు వైద్య సేవలు అందించటంలో పెద్ద దిక్కుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడికి నిత్యం 450 – 550 మంది రోగులు వస్తుంటారు. 150 – 200 మంది ఇన్పేషెంట్లుగా సేవలు పొందుతున్నారు. నెలకు 350 – 450 వరకు కాన్పులు జరుగుతాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి, ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ మెరుగైన వైద్య సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా ఖ్యాతి గడిచింది. ప్రత్యేక సౌకర్యాలున్నా.. ప్రయోజనం సున్నా కార్పోరేట్‌కు ధీటుగా రోగులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఆప్పత్రి భవనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ ప్లోర్లో గర్భణీ పరీక్షలు, యాక్సిటెండ్ విభాగం, క్యాజువాలటీ, చిన్నపిల్లల విభాగంల కోసం తగిన సౌకర్యాలను కల్పించారు. మొదటి అంతస్తులో క్లినిక్, పేథాలజీ, డెంటల్, ఈఎన్టీ, ఇన్‌పేషెంట్, ఆపరేషన్స్ విభాగం, ఐసీయూ విభాగాల కోసం, రెండో అంతస్తులో పరిపాలనకు ప్రత్యేక గదులు, డబ్బులు చెల్లించి అద్దెకు ఉండే రోగుల కోసమని 15 గదులు(స్పెషల్రూమ్స్) సిద్దం చేశారు. బర్నింగ్ కేసుల కోసమని 6 గదులను నిర్మించారు. ప్రసవాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో లేబర్ రూమ్‌లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసమని 6 గదులు కేటాయించగా, ప్రతీ గదిలోనూ అటాచ్డ్ బాత్రూమ్స్, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. కొత్త ఆసుపత్రిలో దాదాపుగా అన్ని వార్డులు, గదుల్లో కూడా ఏసీలను అమర్చారు. కానీ వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో ప్రసుత్తం ఉన్న పాత ఆసుపత్రి భవనాల్లోనే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ యూనిట్ మంజూరైంది. దీనికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు కూడా వచ్చాయి. కానీ దీనిని ప్రస్తుతం ఉపయోగపడటంలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వైద్యులు, సిబ్బంది భర్తీ కోసం ఎదురుచూపులు.. 100 పడకల ఆస్పత్రి నుంచి 200కు అప్‌గ్రేడ్ చేశారు. ఈ లెక్కన వైద్యులు, సిబ్బందిని కూడా అదనంగా నియమించాలి. 40 మంది వైద్యులు, 30 మంది స్టాఫ్ నర్సులు, సుమారు 100 మంది పారామెడికల్ సిబ్బందిని కేటాయించాలి. కానీ ఈ పోస్టులను భర్తీ చేయలేదు. స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత కూడా ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రెండు హెడ్ నర్సు పోస్టులూ ఖాళీనే. 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌గా అయినందున ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తేనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనేది అక్షర సత్యం. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్ శుక్రవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలన కోసం వస్తున్నందున, ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
తమ్ముడూ..మోసాల కుమ్ముడు
బడ్జెట్ ‘సిత్రాలు’ రూ.500 కోట్లు జిల్లాకే సరిపోవు ∙ ఆ అంకెలతో ఎందుకీ రంకెలు l ప్రశ్నిస్తున్న 84 వేల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ.500 కోట్లు. ఓసారి ఈ లెక్కల చిత్రాలేమిటో విశ్లేషించుకుందాం. జిల్లాలో నిరుద్యోగుల మొత్తం సంఖ్య 84 వేలు ... ఇచ్చిన హామీ భృతి రూ.2000. అంటే 84 వేల నిరుద్యోగులతో రూ.2000 గుణిస్తే ఎంత వస్తుంది...నెలకు సుమారు రూ.17 కోట్లు. బాబు అధికారంలోకి వచ్చి 36 నెలలైంది. బ్యాక్లాగ్ బకాయిలతో కలుపుకుంటే ... అంటే 36 నెలలు... 84 వేల మంది నిరుద్యోగులు ... నెలకు రూ.17 కోట్లు గుణిస్తే ఇప్పటి వరకు నిరుద్యోగులకు బాబు సర్కారు ఇవ్వాల్సింది సుమారు రూ.612 కోట్లు. అంటే బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లకు ఇంకో రూ.112 కోట్లు అదనమన్నమాట. ఒక్క ఈ జిల్లాకే సరిపడని ఈ కేటాయింపులతో ‘తందానా అంటే తాన తందానా’ అంటూ గంతులేస్తున్న ఈ తెలుగు తమ్ముళ్లు ఏం సమాధానం చెబుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తా’మన్న చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్ ‘సాక్షి’గా నిరుద్యోగులను నిలువునా దగా చేశారు. గతంలో ఎవరూ ఇవ్వని భృతిపై ఆశలు పెంచడంతో జిల్లాలో నిరుద్యోగులు, యువత గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేశారు.బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఆయన మాటలు నమ్మి ఓటేసినందుకు తగిన బుద్ధి చెప్పారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇచ్చిన హామీపై చంద్రబాబు పెదవి విప్పలేదు. కనీసం రాష్ట్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులుంటాయని గంపెడాశ పెట్టుకున్నారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు నిరాశనే మిగిల్చాయి. నిరుద్యోగ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రూ.500 కోట్లు కేటాయించారు. ఆ బడ్జెట్ ఏమూలకు వస్తుందని నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నాకు ఓటేయండి మీకు ఉద్యోగాలు కల్పిస్తానని, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి రూ.2000 ఇస్తామని ’ నాడు గొప్పగా ప్రకటించి ఆచరణలో దగా చేశారని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉపాధి వేటలో సుమారు 84 వేల మంది... జిల్లా కేంద్రం కాకినాడ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అధికారికంగా నమోదైన నిరుద్యోగులు 84 వేల151 మంది ఉన్నారు. వీరిలో పదో తరగతి ఉత్తీర్ణులై 10,641 మంది, ఇంటరీ్మడియట్ ఉత్తీర్ణులై 16,412 మంది, డిగ్రీ ఉత్తీర్ణులై 16596 మంది, బీఈడీ చేసి ఖాళీగా ఉన్న 4297 మంది, ఐటిఐ 13,314 మంది, డిపొ్లమా చేసి 5423 మంది, ఇతరులు 17,468 మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సర్కార్ జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన వారి సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 84 వేల 151 మంది నిరుద్యోగులకు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే రూ.2000 వంతున లెక్కేస్తే నెలకు రూ.16 కోట్ల 83 లక్షలపై చిలుకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 36 నెలలకు తాను ఇచ్చిన మాటను అమలు చేయాలంటే రూ.612 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అధికారికంగా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల లెక్కలు తీసుకుంటేనే ఇంత మొత్తంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు మన జిల్లాలో నిరుద్యోగులకే సరిపోవు. ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనే అంటే సుమారు లక్షన్నర మంది నమోదు కాని నిరుద్యోగులుంటారని అంచనా. బడ్జెట్లో అరకొర కేటాయింపులతోపాటు అర్హతకు నిర్ధేశించుకున్న మార్గదర్శకాలేమిటో కూడా స్పష్టం చేయకపోవడం తమను దగా చేయడమేనని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
ప్చ్..!
గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టి అధికారం ఇచ్చిన జిల్లా ప్రజలను సర్కారు మరోమారు ఉసూరుమనిపించింది. నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు అన్యాయం చేసింది. కేవలం కంటితుడుపు కేటాయింపులతో సరిపెట్టింది. నామమాత్రంగా పెంచి అంకెల గారడీ చేసింది. గత హామీలకూ చోటివ్వలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై అన్నివర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని సాగునీటి పథకాలకు అరకొర కేటాయింపులు చేసి సర్కారు చేతులు దులుపుకుంది. గతంతో పోలిస్తే నామమాత్రంగా నిధులు పెంచినా.. వాటితో పథకాలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా అభివృద్ధిపై పెద్దగా ప్రకటనలు, కేటాయింపులు కూడా లేవు. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది రూ.3,357 కోట్లుగా సవరించిన అంచనాలు ఉండగా.. ఈ ఏడాది వాటిని రూ.6,889 కోట్లకు పెంచింది. ఈ మొత్తం నాబార్డు రుణంగా కేటాయిస్తేగానీ ఖర్చు చేసే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది రూ.1700 కోట్లు మాత్రమే నాబార్డు రుణంగా వచ్చింది. ఈ ఏడాది రూ.6,889 కోట్లు రుణం వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది రూ.160.76 కోట్లు ఖర్చు పెట్టగా వచ్చే ఏడాది బడ్జెట్లో రూ.91.90 కోట్లు కేటాయిం చారు. ఈ పథకానికి ఇంకా రూ.982 కోట్లు అవసరం. అదనంగా 2.8 లక్షల ఎకరాలకు నీరు అందించే రెండోదశ ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ టెండర్లే పిలవలేదు. రెండోదశతో సుమారు రూ.4,909 కోట్ల అంచనాలు పెరిగితే ప్రభుత్వం మాత్రం రూ.91.90కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.554 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.98.64 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించి అందులో రూ. 46.80 కోట్లు ఖర్చుపెట్టారు. ఎర్రకాల్వ ఆధునికీకరణ కోసం ఇంకా రూ.64 కోట్లు అవసరం కాగా, గత ఏడాది రూ.2.6 కోట్లు కేటాయించి రూ.3.32 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది కేటాయింపులను రూ.18.80 కోట్లకు పెంచారు. ఇదే పద్ధతిలో సాగితే ఈ పథకాలు పూర్తవడానికి మరో మూడేళ్లు పడుతుంది. గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ.85.25 కోట్లు, గోదావరి పుష్కరపనులు, వరదల నియంత్రణకు రూ.89.86 కోట్లు, కృష్ణా,గోదావరి, పెన్నా డెల్టాలలో డ్రెయిన్ల నిర్వహణ కోసం రూ.45.21 కోట్లు కేటాయింపులు జరిగాయి. గోదావరి డెల్టా ఆధునీకరణ కోసం రూ.1,383 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకూ రూ.660 కోట్లు ఖర్చు పెట్టారు. గత ఏడాది బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఉభయగోదావరి జిల్లాలకు కలిపి రూ.85.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది మన ఒక్క జిల్లాకే రూ.136 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. వీటి ప్రస్తావనేదీ! గతంలో సీఎం చంద్రబాబునాయుడు తాడేపల్లిగూడెంలో బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించినా బడ్జెట్లో దీని ప్రస్తావన లేదు. కొల్లేరు కాంటూరు కుదింపుపై గత అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడి తీర్మానం చేసిన ప్రభుత్వం కొల్లేటిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే ఈ ఊసు బడ్జెట్లో లేదు. కాంటూరు కుదింపు ప్రక్రియ, అందుకు సంబంధించిన నిధుల గురించి కూడా ప్రస్తావించలేదు. గతంలో నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశముందని ప్రకటించినా దాని ఊసే మరిచారు. గతంలో జిల్లాలో సిరామిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, చింతలపూడిలో బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తామని, సాగు ప్రధాన జిల్లా కావడంతో నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. అవన్నీ వట్టిమాటలుగా మిగిలిపోయాయి. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పి, జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు గతంలో ప్రకటించినా.. బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఆక్వా వర్సిటీ ఏర్పాటు ఊసు కూడా బడ్జెట్లో కానరాలేదు. ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించినా రూ.15 కోట్లు కూడా దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 స్మార్ట్ సిటీలకు కలిపి రూ.150 కోట్లు కేటాయించారు. కొత్త ఊరింపు గత హామీల ప్రస్తావన లేకపోయినా కొత్తగా కొన్ని ఊరింపు ప్రకటనలను బడ్జెట్లో వల్లెవేశారు. జిల్లాలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహకానికి రూ. 55 కోట్లు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో భారత ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అప్రాధాన్యమే ! అధికారం చేపట్టాక 40సార్లు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా రుణం తీర్చుకోలేనని, జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని ప్రకటనలు గుప్పించారు. అయితే ఈ హామీ బడ్జెట్లో ఎక్కడా ప్రతిఫలించలేదు. పొరుగు జిల్లాలకు దక్కిన ప్రాధాన్యంలో సగం కాదు కదా.. కనీస మాత్రంగా కూడా జిల్లాకు దక్కలేదు. -
భవితకు భరోసా శూన్యం
ఏడాది తరువాత సాదాసీదాగా.. తీరు మారని ఐటీడీఏ పాలకవర్గం సమావేశం రంపచోడవరం : ఏడాది తరువాత నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం యథాలాపంగా జరిగింది. గిరిజనులకు భరోసా ఇచ్చే ఒక్క చర్యా తీసుకోలేదు. పోలవరం నిర్వాసితులు, అటవీ హక్కుల చట్టం అమలు తీరుతో పాటు జీసీసీ వంటి శాఖల అంశాలను విస్మరించారు. ప్రతి త్రైమాసికానికీ నిర్వహించాల్సిన పాలకవర్గ సమావేశం ఏడాది తరువాత నిర్వహించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు టి రత్నబాయి, రెడ్డి సుబ్రమణ్యం, ఎంపీలు తోట నరసింహం, కొత్తపల్లి గీత, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు పాల్గొన్నారు. సమావేశాల రద్దు మీ ఇష్టమేనా? ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి తేదీ ప్రకటించి అధికారులు ఇష్టమెచ్చినట్లు రద్దు చేయడంపై ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికారులను నిలదీశారు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టరాజ్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఐటీడీఏ అధికారుల తీరును రెడ్డి సుబ్రమణ్యం తప్పు పడుతూ ఏడాదిగా సమావేశం నిర్వహించకపోవడానికి కారణం చెప్పాలన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. ఎంపీ గీత గో ఎహేడ్ అంటూ మాట్లాడంపై ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. హోలీ ఏంజెల్స్ డైరెక్టర్‌ను అరెస్టు చేయలేదా? గిరిజన విద్యార్థినులను చిత్రహింసలకు గురిచేసిన హోలీఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్నాడని కలెక్టర్ చెప్పగా, పోలీసులు తలుచుకుంటే అరెస్టు చేయడం ఎంతసేపని ఆమె ప్రశ్నించారు. బొమ్మూరు ఆశ్రమ పాఠశాల బాలికలను ౖలైంగికంగా వేధించిన ఏటీడబ్ల్యూఓపై కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. విచారణ జరుగుతోందన్న పీఓ వివరణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు ఒక్కసారి కూడా పాఠశాల విద్యార్థుల ప్రగతిని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్సీ టి.రత్నబాయి మాట్లాడుతూ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని అన్నారు. పోషకాహార లోపంతోనే మతా, శిశు మరణాలు ఏజెన్సీలో పోషకాహార లోపంతోనే మతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, వాటి నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్నారు. ఐసీడీఎస్ ద్వారా అదనంగా పోషకాహారం అందడం లేదన్నారు. వెలుగు ద్వారా నిర్వహించే పౌష్టికాహార కేంద్రాలను మూసివేశారన్నారు. వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలని, అంబులె¯Œ్సలు అందుబాటులో ఉంచాలని జెడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ ప్రగతి కాగితాలకే పరిమితం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ప్రగతి కాగితాలకే పరిమితమైనట్టుందని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా మంజూరు చేసిన పనులు నేటికీ ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. రంపచోడవరం మండలంలో రహదారులకు ప్రతిపాదనలు పెట్టడం లేదని ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి అనడంతో గిరిజన సంక్షేమ ఇంజనీర్‌కు ఆయనకూ వాగ్వాదం జరగ్గా, ఈఈ పీకే నాగేశ్వరరావు రోడ్డు నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదనలు చదివినిపించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, ఏఎస్పీ అద్నా¯ŒS నయీం ఆస్మీలు పాల్గొన్నారు. -
ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు
బడ్జెట్లో కానరాని ‘తూర్పు’ ఎంపీల ప్రాధాన్యం ఏ ఒక్క హామీ విషయం ప్రస్తావనే లేదు ‘తోట’ మాటలన్నీ ఏ తోటలోకి పోయాయో...! ‘పండుల’ మాట పండలేదెందుకో..! వినిపించని మోహనరాగం అయినా ఏదో సాధించినట్టు ఆర్భాట ప్రకటనలు బాబు నుంచి గల్లీ నేతల వరకూ ఇదేమి ధోరణంటూ విస్తుపోతున్న ఓటర్లు ‘అంతన్నారింతన్నారు’ చందంగా తయారైంది జిల్లాలోని ముగ్గురు ఎంపీల తీరు. ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు ఇవ్వడం రివాజు. అందులో అధికార పార్టీ నేతలు సిద్ధహస్తులు. ఈ విషయం ఆయా నియోజకవర్గ ఓటర్లకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా భారీ ప్రాజెక్టులు తీసుకువస్తామని, రైల్వే ట్రాక్‌లు వేయించేస్తామని, కొత్త మార్గాలు తమకే సాధ్యమని, పలు కేంద్రాల స్థాపనకు ప్రతిపాదనలు చేశామని ఎన్నో మాటలు చెప్పారు. అవన్నీ కేంద్ర బడ్జెట్లో రానున్నాయని...నిధుల వర్షం కురుస్తుందని .. ఇక ప్రగతి పరుగులు తీస్తుందంటూ ఊరించిని ఎంపీల మాటల్లోని డొల్లతనం బయటపడడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు. మురళీమోహన రాగమేదీ..? ∙ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహ¯ŒSదీ అదే బాట. ∙ రాజమహేంద్రవరంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్, గోదావరిపై హేవలాక్ బ్రిడ్జిని, టూరిజం ప్రాజెక్టులో మంజూరు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ∙ భారతీయ విదేశీ వ్యాపార శిక్షణా సంస్థను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చే స్తామని ప్రభుత్వం ప్రకటించగా ఎంపీగా ఉండి కూడా సాధించలేకపోయారు. ‘పండ’లేదెందుకో ∙ ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఏ ఒక్క హామీనీ నిలుపుకోలేకపోయారు. ∙ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లై¯ŒSకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఎంతగానో ఆశించిన రైల్వే సాధన సమితికి, కోనసీమ ప్రాంతవాసులకు నిరాశే మిగిలింది. ∙ గత రైల్వే బడ్జెట్లో సుమారు రూ. 300 కోట్లు విడుదలైనా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. ప్రస్తుత బడ్జెట్లో మరికొన్ని నిధులు వస్తాయని ఆశపడ్డారు. ∙ అంతర్వేదిలో రూ.1450 కోట్లతో ప్రతిపాదించిన డ్రెడ్జింగ్ కార్పొరేష¯ŒS సంస్థ కార్యకలాపాల ఊసుకూడా బడ్జెట్లో లేకపోయింది. ‘తోట’ మాట ‘నీటి’ మూట లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా కేంద్ర రైల్వే బోర్డు, పెట్రోలియం, సహజ వాయువుల సంప్రదింపుల కమిటీ, కోకోనట్ బోర్డు, జిల్లా విద్యుత్ కమిటీ చైర్మ¯ŒSగా పదవులు అనుభవిస్తున్న ఎంపీ ‘తోట’ ఇచ్చిన హామీలివీ... డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ కింగ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలు ప్రస్తుత బడ్జెట్లో కాకినాడకు వస్తాయని ఊరించారు. ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కాకినాడ మెయి¯ŒS లై¯ŒS గురించి కూడా రైల్వే బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ∙కాకినాడ–పిఠాపురం లై¯ŒSకు గత బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినా ఈ బడ్జెట్లో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ∙ 21 కిలోమీటర్ల ఈ లై¯ŒS అంచనా విలువ 2000లో రూ.126 కోట్లయితే అది ఇప్పుడు రూ.250 కోట్లకు చేరుకుంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కేంద్రంలో పలుకుబడి...‘బాబు’తో సాన్నిహిత్యం... ప్రొటోకాల్ దర్పంతో కూడిన పదవులు... ఇలా ఎన్ని ఉన్నా అవన్నీ అలంకారప్రాయమేనని నిరూపించారు మన ఎంపీలు. ప్రస్తు త కేంద్ర సాధారణ, రైల్వే బడ్జెట్లో జిల్లాకు అనేక ప్రాజెక్టులు తెచ్చేస్తామంటూ గడచిన నెల రోజులుగా ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన మన పార్లమెంట్ సభ్యులు తీరా బడ్జెట్ బయటకు వచ్చాక ఏ ఒక్క హామీ ప్రస్తావన అందులో లేకపోవడంతో ఓటేసిన జనం వీరి పనితీరుపై మండిపడుతున్నారు. వీరికి ఉన్న పదవులు, పలుకుబడి ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఈ ప్రాంతానికి లభిస్తాయన్న ఈ ప్రాంతవాసుల ఆశలు ఆవిరైపోయాయి. ‘తోట’ మాట ‘నీటి’ మూట ప్రస్తుత బడ్జెట్లో జిల్లాకు కొత్తగా మూడు ప్రాజెక్టులు వచ్చేస్తాయంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం గడచిన కొద్దిరోజులుగా ఆర్భాటంగా ప్రచారం చేసి తుస్సుమనిపించారు. లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా కేంద్ర రైల్వే బోర్డు, పెట్రోలియం, సహజవాయువుల సంప్రదింపుల కమిటీ, కోకోనట్ బోర్డు, జాతీయ ఆరోగ్యమిష¯ŒS జిలా్లౖ ఛైర్మన్, జిల్లా విద్యుత్ కమిటీ చైర్మ¯ŒSగా పదవులు అనుభవిస్తున్న ఎంపీ ‘తోట’ మాటలన్నీ నీటి మూటలయ్యాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలు ప్రస్తుత బడ్జెట్లో కాకినాడకు వస్తాయని ఆయన కొద్దిరోజులుగా ప్రతి కార్యక్రమంలోనూ ప్రజల ముంగిట పదేపదే చెప్పారు. ఇవేమీ బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడంతో చూసిన ప్రజలు నివ్వెర పోయారు. ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కాకినాడ మెయి¯ŒSలై¯ŒSకు కూడా రైల్వే బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాకినాడ–పిఠాపురం లై¯ŒSకు గత బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినా ఈ బడ్జెట్లో చిల్లిగవ్వ కూడా కేటాయించ లేదు. 21 కిలోమీటర్ల ఈ లై¯ŒS అంచనా విలువ 2000లో రూ.126 కోట్లయితే అది ఇప్పుడు రూ.250 కోట్లకు చేరుకుంది. కేంద్రంలో అనేక కీలక పదవులు అనుభవిస్తూ ఒక్క ప్రాజెక్టును కూడా సాధించలేకపోయారంటూ ఎంపీ తోటపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఆయనకు ఉన్న పదవులు, పలుకుబడి ఎవరికోసమంటూ ప్రశ్నిస్తున్నారు. ‘పండ’లేదెందుకో ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఏ ఒక్క హామీని నిలుపుకోలేకపోయారు. ఐఆర్ఎస్ అధికారిగా, కేంద్రస్థాయిలోను కాస్తంత పట్టున్న ఆయన ఇచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ప్రధానంగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లై¯ŒSకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఎంతగానో ఆశించిన రైల్వే సాధన సమితికి, కోనసీమ ప్రాంతవాసులకు నిరాశే మిగిల్చింది. గత రైల్వే బడ్జెట్లో సుమారు 300 కోట్లు విడుదలైనా పనులు ప్రారంభానికి మాత్రం నోచుకోలేకపోయాయి. ప్రస్తుత బడ్జెట్లో మరికొన్ని నిధులు వచ్చి ఉంటే పనులు వేగవంతమయ్యేందుకు ఉపయోగపడేవన్న భావన ప్రజల్లో వ్యక్తమైంది. చమురు, సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఉన్న ఎంపీ రవీంద్రబాబు కొద్దిరోజులుగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లై¯ŒSకు ఈ బడ్జెట్లో అదనపు నిధులు మంజూరవుతాయంటూ ప్రజలను ఎంతగానో నమ్మించారు. అవన్నీ ఉత్తుత్తి మాటలేనని బడ్జెట్ తేల్చేసింది. అంతర్వేదిలో రూ.1450 కోట్లతో ప్రతిపాదించిన డ్రెడ్జింగ్ కార్పొరేష¯ŒS సంస్థ కార్యకలాపాల ఊసుకూడా బడ్జెట్లో లేకపోయింది. ఇక ఈ ఎంపీ సాధించినదేమిటంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మురళీమోహన రాగమేదీ..? ఎంతో పలుకుబడి...ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహ¯ŒS కూడా మిగిలిన ఇద్దరు ఎంపీలతో బాగా పోటీపడ్డారు. ఆ ఎంపీల్లాగే ఈయన కూడా ఏ ఒక్క ప్రాజెక్టును సాధించలేకపోయారు. రాజమ హేంద్రవరంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్, గోదావరిపై హేవలాక్ బ్రిడ్జిను, టూరిజం ప్రాజెక్టులో మంజూరు చేస్తామంటూ ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. భారతీయ విదేశీ వ్యాపార శిక్షణా సంస్థను రాజ మహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఎంపీగా ఉండి దీన్ని కూడా ఎంపీ సాధించలేకపోయారు. అందులో ఏ ఒక్కటీ ప్రస్తావనకు రాని పరిస్థితి నెలకొంది. ఇలా ముగ్గురు ఎంపీల పనితీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పక్షంగా ఉంటూ కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతూ మరెన్నో ప్రొటోకాల్ పదవులు అనుభవిస్తూ ఈ ముగ్గురు ఎంపీలు ఈ ప్రాంత ప్రజలకు ఒరగబెట్టిందేమిటని పెదవి విరుస్తున్నారు. -
మూలన పడ్డ ముద్రణ యంత్రాలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవస్థలు ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులు పట్టించుకోని జిల్లా అధికారులు కాకినాడ లీగల్ : నూతన ముద్రణ యంత్రాలు (ఫ్రాంకింగ్ మెషీన్లు) జిల్లాకు వస్తున్నాయంటూ జిల్లా అధికారులు ఆరు నెలల నుంచి ఊరిస్తున్నారు తప్ప వాటి జాడ కనిపించడంలేదు. జిల్లాలో బ్యాంక్ రుణాలు, స్థలాల నుంచి రుణాలు తీసుకునేవారికి ఫ్రాంకింగ్ మెషీన్లు లేక స్టాంపులు ముద్రించే వెసులుబాటు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మెషీన్లు వినియోగం ముఖ్యంగా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ లోన్లు తీసుకునే సమయంలో ఒక్కో రిజిస్ట్రేష¯ŒSకు రూ.వెయ్యి నుంచి రూ.లక్ష, రూ.2 లక్షల వరకూ స్టాంపులను కూడా వినియోగించే పరిస్థితులు ఉంటాయి. జిల్లాలోని రిజిస్ట్రేష¯Œ్స అండ్ స్టాంప్స్ శాఖ ఆధ్వర్యంలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 13 చోట్ల ముద్రణ యంత్రాలు (ఫ్రాంకింగ్ మెషీన్లు) ఏర్పాటు చేశారు. వీటిలో సాంకేతిక లోపాలతో ద్రాక్షారామ, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు తదితర 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని మెషీన్లు పనిచేయడంలేదు. ప్రస్తుతం తుని, అమలాపురం ప్రాంతాల్లోని మెషీన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ముద్రణ యంత్రాలను సర్వీసింగ్ చేసే ‘పిట్నీబౌజ్’ సంస్థ పనిచేయని యంత్రాలపై దృష్టి పెట్టడంలేదు. దీంతో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వీస్ ఇవ్వని కంపెనీతోనే ఒప్పందం కొన్నేళ్లుగా జిల్లాలో ఉన్న ఫ్రాంకింగ్ మెషీన్లకు సర్వీస్ ఇవ్వాల్సిన పిట్నీబౌజ్ ప్రైవేటు సంస్థ పట్టించుకోకపోవడంతో అవి మూలనపడ్డాయి. సుమారు మూడేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పట్టించుకోని ఆ సంస్థతోనే అధికారులు ఒప్పందం కుదుర్చుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతున్న జిల్లా అధికారులు మెషీన్లకు మరమ్మతులు చేయకపోయినా ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. సమస్య ఇలా... వివిధ లావాదేవీల్లో ఒప్పంద పత్రాలపై స్టాంపు వేయించుకోవాలన్నా, బ్యాంకు నుంచి రుణం పొందాలన్నా అంత సులభం కాదు. ఒప్పంద పత్రాలకు స్టాంపు కాగితాల విలువను తీసుకొచ్చే ముద్రలు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రాకింగ్ మెషీన్లు అలంకార ప్రాయంగా మిగిలాయి. రూ.వెయ్యి పైబడి విలువైన స్టాంపు వేయించుకోవాలంటే జిల్లాలో ఎక్కడ ఫ్రాకింగ్ యంత్రం పనిచేస్తుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకు రుణాల విషయంలోనూ, స్థిరాస్తి లావాదేవీల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. త్వరలో కొత్త మెషీన్లు నూతన ఫ్రాంకింగ్ మెషీన్ల కోసం పిట్నీబౌజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. త్వరలో అవి జిల్లాకు రానున్నాయి. పాత మెషీన్లను మరమ్మతులు చేసేందుకు ముంబాయి పంపించాం. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తాం. – పి.లక్షీ్మకుమారి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష¯ŒS డీఐజీ, తూర్పుగోదావరి -
ఇది ‘పచ్చ’ కామెర్ల మాయాజూదం
‘బీచ్‌లవ్’ ప్రతిపాదనపై కవుల నిరసనగళం రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రభుత్వం తలపెట్టిన ’బీచ్ లవ్’ భారతీయ సంస్కృతికి వ్యతిరేకం, ఆంధ్ర సంస్కృతికి అవమానమని కళాగౌతమి అనుబంధ సంస్ధ రచయితల సమితి ఏకగ్రీవ తీర్మానంతో నిరసించింది. ఆదివారం దానవాయిపేట గ్రంథాలయం మేడపై జరిగి న సమితి సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి. వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ విదేశీయులు మన దేశానికి చేయలేని కీడును నేడు గద్దెనెక్కిన పెద్దలు చేస్తున్నారని నిరసించారు. ‘జరుగవలెను ప్రేమలు చాటుగానె–బట్టబయలు చేయుట భావ్యమగునె– వెర్రి వేషాలు వేయంగ వెసలుబాటు–ఆటవస్తువయ్యె అబల బ్రతుకం త’ అన్న స్వీయరచనను వినిపించారు. విజయకుమార్ యాళ్ళ రచించిన ‘విజయరవళి‘ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుద్ధినీ విదేశాలకు అమ్ముకుంటున్నాం.. కవులు బీచ్ లవ్‌పై తమ నిరసనకు ఇలా వ్యక్తం చేశారు.. ‘మద్యం మత్తులో మీరు–సాగర సౌందర్యాన్ని తొక్కేస్తున్నారు–వెకిలి పాటల మధ్య–సాగరఘోష మీకు వినిపించదు–నకిలీ దీపకాంతుల్లో నిండు చంద్రుని చూడలేరు (రామచంద్రుని మౌనిక)’, ‘భూమిని అమ్ముకుంటున్నాం–నీటిని అమ్ముకుంటున్నాం–అగ్నిని అమ్ముకుంటున్నాం–బుద్ధిని విదేశాలకు అమ్ముకుంటున్నాం (బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి)’, ’సాగర తీరతిన్నెలపై–చట్టబద్ధతను కూర్చి–విశృంఖల సంస్కృతికై ’పచ్చ’కామెర్ల మాయాజూదం (తాతపూడి అబ్రహాం ప్రభాకర్)’ అంటూ బీచ్‌లవ్ ప్రతిపాదనను నిరసించారు. -
ప్రజా సంక్షేమానికి తిలోదకాలు
కొత్తపేట : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీలోదకాలు వదిలేసిందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వజమెత్తారు.శనివారం కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలకులకు రూ వేల కోట్లతో రాజధాని, ఎత్తిపోతల పథకాల నిర్మాణంపై ఉన్న ప్రేమ పేద, సామాన్యుల గృహాల నిర్మాణంపై లేదని విమర్శించారు.. ఎ¯ŒSటీఆర్ హౌసింగ్ అంటూ రూ 290 లక్షలతో పక్కా గృహాలు నిర్మిస్తున్నామని గొప్పలకు పోయి ఆర్బాటంగా శంకుస్థాపనలు చేశారని, మంచి పథకమని తామూ ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, తీరా ఆ పథకానికి దశ, దిశ లేకుండా చేశారన్నారు. ఇంటింటికీ తాగునీరు లేదు గానీ మద్యం మాత్రం సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసూనూరి వెంకటేశ్వరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో సొంతగూడు కరువు
గడపగడపకూ వైఎస్సార్‌లో పేదల గగ్గోలు కార్యక్రమానికి అనూహ్య స్పందన కాకినాడ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇదిగో ఇళ్లు, అదిగో రుణం అంటూ రెండేళ్లు గడిపేశారు. కాని పేదలకు ఒక్క పూరిగుడిసైనా కట్టివ్వలేదు. పేద లు సొంద గూడులేక ఇబ్బంది పడుతున్నారు. వారికి పూర్తిగా అన్యాయం జరుగుతోందంటూ కాకినాడ రూరల్ 49వ డివిజన్లో జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో ఓనుం ప్రభాకరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల ఆగడాలు పెచ్చురిల్లాయి. అర్హులందరి పింఛన్లను తొలగిస్తున్నారు. అధికారులే ఏమీ చేయలేకపోతున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పే కాలం దగ్గరపడుతుందని అదే ప్రాంతానికి చెందిన పి.రమణ ఆవేదన వెళ్లబుచ్చాడు. ఇళ్లు ఎప్పుడొస్తాయో... టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం మండలం ఇటికాయలపల్లిలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని తలారి సంధ్య తెలిపారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పంచాయతీ పరిధిలో ఇళ్లు మంజూరు చేయలేదంటూ బొర్రా నాగరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. మురికి కూపంలో మగ్గుతున్నాం రౌతులపూడి మండలంలోని పారుపాక ఎస్సీపేటలో డ్రెయినేజీ సదుపాయాలు లేక మురికికూపంలో మగ్గుతున్నామని పాలెడ్డి నాగమణి పర్వత వద్ద వాపోయింది. కాకినాడ జగన్నాథపురం మెయిన్‌రోడ్డు, విష్ణాలయం వీధులలో ఆశీల పేరుతో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారంటూ నాయకుల వద్ద రవి అనే చిరువ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్ల సదుపాయం లేక.. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు మిలటరీ కాలనీలో రోడ్లు గోతులమయంగా మారినా పట్టిం చుకోవడంలేదని ఆప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు తెలిపారు. ఆలమూరు మండలంలోని మూలస్థాన అగ్రహారంలో స్థానిక సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. అమలాపురం రూరల్ మండలం సాకుర్రు ప్రాంతంలో పొలమూరుబాలకృష్ణనగర్, కాపులపాలెం, క్రాపవీధి తదితర ప్రాంతాల్లో పంటపొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గుత్తుల జనార్దనరావు ఆవేదన వ్యక్తం చేశాడు. మంచినీటి సమస్యతో సతమతమవుతున్నామని కాపులపాలెంనకు చెందిన బాలకృష్ణ తెలిపాడు. -
నిర్మించినా.. నిరుపయోగమే!
– రూ.13కోట్లతో 7ఘాట్లు – రూ.17కోట్లతో రహదారులు – 2చోట్ల మాత్రమే ఉపయోగం కృష్ణా పుష్కరాల్లో భాగంగా పెబ్బేరు మండలంలో మొత్తం ఏడు ఘాట్లు నిర్మించారు. ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే యాత్రికులు అధిక సంఖ్యలో రాగలిగారు.. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయా చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించారు.. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. పెబ్బేరు : మండలంలోని రంగాపూర్ వీఐపీ ఘాట్ రూ.6.15కోట్లతో, మునగమాన్‌దిన్నె రూ.మూడు కోట్లు, తిప్పాయిపల్లి రూ.1.2కోట్లు, యాపర్ల రూ.96లక్షలు, బూడిదపాడు రూ.60లక్షలు, గుమ్మడం రూ.21 లక్షలు, రాంపూర్ ఘాట్ రూ.87లక్షలు ఇలా మొత్తం రూ.13కోట్లతో పుష్కరఘాట్లు నిర్మించారు. రూ.17కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభం నాటికి జూరాల వరదనీరు భారీగా రావడంతో కేవలం రంగాపూర్, రాంపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్ల వద్ద మాత్రమే భక్తులకు స్నానాలు చేసేందుకు వీలయింది. రెండు రోజుల తర్వాత నుంచి రాంపూర్ ఘాట్‌కు నీళ్లు లేకపోవడంతో చివరి వరకు లక్షలాది మంది భక్తులు రంగాపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్లకు వెళ్లి పుష్కరస్నానాలు ఆచరించారు. దీంతో బూడిదపాడు, యాపర్ల, తిప్పాయిపల్లి, గుమ్మడం, రాంపూర్ ఘాట్లు నిరుపయోగంగా మారాయి. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. హైవే నుంచి రాంపూర్ ఘాట్‌కు వెళ్లే రోడ్డును పంచాయతీరాజ్ అధికారులు ఏకంగా అలైన్‌మెంట్‌నే మార్చేసి బీటీ స్థానంలో సీసీ మాత్రమే నిర్మించారు. అసంపూర్తిగా.. వీఐపీలకు వసతి కల్పించేందుకుగాను పెబ్బేరు పీజేపి అతిథి గహం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.5కోట్లు విడుదల చేసింది. అందులోని గదులు, ఏసీలు, రంగులు, బెడ్లు తదితర పనులను మాత్రమే కాంట్రాక్టర్లు హడావుడిగా చేశారు. దీని ముందు టైల్స్, గార్డెన్, మరో నాలుగు ఏసీలు, ఎస్ఈ, ఈఈ క్వార్టర్ల మరమ్మతు, అంతర్గత బీటీరోడ్లు తదితర పనులను చేపట్టలేదు. ఇక చేసిన పనులను అసంపూర్తిగా, మిగిలినవి పుష్కరాల నాటికీ ప్రారంభించకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది. -
'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా
నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంతో గ్రామాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార ఆర్భాటానికే తప్ప ఈ పథకానికి పైసా విదిల్చేది ఉండదని విమర్శించారు. సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. గ్రామజ్యోతి పథకానికి సరైన ప్రణాళిక లేదన్నారు. పథకంలో ఎంపీటీసీ, జెడ్సీటీసీలను భాగస్వామ్యులు చేయకపోవడం తగదన్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం అందించే నిధులే తప్ప గ్రామజ్యోతి కోసం ప్రత్యేకంగా ఒక్క పైసా కేటాయించడంలేదని వివరించారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే, మన ఊరు- మన ప్రణాళికలు చెత్తబుట్టకే పరిమితమయ్యాయన్నారు. -
‘చచ్చు’బండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్న రచ్చబండ.. చచ్చుబండగా మారింది. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుదారులలో ఏడాది తర్వాత సగం మందికి మాత్రమే మోక్షం కలిగింది. మిగిలిన సగం దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. మళ్లీ 2011 నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించగా... నేటికీ ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం కలుగలేదు. కాగా, సోమవారం నుంచి మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో తొలివిడత రచ్చబండ కార్యక్రమాన్ని 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆర్భాటంగా నిర్వహించారు. గ్రామసభల్లో ప్రధానంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మళ్లీ అదే సంవత్సరం నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించారు. అందులో మొదటి విడత లబ్ధిదారులు కొందరికి పథకాలు అందించి చేతులు దులుపుకున్నారు. రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఆన్లైన్ చేస్తున్నాం.. త్వరలో రేషన్‌కార్డులు, ఫించన్లు, ఇళ్లు వస్తాయి’ అంటూ అధికారులు తిప్పుకుంటున్నారే తప్ప.. ఒరిగిందేమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, గతనెల 24 వరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులందరికీ మూడో విడత రచ్చబండలో సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇచ్చిన దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించకుండా గతనెల 24 వరకు వచ్చిన వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. అమలుకు నోచని ఇందిరమ్మ ఇళ్లు.. అభివృద్ధి పథకాల అమలులో ప్రభుత్వ అలసత్వంతో మొదటి విడత లబ్దిదారులకు ఇప్పటివరకు ఇళ్లు మంజురు కాలేదు. రెండు విడతల్లో 1,13,928 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించారు. ఇవికాకుండా గ్రీవెన్స్, ఇతర కార్యక్రమాల్లో మరికొందరు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా అక్టోబర్ 24 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఈ రచ్చబండలో 61,958 మందికి మంజురూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. గుర్తించిన వారిలోనూ కొందరికి రేషన్‌కార్డు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ఫించన్ల కోసం గత రచ్చబండలో 29,678 మంది దరఖాస్తు చేసుకోగా, నేటికీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనిదే తామేమీ చేయలేమని అధికారులు చేతులెతేస్తున్నారు. రెండోవిడత రచ్చబండలో 62,558 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 42,096 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ వారికి ఇప్పటి వరకూ కార్డులు మంజురు చేయలేదు. దీంతో వారు ఏ ప్రభుత్వ పధకానికీ అర్హులు కావడం లేదు. ప్రచారానికే ప్రాధాన్యత.. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం చూపని ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రచార ఆర్భాటాల కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.