పెద్దవాళ్లు విటమిన్‌–డి తీసుకున్నా వృథానే! | Vitamin D Supplements Don't Build Bones | Sakshi
Sakshi News home page

పెద్దవాళ్లు విటమిన్‌–డి తీసుకున్నా వృథానే!

Published Sat, Oct 6 2018 4:14 AM | Last Updated on Sat, Oct 6 2018 4:14 AM

Vitamin D Supplements Don't Build Bones - Sakshi

మెల్‌బోర్న్‌: పెద్ద వయస్కులు విటమిన్‌–డి సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల వారిలో ఎముకల సాంద్రత మెరుగు పడే అవకాశాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. ఎముకలు విరగటాన్ని ఈ సప్లిమెంట్లు నిరోధించలేవని వెల్లడైంది. పెద్ద వయస్కుల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉండేందుకు గత కొంత కాలంగా డాక్టర్లు విటమిన్‌–డి సప్లిమెంట్లను సిఫార్సు చేయడం తెల్సిందే. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్లాండ్‌కు చెందిన పరిశోధకులు సుమారు 81 క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అసలు విటమన్‌–డి సప్లిమెంట్ల వల్ల అనుకున్నంత ప్రయోజనంలేదని తేలింది. ఈ సప్లిమెంట్లు వల్ల పూర్తిగా, పాక్షికంగా విరిగిన ఎముకలు కేవలం 15 శాతం అతుక్కుంటున్నట్లు తేల్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement