Clinical trials
-
ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..
ఆయుర్దాయం పెంచడం ఎలా అనేదాని గురించి శాస్త్రవేత్తలు ఎన్నేళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే పెంపుడు జంతువుల ఆయువుని పెంచే సరికొత్త పిల్‌ని ఆవిష్కరించారు యూఎస్ శాస్త్రవేత్తలు. ఈ డ్రగ్ విజయవంతంగా పనిచేస్తుందా? లేదా? అనే దాని గురించి యూఎస్‌లోని సుమారు వెయ్యి కుక్కలపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. అయితే పెద్ద జాతి కుక్కలపై డ్రగ్ సత్ఫలితాలు ఇవ్వడంతో చిన్న జాతి కుక్కలపై ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతమైతే పెంపుడు జంతువుల దీర్ఘాయువుని పెంచడమే గాక మానువుల ఆయుర్దాయన్ని పెంచగలిగే సరికొత్త ఆశను రేకెత్తిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన మాట్ కేబర్లీన్ శాస్త్రవేత్తల బృందం ఈ ప్రతిష్టాత్మకమైన పరిశోధనకు నాయకత్వం వహిస్తుంది.'ది డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్' పేరుతో ఈ పరిశోదన చేస్తున్నారు. అందుకోసం ముందుగా యూఎస్ అంతటా ఉన్న పెద్ద జాతి పెంపుడు కుక్కల యజమానులు ఈ పరిశోధనలో నమోదు చేయించుకున్నారు. ఈ పరిశోధనలో పాల్గొనే కుక్కుల వైద్య చరిత్రను వివరణాత్మకంగా విశ్లేషించింది పరిశోధక బృందం. ఆ తర్వాత ఆ కుక్కల నుంచి వెంట్రుకలు, బ్లండ్ శాంపుల్స్, మూత్ర నమునాల వంటి వాటన్నింటిని సేకరంచారు. ఇక యాంటీ ఏజింగ్ పిల్‌ని ఇస్తూ..ఆయా కుక్కల వృధాప్య లక్షణాలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. తొలుత శాస్త్రవేత్తలు పెద్ద జాతి కుక్కలపై అధ్యయనం నిర్వహించేలా లాయ్-001-పిల్(LOY-001)ని తీసుకొచ్చారు. ఇది ఐజీఎఫ్-1(IGF-1) స్థాయిలను ప్రేరేపిస్తుంది. అంటే ఆయవును పెంచే దిశగా కణాల పెరుగుదలను ప్రేరిపించే హార్మోన్ ఇది. ఈ పిల్ ఐజీఎఫ్-1 ఓవర్ ఎక్స్‌ప్రెషన్‌కి నిరోధించి కుక్క జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఈ పిల్కి సెంటర్ ఫర్ వెటర్నరీ మెడిసిన్‌కి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం కూడా లభించడం విశేషం. ఇక ఈ పిల్‌ని జంతు ఆరోగ్య బయోటెక్ కంపెనీ లాయల్ అభివృద్ధి చేసింది. ఈ ఔషధం కుక్కలలోని వృధాప్య సంబంధ రుగ్మతలను తగ్గించి జీవితకాలాన్ని పొడిగిస్తుంది. దీన్ని చాలామంది కుక్కల యజమానులు స్వాగతించారు. ఇక డాగ్ ప్రేమికురాలు, బీఫ్ సిరీస్ సృష్టికర్త లీ సంగ్ జిన్ కూడా ఇలా ఎఫ్‌డీఏ తొలిసారిగా యాంటీ ఏజింగ్‌కి సంబంధించిన ఔషధాన్ని ఆమోదించడాన్ని స్వాగతించారు. ఇది చాలా మంచి విషయం, తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేసి కుక్కల ఆయువును పెంచేయండి అని పిలుపునిచ్చారు. మరి పెద్దకుక్కల కోసం పిల్‌ని తెచ్చారు మరీ చిన్న జాతి కుక్కలు సంగతేంటీ అన్ని ప్రశ్నించారు లీ. అందుకు ప్రతిస్పందనగా లాయల్ కంపెనీ లాయ్-002 అనే పిల్‌ని పరీక్షించనున్నట్లు ఫిబ్రవరిని 1న ప్రకటించింది. ఇది చిన్నవి మినహ సీనియర్ కుక్కల జీవితకాలం పొడిగించేందుకు రూపొందించబడిన జీవితకాల మాత్ర. దీన్ని స్టడీ(study) అనే పేరుతో చిన్న జాతిలోని పెద్ద వయసు కుక్కలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు పరిశోధకులు. అందులో భాగంగా తొలి మోతాదు బూ అనే 11 ఏళ్ల విప్పేట్ తీసుకున్నట్లు యజమాని డెబ్ హన్నా పేర్కొన్నారు. ఇది పెద్ద వయసుగల శక్తిమంతమైన కుక్క కావడంతో పరిశోధనలో చేర్చుకోవడమేగాక మొదటి డోసు దీనికే ఇచ్చారని వెల్లడించారు యజమాని హన్నా. ఈ పరిశోధన యూఎస్ అంతటా ఉన్న 55 వెటర్నరీ క్లినిక్‌లో నిర్వహిచనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులు, వయస్సులు, ఆరోగ్యం డేటా వారిగా సుమారు వెయ్యి కుక్కలపై ఈ ట్రయల్స్‌ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ఆయా యజమానులు తప్పనసరిగా ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశోధనలో తమ కుక్కలు భాగం కావాలంటే ..నమోదు సమయంలో వాటి వయసు పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ, బరువు 6.4 కేజీలు ఉండాలి. అలాగే ఆయాయజమానులు తమ కుక్కలు నాలుగేళ్ల వరకు ఈ పరిశోధనలో పాల్గొనాలి అనే నిబంధనకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఈ పరిశోధన విజయవంతమైతే కుక్కల ఆయుష్షు పెరగడమే గాక మనుషుల దీర్ఘాయువుకు మార్గం సుగమం చేస్తుంది. కుక్కలు మానవులుకు అద్భుత నమునాలుగా పనిచేస్తాయి.కాబట్టి కుక్కల కోసం రూపొందించిన యాంటీ ఏజింగ్ డ్రగ్ పురోగతి మానవులకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. (చదవండి: పూనం పాండే కన్నుమూత: సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!) -
5 బిలియన్ డాలర్లకు క్లినికల్ ట్రయల్స్ పరిశ్రమ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా క్లినికల్ ట్రయల్స్ పరిశ్రమ ఏటా 7–8 శాతం మేర వృద్ధి చెందనుంది. 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో దాదాపు 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అంతర్జాతీయంగా క్లినికల్ రీసెర్చ్ దిగ్గజాల్లో ఒకటైన పారెక్సెల్ భారత విభాగం ఎండీ సంజయ్ వ్యాస్ శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా దాదాపు 40 పైగా అధ్యయనాలు జరుగుతుండగా.. వాటిలో తమ సంస్థ సుమారు 12–15 స్టడీస్ నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. భారత్‌లో తమకు మొత్తం 5 కేంద్రాల్లో 6,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్, చండీగఢ్ సెంటర్లు అతి పెద్దవని వ్యాస్ వివరించారు. వచ్చే అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచుకోనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో తమకు 2,500 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు. తెలంగాణ సహా దేశీయంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు పరిస్థితులు, నిపుణుల లభ్యత బాగుంటున్నాయని ఆయన చెప్పారు. అయితే, పేషెంట్లలో అవగాహన, తృతీయ శ్రేణి పట్టణాలు మొదలైన చోట్ల మౌలిక సదుపాయాలు, అధ్యయనాల మధ్యలోనే పేషెంట్లు తప్పుకోవడం తదితర అంశాలపరంగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందని వ్యాస్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశ్రమకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాసంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వంతోనూ ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు. -
గుడ్‌న్యూస్: కోవిడ్ సోకితే ఇక ఇంట్లోనే మాత్రలు వేసుకుంటే చాలు!
లండన్/వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారికి చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. కరోనా వైరస్‌కి చికిత్స లేదు నివారణే మార్గం అనుకుంటున్న సమయంలో ఒక గేమ్‌ఛేంజర్‌గా యాంటీవైరల్ మాత్రలు మార్కెట్లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిస్తే, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90శాతం మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) గురువారం అనుమతులు మంజూరు చేసింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్డీ) కంపెనీలు సంయుక్తంగా ఈ మాత్రను రూపొందించాయి. ‘కరోనా సోకితే ఇక ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్యాబ్లెట్ మింగొచ్చు. ప్రపంచంలోనే అలాంటి మాత్రకు అనుమతులిచ్చిన మొదటి దేశం మాదే’అని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సజీద్ జావిద్ ప్రకటించారు. కరోనా వైరస్ లోడు స్వల్పంగా, ఓ మోస్తరుగా సోకిన వారిలో తీవ్రతరం కాకుండా ఈ మాత్ర నిరోధిస్తుంది. ఊబకాయం, 60 ఏళ్ల పైబడిన వయసు, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్న వారిలో అయినా ఈ టాబ్లెట్ బాగా పని చేస్తుందని ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది. కరోనా సోకిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అత్యంత శక్తిమంతంగా పని చేస్తున్నట్టుగా ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జునె రెయిన్ వెల్లడించారు. త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర కోవిడ్–19 మాత్రకు బ్రిటన్ ఆమోద ముద్ర వేసిన ఒక్క రోజులోనే అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ తమ కంపెనీ తయారు చేసిన యాంటీవైరల్ మాత్ర కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడించింది. కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ 90% మరణాలను ఆ మాత్ర నిరోధిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్‌స్టెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకుండా ఊబకాయం, మధుమేహం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న 775 మందిపై ఫైజర్ ఈ టాబ్లెట్ ఇచ్చి చూస్తే 89% మందికి ఆస్పత్రి అవసరం రాలేదని వెల్లడించింది. ఒక్క శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ టాబ్లెట్ ఇచ్చిన వారెవరూ మరణించలేదని ఆ కంపెనీ తెలిపింది. 90% సామర్థ్యంతో, 100 శాతం మరణాలను అరికట్టేలా ఈ మాత్ర పని చేస్తున్నట్టుగా మైకేల్ వివరించారు. ఈ కొత్త మాత్ర అనుమతులు ఇవ్వడానికి ఎఫ్‌డీఏ సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనాపై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడుతోంది. మాత్రలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రయల్స్ లేకుండా టీకాలా?: ఢిల్లీ హైకోర్టు
క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా కరోనా టీకాలనివ్వడం, అదికూడా పిల్లలకు ఇవ్వడం ఉత్పాతాన్ని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్స్‌ను సత్వరం పూర్తి చేసి 18ఏళ్లలోపు వారికి కూడా తొందరగా టీకానిచ్చే చర్యలు వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచిఉన్నందున పిల్లలకు వెంటనే టీకాలిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిల్‌పై కోర్టు విచారణ జరిపింది. కెనడా, యూఎస్‌లాంటి దేశాల్లో పిల్లలకు టీకాలిస్తున్నారని, భారత్‌లో ఈ విషయమై ఒక విధానం రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు. అయితే జైడస్ కాడిలా చిన్నపిల్లల కోసం డీఎన్ఏ టీకాపై ట్రయల్స్ జరుపుతోందని, త్వరలో ఇది అందుబాటులోకి రావచ్చని ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్‌శర్మ కోర్టుకు తెలిపారు. వీలయినంత తొందరగా దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. 18 ఏళ్లలోపు వారికి టీకాపై ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇవి పూర్తికాగానే పిల్లల టీకాలపై విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. ట్రయల్స్‌ను సంపూర్ణంగా ముగించాలని, లేదంటే ఉత్పాతాలు జరుగుతాయని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు టీకా కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని సూచించింది. 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సినందున వీరికి టీకాలివ్వాలన్న మరో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
Corona Vaccine: సనోఫీ–జీఎస్కే వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్
న్యూఢిల్లీ: సనోఫీ పాయిశ్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–జీఎస్కే ఫార్మాస్యూటికల్ కంపెనీ సంయుక్తంగా కొవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది ప్రోటీన్ ఆధారితం. తాజాగా ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఈ దశలో టీకా భద్రత, సమర్థత, కరోనా వైరస్‌పై పనితీరును క్షుణ్నంగా పరీక్షించనున్నారు. భారత్‌తోపాటు అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో 35,000కు పైగా వలంటీర్లపై తమ టీకా ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సనోఫీ సంస్థ కంట్రీ హెడ్ అన్నపూర్ణ దాస్ చెప్పారు. ఇందుకోసం 18 ఏళ్లు పైబడిన వలంటీర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక టీకా అభివృద్ధి విషయంలో మూడో దశ ట్రయల్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌లో మార్పులు కొనసాగుతున్నాయని, కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. -
Covovax: పిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం నో
న్యూడిల్లీ: రెండు నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలపై కొవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు పిల్లలపై టీకా రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. కొవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌ను రెండు నుంచి 17ఏళ్లలోపు ఉన్న 920 మంది పిల్లలపై జరిపేందుకు సీరం ఇన్స్టిట్యూట్ సోమవారం డీసీజీఐ అనుమతి కోరిన విషయం తెలిసిందే. 12 నుంచి 17 ఏళ్ల లోపున్న460 మందిపై, రెండు నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై దేశవ్యాప్తంగా 10 చోట్ల ట్రయల్స్ చేపట్టేందుకు అనమతి ఇవ్వాలని సీరం కోరింది. తాజాగా ఈ దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కోవోవాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందనలేదనే విషయాన్ని గుర్తించింది. దీంతో పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్‌కు ముందు ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించింది. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో 'కొవొవాక్స్' పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మార్చిలో 18ఏళ్లు పైబడినవారిపై టీకా క్లినికల్ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది. జులై నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని సీరమ్ భావించింది. ఇప్పటికే సీరమ్ కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తోంది. చదవండి: అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు Corona: భారత్‌లో స్వల్పంగా పెరిగిన కేసులు -
బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాల్సిందే.. మరీ ఇంత దారుణం చేశాడా?
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాలంటూ ట్విటర్లో ఓ పోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. భారత్‌లో అమాయక గిరిజన బాలికలపై వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను తన సంస్థ ( బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్) తరపున అనధికారికంగా నిర్వహించారని , వాటికి పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చారంటూ గ్రేట్‌గేమ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం విడుదల చేసింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత నుంచి 'అరెస్ట్ బిల్ గేట్స్' అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్విటర్లో నెటిజన్ల పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది ట్రెండింగ్‌లో ఉంది. మెలిండా గేట్స్‌తో విడాకుల వ్యవహారం, మైక్రోసాఫ్ట్‌లోని ఒక మహిళా ఉద్యోగితో అతని అక్రమ సంబంధంపై వివాదంతో పాటు ప్రస్తుతం తాజా ఆరోపణలు చూస్తుంటే బిల్ గేట్స్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గ్రేట్‌గేమ్ ఇండియా రాసిన ప్రత్యేక కథనంలో.. 2009లో తెలంగాణ సహా నాగాలాండ్‌లోని గిరిజన బాలికలపైనా అనాధికారంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. 14 వేల మంది కోయ గిరిజన తెగకు చెందిన 10 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికపై ఈ ప్రయోగాలు సాగాయని తన కథనంలో పొందుపరిచింది. అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఆ బాలికలపై జరిపినట్లు తెలిపింది. ఆ వ్యాక్సిన్ హ్యూమన్పాపిలోమా వైరస్‌ను నివారించడానికి తయారు చేసింది. అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించి ఉన్న ఎన్జీఓ సంస్థ ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) ద్వారా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించినట్లు గ్రేట్‌గేమ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించే బాలికలను, పేదరికంలో ఉన్న వారినే ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగాలు వికటించడం వల్ల పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని వివరించింది. తమ కుమార్తెకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారనే విషయం.. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలియదని అంటున్నారు. ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లా పలువురు గిరిజనుల్లో నెలకొని ఉందని పేర్కొంది. నాగాలాండ్‌లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవల వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. This is the untold story of how @BillGates funded NGO PATH killed tribal girls in India in unauthorised clinical trials and got away with it. #ArrestBillGates https://t.co/yYqCRZ4Ah3 — Tribal Army (@TribalArmy) May 29, 2021 He is a monster and enemy of humanity...He must be stopped for good.#ArrestBillGates #ArrestBillGates#ArrestBillGates pic.twitter.com/sXyaTxV9is — Suraj Samrat 💙 (@samratsurajINC) May 29, 2021 చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
CoronaVirus: మన కాక్టెయిల్ ట్రయల్స్‌కి పర్మిషన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్‌లో ట్రీట్మెంట్ కొరత ప్రధాన సమస్యగా మారింది. మందులు, వ్యాక్సిన్ల కొరత కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల మీద ప్రభుత్వాల దృష్టి మళ్లుతోంది. ఇప్పటికే భారత మార్కెట్లోకి యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్మెంట్కు పర్మిషన్ దొరికింది. ఈ క్రమంలో జైడస్ కాడిల్లా క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతులు దక్కించుకుంది. మైల్డ్ సింప్టమ్స్(ఓ మోస్తరు) లక్షణాలున్నకోవిడ్ పేషెంట్లలో జైడస్ వారి యాంటీబాడీ కాక్టెయిల్ని మనుషులపై ప్రయోగించి చూసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. గుజరాత్‌కు చెందిన జైడస్ కాడిల్లా వారి జెడ్ఆర్సీ-3308, ట్రయల్స్ దశలో జంతువుల లంగ్ డ్యామేజ్‌ను తగ్గించింది. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో ఉండే కాక్టెయిల్, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకాల తరహాలో ఇన్ఫెక్షన్తో పోరాడుతుందని జైడస్ కాడిల్లా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్లో పురోగతి అవసరమని జైడస్ కాడిల్లా ఎండీ శార్విల్ పటేల్ తెలిపారు. మనుషుల ఎర్లీ టు లేట్ స్టేజ్ ట్రయల్స్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు అమెరికాలోనూ అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ట్రీట్మెంట్స్కి అనుమతి చ్చింది. రెగెనెరోన్, రోచె యాంటీ బాడీ కాక్టెయిల్ ఇదివరకే భారత్‌లో అనుమతులు దక్కించుకోగా, ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దానిని సరఫరా చేస్తోంది. ఇది చదవండి: కాక్టెయిల్ హైరిస్క్ తప్పిస్తుంది! -
డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్ సోకి దెబ్బతిన్న కణాలు. 2–డీజీ ఇవ్వక ముందు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. 2. మందు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే వైరస్ లోడ్ చాలా వరకు తగ్గింది. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో శుభవార్త చెప్పింది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి శనివారం వెల్లడించారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. ‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన కోవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తమవుతోంది. ఏడాది కిందే ప్రయోగాలు మొదలు.. కరోనా వైరస్ పంజా విసరడం మొదలైన కొత్తలోనే.. అంటే గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ వైరస్‌కు మందు కనిపెట్టడంపై ఇన్మాస్ సంస్థ దృష్టి పెట్టింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్ ట్రయల్స్ కోసం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌డీఓ)’కు దరఖాస్తు చేసింది. ఈ మేరకు అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు సామర్థ్యం, భద్రత ఏమేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. కరోనా వైరస్ ఉన్న శాంపిల్స్.. ఇన్ఫెక్ట్ అయిన కణాలకు 2–డీజీ మందు వాడిన తర్వాత మందు సురక్షితమే.. గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని గుర్తించారు. తర్వాత రెండో దశలో ఫేజ్–2ఏ కింద ఆరు ఆస్పత్రుల్లో, ఫేజ్–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు నిర్ధారించారు. మరోలా చెప్పాలంటే 2–డీజీ తీసుకున్నవారు మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేల్చారు. మూడో దశలోనూ సత్ఫలితాలు తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు – ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అరవై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. మూడు దశల ఫలితాల ఆధారంగా.. మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్ రోగుల చికిత్సలో 2–డీజీని ఉపయోగించేందుకు డీసీజీఐ ఈ నెల ఒకటో తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔష ధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే వారం, పదిరోజుల్లోనే ఈ మందు తొలి విడత మార్కెట్లోకి వచ్చేస్తుందని.. మూడు వారాల్లో మరింత మోతాదులో అందుబాటులోకి వస్తుందని వివరించారు. -
ఆస్పిరిన్ టాబ్లెట్ వాయు కాలుష్యం నుంచి రక్షిస్తుందా...!
ఆస్పిరిన్ టాబ్లెట్ మనలో చాలా మందికి సుపరిచితమే. ఒంట్లో కాస్త నలతగా ఉన్న, జ్వరం వచ్చిన, ఈ టాబ్లెట్‌ను వాడుతుంటారు. అంతేకాకుకుండా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నవారు డాక్టర్ల సూచన మేరకు ఉపయోగిస్తారు. కాగా పరిశోధకులు ఆస్పిరిన్ టాబ్లెట్‌పై నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆస్పిరిన్ టాబ్లెట్ ఉపయోగించడంతో ఒక్కింతా వాయు కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకోవచ్చునని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్ ఆస్పిరిన్ తీసుకునే వృద్ధులు కొంతమేర వాయు కాలుష్యం వల్ల ఏర్పడే స్వల్పకాలిక ప్రభావాల నుంచి రక్షించబడతారని తెలిసింది. అమెరికాలో బోస్టన్ ప్రాంతంలో దాదాపు వెయ్యి మంది మగ వారిపై నిర్వహించిన ఈ పరిశోధనలో, ఆస్పిరిన్ తీసుకున్న వారిలో కాలుష్యం ఒక మోస్తరుగా ఉన్న సందర్భంలో వారు ఊపిరి తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదని అధ్యాయనం వెల్లడించింది. ఆస్పిరిన్ తీసుకోవడంతో మెదడు పనితీరుపై అది చూపే ఫలితాలను పరిశోధకులు కనుగొనలేకపోయారు. కానీ, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీలను తీసుకుంటున్న వారికి నిర్వహించిన పరీక్షలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత విషయంలో వారు గణనీయమైన మార్పులను కనుగొన్నారు. వీరి అధ్యయనం ప్రకారం స్వల్పకాలిక వాయు కాలుష్యానికి బహిర్గతమైన వారిలో స్వల్పకాలిక మార్పులు సంభవించాయి. అధిక వాయు కాలుష్యం వలన వారిలో మెదడులో కొంత నొప్పి ఏర్పడింది. ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకున్న వారిలో కాలుష్యంవల్ల మెదడులో ఏర్పడే నొప్పి కాస్త తగ్గుతుందని తెలిపారు. దీంతో వారిలో క్రోనిక్ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కల్గినట్లు పరిశోధకులు చేసిన స్టడీలో తేలింది. కాగా ప్రస్తుతం ఇది ఒక పరికల్పన మాత్రమే. వాయుకాలుష్యం నుంచి ఏర్పడే సమస్యలపై పెద్ద ఏత్తున క్లినికల్ స్టడీలు చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆస్పిరిన్ వాడకంతో వాయుకాలుష్య ప్రభావానికి వెంటనే చెక్ పెట్టలేము. ఈ టాబ్లెట్‌ను తక్కువ మోతాదులో తీసుకున్న అధిక మొత్తంలో రక్తస్రావం జరిగే చాన్స్ ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వాయుకాలుష్యానికి ఎక్కువగా గురైన వారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తక్కువ స్థాయి వాయు కాలుష్యానికి గురైన వారిలో నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ తీసుకొనని వారిలో జ్ఞాపక శక్తి తగ్గుదల 128 శాతంగా ఉంది. నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీలను తీసుకునే వారు ఇదే సమయంలో జ్ఞాపక శక్తి తగ్గుదల 44 శాతంగా ఉంది. -
‘క్లినికల్’ తరహాలో కోవాగ్జిన్ టీకా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన తొలి టీకా కోవాగ్జిన్ వినియోగానికి ఇచ్చిన అనుమతులు కేవలం క్లినికల్ ట్రయల్ మోడ్‌లో వినియోగానికేనని ప్రభుత్వం తెలిపింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌కు ఇచ్చిన అనుమతుల్లో తేడాఉందని, కోవాగ్జిన్‌ను కేవలం క్లినికల్ ట్రయిల్ మోడ్‌లో మాత్రమే వినియోగిస్తామని కేంద్రమంత్రి హర్షవర్థన్ వివరణ ఇచ్చారు. అంటే కోవాగ్జిన్ ఇచ్చిన వారిని ట్రయిల్స్‌లో చేసినట్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతోపాటు కోవాగ్జిన్‌ను ఫేజ్ 3 ట్రయిల్స్‌లో 12 సంవత్సరాలు నిండినవారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించింది. గత ట్రయిల్స్‌లో ఈ టీకాను 12 ఏళ్ల పైబడినవారికి ఇచ్చిన సందర్భంలో సురక్షితమనే తేలింది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌కు ఆదివారం అత్యవసర వినియోగానుమతులు లభించాయి. రెండు టీకాలను రెండు డోసుల్లో ఇస్తారని డీసీజీఐ అనుమతి పత్రంలో పేర్కొంది. ఒకపక్క ఫేజ్ 3 ట్రయిల్స్ కొనసాగిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాలను వాడేందుకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 3 కోట్ల మందికి టీకా అందిస్తారు. రెండు టీకాలు అత్యవసర అనుమతికి తయారుగా ఉన్నా, ఇంకా ఫేజ్ 3 ట్రయిల్స్‌ను పూర్తి చేసుకోలేదు. -
12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకుగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌కు సంబంధించి కేంద్రం మరో కీలక విషయాన్ని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టీకా మూడో దశ ప్రయోగాలను 12 సంవత్సరాలకు పైన వయసు పిల్లలపై జరిపేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ చాలా సురక్షితమైందనీ, బలమైన రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను అందిస్తోందని డీసీజీఐ విజి సోమాని చెప్పారు. (వ్యాక్సిన్ కోసం యాప్: రిజిస్ట్రేషన్ ఎలా అంటే?) అయితే ఇప్పటివరకు పిల్లల్లో తొలి, రెండో దశ ప్రయోగాలను భారత్ బయోటెక్ పూర్తిచేసింది. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ సురక్షితమని తేలడంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతి సాధించింది. దీంతో 12 ఏళ్ల వయసువారిపై భారత్ బయోటెక్ ప్రయోగాలను చేపట్టనుంది. అయితే, వ్యాక్సిన్ సమర్థత, సురక్షితమని నిర్ధారించే తొలి, రెండు, మూడో దశ ప్రయోగాల తాజా సమాచారాన్ని అందించాలని డీసీజీఐ కోరింది. వ్యాక్సిన్ తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై ప్రారంభించినట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 22,500 వేల మందికి ప్రయోగించగా సురక్షితంగా తేలిందని సోమానీ తెలిపారు. కాగా భారత్‌బయెటక్ టీకా కుసంబంధించి తన ఫేజ్ 1, 2 ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఇందులో టీకా ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన పిల్లలపై సురక్షితంగా ఉందని తేలింది. దీంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతినిస్తున్నట్లు డీసీజీఐ తాజాగా వెల్లడించింది -
ఆక్స్ఫర్డ్ టీకాకే తొలి ఛాన్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్ఫర్డ్ కోవిడ్–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీకా డోసులను దేశీయంగా పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిషీల్డ్ టీకా వినియోగానికి యూకేలో అనుమతులు లభించిన వెంటనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) నిపుణుల సమావేశం కానుంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఈ టీకా క్లినికల్స్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పరిశీలించి భద్రత, వైరస్ నిరోధకతపై చర్చించి, దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించే విషయం పరిశీలించనుందని అధికారులు తెలిపారు. భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నందున అనుమతించేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఫైజర్ సంస్థ తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ‘కోవిషీల్డ్’కే భారత్‌లో అత్యవసర వినియోగానికి తొలి అనుమతి లభించనుందని అధికారులు అంటున్నారు. వివిధ దేశాలు, సంస్థలు తయారు చేస్తున్న టీకాలు కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని ఇటీవల యూకే స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను తయారు చేసి, సిద్ధంగా ఉంచింది. తగ్గుతున్న యాక్టివ్ కేసులు దేశంలో ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల, పెరుగుతున్న రికవరీల కారణంగా యాక్టివ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2,81,667 ఉన్నాయని శనివారం వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఇవి 2.77% మాత్రమేనని వివరించింది. ‘కోవిడ్‌తో ఇప్పటి వరకు 97,40,108 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 95.78%గా ఉంది’ అని వివరించింది. రోజువారీ కోవిడ్ బాధితుల మరణాలు 6 నెలల తర్వాత మొదటిసారి 300లోపు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 251 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరుకుంది. అదేవిధంగా, కొత్తగా 22,273 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరుకుందని తెలిపింది. -
కీలక దశకు కోవాగ్జిన్ ప్రయోగాలు
సాక్షి, హైదరాబాద్: భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కోవిడ్–19 నిరోధక టీకా ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. టీకా వినియోగానికి అత్యవసరమైన మూడో దశ మానవ ప్రయోగాల్లో 13 వేల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయినట్లు భారత్ బయోటెక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో మొత్తం 26,000 మందికి టీకాలిచ్చి పరీక్షించే లక్ష్యంతో మూడో దశ ప్రయోగాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలి, రెండో దశ మానవ ప్రయోగాలు ఒక్కొక్క దాంట్లో 1,000 మందికి టీకా అందించి భద్రత, రోగ నిరోధక వ్యవస్థ స్పందనలను నిర్ధారించుకున్నామని, ఈ రెండు దశల ప్రయోగాలపై అందిన సమాచారాన్ని అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో ప్రచురించామని కంపెనీ వెల్లడించింది. భారత్ బయోటెక్, భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సంయుక్తంగా కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవల్–3 కేంద్రాల్లో ఉత్పత్తి చేయనున్నారు. కోవాగ్జిన్ ప్రయోగాల్లో పాల్గొన్న 13 వేల మందికి భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: భారత్ బయోటెక్‌తో యూఎస్ కంపెనీ జత) -
భారత్ బయోటెక్‌తో యూఎస్ కంపెనీ జత
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి దేశీ కంపెనీ భారత్ బయోటెక్‌తో తాజాగా యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ చేతులు కలిపింది. తద్వారా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ తదుపరి అభివృద్ధి దశలను యూఎస్‌లో ఆక్యుజెన్ చేపట్టనుంది. ఇందుకు కట్టుబడేందుకు వీలుగా రెండు కంపెనీలు ఒప్పందం(ఎల్వోఐ)పై సంతకాలు చేశాయి. ఎల్‌వోఐలో భాగంగా ఆక్యుజెన్ యూఎస్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ హక్కులను పొందనుంది. భారత్ బయోటెక్ సహకారంతో యూఎస్‌లో వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ డెవలప్మెంట్, రిజిస్ట్రేషన్, వాణిజ్య వ్యవహారాలను ఆక్యుజెన్ చేపట్టనుంది. ప్రస్తుతం రెండు కంపెనీలూ పరస్పరం సహకరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. పూర్తిస్థాయి ఒప్పంద వివరాలను కొద్ది వారాలలో వెల్లడించనున్నట్లు తెలియజేశాయి. ఒప్పందం ప్రకారం యూఎస్‌లో వ్యాక్సిన్ సైంటిఫిక్ అడ్వయిజరీ బోర్డ్‌ను ఆక్యుజెన్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అక్కడ క్లినికల్ పరీక్షల డేటా, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర వ్యవహారాలను చేపట్టనుంది. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) కోవాగ్జిన్ ప్రత్యేకం చరిత్రలో నిరూపితమైన విధానాల బాటలోనే కోవిడ్-19 కట్టడికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఒప్పందం సందర్భంగా హార్వే రూబిన్ పేర్కొన్నారు. వెరసి యూఎస్‌లో అందుబాటులోకి వస్తున్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవాగ్జిన్ ప్రత్యేకమైనదని తెలియజేశారు. వైరస్‌పై మరింత సమర్ధవంతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ పీహెచ్డీ ఎండీ అయిన రూబిన్.. ఆక్యుజెన్ సైంటిఫిక్ సలహాదారుల బోర్డు సభ్యులుకావడం గమనార్హం! దేశీయంగా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్(ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించవలసిందిగా ఇటీవలే డీసీజీఐకు భారత్ బయోటెక్ దరఖాస్తు చేసింది. 26,000 మందిపై చేపట్టనున్న మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటికే 13,000 మంది వాలంటీర్లను సమకూర్చుకుంది. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) మైలురాయి.. దేశీయంగా వ్యాక్సినాలజీలో కోవాగ్జిన్ అభివృద్ధి, క్లినికల్ డేటా ఒక మైలురాయి వంటిదని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. వైరస్ కట్టడికి రూపొందిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై పలు దేశాల నుంచి సరఫరాలు తదితరాల కోసం ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం ద్వారా యూఎస్ మార్కెట్లలోనూ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టే వీలు చిక్కిందని తెలియజేశారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలలో ఫలితాలతో తాము సంతృప్తి చెందినట్లు ఆక్యుజెన్ సహవ్యవస్థాపకుడు, చైర్మన్ శంకర్ ముసునూరి చెప్పారు. దేశీయంగా మూడో దశ పరీక్షలు సైతం ప్రోత్సాహకరంగా సాగుతున్నట్లు తెలియజేశారు. సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌కు భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనకారిగా నిలిచే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడి కోసం దేశీయంగా తొలిసారి మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా వ్యాక్సిన్ అభివృద్ధికి బీజం పడింది. తొలి, రెండు దశల క్లినికల్ పరీక్షలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యూఎస్ సంస్థ హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్ సహకరాంతో పుణే కంపెనీ జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఇందుకు అనుమతిని పొందింది. జెన్నోవా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రభావంతో ఎలుకలు, చింపాజీలు తదితర జంతువులలో కనిపించిన యాంటీబాడీలు, ఇమ్యునాలజీ తదితర అంశాల డేటా ఆధారంగా డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) షరతులతో.. హెచ్‌జీసీవో19 పేరుతో జెన్నోవా రూపొందించిన వ్యాక్సిన్‌కు మానవులపై క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ కొన్ని షరతులతో ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్ డేటా పరిశీలించిన సంబంధిత నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సలహామేరకు ఇందుకు అనుమతించింది. దీంతో కోవిడ్-19 కట్టడికి తొలిసారి ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీగా జెన్నోవా నిలవనుంది. అయితే తొలి దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర ఫలితాలను జెన్నోవా కమిటీకి దాఖలు చేయవలసి ఉంటుంది. వీటి ఆధారంగా రెండో దశ పరీక్షలకు అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. జెన్నోవా అభివృద్ధి చేస్తున్న కొత్తతరహా వ్యాక్సిన్‌కు మద్దతుగా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రాథమిక నిధులను(సీడ్ ఫండింగ్) అందించినట్లు తెలుస్తోంది. (జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) -
భారత్‌లో ప్రారంభమైన స్పుత్నిక్ ప్రయోగాలు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కోవిడ్ వ్యాక్సిన్ 2, 3 దశల క్లినికల్ ప్రయోగాలను భారత్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నాయని, దాని భద్రత రోగనిరోధక శక్తి అంశాలపై అధ్యయనం చేస్తామని రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ క్లినికల్ ప్రయోగాలను జేఎస్ఎస్ మెడికల్ రీసెర్చ్ నిర్వహిస్తుందన్నాయి. మొదటిదశ ప్రయోగంలో 28వ రోజున 91.4 శాతం సామర్థ్యంతో, 42 రోజుల అనంతరం 95 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పనిచేసినట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది. మూడో దశ ప్రయోగాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగంలో 40,000 మంది వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ వ్యాక్సిన్‌ని దేశ అవసరాలకూ, ఇతర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో పది కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ లాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. (మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్) -
వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా!
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు. 100కోట్లకు దావా : సీఐఐ ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. -
గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
గుంటూరు మెడికల్: కోవిడ్–నివారణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ బుధవారం గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ ఐసీఎంఆర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామన్నారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 715 మందిపై చేసినట్లు వెల్లడించారు. గుంటూరులో 1,000 మందికి క్లినికల్ ట్రయల్స్ చేసేలా వ్యాక్సిన్ సిద్ధం చేశామన్నారు. నెల రోజుల్లో వెయ్యి మందికి వ్యాక్సిన్ వేసి పరిశోధనలు చేస్తామన్నారు. నిబంధనలను చదివి అంగీకార పత్రం ఇచి్చన తర్వాతే వలంటీర్లకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. వ్యాక్సిన్ చేయించుకునేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని కంపెనీల క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఫైజర్, మోడెర్నా వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్ రాగానే ఉపయో గించాలంటే ప్రభుత్వం అత్యవసర అనుమతి (ఎమర్జెన్సీ ఆథరైజేషన్) ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లకు ఇలాంటి అనుమతి ఇవ్వడానికి అందుబాటులో ఉన్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ (వీటీఎఫ్) ఈ పనిలో నిమగ్నమై ఉంది. మోడెర్నా టీకా డోసు ధర ఎంతంటే.. ఫ్రాంక్ఫర్ట్: కరోనా టీకా అభివృద్ధిలో అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ముందంజలో ఉంది. త్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతోంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానీ బాన్సెల్ మాట్లాడుతూ తమ వ్యాక్సిన్‌కుగాను ప్రభుత్వాల నుంచి ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్లు(రూ.1,854–రూ.2,744) తీసుకుంటామని చెప్పారు. ఆర్డర్ చేసిన డోసులను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంద న్నారు. ఫ్లూ వ్యాక్సిన్ డోసు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల దాకా పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులు ఇప్పటికే మోడెర్నా సంస్థతో చర్చలు జరిపారు. వ్యాక్సిన్ డోసు 25 డాలర్ల లోపు ధరకే తమకు సరఫరా చేయాలని కోరారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. -
కోవిడ్-19 ఔషధానికి డబ్ల్యూహెచ్‌వో షాక్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సోకినవారికి విరివిగా వినియోగిస్తున్న ఔషధాలలో రెమ్‌డెసివిర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రధానంగా ఆసుపత్రులలో చేరిన రోగులలో ఈ ఔషధం ఎలాంటి గుణమూ చూపించడంలేదని డబ్ల్యూహెచ్‌వో ప్యానల్ పేర్కొంది. సాలిడారిటీ ట్రయల్స్‌లో ఈ అంశాలు బయటపడినట్లు తెలియజేసింది. రెమ్‌డెసివిర్ ఔషధ వినియోగం వల్ల మరణాల సంఖ్య తగ్గడం లేదా మెకానికల్ వెంటిలేషన్ అవసరాన్ని తగ్గించడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించలేదని నివేదిక అభిప్రాయపడింది. దీంతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు ఈ ఔషధాన్ని వినియోగించవద్దంటూ సూచించింది. ఆసుపత్రులలో 28 రోజులపాటు నిర్వహించిన సాలిడారిటీ ట్రయల్స్‌లో ఈ విషయాలు గమనించినట్లు తెలియజేసింది. అమెరికాసహా 50 ప్రపంచ దేశాలలో రెమ్‌డెసివిర్ ఔషధాన్ని కోవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ప్యానల్ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్-19 చికిత్సలో ఈ ఔషధాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు సైతం వినియోగించడం గమనార్హం. గిలియడ్ ఏమంటున్నదంటే రెమ్‌డెసివిర్ ఔషధ తయారీ కంపెనీ గిలియడ్ సైన్సెస్ సాలిడారిటీ ట్రయల్స్ ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఈ ఔషధాన్ని ఆసుపత్రులలో చేరిన రోగుల చికిత్సలో వినియోగించేందుకు పలు జాతీయ సంస్థలు మార్గదర్శకాలను జారీ చేసినట్లు ప్రస్తావిస్తోంది. ఈ అంశాలను డబ్ల్యూహెచ్‌వో నిర్లక్ష్యం చేయడం తమను నిరాశపరచినట్లు పేర్కొంది. వెల్కూరీ బ్రాండుతో కంపెనీ రెమ్‌డెసివిర్ ఔషధాన్ని విక్రయిస్తోంది. వెల్కూరీని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కోవిడ్-19 చికిత్సలో నమ్మకంగా వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. కోవిడ్-19 రోగుల చికిత్సలో వినియోగించేందుకు యాంటీవైరల్ ట్రీట్మెంట్కింద అనుమతులు పొందిన తొలి ఔషధం వెల్కూరీ అని తెలియజేసింది. కాగా.. రెమ్‌డెసివిర్ ఔషధ అమ్మకాలతో కనిపిస్తున్న అనిశ్చితి కారణంగా ఇటీవల కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గమనార్హం. గ్రూప్ సమీక్ష ఇలా అంతర్జాతీయ స్థాయిలో నాలుగు ప్రాంతాల నుంచి 7,000 మందికిపైగా రోగుల పరీక్షలలో క్రోడీకరించిన డేటా ఆధారంగా రెమ్‌డెసివిర్ ఔషధంపై మార్గదర్శకాలను జారీ చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్(జీడీజీ) ప్యానల్ వెల్లడించింది. అయితే రెమ్‌డెసివిర్ ఔషధ క్లినికల్ పరీక్షలను సమర్థించింది. కొంతమంది రోగులపై చేపట్టిన పరీక్షలలో కనిపిస్తున్న ఫలితాల కారణంగా వీటిని సమర్థిస్తున్నట్లు తెలియజేసింది. -
సీనియర్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భళా
లండన్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ సీనియర్ సిటిజెన్స్‌లో రోగనిరోధక శక్తిని బలంగా పెంపొందిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజాగా వెల్లడించింది. క్లినికల్ పరీక్షల రెండో దశలో భాగంగా 56-69 ఏళ్ల వయసు వ్యక్తులలో తమ వ్యాక్సిన్ పటిష్ట ఫలితాలను సాధించినట్లు పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే 70 ఏళ్ల వయసు వ్యక్తులతోపాటు.. యువతపైనా ఒకే స్థాయిలో ఇమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేసింది. రెండో దశ పరీక్షలలో భాగంగా 560 మందిపై వ్యాక్సిన్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది. వీరిలో 240 మంది సీనియర్ సిటిజెన్స్‌గా తెలియజేసింది. ఫలితాలు భేష్ బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రోత్సాహకర ఫలితాలను వెలువరించినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్ వినియోగంతో యాంటీబాడీ, టీసెల్స్ బలమైన రెస్పాన్స్‌ను కనబరచిరినట్లు వివరించింది. ఈ విషయాలను తాజాగా లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించింది. మూడో దశ క్లినికల్ పరీక్షల ప్రాథమిక డేటా రానున్న వారాల్లో వెల్లడికాగలదని నివేదిక పేర్కొంది. తద్వారా సమాజంలోని భిన్న వ్యక్తులకు రక్షణ కల్పించగల అంశంపై మరిన్ని వివరాలు అందగలవని తెలియజేసింది. AZD1222 పేరుతో రూపొందించిన ప్లాసెబో, వ్యాక్సిన్‌ను రెండు డోసేజీలలో తీసుకున్న వొలంటీర్లలో ఎలాంటి ఇతర ఇబ్బందులూ తలెత్తలేదని వివరించింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) వైరల్ వెక్టర్ యూఎస్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా.. మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. అయితే తాము వైరల్ వెక్టర్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే వెల్లడించింది. చింపాంజీలలో కనిపించే సాధారణ జలుబుకు సంబంధించిన వైరస్ ఆధారంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనే యూకే ప్రభుత్వం 10 కోట్ల డోసేజీల వ్యాక్సిన్లను అందించవలసిందిగా ఆస్ట్రాజెనెకాకు ఆర్డర్లు జారీ చేసింది. దేశీయంగా ఆస్ట్రాజెనెకాతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు కీలక విషయాన్ని ప్రకటించగా, దేశీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాక్సిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదని సంస్థ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. కోవిడ్19 కి సంబంధించిన ఇతర వ్యాక్సీన్ల విషయంలో కూడా తమ కంపెనీ అధ్యయనం చేస్తోందన్నారు. ఈ ట్రయల్ 2021 ప్రారంభంలో పూర్తవుతుందన్నారు. ఇది ముక్కులో వేసుకునే డ్రాప్స్ మాదిరిగా ఉండే ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది నాటికి సిద్దమవుతుందని వివరించారు. కాగా తొలి దేశీయ వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాక్సిన్ ప్రపంచంలోనే చౌకైన వ్యాక్సిన్‌గా ఉంటుందని అంచనా. కోవాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తి అయిందని ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్: ఊరటినిస్తోన్న మోడర్నా) -
జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఫేజ్-2 పూర్తి
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న జైకోవి-డి వ్యాక్సిన్‌పై రెండో దశ పరీక్షలు పూర్తయినట్లు జైడస్ క్యాడిలా తాజాగా వెల్లడించింది. డిసెబర్‌లో మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ ఎండీ షార్విల్ పటేల్ తెలియజేశారు. ఫేజ్-3లో 15,000-20,000 మందిపై పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రెండో దశ పరీక్షల డేటాను ఈ నెలలో దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు అందించనున్నట్లు తెలియజేశారు. రెండో దశ పరీక్షలలో భాగంగా 1,000 మంది వొలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ డేటా విడుదల తదుపరి మూడో దశ పరీక్షలకు వెంటనే అనుమతి లభించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. 2021 మార్చి-ఏప్రిల్‌కల్లా వ్యాక్సిన్ పరీక్షల తుది డేటాను సిద్ధం చేయగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి 20201 తొలి అర్ధభాగంలో వ్యాక్సిన్‌ను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. -
100 మందిపై స్పుత్నిక్–వీ ప్రయోగం
మాస్కో/న్యూఢిల్లీ: భారత్‌లోని 100 మంది వలంటీర్లపై, రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–వీను ప్రయోగించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కి డ్రగ్ కంట్రోలర్ జనరల్(డీసీజీఐ) అనుమతిచ్చినట్లు రష్యా వార్త సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయించాల్సి ఉంది. మూడో దశలోకి ప్రవేశించే ముందు, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీకి, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ప్రయోగాల అనంతరం 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేయడానికి రెడ్డీస్ ల్యాబ్‌కి అనుమతిచ్చినట్లు ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. గత నెలలో ఆర్డీఐఎఫ్ భారత ప్రభుత్వంతోనూ, ఔషధ కంపెనీలతో స్థానికంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీపై చర్చించింది. అలాగే స్పుత్నిక్–వీ భద్రత, దాని పనితీరుపై మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ‘ది లాన్సెట్’మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కి 100 మందిపై, మూడో దశలో 1,400 మంది వలంటీర్లపై ప్రయోగాలు జరుపుతారని అధికారులు వెల్లడించారు. తొలిగా 4 కేటగిరీల వారికి టీకా పంపిణీ కరోనా మహమ్మారికి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ‘స్పెషల్ కోవిడ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం’ కింద ప్రాధాన్య వర్గాలకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రజలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా వర్కర్లు ఉన్నారు. అలాగే 2 కోట్ల మంది మున్సిపల్ కార్మికులు, పోలీసులు, సైనిక సిబ్బంది.. 26 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 50 ఏళ్లలోపు వయసుండి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికీ మొదటి దశలోనే టీకా ఇచ్చే అవకాశం ఉంది. 77 లక్షలు దాటిన కేసులు దేశంలో గత 24 గంటల్లో 54,366 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 690 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,17,306 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 69,48,497 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,95,509 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8.96 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 89.53 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.51గా నమోదైంది. -
ఔషధ పరీక్షల్లో వలంటీర్ మృతి
సావోపౌలో: అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాలంటీర్ మృతి చెందినట్లు బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం ప్రకటించింది. ట్రయల్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ట్రయల్స్‌ను కొనసాగిస్తామంది. ఈ ఘటనపై అస్ట్రాజెనెకా స్పందించలేదు. చనిపోయిన వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇచ్చినట్లు నిర్ధారణైతే ట్రయల్స్‌ను 3 నెలలు ఆపివేయ వచ్చని సంబంధితవర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మృతి చెందిన వలంటీర్‌కు మెనింజిటిస్ వ్యాక్సిన్ ఇచ్చారని సదరు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ట్రయల్స్ కొనసాగించవచ్చని ఈ ఘటనపై విచారణ జరిపిన స్వతంత్ర విచారణ కమిటీ సూచించిందని ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న సావోపౌలో ఫెడరల్ యూనివర్సిటీ తెలిపింది. మృతి చెందిన వలంటీర్ రియోడిజినిరోకు చెందిన 28 సంవత్సరాల వైద్యుడి గా చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి వలంటీర్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటివరకు 8 వేల మంది వలంటీర్లను ట్రయల్స్ కోసం తీసుకున్నారు. -
షాకింగ్ : ఆ వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత
వాషింగ్టన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిరోధానికి పలు ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కీలక దశకు చేరాయి. వ్యాక్సిన్ పరీక్షలు ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకుంది. తాము నిర్వహించిన అథ్యయన పరీక్షలో పాల్గొన్న ఓ వ్యక్తి వివరించలేని అస్వస్థతకు లోనవడంతో తమ కోవిడ్-19 వ్యాక్సిన్‌పై మూడవ దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 60,000 మందిని క్లినికల్ ట్రయల్స్ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఎన్రోల్మెంట్ వ్యవస్థను మూసివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి భేటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఏ క్లినికల్ ట్రయల్స్‌లో అయినా ముఖ్యంగా భారీ అథ్యయనాల్లో తీవ్ర ప్రతికూల ఘటన(ఎస్‌ఏఈ)లు ఊహించదగినవేనని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అథ్యయనాన్ని నిలిపివేసి ఎస్‌ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్ మానవ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60,000 మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. అమెరికాతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, దక్షిణాఫ్రికాలో క్లినకల్ ట్రయల్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. చదవండి : ‘వ్యాక్సిన్ ఇలా ఇస్తే అద్భుత ఫలితాలు’ -
కేజీహెచ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
సాక్షి, విశాఖ: నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. ఆక్స్ఫర్డ్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్, సీరం ఇండియా సంయుక్తంగా పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కూడా పరీక్షలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సోమవారం తొలి వాలంటీర్‌కు వ్యాక్సిన్ అందించారు. మొదటి రోజు ముగ్గురు వాలంటీర్ల కు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరో 15 రోజుల వ్యవధిలో 100 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహించనున్నట్టు డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు. -
‘కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం అయినట్లు కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేజీహెచ్‌తో పాటు మరో 17 చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్‌లో 100 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని వెల్లడించారు.చదవండి: కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం ‘నిన్నటి నుంచి క్లినికల్ ట్రయల్స్ వలంటీర్లు ఎంపిక ప్రారంభించాం. మొదట 10 మంది ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉన్నవారు. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు. సోమవారం నుంచి తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం అవుతున్నాం. మొత్తం అయిదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ వ్యాక్షిన్ ఇచ్చి, వారి రక్త నమూనాలు నమోదు చేస్తాం. ఆరు నెలలు పాటు ఎంపికైన 100మందిలో 75 మందికి వ్యాక్సిన్ ఇస్తాము. ఆ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు శాంపిల్స్ అన్ని పంపిస్తాము’. అని డాక్టర్ సుధాకర్ తెలిపారు.చదవండి:శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ) -
కరోనా : కీలక దశలో నాలుగు వ్యాక్సీన్లు
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. (పీఎం కేర్స్ : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై ఐదు వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ దశలో ఉండగా, 35 కు పైగా క్లినికల్ ట్రయల్స్ లో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా ప్రయోగ ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న వారిలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఒకటి. అలాగే పూణేకు చెందిన సీరం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 86,961తాజా కేసులతో సోమవారం నాటికి 54.87 లక్షల మంది వైరస్ వ్యాధి బారిన పడగా, 87,882 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ ) -
సీరం ఆధ్వర్యంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు దిగ్గజ సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ ప్రయోగాలను సీరం త్వరలోనే చేపట్టనుంది. ఆగస్టులో చేసుకున్నఒప్పందం ప్రకరం, తమ వ్యాక్సిన్ ఎన్వీఎక్స్-కోవి 2373 యాంటిజెన్ భాగాన్ని తయారు చేయనుంది. దీంతోపాటు వచ్చే నెలలోనే (అక్టోబర్) ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్) తాజా నివేదికల ప్రకారం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న అదార్ పూనవల్లా నేతృత్వంలోని సీరం త్వరలోనే నోవావాక్స్ ప్రయోగాలను ప్రారంభించనుంది. నోవావాక్స్-సీరం ట్రయల్స్‌కు పూణేలోని ఐసీఎంఆర్-నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నాయకత్వం వహించనుంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఏటా 2 బిలియన్ మోతాదులకు రెట్టింపు చేయాలని యోచిస్తున్నా మనీ, ప్రపంచవ్యాప్త పంపిణీకి తాము కట్టుబడి ఉన్నామని నోవావాక్స్ అధ్యక్షుడు స్టాన్లీ సి ఎర్క్ అన్నారు. దీనికి వివిధ ఫార్మా సంస్థలు, ప్రపంచ సరఫరా గొలుసులతో ఒప్పొందాలు చేసుకున్నట్టు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ 2 వ దశలో ఉన్న వ్యాక్సిన్‌ను అభివృద్ధికి చాలా వేగంతో పనిచేస్తున్నామనీ, రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫేజ్ 3 ఎఫిషియసీ ట్రయల్స్ ప్రారంభించాలని భావిస్తున్నామని ఎర్క్ చెప్పారు. (కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ ) -
రష్యా వ్యాక్సిన్- డాక్టర్ రెడ్డీస్ చేతికి
కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ స్పుత్నిక్-Vపై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ ఆర్డీఐఎఫ్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇవి విజయవంతమైతే నవంబర్ తొలి వారానికల్లా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని అభిప్రాయపడింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసేజీలను డాక్టర్ రెడ్డీస్‌కు సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వివరాలను ఆంగ్ల మీడియా వెల్లడించింది. సురక్షితం ఎడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన స్పుత్నిక్-V వ్యాక్సిన్ సురక్షితమైనదని డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం సందర్భంగా ఆర్డీఐఎఫ్ సీఈవో కైరిల్ దిమిత్రేవ్ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు మరో నాలుగు దేశీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్న వ్యాక్సిన్లపై ఆసక్తి చూపడం ద్వారా వివిధ దేశాలు, సంస్థలు.. ప్రజలను సంరక్షించుకునేందుకు కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మానవ ఎడినోవైరల్ వెక్టర్స్ ద్వారా రూపొందించిన తమ వ్యాక్సిన్‌ను 40,000 మందిపై ప్రయోగించి చూశామని, 250 క్లినికల్ డేటాలను విశ్లేషించామని వివరించారు. తద్వారా ఇది సురక్షితమని తేలడమేకాకుండా దీర్ఘకాలంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలనూ చూపలేదని స్పష్టం చేశారు. రష్యాలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలు సఫలమయ్యాయని.. దేశీ ప్రమాణాల ప్రకారం మూడో దశ పరీక్షలకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు) -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశామంటూ ఉసూరుమనిపించిన బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మళ్లీ శుభవార్త చెప్పింది. మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ధృవీకరించిన తరువాత యునైటెడ్ కింగ్డమ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించినట్లు బ్రిటిష్-స్వీడిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. డేటాను స్వతంత్రంగా సమీక్షించిన తరువాత ట్రయల్స్ తిరిగి ప్రారంభించాలని యూకే రెగ్యులేటరీ అథారిటీ సిఫారసు చేసినట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్) ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా ఒక వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో తాత్కాలికంగా ప్రయోగాలకు విరామం ఇచ్చినట్టు ప్రకటించింది. దీనిపై తమకు సమాచారం అందించలేదనీ, భద్రతా కారణాల రీత్యా పరీక్షలు నిలిపివేసి వివరణ ఇవ్వాలంటూ పూణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరంకు డ్రగ్ కంట్రోలర్స్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో మనదేశంలో ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి పొందిన సీరం కూడా ఇండియాలో పరీక్షలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు) -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మన దేశంలోనూ ఆగాయి. ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రయోగాలు చేపట్టేవరకు తామూ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా టీకా డోసు ఇచ్చిన ఒక వాలంటీర్‌కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలేవరకూ భారత్‌లో రెండు, మూడో దశలకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ వి.జి. సొమానీ సీరమ్ ఇన్స్టిట్యూట్కి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా సీరమ్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడినప్పటికీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ ఏడాది చివరికి టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కాల్ సోరియెట్ చెప్పారు. టీకా భద్రతపై సమీక్షను వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనాకు చైనా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ బీజింగ్: కరోనాను నిలువరించడానికి నాజల్ స్ప్రే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కి చైనా అనుమతించింది. తొలి దశ క్లినికల్ ట్రయల్ నవంబర్‌లో ప్రారంభం కావొచ్చని చైనా తెలిపింది. చైనాకి చెందిన నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా వ్యాక్సిన్‌ని ఆమోదించడం ఇదే తొలిసారి. -
వ్యాక్సిన్ పరీక్షలకు బ్రేక్ -ఆస్ట్రాజెనెకా డౌన్
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించేందుకు రూపొందిస్తున్న వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. తుది దశ క్లినికల్ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగించిన వ్యాక్సిన్ అనారోగ్యానికి దారితీసినట్లు తెలుస్తోంది. దీంతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆశలు రేకెత్తిన విషయం విదితమే. భారీ స్థాయిలో నిర్వహించే క్లినికల్ పరీక్షలలో ఒక్కోసారి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తవచ్చని.. ఇవి సహజమేనని ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా పేర్కొంది. అయితే ఏ చిన్న పొరపాటుకూ తావివ్వకుండా పరిశోధనలు నిర్వహించేందుకే పరీక్షలను స్వతంత్రంగా నిలిపివేసినట్లు వివరించింది. అమ్మకాలతో డీలా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై పరీక్షలు నిలిచిపోయిన వార్తల నేపథ్యంలో దేశీ అనుబంధ సంస్థ అయిన ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 6.3 శాతం పతనమై రూ. 3,968 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 12 శాతంపైగా పడిపోయి రూ. 3,710ను తాకింది. కాగా.. ఈ ఏప్రిల్- జూన్ కాలంలో కంపెనీ నికర లాభం 13 శాతంపైగా క్షీణించి రూ. 19 కోట్లకు పరిమితంకాగా.. నికర అమ్మకాలు 5 శాతం తగ్గి రూ. 194 కోట్లకు చేరాయి. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. -
‘రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు’
లండన్: కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా ప్రయోగ దశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్లు్యహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది. స్పుత్నిక్ వ్యాక్సిన్‌పై తగినంత సమాచారం లేదు కాబట్టి దాని సమర్థతపై నిర్ణయానికి రాలేమని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ అన్నారు. టీకా ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!) -
కోవాక్జిన్ రెండో దశ ట్రయల్స్ షురూ
నాగ్‌పూర్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవిడ్–19 టీకా ‘కోవాక్జిన్’రెండోదశ మానవ ప్రయోగాలు నాగ్‌పూర్‌లో బుధవారం మొదలయ్యాయి. కోవాక్జిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌లోని నిమ్స్, వైజాగ్‌లోని కేజీహెచ్ కూడా ఉన్నాయి. వలంటీర్ల నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు పంపి... సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని నిర్ధారణ జరిగిన తర్వాత వారికి టీకాను ఇస్తున్నారు. నాగ్‌పూర్‌లోని గిల్లూర్కర్ ఆస్పత్రిలో బుధవారం రెండో దశ ప్రయోగం ప్రారంభమయ్యింది. టీకా సమర్థత, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్న తీరు, సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిస్తారు. వందల మంది వలంటీర్లపై ఈ ప్రయోగం ఉంటుంది. -
కోవిడ్–19 మొదటి అంకం ముగిసింది
లక్డీకాపూల్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కొనసాగుతున్న కొవాక్జిన్ క్లినికల్ ట్రయిల్స్‌లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది. ఈ ప్రక్రియలో 50 మంది వలంటీర్లపై ఈ వ్యాక్సిన్ టీకాలను ప్రయోగించారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు దాదాపుగా 60 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 50 మందికి సంబంధించి రక్త నమూనాలను సేకరించి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్ సైతం పరీక్షలు నిర్వహించి ఆయా వలంటీర్ల ఫిట్నెస్ను నిర్ధారించింది. ఈ మేరకు కోవిడ్–19ను నియంత్రించే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్(బీబీఐఎల్) సంస్థ తయారు చేస్తున్న కోవాక్జిన్ ఫేజ్–1 హ్యూమన్ క్లినికల్ ట్రయిల్స్‌కు శ్రీకారం చుట్టారు. తొలుత ఇద్దరు ఆరోగ్యకమైన వలంటీర్లకు మొదటి మోతాదు టీకా ప్రయోగం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత 14 రోజులకు అదే కోడ్‌కు సంబంధించిన బూస్టర్ డోస్‌ను కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియను కూడా ఇటీవలే పూర్తి చేసినట్టు నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె. మనోహర్ పర్యవేక్షణలో క్లినికల్ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు జనరల్ మెడిసిన్, ఆనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన వైద్యులు సమన్వయంతో ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా వలంటీర్లంతా తమ తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా 28 రోజుల తర్వాత రెండవ మోతాదు టీకా ప్రయోగానికి నిమ్స్ క్లినికల్ ట్రయిల్ నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎవాల్యూషన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ వ్యాక్సిన్ వల్లలో శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. వలంటీర్ల ఆరోగ్యాన్ని పరిక్షించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే రెండవ మోతాదు టీకా ప్రయోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. -
కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. మరోవైపు కరోనాను నిరోధించే టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నోవావాక్స్ సంస్థ కీలక విషయాన్ని ప్రకటించింది. తమ ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్ కరోనాను నిరోధించే యాంటీ బాడీస్ ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. కొద్దిపాటి స్థాయిలో నిర్వహించిన ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం తమ వ్యాక్సిన్ సురక్షితంగా కనిపిస్తోందని తెలిపింది. మేరీల్యాండ్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వ్యాక్సిన్ ఎన్‌విఎక్స్-కోవి 2373, ఆరోగ్యకరమైన వాలంటీర్లలో రెండు మోతాదుల తర్వాత ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, అత్యధికంగా యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. ఈ ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేలా అదనంగా అందించిన మ్యాట్రిక్స్ ఎమ్ పదార్ధం, టీకా ప్రభావాన్నిమరింత పెంచుతుందని అధ్యయనంలో తేలిందని తెలిపింది. మే చివరలో ప్రారంభమైన ఈ పరీక్షల్లో, 5 మైక్రోగ్రామ్, 25 మైక్రోగ్రామ్ మోతాదులను పరీక్షించామని తెలిపింది. అమెరికా సహా పలుదేశాల్లో రెండోదశ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపింది. త్వరలోనే చివరి దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభిస్తామని నోవావాక్స్ రీసెర్చ్ చీఫ్ గ్రెగొరీ గ్లెన్ తెలిపారు. డిసెంబరు నాటికి రెగ్యులేటరీ ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్నామన్నారు. జనవరి 2021 నాటికి 1 నుంచి 2 బిలియన్ల మోతాదులను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాగా కరోనాకి సంబంధించిన టీకా అభివృద్దికి వైట్ హౌస్ ప్రోగ్రామ్ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అమెరికా నిధులు కేటాయించిన వాటిల్లో నోవావాక్స్ వ్యాక్సిన్ మొదటిది. దీనికి సంబంధించిన ట్రయల్స్, ఉత్పత్తి తదితర ఖర్చులను భరించటానికి నోవావాక్స్ సంస్థకు 1.6 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అమెరికా ప్రభుత్వం జూలైలో అంగీకరించింది. మరోవైపు దేశంలో వైరస్ కేసుల సంఖ్య 19 లక్షలను దాటేయగా, ప్రపంచవ్యాప్తంగా 695,000 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న మహమ్మారిని నిలువరించే టీకా కోసం ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. -
జనవరికల్లా కోవిడ్ వ్యాక్సిన్!
వాషింగ్టన్: ఈ యేడాది చివరికల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని, ఇప్పటికే 2.5 లక్షల మంది క్లినికల్ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణులు డాక్టర్ ఆంథోని ఫాసీ చెప్పారు. అమెరికాలో కోవిడ్–19 పరీక్షా ఫలితాలను రెండు మూడు రోజుల్లో అందించలేకపోతున్నామని, కనుక అమెరికా పౌరులంతా మాస్కులు ధరించడమూ, సమూహాల్లోకి వెళ్లకుండా ఉండడమూ, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని అమెరికా అధికారులు ఫాసీతో చెప్పారు. వ్యాక్సిన్ రావడం, కలకాదనీ, అది నిజం కాబోతోందని ఫాసీ అన్నారు. -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. సీరమ్‌కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ గురువారం నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసింది. అదనపు సమాచారం జోడి స్తూ సవరించిన ప్రతిపాదనలను అందజేసింది.సీరమ్ దరఖాస్తుపై నిపుణుల కమిటీ శుక్రవారం చర్చించింది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది. -
ఒకే రోజు 49 వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా.. ఎక్స్ ప్రెస్ కంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధికంగా 49,310 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 12,87,945కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 740 మంది మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,17,208కి చేరుకుంది. దీంతో మొత్తం కోలుకున్న వారి వాతం 63.45కు చేరుకుంది. మరణాల రేటు 2.38కి పడిపోయింది. పరీక్షల సంఖ్య జూలై 20 నాటికి ప్రతి 10 లక్షల మందిలో 10,180 మందికి చేరింది. లేబొరేటరీల సంఖ్య 1290కి పెంచడంతో భారీగా పరీక్షలు పెరిగినట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో మరణించిన వారిలో 298 మంది మహారాష్ట్రకు, 97 మంది కర్ణాటకకు, 88 మంది తమిళనాడుకు, 34 పశ్చిమ బెంగాల్ కు, 28 మంది గుజరాత్ కు, 26 మంది ఉత్తరప్రదేశ్ కు, మరో 26 మంది ఢిల్లీకి, 11 మంది రాజస్తాన్ కు, 10 మంది మధ్యప్రదేశ్ కు, 9 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారని తెలిపింది. జూలై 23 వరకూ మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. గురువారం 3,52,901 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక కేసుల్లోనూ, అత్యధిక కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కోల్ కతాకు విమానాల్లేవు.. లాక్డౌన్ అమలవుతుండటంతో కోల్‌కతా విమానాశ్రయంలో జూలై 25 నుంచి 29 వరకూ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ‘కోవాగ్జిన్’ తొలి డోసు భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ మానవ ప్రయోగాలు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో(ఎయిమ్స్) శుక్రవారం ప్రారంభమయ్యా యి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. ఎయిమ్స్‌లో ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 3,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపి క చేసింది. ఈ ప్రయోగాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. కోవాగ్జిన్‌లో మూడు రకాల ఫార్ములేషన్స్ ఉన్నాయి. మొదట 50 మం దిపై తక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకపోతే మరో 50 మందికి కొంత ఎక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్ ఇస్తారు. -
నిమ్స్‌లో ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంట ర్నేషనల్ మరో ముందడుగు వేసింది. తాము అభి వృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ను మనుషులకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఎయిమ్స్ (పాట్నా) సహా రోహతక్ (హరియాణా)లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆ సంస్థ తాజాగా సోమవారం హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోనూ మనుషులపై టీకాను ప్రయోగిం చింది. సోమవారం ఇద్దరు వలంటీర్లకు మూడు మైక్రోగ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారు. 24 గంటల పాటు వీరిని ఆస్పత్రి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తారు. బయట తిరిగితే ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉండటంతో వీరిని పూర్తిగా ఇంటికే పరి మితం చేయనున్నారు. వైద్యులు వీడియో కాల్లో రోజూ వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో వీరికి అవసరమైన పౌష్టికాహారం సహా అన్ని రకాల మందులను అందజేస్తారు. 14 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెం దాయి? వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటివి విశ్లేషించి, వచ్చే ఫలితాలను బట్టి వీరికి అదే బ్యాచ్‌కి చెందిన ఆరు మైక్రో గ్రాముల చొప్పున రెండో డోస్ ఇవ్వనున్నారు. మంగళవారం మరో ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మూడో ప్రయోగం.. కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ తెచ్చేందుకు అంతర్జాతీయంగా వందకుపైగా ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆయా దేశాలు వ్యాక్సిన్ల తయారీపై చేస్తున్న పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు సెప్టెంబర్‌లోగా వ్యాక్సిన్ తేనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్స్ మాత్రం అంతకంటే ముందే (అక్టోబర్) వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటించింది. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం నిమ్స్ సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 పరిశోధన కేంద్రాల్లో ఇప్పటికే 375 మంది వలంటీర్లపై ర్యాండమైజ్డ్ డబుల్ బ్లెండ్, ప్లాసిబో కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. జూలై 15న పాట్నా ఎయిమ్స్‌లో, 17న హరియాణాలోని రోహతక్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ముగ్గురికి వ్యాక్సిన్ ఇవ్వగా, ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదు. దీంతో తాజాగా నిమ్స్‌లో ఇద్దరు వలంటీర్లకు తొలి డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మిలీనియం బ్లాక్ 6వ అంతస్తులోని నిమ్స్ క్లినికల్ ఫార్మాకాలజీ విభాగం ఈ టీకా ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. కాగా, నిమ్స్‌లో ప్రయోగానికి ఇప్పటి వరకు 60 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరికి కరోనా సహా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారి పేర్లను ఐసీఎంఆర్‌కు పంపి, ఫిట్నెస్ అనుమతి వచ్చాకే వారికి వ్యాక్సిన్ డోస్ ఇస్తారు. -
కరోనా వ్యాక్సిన్ : ఎయిమ్స్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నవేళ తొలి దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రధాన ఆసుపత్రిలలో హ్యూమన్ ట్రయిల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు కూడా ఎథిక్స్ అనుమతి లభించింది. (కరోనా వ్యాక్సిన్.. వాలంటీర్‌కు తొలి డోస్) కోవిడ్-19 టీకా పరీక్షలకు సంబంధించిన వాలంటరీ ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నామని, సంబంధిత వాలంటీర్ల ఆరోగ్య పరీక్షలను ప్రారంభించామనీ ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు. ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాయ్ తెలిపారు. మొదటి దశలో, 375 వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. వీరిలో గరిష్టంగా 100 మంది ఎయిమ్స్ నుంచే ఉండనున్నారు. కాగా ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను రూపొందించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను ఆగస్టు15నాటికి అందుబాటులోకి తీసుకురావాలనిఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులలో హ్యూమన్ ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌లో ఈ పరీక్షలు నేడు( సోమవారం) ప్రారంభమైనాయి. పట్నాలోని ఎయిమ్స్‌లో చిన్నమోతాదులో తొమ్మిదిమందికి ట్రయల్స్ గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
దేశంలో కరోనా మిలియన్ మార్చ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కోవిడ్–19 కేసులు మొదటి లక్షకు చేరుకునేందుకు 110 రోజులు పట్టగా 9 లక్షల మార్కును 59 రోజుల్లోనే దాటేయడం గమనార్హం. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 34,956 మందికి పాజిటివ్ తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 10,03,832కు చేరుకుందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే అత్యధికంగా మరో 687 మంది కోవిడ్ బారిన పడి చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 25,602కు పెరిగిపోయింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,942 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 6,35,756 మంది రికవరీ కాగా, దేశంలో 3,42,473 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. రికవరీ రేటు 63.33 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈనెల 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 1,30,72,718 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 658 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇది 4 నుంచి 8 రెట్లు తక్కువ. క్వారంటైన్లో 31.6 లక్షల మంది కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా 31.6 లక్షల మంది బాధితులను క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీరిలో యూపీలో అత్యధికంగా 11 లక్షల మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 7.27 లక్షలు, గుజరాత్లో 3.25 లక్షలు, ఒడిశాలో 2.4 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నారని పేర్కొన్నారు. ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్–19 టీకా కోవాక్సిన్ క్లినికల్ పరీక్షలు రొహ్‌తక్‌లోని పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ ప్రకటించారు. ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్, ఆమె కూతురు ఆరాధ్య శుక్రవారం తీవ్ర జ్వరంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటికే భర్త అభిషేక్, మామ అమితాబ్ బచ్చన్ అదే ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. ఐశ్వర్య, ఆరాధ్య కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఇన్నాళ్లు హోం క్వారంటైన్లో ఉన్నారు. కోవిడ్ పరీక్షల్లో అమెరికా తర్వాత భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా 4.2 కోట్ల కోవిడ్–19 పరీక్షలు చేపట్టగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ 1.20 కోట్ల మందికి పరీక్షలు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం ప్రెస్ సెక్రటరీ కేలీ మెకెననీ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం అత్యధికంగా 4.2 కోట్ల మందికి పరీక్షలు చేయగా 35 లక్షల మందికి పాజిటివ్‌గా తేలిందని ఆమె తెలిపారు. కోవిడ్ పరీక్షల దృష్ట్యా చూస్తే అమెరికా మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉందన్నారు. మోడెర్నా సంస్థ రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయనీ, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడో దశ జూలై చివర్లో జరుగుతాయన్నారు. -
నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 కేంద్రాలను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కూడా ఉంది. ఈ క్రమంలో నిమ్స్ అధికారులు క్లినికల్ ట్రయల్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత జూలై 7 నుంచి ట్రయల్స్ ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ దానికి కాస్త బ్రేక్ పడింది. (తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్ డైరెక్టర్) తాజాగా మంగళవారం నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలయ్యాయి. వాలంటీర్ల బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించిన వైద్యులు వాటిని సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. కాగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చేసిన 12 కేంద్రాల్లో మొత్తం 375 మందిపై మొదటి డోస్‌ను పరీక్షించనున్నారు. నిమ్స్‌లో దాదాపు 60 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిపే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.(మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు) -
రష్యన్ యూనివర్శిటీ ఔషధ పరీక్షలు ఓకే
ఆరోగ్యపరంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 కట్టడికి వీలుగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను రష్యన్ యూనివర్శిటీ సెచెనవ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్పుత్నిక్ న్యూస్ వివరాల ప్రకారం మాస్కోలోని గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సెచెనవ్ యూనివర్శిటీలో క్లినికల్ పరీక్షలకు రష్యన్ ఆరోగ్య శాఖ జూన్ 16న అనుమతించింది. దీంతో 18 మంది వలంటీర్లతో కూడిన తొలి గ్రూప్‌నకు జూన్ 18న వ్యాక్సిన్‌ను అందించగా.. జూన్ 23న మరో 20 మందికి ఇచ్చినట్లు స్పుత్నిక్ పేర్కొంది. దీనిలో భాగంగా తొలి బ్యాచ్‌ను ఈ నెల 15న ఇంటికి పంపించివేయనుండగా.. తదుపరి బ్యాచ్‌ను ఈ నెల 20న డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలియజేసింది. యూనివర్శిటీకి చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియోవాసాలజీ రీసెర్చ్ సెంటర్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది, ఈ వివరాలను ట్రాన్సేషనల్ మెడిసిన్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ తెలియజేసినట్లు స్పుత్నిక్ పేర్కొంది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ వెల్లడికాలేదు. ఇతర కంపెనీలూ ఇప్పటికే పలు ఫార్మా దిగ్గజాలు కోవిడ్-19 కట్టడి కోసం వ్యాక్సిన్లను రూపొందించేందుకు వేగంగా ప్రయోగాలు చేస్తున్న విషయం విదితమే.ప్రపంచవ్యాప్తంగా 21 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. వీటిలో ప్రధానంగా యూఎస్ కంపెనీలు గిలియడ్ సైన్సెస్, ఆక్స్ఫర్డ్ యూనివర్శీటీ రీసెర్చ్ విభాగం, బయోటెక్ కంపెనీ మోడర్నా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా బయోఎన్‌టెక్‌తో ఫైజర్ ఇంక్ సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ఈ ఏడాది(2020) డిసెంబర్‌కల్లా యూఎస్ఎఫ్డీఏ నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్!
మాస్కో: కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు చీకట్లో చిరుదీపంలా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్–19 వ్యాక్సిన్ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం కరోనాని తరిమికొట్టగలమన్న ఆశల్ని పెంచుతోంది. రష్యాలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగం కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ వెల్లడించారు. గమలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయోలజీ కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను జూన్ 18 నుంచి ప్రారంభించింది. వ్యాక్సిన్‌ను పరీక్షించిన వాలంటీర్లలో మొదటి బృందాన్ని బుధవారం డిశ్చార్జ్ చేస్తారు. రెండో బృందం వాలంటీర్లను జూలై 20న డిశ్చార్జ్ చేయనున్నట్టుగా తారాసోవ్ తెలిపారు. టీకా భద్రత పరీక్షలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషేవ్ వెల్లడించారు. వ్యాక్సిన్ భద్రత పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఇక వ్యాక్సిన్ అభివృద్ధిపై సెచెనోవ్ యూనివర్సిటీ దృష్టి సారించనుంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. కాగా గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లండన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అత్యంత పురోగతిలో ఉందని వెల్లడించింది. ఆ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇప్పుడు రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం అందరిలోనూ ఆశలు నింపుతోంది. -
కరోనాకు సోరియాసిస్ మందు
న్యూఢిల్లీ: చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ పేర్కొన్నారు. ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఒక మోస్తరు నుంచి తీవ్రమైన దశలో ఉన్న బాధితులకు మాత్రమే ఈ సూదిమందును ఆయన సిఫార్సు చేశారు. క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగానే ఈ మందును సూచిస్తున్నట్లు తెలిపారు. ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను బయోకాన్ అనే దేశీయ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అల్జూమాబ్ అనే బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. సోరియాసిస్ చికిత్సకు 2013 నుంచి ఈ సూదిమందును ఉపయోగిస్తున్నారు. బయోకాన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల పట్ల డీసీజీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదం తెలియజేసింది. ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సూదిమందు ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇతర ఔషధాలతో పోలిస్తే ఇటోలిజుమాబ్ వ్యయం చాలా తక్కువ. -
కరోనా: 7నుంచి నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చాక రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామని మనోహర్ పేర్కొన్నారు. (చదవండి : ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్ ఉన్నాయి. -
కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన విషయం తెల్సిందే. ఈ మానవ ట్రయల్స్‌లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్‌ను ఆవిష్కరించాలంటూ భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. (గుడ్‌న్యూస్: ఆగస్ట్ 15కి వ్యాక్సిన్) మానవులపై ట్రయల్స్ జరగకముందే ఎలా వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఖరారు చేస్తారని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’ సంపాదకులు అమర్ జెసాని ప్రశ్నించారు. మానవులపై వ్యాక్సిన్ ట్రయల్స్ విజయం అవుతాయన్న నమ్మకం ఏమిటని ఆయన అన్నారు. మానవ ట్రయల్స్‌లో పాల్గొంటున్న 12 సంస్థల్లో మెజారిటీ సంస్థలు కూడా భార్గవ లేఖ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎథిక్స్ కమిటీ అనుమతి ఇవ్వకుండా తాము మానవ ట్రయల్స్ పాల్గొనలేమని, ఆగస్టు 15వ తేదీ కాదుగదా, డిసెంబర్ 15వ తేదీ నాటికి కూడా ఇది సాధ్యమయ్యే పని కాదని ఒడిశాలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సమ్ హాస్పిటల్’ ట్రయల్స్ ఇంచార్జి వెంకట్రావు తెలిపారు. (టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు) ఇది జంతువులపై ట్రయల్స్ అని, మానవులపై ట్రయల్స్ అని, సాక్షాత్తు ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నా రెండు, మూడు నెలల్లో ట్రయల్స్ పూర్తి కావని మరో ప్రభుత్వాస్పత్రికి చెందిన ఎథిక్స్ కమిటీ పేర్కొంది. భార్గవ లేఖ గురించి తనకు తెలియదని, నిర్దేశించిన కాల వ్యవధిలో వ్యాక్సిన్‌ను ఆవిష్కరించడం అసాధ్యమని, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకున్నా ఆవిష్కరణకు కనీసం ఏడాది కాలం పడుతుందని ఐసీఎంఆర్ ఎథిక్స్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వసంత ముత్తుస్వామి చెప్పారు. ఇలా అనవసరంగా తొందరపెడితే తాము మానవ ట్రయల్స్‌లో పాల్గొనమని 12 సంస్థల్లో కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. (మనుషులపై ప్రయోగానికి 'భారత్' వ్యాక్సిన్) -
మనుషులపై ప్రయోగానికి 'భారత్' వ్యాక్సిన్
న్యూ ఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకున్న కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. త్వరలోనే ఈ లిస్టులో చేరేందుకు భారత్ బయోటెక్ చర్యలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. ఇప్పటికే కో వ్యాక్సిన్ పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరిచింది. దీన్ని మనుషులపై ప్రయోగించేందుకు అనుమతులు లభించడంతో జూలై నుంచి దేశంలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. (ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వాక్సిన్) దీన్ని రెండు ఫేజుల్లో చేసుకునేందుకు అనుమతి లభించిన తొలి కంపెనీ భారత్ బయోటెక్ కావడం విశేషం. హైదరాబాద్‌లోని జివోమ్ వ్యాలీలో బయోసేఫ్టీ లెవల్-3తో కలిసి కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరిచింది. జూలైలో మానవ ప్రయోగాలు మొదలైనందున ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే కరోనా చికిత్స కోసం గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’తో పాటు మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ ఔషధాలకు డీసీజీఐ అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. (కరోనా మందు! ) -
ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వాక్సిన్
లండన్: ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావంతో ఉన్నట్టు ఆ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వైరస్ తాజా ఔష«ధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ సౌమ్య మాట్లాడారు. పదిమందిపై వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగం జరుగుతోందని, వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడవ దశకు చేరుకున్నారని డాక్టర్ సౌమ్య చెప్పారు. గేమ్ చేంజర్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కితాబిచ్చిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి కోవిడ్ మరణాలను నివారించే శక్తి లేదని మానవ ప్రయోగాల్లో తేలిపోయిందని సౌమ్య చెప్పారు. -
సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్..!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెచ్చుమీరుతున్న వేళ ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ మరో 3 నెలల్లో దేశంలో అందుబాటులోకి రానుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు తయారీ, మార్కెటింగ్‌లో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఏజెడ్‌డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్ తయారీని ప్రారం భించామని, అన్ని పరీక్షలు ఆగస్టులో విజయవంతంగా పూర్తయ్యే నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం సెప్టెంబ ర్‌కల్లా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశ ట్రయల్స్ సక్సెస్ వాస్తవానికి కోవిడ్–19 వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో 12 సంస్థల పరిశోధనలను డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఇలా డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు పొందిన వాటిలో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఒకటి. ఈ వర్సిటీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ‘ఏజెడ్‌డీ 1222 జేఏబీ’ అనే వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 18–55 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకర వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించింది. ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఇప్పుడు మరో దశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా త్వరలోనే పరీక్షలు నిర్వహించేందుకు వివిధ వయసులకు చెందిన 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారిపై ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని, వ్యాక్సిన్‌ను మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా వేస్తోంది. బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం... ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్‌తోపాటు భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ సంస్థ... మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రాజెనెకా అంచనా ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డోసులు, 2021 జూన్ నాటికి 200 కోట్ల డోసుల ‘ఏజెడ్‌డీ 1222 జెఏబీ’ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. లాభం చూసుకోవట్లేదు... ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా లాభం చూసుకోకూడదు. మేము కూడా ఈ విషయంలో లాభాపేక్ష లేకుండా పని చేస్తున్నాం. అదే కొనసాగిస్తాం కూడా. ప్రయోగ ఫలితాలు విజయవంతంగా పూర్తయ్యే సమయానికి వ్యాక్సిన్ మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసి ఉంచుతాం. ఆగస్టుకల్లా అన్ని ప్రయోగాలు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. – పాస్కల్ సారియట్, ఆస్ట్రాజెనెకా సీఈవో -
హైదరాబాద్‌లోనే ‘ఫావిపిరవిర్’
సాక్షి,హైదరాబాద్:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణలో హైదరాబాద్‌కు చెందిన రాఘవ లైఫ్ సైన్సెస్(ఆర్ఎల్ఎస్) మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పలు ఔషధ కంపెనీలు మెడిసిన్ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తుండగా, ఆ సరసన తాజాగా ఆర్ఎల్ఎస్ కూడా చేరింది. తాము కరోనాను నియంత్రించే దిశగా అనేక ప్రయోగాలు చేసి రూపొందించిన ‘ఫావిపిరావిర్’ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఏవీయన్ సాధారణ వెర్షన్ అయిన ఈ ఫావిపిరావిర్ ఔషధాన్ని జపాన్‌లో కరోనా పాజిటివ్ రోగుల చికిత్స కోసం వినియోగిస్తుండగా, చైనా, టర్కీ తదితర దేశాల అధ్యయనాల్లోనూ ఈ ఔషధం సత్ఫలితాలు ఇస్తోందని ఆర్ఎల్ఎస్ పేర్కొంది. రష్యాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 80 మంది రోగులపై ఈ ఔషధాన్ని ప్రయోగించగా, రోగి కోలుకునే సమయం 11 రోజుల నుంచి 4 రోజులకు తగ్గిందని, రికవరీ రేటు సైతం 55.86 శాతం నుంచి 71.43 శాతానికి పెరిగిందన్నారు. (లాక్డౌన్ 5.0 ఉంటుందా లేదా?) ముడిసరుకులన్నీ మనవే.. మన దేశంలోనే లభించే ముడి పదార్థాలతోనే ఫావిపిరవిర్ ఔషధాన్ని రూపొందించామని, ఏ స్థాయిలో ఉత్పత్తి చేసినా చైనా సహా ఇతర ఏ ఒక్క దేశంపై ఆధారపడే పరిస్థితి లేకుండా చూశామని, ఇదే భారత ఫార్మాస్యుటికల్ రంగం సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చని ఆర్ఎల్ఎస్ కంపెనీ డైరెక్టర్ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.ఇప్పటికే పేటెంట్ పొంది కరోనా నివారణలో వినియోగిస్తున్న పలు ఔషధాలతో పోలిస్తే ఫావిపిరవిర్ తక్కువ వ్యయంతో ఉత్పత్తి సాధ్యమైందని, ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయని, క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అభివృద్ధి చెందుతున్న ఇండియాతో పాటు అనేక పేద దేశాలకు గొప్ప మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (వెంట తెస్తున్నారు!) -
విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా
లండన్: కరోనా వైరస్‌పై పోరులో లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన ముందడుగు వేసింది. వైరస్‌ను నివారించే టీకాను పదివేల మందిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఈ టీకా కరోనా శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుందా? లేదా? అన్నది పరిశీలించనుంది. గత నెలలో వెయ్యిమందిపై జరిగిన ప్రయోగాలు టీకా సురక్షితమైందని స్పష్టం చేయగా.. దాని సమర్థతను పరీక్షించేందుకు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వృద్ధులతో కలిపి 10,260 మందికి టీకా వేయనున్నామని శుక్రవారం ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనా, అమెరికా, యూరప్‌లలో 12 వరకూ టీకాలు వేర్వేరు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇంత వేగంగా ఓ వ్యాక్సీన్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఈ టీకాలు అన్ని ప్రయోగ దశలు దాటుకుని సురక్షితంగా, సమర్థంగా వైరస్‌ను అడ్డుకుంటాయా అన్నది ఇప్పటికీ అస్పష్టమే. ప్రయోగాత్మక టీకాల్లో అధికం రోగ నిరోధక శక్తిని చైతన్యవంతం చేసి వైరస్‌ను గుర్తించి మట్టుబెట్టేలా చేసేవే. ఆక్స్ఫర్డ్ టీకానే తీసుకుంటే ఇది నిరపాయకరమైన వైరస్‌తో తయారవుతోంది. చింపాంజీలకు జలుబు తెప్పించే వైరస్. ఇందులో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇది వ్యాప్తి చెందదు. -
ఆయుర్వేద ప్రభావమెంత?
న్యూఢిల్లీ: కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద ఔషధం అశ్వగంధ చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అశ్వగంధను కరోనా సోకకుండా నిరోధించగల ఔషధంగా వైద్య సిబ్బందికి, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఇతరులకు హైడ్రో క్లోరోక్విన్ స్థానంలో వినియోగించవచ్ఛా? అనే విషయంపై నియంత్రిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ను సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్‌ల సహకారంతో ఆయుష్, ఆరోగ్య, శాస్త్ర,సాంకేతిక శాఖలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం వెల్లడించారు. ఆయుర్వేద ఔషధాలు యష్టిమధు, గదుచి, పిప్పలి, ఆయుష్ 64ల సమ్మేళనాన్ని సాధారణ కోవిడ్ రోగులకు ఇవ్వడంపైనా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ తెలిపారు. వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా, అలాగే, సోకాక ఔషధంగా వాటిని వినియోగించడంపై పరీక్షలు జరుపుతున్నామన్నారు. కరోనా తీవ్రంగా ఉండేవారిపై ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియో ఔషధాల ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోవిడ్‌పై ఆయుష్ ఔషధాల ప్రభావం, ఆయా ఔషధాల వినియోగం తదితర సమాచారం తెలిపే ‘సంజీవని’ యాప్‌ను హర్షవర్ధన్ ఆవిష్కరించారు. -
‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కాపాడేందుకు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్‌కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) దేశంలోని 21 సంస్థలకు అనుమతినిచ్చింది. థెరపీ ద్వారా కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని యాంటీబాడీస్‌ని సేకరించి, వాటిని కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల కోవిడ్‌ని ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు 111 సంస్థలు ఆసక్తి చూపగా, 21 సంస్థలకే అనుమతి లభించింది. ఐసీఎంఆర్ అనుమతి పొందిన వాటిలో తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ ఉంది. కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులైన వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దాత పూర్తి సమ్మతితోనే ప్లాస్మాను తీసుకుంటారు. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయితేనే వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. (ఒక్క రోజులో 2,958 కరోనా పాజిటివ్ కేసులు) -
హ్యుమన్ ట్రయల్స్.. నేను బతికే ఉన్నా
లండన్ : కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 800 మంది వాలంటీర్లను కూడా ఎంపిక చేసింది. తొలుత ఇద్దరిపై ట్రయల్స్ మొదలుపెట్టగా.. అందులో మొదటగా 32 ఏళ్ల మైక్రో బయాలజిస్ట్ ఎలీసా గ్రానటో వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఎలీసా మరణించారని.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు విఫలమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎలీసా ఖండించారు. తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎలీసా చెప్పారు. తన పుట్టిన రోజునాడే వ్యాక్సిన్ తీసుకున్నానని.. ఇప్పుడు క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. ‘నేను బతికే ఉన్నాను. నేను ఈరోజు(26 ఏప్రిల్) టీ తాగుతున్నాను. ఇవాల్టికి నా బర్త్‌డే జరిగి మూడు రోజులు అవుతుంది. నేను వ్యాక్సిన్ తీసుకుని కూడా మూడు రోజులు గడిచింది. నేను బాగానే ఉన్నాను. వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రపంచంలోని అందరూ కూడా బాగానే ఉన్నారని భావిస్తున్నాను’ అని తెలిపారు. ఎలీసా మరణించారని జరిగిన తప్పుడు ప్రచారంపై యూకే ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది. ఆ వార్తలు నిరాధామైనవని పేర్కొంది. ఆన్లైన్లో ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం యూకే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ట్విటర్లో ఒక ప్రకటన చేసింది. ఎలీసా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రతినిధి ఫెర్గస్ వాల్ష్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి వాలంటీర్ ఎలీసా మరణించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నేను ఈ రోజు ఉదయం కొద్ది నిమిషాల పాటు ఎలీసాతో స్కైప్ ద్వారా చాట్ చేశాను. ఆమె బతికే ఉన్నారు.. అలాగే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు నాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె తన బంధువులందరితో చాట్ కూడా చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. అలాగే ఎలీసా మాట్లాడుతన్న వీడియోను కూడా షేర్ చేశారు. ....and here is Dr Elisa Granato in person. Alive and well pic.twitter.com/Csw1WqmBQa — Fergus Walsh (@BBCFergusWalsh) April 26, 2020 -
ఒక్కరోజులో 1,975 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అలజడి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేవలం ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 26,917కు, మరణాల సంఖ్య 826కు చేరిందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 20,177 కాగా, 5,914 మంది(21.96 శాతం) బాధితులు పూర్తిగా కోలుకున్నారు. మొత్తం కరోనా బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఏప్రిల్ 24న 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును తిరగరాస్తూ తాజాగా 1,975 కేసులు బయట పడడం గమనార్హం. పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్ దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆరోగ్య శాఖా మంత్రి హర్‡్షవర్ధన్ తెలిపారు. చాలా జిల్లాలు హాట్‌స్పాట్ (ప్రమాదకర/అత్యధిక కేసులు నమోదవుతున్న) నుంచి నాన్ హాట్స్పాట్లుగా మారుతున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ నివారణ విషయంలో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారితో వీడియోకాల్ ద్వారా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాగా, గుజరాత్లో కరోనా వల్ల ఇప్పటిదాకా 133 మంది మృతిచెందారు. ఎల్–టైప్ వైరస్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలోని వూహాన్లో ఈ వైరస్‌నే అలజడి సృష్టించింది. ఎస్–టైప్ కంటే ఎల్–టై‹ప్ వైరస్ మరింత ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ’ కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివృద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. -
చైనాలో వ్యాక్సిన్‌కి రెండోదశ క్లినికల్ ట్రయల్స్
బీజింగ్: చైనాలో మూడో కరోనా వైరస్ వ్యాక్సిన్‌ని రెండోదశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించినట్టు ఆ దేశం ప్రకటించింది. చైనా సైన్యానికి చెందిన సంస్థ అభివృద్ధి పరిచిన వ్యాక్సిన్ సహా ఇప్పటి వరకు చైనా కరోనా వైరస్‌పై మూడు వ్యాక్సిన్లను క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదించింది. చైనా నేషనల్ ఫార్మా స్యూటికల్ గ్రూప్(సినోఫామ్) అధీనంలో పనిచేసే వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయొలాజికల్ ప్రొడక్ట్స్ ‘ఇనాక్టివేటెడ్’వ్యాక్సిన్‌ని అభివృద్ధిపరిచింది. అలాగే వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్లు్యఐవి) సైతం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్టు చైనా ప్రభుత్వ జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తమ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కి కూడా పంపిస్తున్నామనీ, అది పూర్తివడానికీ, ఎంత సురక్షితమైందో, సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏడాది పడుతుందని సినోఫామ్ తెలిపింది. -
ఐఐసీటీలో ఏపీఐల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషదాల తయారీలో అతిముఖ్యమైన యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతరత్రా ముడిపదార్థాలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఫార్మాసూటికల్ కంపెనీ లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫెనోవిర్, రెమిడిసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) వంటి ఔషదాల తయారీ మీద దృష్టిపెడతామని ఐఐసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఐఐసీటీలో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యుల్స్, లాక్సాయ్‌లో ఫార్ములేషన్స్, డ్రగ్స్ తయారవుతాయని ఐఐసీటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. లాక్సాయ్‌కు హైదరాబాద్‌లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి పొందిన ఏపీఐ తయారీ కేంద్రాలున్నాయి. గతంలో ఎబోలా వైరస్ రోగులకు అందించిన రెమ్డిసివిర్ డ్రగ్‌ను ప్రస్తుతం కరోనా చికిత్స కోసం సమర్థవంతంగా పని చేస్తుందని, ఈ మేరకు డ్రగ్ పనితీరు, భద్రత అంశాలను అంచనా వేయడానికి క్లినికల్ ట్రయల్స్‌జరుగుతున్నాయని ఐఐసీటీ తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఏపీఐల కోసం చైనా మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. -
యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ!
లండన్: యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృది చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు గురువారం మొదలయ్యాయి. ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్ నేతృత్వంలోని బృందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో ఈమె ‘ఎబోలా’ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. తాజా కార్యక్రమానికి దాదాపు రూ.180 కోట్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. -
పరమౌషధం కానున్న ప్లాస్మా!
న్యూఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు ప్లాస్మా యాంటీ బాడీలతో చికిత్స మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం తెల్సిందే. దీంతో కొన్ని సంస్థలు పరీక్షలు జరిపేందుకు ముందుకొచ్చాయి. ఈ వ్యవహారానికి తాజాగా సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. ఐసీఎంఆర్ రూపొందించిన ప్రొటోకాల్ ప్రకారం దీనికి అనుమతులిచ్చింది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఐసీఎంఆర్ ఇచ్చిన నివేదికలో ప్లాస్మా చికిత్స పరిశోధనలపై పనిచేయనున్న సంస్థల వివరాలు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ రెగ్యులేటరీ తెలిపింది. వాటిని తమ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలించినట్లు వెల్లడించింది. డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్ రూల్స్ కింద అనుమతులిచ్చినట్లు స్పష్టం చేసింది. ఇదే ముందున్న మార్గమా? అమెరికా ఎఫ్.డీ.ఏ కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్స ద్వారా కోవిడ్ వైద్యులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అయిదు మంది కరోనా రోగులకు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలు కలిగిన ప్లాస్మాను ఎక్కించారు. అందులో ముగ్గురు ఇప్పటికే కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరణాలు అసలులేకపోవడం ఆశాజనకంగా మారింది. మరోవైపు భారత్‌లో నలుగురు రోగులపై ప్లాస్మా చికిత్సను ప్రయోగించగా, వారిలో గర్భిణిసహా అందరూ కోలుకున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. -
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్?
లండన్: వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యా న్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న 70 సంస్థలను గుర్తించగా, అందులో మూడు సంస్థలు ఇప్పటికే మనుషులపై ప్రయోగం చేశాయి. గిల్బర్ట్ ప్రయోగం తొలిదశలో 510 మంది వలంటీర్లను ఐదు గ్రూపులుగా విభజించి వారికి వ్యాక్సిన్ ఇచ్చి, వారిని ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తారు. తొలి ఇమ్యునైజేషన్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఈ ఐదు గ్రూపుల్లో ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తారు. వేసవి కాలంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే తీరునిబట్టి వ్యాక్సిన్ పనితీరుని గుర్తిస్తారు. అదే కాలంలో ఇతర దేశాల్లోని భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ ఫలితాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్లు తయారుచేస్తోన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రాథమిక నిర్ధారణలను, వారి ఆలోచనలను పంచుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు గిల్బర్ట్ లాన్సెట్ పత్రికకు చెప్పారు. -
కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్
బీజింగ్ : కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించే చర్యల్లో చైనా మరో అడుగు ముందుకేసింది. చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ టీకా రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది. ఇందుకు దాదాపు 500 మంది వాలంటీర్లను నియమించుకుంది. ముఖ్యంగా వుహాన్ కు చెందిన 84 ఏళ్ల వుహాన్ నివాసి కూడా ఉన్నారు. మార్చిలో చేపట్టిన మొదటి దశ పరీక్షల్లో పరిశోధకులు టీకా భద్రతపై దృష్టి సారించగా, రెండవ దశలో దృష్టి టీకా సమర్థతపై దృష్టి పెట్టారు. అలాగే రెండవ దశలో మొదటి దశ కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నారనీ, ఇందులో ప్లేసిబో నియంత్రణ బృందం కూడా ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. ముఖ్యంగా, క్లినికల్ హ్యూమన్ టెస్టింగ్‌లో మొదటి దశగా వారు తెలిపారు. రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్లకుగాను మానవ పరీక్షలను చైనా ఆమోదించినట్లు చైనా మీడియా జిన్హువా మంగళవారం నివేదించింది. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేసింది. ఈ పరిశోధనా బృందానికి పిఎల్ఎ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారు.దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసెస్ సోమవారం (ఏప్రిల్ 13) మాట్లాడుతూ, కరోనావైరస్ కోవిడ్ -19 స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమని, ఒక టీకా మాత్రమే కరోనావైరస్ పూర్తిగా అడ్డుకోగలదని స్పష్టం చేశారు. ఇది 2009 ఫ్లూ మహమ్మారి కంటే 10 రెట్లు ప్రాణాంతకమని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది, దేశంలొ 339 మంది మృత్యువాత పడ్డారు. ( కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ ) చదవండి : కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు China's #COVID19 vaccine has taken the lead to enter Phase II clinical trials, recruiting 500 volunteers including an 84-year-old Wuhan resident. The recombinant vaccine was developed by #China’s CanSino Biologics Inc under a research team headed by PLA Major General Chen Wei. pic.twitter.com/wiDwR55cPu — Global Times (@globaltimesnews) April 14, 2020 -
కరోనాకు వ్యాక్సిన్ : 108 మందిపై క్లినికల్ ట్రయల్స్
బీజింగ్ : కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్ దేశాలతో పాటు భారత్ కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా దేశాలకు చెందిన వందలాది మంది శాస్త్రవేత్తలు కరోనా మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లింది. వ్యాక్సిన్ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు అనుక్షణం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్ సైన్సెస్‌లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు తెలుస్తోంది. (చదవండి : కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..) ఈ నెల 16న మొదటి ట్రయల్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 18-60 ఏళ్ల వయస్సున్న 108 మందిని మూడు బృందాలుగా విభజించి భిన్నమైన డోసులు ఇచ్చారు. వీరంతా వూహాన్ నగరానికి చెందినవారే. వీరిలో కొంతమందికి జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. భారత్‌లో కూడా భారతదేశంలోనూ కోవిడ్ నడ్డి విరిచే వ్యాక్సిన్ తయారీ ముమ్మరమైంది. ఇందుకు ఈ రంగంలో అనుభవమున్న ముంబైకి చెందిన సిప్లా కంపెనీ రంగంలోకి దిగింది. త్వరలోనే ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో పలు వైరస్‌లను నియంత్రించిన వ్యాక్సిన్లు కోవిడ్‌ను కూడా నియంత్రించగలవా అనే దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా, కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 16 వేల మందికి పైగా మృతి చెందారు. 3.8లక్షల మందికి కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌లో 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు. -
‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకై కీలక ముందడుగు పడింది. ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనే క్రమంలో అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. సీటెల్‌లోని కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేపీడబ్ల్యూహెచ్ఆర్ఐ) పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్‌ను ఓ వ్యక్తిపై ప్రయోగించారు. భారత్, నార్వే సహాయ సహకారాలతో తొలి దశ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... ‘‘క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా తొలిసారిగా ఓ వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చారని తెలియజేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. అత్యంత తక్కువ సమయంలో ఇలా వ్యాక్సిన్ రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారి. దీని దరిదాపుల్లోకి మరెవరూ రాలేరు. వ్యాక్సిన్‌తో పాటు ఇతర యాంటీరైవల్ థెరపీలు, చికిత్సలు అభివృద్ధి చేస్తున్నాం’’అని సోమవారం పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.(సీటెల్‌లో ‘కోవిడ్-19’ క్లినికల్ ట్రయల్స్!) కాగా కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులను ఎంచుకుని.. వారిపై ప్రయోగించనున్నట్లు కేపీడబ్ల్యూహెచ్ఆర్ఐ పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించి.. సీటెల్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే అందరికీ ఒకే డోసు ఇవ్వకుండా వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని వెల్లడించారు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్చియస్ డిసీజెస్(ఎన్ఐఏఐడీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) సహాయంతో రూపొందించిన ఈ వ్యాక్సిన్‌కు ఎమ్ఆర్ఎన్ఏ-1273గా నామకరణం చేశారు. మసాచుసెట్స్‌లోని మెడెర్నాటీఎక్స్ బయోటెక్నాలజీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన మొదటి దశ ట్రయల్స్‌కు ది కొలియేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్(సీఈపీఐ) ఎంతగానో సహకరించిందని వెల్లడించారు.(కరోనా: వివాదం రేపిన ట్రంప్ ట్వీట్) చదవండి: కరోనా టీకా; అమెరికా కుయుక్తులు! కరోనా మరణాలు @ 7007 -
కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!
బెర్లిన్: కరోనా వైరస్‌ను నిర్మూలించే టీకాను రూపొందించే పరిశోధనలో ఉన్న ఒక జర్మన్ సంస్థ నుంచి ఆ టీకా హక్కులను పొందేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వార్త యూరప్‌లో హల్చల్ చేస్తోంది. దీనిపై జర్మనీ ప్రభుత్వం కూడా స్పందించింది. టీకాను జర్మనీ, యూరోప్ల్లోనే ఉత్పత్తి చేయాలనేది జర్మన్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేసింది. జర్మనీకి చెందిన బయోటెక్ కంపెనీ ‘క్యూర్‌వాక్’ కరోనా వైరస్‌కు టీకాను రూపొందించే పనిలో ఉంది. ఆ సంస్థ నుంచి ఆ టీకాకు సంబంధించిన అన్ని హక్కులను సొంతం చేసుకోవాలని, ఆ టీకా వినియోగాన్ని అమెరికాకు మాత్రమే పరిమితం చేయాలని ట్రంప్ ఆలోచన అని యూరప్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అమెరికా స్పందించింది. (విజృంభిస్తున్న కోవిడ్.. యూరప్ అతలాకుతలం) ‘వ్యాక్సిన్‌ని రూపొందించే పరిశోధనల్లో ఉన్న అనేక కంపెనీలతో అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. ఆ టీకాను అమెరికాకే పరిమితం చేసే ఆలోచన లేదు. దాన్ని ప్రపంచంతో పంచుకుంటాం’ అని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌తో సోమవారం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనాలకునేవారు తమను సంప్రదించవచ్చని, దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధకులు ఇంతకుముందే తెలిపారు. (కరోనా వైరస్ గురించి అతనికి ముందే తెలుసా?) -
కోవిడ్-19: వ్యాక్సిన్ రెడీ.. క్లినికల్ ట్రయల్స్!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్)కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వైరస్‌ను నాశనం చేయలేకపోయినా... దానిని ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు... తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులను ఎంచుకుని.. వారిపై వ్యాక్సిన్ ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించి.. సీటెల్‌లో ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 14 నెలల్లో రెండు సార్లు వారికి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తామని.. అయితే అందరికీ ఒకే డోసు ఇవ్వకుండా వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని తెలిపారు. (కరోనా వైరస్‌తో మృతులు లక్షల్లో ఉండొచ్చు! ) కాగా మెడెర్నాటీఎక్స్ సంస్థ సహాయ సహకారాలతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌కు.. కరోనా వైరస్‌ను బలహీనపరిచే లేదా అంతమొందించే శక్తి లేదని.. కేవలం అది దరిచేరకుండా తమ చుట్టూ ప్రోటీన్‌ను నిర్మించుకునేలా శరీరంలోని కణాలను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. తద్వారా రోగనిరోధ శక్తి పెరిగి కరోనాను ఎదుర్కో గల సామర్థ్యం పెంపొందుతుందని తెలిపారు. గతంలో వ్యాప్తిచెందిన జికా వైరస్, హ్యూమన్ మోటాప్నం వైరస్‌లను నిరోధించడానికి ఉపయోగించిన వ్యాక్సిన్ మాదిరే ఇది కూడా పనిచేస్తుందని.. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనాలకునేవారు తమను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పేర్కొన్నారు.(కరోనాను జయించి బయటకు వచ్చారు..) ఇక చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. (కరోనా అలర్ట్: కేంద్ర సిబ్బంది శాఖ కీలక నిర్ణయం!) కరోనా కల్లోలం.. అలర్ట్: వరుస కథనాల కోసం క్లిక్ చేయండి! -
క్లినికల్ ట్రయల్స్‌లో ఉల్లంఘనలు
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్‌లో జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో ఉల్లంఘనలు జరిగినట్లు త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. అయితే అవేవీ పెద్దవి కావని, చిన్నపాటి ఉల్లంఘనలేనని కమిటీ పేర్కొంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రభుత్వానికి మంగళవారం నివేదిక అందజేశారు. ఆ నివేదికను అధికార వర్గాలు గోప్యంగా ఉంచుతు న్నాయి. నిలోఫర్‌లో చిన్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు, కొన్ని ఉల్లంఘనలు, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సర్కారు కదిలింది. నిలోఫర్‌లో జరిగిన ఔషధ ప్రయోగాల డాక్యుమెంట్లను పరిశీలించి ఒక్క రోజులోనే త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసింది. నివేదికలో ఉన్న అంశాలను ఉన్నత స్థాయి వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చిన ఎథిక్స్ కమిటీ, ఆ తర్వాత ఔషధ ప్రయోగాలు ఎలా జరుగుతున్నాయో తరచుగా పర్యవేక్షించలేదని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరిపినప్పుడు ఎథిక్స్ కమిటీ అనుమతి మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కూడా తప్పనిసరి. కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరిపినట్లు కమిటీ గుర్తించింది. క్లినికల్ ట్రయల్స్ సమయంలో వచ్చే శాస్త్రీయమైన, న్యాయపరమైన చిక్కులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తేలినట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ ఎన్నాళ్లు నిర్వహిస్తున్నారన్న దానిపైనా నిర్ధిష్ట కాలపరిమితి పేర్కోలేదని తేలింది. ట్రయల్స్ వివరాలను క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (సీటీఆర్ఐ)లో నమోదు చేయలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి నుంచి పూర్తిస్థాయి ఆమోదం తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది. ప్రతిష్ట దెబ్బతినకూడదన్న భావన.. నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని, కాబట్టి క్లినికల్ ట్రయల్స్‌లో ఏవైనా పొరపాట్లు జరిగినా వాటిని భూతద్దంలో చూపకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే మొదట్లో నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కొందరు వైద్యాధికారులు ఇప్పుడు చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు. పరస్పరం కొందరు డాక్టర్ల మధ్య వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ విషయం.. ఇప్పుడు ఆయా వర్గాల మధ్య రాజీ తీసుకురావడం ద్వారా క్లినికల్ ట్రయల్స్‌లోని లోపాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని వైద్యాధికారులు కొందరు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కొద్దిపాటి ఉల్లంఘనలు వాస్తవం: ఈటల నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌లో కొద్దిపాటి ఉల్లంఘనలు జరిగిన మాట వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అంగీకరించారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన చర్యలు: డీఎంఈ నిలోఫర్ సంఘటన నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఎథిక్స్ కమిటీలకు ట్రయల్స్‌పై దిశానిర్దేశం చేశామన్నారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ట్రయల్స్ జరుగుతున్నాయో సమగ్ర సమాచారం కావాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడ అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నిలోఫర్‌లో ట్రయల్స్‌పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపామన్నారు. వివరాలు వెల్లడించడానికి ఆయన అంగీకరించలేదు. -
క్లినికల్ ట్రయల్స్‌పై నూతన విధానం
సాక్షి, హైదరాబాద్: ఔషధ ప్రయోగాలపై నూతన విధానాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఈ ఏడాది తీసుకొచ్చిన క్లినికల్ ట్రయల్స్–2019 మార్గదర్శకాలకు అనుగుణంగా మరింత పకడ్బందీగా రాష్ట్రంలోనూ తీసుకురావాలని భావిస్తోంది. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయమూర్తి నేతృత్వంలో క్లినికల్ ట్రయల్స్‌పై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ నివేదికను బయటకు తీసి కేంద్ర నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని తీసుకురావాలనేది సర్కారు ఆలోచన అని వైద్య విద్యా వర్గాలు తెలిపాయి. నిలోఫర్ ఆసుపత్రిలో పసిపిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివాదాస్పదం కావడంతో సర్కారు నూతన విధానంపై దృష్టిసారించింది. ఇక నిలోఫర్ సంఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఉల్లంఘన జరిగితే ఉపేక్షించొద్దని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. విచారణ షురూ: నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్ వ్యవహారాన్ని తేల్చేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం సుదీర్ఘ విచారణ జరిపింది. ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ విమలాథామస్, ప్రొఫెసర్ లక్ష్మీ కామేశ్వరి నేతృత్వంలోని కమిటీ 5 గంటల పాటు నిలోఫర్‌లో విచారించింది. సుమారు 260 మందిపై 5 రకాల ట్రయల్స్ నిర్వహించినట్టు కమిటీ తేల్చినట్లు సమాచారం. వీళ్లలో ర్యాండమ్ గా కొందరితో కమిటీ సభ్యులు ఫోన్లో మాట్లాడి ట్రయల్స్ జరిగినట్టు తెలుసా లేదా అని ప్రశ్నించి సమాధానాలు రికార్డు చేశారు. సాయం త్రం వైద్య విద్యా సంచాలకులు రమేశ్‌రెడ్డికి కమిటీ ప్రాథమిక నివేదిక ఇచి్చనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగానే..! విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎథిక్స్ కమిటీ అనుమతులున్నా ట్రయల్స్ మాత్రం నిబంధనల ప్రకారం జరగలేదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. అధికారులపై కొన్ని ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ వివరాలను అందజేయాలని రమేశ్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఎథికల్ కమిటీలను ఆదేశించారు. -
హద్దులు దాటితే ఆపేస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రు ల్లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌పై వారంలో గా సమగ్ర తనిఖీలు చేపట్టాలని, అక్కడి రికార్డులను పరిశీలించాలని సర్కారు ఆదేశించింది. ఉల్లంఘన జరిగినట్లు తేలితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ నిలిపివేస్తామని తెలి పింది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో రోగుల భద్రతే అత్యంత కీలకమని తెలిపింది. ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులు, అనారోగ్యంతో చేరే వారిపై క్లినికల్ ట్రయల్స్ జరపకూడదని పేర్కొంది. నిలోఫర్‌లో ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మార్గదర్శకాలతో కూడిన ఓ ప్రకటన జారీ చేశారు. స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చే వారిని మాత్రమే అంగీకరించాలని స్పష్టం చేశారు. వారి సమ్మతిని తెలియజేసే పత్రాలు, ఆడియో విజువల్ రికార్డింగ్ వంటి అన్ని రకాల చట్టపరమైన విధానాలను అనుసరించడం ప్రయోగాలు చేసే వారి బాధ్యతన్నారు. అధికారులు రూపొందించిన కఠిన నిబంధనలను అనుసరించిన తర్వాతే పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని తెలిపారు. నిలోఫర్‌పై ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సోమవారం అన్ని రకాల పత్రాలను, రోగుల నుంచి తీసుకున్న సమ్మతి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్గదర్శకాలిలా.. ►క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఎథికల్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. దాని ఆధారంగానే ఔషధ ప్రయోగాలు జరగాలి. ►ఎథిక్స్ కమిటీ ప్రయోజనాలు, నష్టాలను అంచనా వేయాలి. ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలున్నాయా పరిశీలించాలి. అటువంటి ప్రమాదాలను తగ్గించే ప్రణాళికలను రూపొందించాకే ట్రయల్స్ చేయాలి. ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో చట్టబద్ధంగా అనుమతించే క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరపాలి. ►క్లినికల్ ట్రయల్స్‌పై వివాదాలు తలెత్తినప్పుడు విచారణ జరపడం తప్పనిసరి. నిలోఫర్ ఆస్పత్రిలో కూడా అటువంటి విచారణే జరుగుతుంది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొనే వాలంటీర్ల భద్రత కోసం ఇలా చేస్తున్నాం. ►ఔషధ ప్రయోగాల్లో పాల్గొనేవారి నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. క్లినికల్ ట్రయల్స్ దేనిపై చేస్తున్నారో సమాచారాన్ని ఇవ్వాలి. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారు నిరక్షరాస్యులైతే, వారికి అవగాహన కల్పించి సాక్షి సమక్షంలో సమ్మతి తీసుకోవాలి. ►క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరుకునే పరిశోధకుడు మొదట ఎథిక్స్ కమిటీకి, తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ పైస్థాయికి పంపించాలి. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే అనుమతి వస్తుంది. ►ట్రయల్స్‌ను ఆమోదించే ముందు పరిశోధన యోగ్యత, ప్రయోజనాన్ని నిర్ణయించాలి. ►దేశంలో నిబంధనలను ఐసీఎంఆర్ నిర్దేశిస్తుంది. ఒక క్లినికల్ ట్రయల్‌ను సమగ్రమైన వివరాలతోనే నిర్వహిస్తారు. ►ఎథిక్స్ కమిటీలు క్లినికల్ ట్రయల్స్‌కు ముందు ప్రాథమిక సమీక్ష చేయాలి. ట్రయల్స్ జరుగుతున్నప్పుడు పర్యవేక్షించాలి. మానవులపై ట్రయల్స్ విషయంలో కఠినమై న నియంత్రణ చర్యలున్నాయి. ►ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎథిక్స్ కమిటీ నిలోఫర్‌లో చేసే క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చినట్లు తేలింది. భద్రతాచర్యల ను అనుసరిస్తున్నాయో లేదో తేల్చడానికి ముగ్గురు సభ్యుల కమిటీ వేశాం. అది నివేదిక అందజేస్తుంది. ►క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షించా లని అన్ని ఎథిక్స్ కమిటీలకు సూచించాలని నిర్ణయించాం -
300 మంది క్లినికల్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్‌లో వంద లాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్ ట్రయల్స్ బాధితులుగా మిగిలారు. గతేడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఇన్పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. 300 మందిలో 100 మంది ని జనరల్ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్ ప్రయోగించారు. తద్వారా వారిపై అదెలా పనిచేసిందో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ పదే ళ్లలో 13 ట్రయల్స్ జరిగాయని, ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు. అది విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. వయసు వారీగా వర్గీకరించి.. క్లినికల్ ట్రయల్స్ జరిపిన పిల్లలను వయసు వారీగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు. సాధారణ వార్డులో నెల నుంచి ఏడాది వయసున్న పిల్లలు 18 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల వరకు 34 శాతం, 5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు 48 శాతం ఉన్నారు. పీఐసీయూలో నెల నుంచి ఏడాది వరకు 44 శాతం, 1 నుంచి ఐదేళ్ల వయసు వారు 32 శాతం, 5 నుంచి 12 ఏళ్ల వారు 24 శాతం ఉన్నారు. ఎన్ఐసీయూలో నెల నుంచి ఏడాది వయసు పిల్లలు 58 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల వరకు 28 శాతం, 5 నుంచి 12 ఏళ్ల పిల్లలు 14 శాతం ఉన్నారు. సాధారణ వార్డులో మగ పిల్లలు 64%, ఆడ పిల్లలు 36 శాతం ఉన్నారు. పీఐసీయూలో మగ పిల్లలు 54 శాతం, ఆడ పిల్లలు 46 శాతం ఉన్నారు. ఎన్ఐíసీయూలో మగ పిల్లలు 48%, ఆడ పిల్లలు 52% ఉన్నారు. వీరంతా వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రిలో చేరినవారే. రోగాల వారీగా కూడా పిల్లలను ఎంపిక చేసి వారిపై ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం అక్కడ రోటా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. అంతా పేద పిల్లలే.. నిలోఫర్‌కు వచ్చే పిల్లల్లో 99 శాతం మంది పేద పిల్లలే కావడం గమనార్హం. క్లినికల్ ట్రయల్స్‌కు అను మతి పేరుతో వారిపై జరిగిన ప్రయోగాల్లో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు అనుమానాలున్నాయి. దీనిపై విచారణ జరగాలని నిపుణులు కోరు తున్నారు. కేంద్ర నివేదికలో పిల్లల వివరాలు, ఎప్పుడు ఈ క్లినికల్ ట్రయ ల్స్ పూర్తయ్యాయన్న సమాచారాన్ని పేర్కొనలేదు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రుల్లోనూ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తేలింది. ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ జరిగాయని రిజిస్ట్రీ తన నివేదికలో తెలిపింది. కాగా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు శనివారం నిలోఫర్‌కి వచ్చి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్లినికల్ ట్రయల్స్‌కు బాధ్యులైన వారిపై బదిలీ వేటు పడే అవకాశాలున్నట్లు వైద్య విద్యా విభాగం వర్గాలు చెబుతున్నాయి. -
క్లినికల్ ట్రయల్స్‌పై దుమారం
సాక్షి, హైదరాబాద్/వరంగల్: నిలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌పై దుమారం చెలరేగింది. అక్కడ జరుగుతున్న ట్రయల్స్‌పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారానికి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఫార్మా కంపెనీలు తయారుచేసిన కొత్త మందులతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లలపై ప్రయోగం చేస్తున్నారని చర్చ జరుగుతున్న నేప థ్యంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ను సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. క్లినికల్ ట్రయల్స్‌ను బాలల హక్కుల సంఘం ఖండించింది. నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండ టాన్ని తప్పుబట్టింది. ప్రైవేటు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొందరు డాక్టర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. బాధ్యులైన డాక్టర్లను సస్పెం డ్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రయల్స్ నిర్వహిస్తున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. రోగులకు తెలియకుండానే.. నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అయితే అవి అనుమతి మేరకే జరుగుతున్నట్లు కొందరు వైద్యులు ప్రకటించారు. ఎథికల్ కమిటీ అనుమతి మేరకే చేస్తున్నామని తెలిపారు. కొత్త మందు బయటకు రావాలంటే ఇలాంటివి తప్పద ని కొందరు సమర్థిస్తున్నారు.అయితే క్లినికల్ ట్రయల్స్‌లో పేదలు, పేద పిల్లలనే లక్ష్యంగా చేసుకుంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లినికల్ ట్రయిల్స్‌పై పేదలు, పెద్దగా చదువు, అవగాహన లేకపోవడంతో ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడుతున్న పరిస్థితి ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయమే తల్లిదండ్రులకు తెలియట్లేదు. క్లినికల్ ట్రయల్స్‌ను వీడియో రికార్డింగ్ చేయాలన్న నిబంధన ఉందని, ఆ ప్రకారం జరగట్లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అనధికారిక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో డబ్బు వంటి ప్రలోభాలకు గురవుతారని ఐసీఎంఆర్ తెలిపింది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన సమీక్షకు హాజరైన వెద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి క్లినికల్ ట్రయల్స్ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మీడియాకు తెలిపారు. ‘నిలోఫర్’ ఘటనపై గందరగోళం వద్దు: ఈటల నిలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఎవరూ గందరగోళం చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఎవరైనా సరే నిబంధనలకు లోబడే వ్యవహరించాలని సూచించారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో శుక్రవారం డాక్టర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంలో ఇప్పటికే డీఎంఈ చర్యలు చేపట్టారని తెలిపారు. నిజానిజాలను తేల్చేందుకు కమిటీ వేశా మని చెప్పారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై కారి్మక శాఖ చూసుకుంటోందని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీఎంఈ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిలోఫర్‌లో పసి కూనలపై ప్రయోగాలు?
సాక్షి, హైదరాబాద్ : పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నిలోఫర్ ఆస్పత్రిలో వారిపైనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలకు నిలోఫర్ ఆస్పత్రిలోని కొందరు డాక్టర్లు సహకరిస్తున్నారు. కొన్ని రకాల నిషేధిత డ్రగ్స్ కూడా ట్రయల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలకు పాల్పడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారన్న విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి గురువారం సాయంత్రం విచారణకు ఆదేశించారు. నిలోఫర్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ బాగోతం.. పీడియాట్రిక్స్ విభాగంలోని ఓ ప్రొఫెసర్ ఫార్మా కంపెనీలతో కలసి అనధికారికంగా ట్రయల్స్ చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ, రొటా, హెచ్‌పీవీ, ఎంఆర్ వ్యాక్సిన్లను సదరు ప్రొఫెసర్ పిల్లలకు ఇస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల రక్త నమూనాలు సేకరిస్తున్నట్టు కొందరు డాక్టర్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా సూపరింటెండెంట్ గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సదరు ప్రొఫెసర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను అన్ని అనుమతులు తీసుకునే ట్రయల్స్ చేస్తున్నట్లు సదరు ప్రొఫెసర్ చెబుతున్నారు. గొడవతో విషయం బయటకు.. ఇటీవల ఇద్దరు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటపడింది. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సమక్షంలోనే చాలా రోజుల నుంచి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈవ వ్యవహారం నడుస్తున్నా సంబంధిత అధికారులు కళ్లు మూసుకుని పట్టించుకోకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి వరకు అనేకమంది భాగస్వామ్యం ఉన్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్టు సమాచారం. అందులో కొందరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలిసింది. ఈ విషయాలు బయటికి రాకుండా కొందరు డాక్టర్లు, అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ అంటే.. పరిశోధనశాలల్లో అభివృద్ధిపరిచిన ఏదైనా మందులు, వ్యాక్సిన్లు మనుషులపై లేదా రోగులపై సరిగా పనిచేస్తాయా లేదా అనే విషయాలను ధ్రువీకరించుకునేందుకు చేసే పరీక్షలనే క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఒకవేళ మందు వికటిస్తే సైడ్ ఎఫెక్ట్లు, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం తదితర చట్టాల నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అనుమతి లభించడం చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కఠినమైన నిబంధనలతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టే చాలా కంపెనీలు గుట్టుగా ఈ ట్రయల్స్‌ను జరుపుతాయి. -
త్వరలో లీరాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్
సాక్షి. హైదరాబాద్: టైప్2 మధుమేహాన్ని నియంత్రించే లీరాగ్లుటైడ్ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సజ్జల బయోల్యాబ్స్ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ ఔషధంపై నొవో నార్డిస్క్‌కు ఉన్న పేటెంట్ గడువు గతేడాది సెప్టెంబరుతో ముగిసింది. దీంతో దీని జనరిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు దేశంలో తామే మొదట ప్రయోగ పరీక్షలు ఆరంభించనున్నట్లు సజ్జల బయోల్యాబ్స్ డైరెక్టర్లు ఎస్.భార్గవ, డాక్టర్ ఎరువ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘‘విక్టోజా బ్రాండ్‌తో నోవో నార్డిస్క్‌కు పేటెంట్ ఉంది. ఈ పేటెంట్ గడువు ముగిసింది కనక లీరాగ్లుటైడ్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి మాకు ప్రొవిజినల్ ప్రాసెస్ పేటెంట్ దక్కింది’’ అని వారు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థను 2015లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారని తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే ఇనాక్సాపారిన్ సోడియం, లాస్పరాగైనేజ్ తదితర మందులతో గత మార్చి చివరికి రూ.15 కోట్ల టర్నోవర్ సాధించిందని, వచ్చే మార్చికి రూ.30 కోట్ల రెవెన్యూ దిశగా ముందుకెళుతున్నామని చెప్పారు. డిసెంబరు 31లోగా లీరాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెస్తామన్నారు. -
పెద్దవాళ్లు విటమిన్–డి తీసుకున్నా వృథానే!
మెల్బోర్న్: పెద్ద వయస్కులు విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల వారిలో ఎముకల సాంద్రత మెరుగు పడే అవకాశాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. ఎముకలు విరగటాన్ని ఈ సప్లిమెంట్లు నిరోధించలేవని వెల్లడైంది. పెద్ద వయస్కుల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉండేందుకు గత కొంత కాలంగా డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్లను సిఫార్సు చేయడం తెల్సిందే. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్‌కు చెందిన పరిశోధకులు సుమారు 81 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అసలు విటమన్–డి సప్లిమెంట్ల వల్ల అనుకున్నంత ప్రయోజనంలేదని తేలింది. ఈ సప్లిమెంట్లు వల్ల పూర్తిగా, పాక్షికంగా విరిగిన ఎముకలు కేవలం 15 శాతం అతుక్కుంటున్నట్లు తేల్చారు. -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్ :ప్రజల ప్రాణాలను తీసే ప్రమాదకర ఔషధ ప్రయోగాల (క్లినికల్ ట్రయల్స్)పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయోగ కేంద్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఔషధ ప్రయోగాలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదకర ప్రయోగాల కారణంగా కొందరు మృత్యువాతపడటంతోపాటు పలువురు పేదలు తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూసినప్పటికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కనీస మాత్రంగా స్పందించడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. బాధితులకు చట్ట ప్రకారం అండగా నిలవాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఇవేమీ చేయడంలేదు. 2017 జూన్‌లో కరీంనగర్ జిల్లాలో ఔషధ ప్రయోగాల కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఔషధ ప్రయోగాలపై రాష్ట్ర స్థాయిలో నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించేందుకు 2017 జూలై 5న ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 30 రోజులలోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీ ఏర్పాటై ఏడు నెలలు గడిచింది. అయితే కమిటీ ఇప్పటికీ నివేదిక రూపొందించలేదు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడం ఇప్పట్లో జరిగే పనిగా కనిపించడంలేదని వైద్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ చర్యలకు వీలు.. ఔషధ ప్రయోగాల నియంత్రణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలోని పలు విభాగాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర స్థాయిలోనూ ప్రయోగాలపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. సహేతుక మార్గంలోనే ఔషధ ప్రయోగాలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రయోగాలకు అంగీకరిస్తున్నట్లుగా... ఆయా వ్యక్తులనుంచి రాత పూర్వకంగా, వీడియో రూపంలో సమ్మతిని తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. జోనల్ కార్యాలయాల పరిధిలో ఔషధ ప్రయోగాలు నిర్వహించే కేంద్రాల వివరాలను నమోదు చేయాలి. ఉన్నత స్థాయి కమిటీలను నియమించి ప్రయోగాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం 2013 ఏప్రిల్ 26న అన్ని జోనల్ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జోనల్ కార్యాలయం ఉంది. అయితే మన రాష్ట్రంలోనే అనుమతిలేని ఔషధ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయా? లేక తెలిసీ అధికారులు పట్టించుకోవడంలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు.. ఫార్మసీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ఔషధాలను తయారు చేసి వీటిని ప్రయోగించే కాంట్రాక్టును పరీక్ష కేంద్రాలకు ఇస్తుంటాయి. ఆయా పరీక్ష కేంద్రాలు వ్యక్తులపై వాటిని ప్రయోగించి తుది ఫలితాలను క్రోడీకరిస్తాయి. దేశ వ్యాప్తంగా 84 ప్రయోగ కేంద్రాలు ఉండగా, తెలంగాణలో తొమ్మిది ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. ఔషధ ప్రయోగ కేంద్రాలు... డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (డీసీవో) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కేంద్రాలు అనేక సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, వయసు, ప్రయోగించే ఔషధానికి శరీరం తట్టుకుంటుందా లేదా అనే అంశాలను పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. వ్యక్తుల వివరాలను నమోదు చేయకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా ఎవరు బాధితులో తెలియడంలేదు. రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
ఔషధ బాధితుడు మాయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్లినికల్ ప్రయోగాల కేసు కొత్త మలుపు తీసుకుంది. ఔషధాల ప్రయోగం వికటించి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే, బాధితుడు స్వచ్ఛందంగా వెళ్లిపోయాడా.. లేదా ఎవరైనా తప్పించారా... అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఔషధ ప్రయోగ బాధితుడు బోగ సురేశ్ రక్తపు వాంతులు చేసుకోవడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఆదివారం తీసుకువచ్చారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎంజీఎంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 7 గంటలకే సురేశ్ ఎంజీఎం నుంచి వెళ్లిపోయాడు. ఐదుగురు అపరిచితులు విచారణ రోజే బాధితుడు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ నుంచి తమను కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీలు ఏమైనా పన్నాగం పన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళ వారం ఉదయం 6 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు సురేశ్‌తో మాట్లాడేందుకు వార్డుకు వచ్చారు. పదిహేను నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత అందరూ కలసి వెళ్లిపోయారు. ఎంతకీ తిరిగి రాకపో వటంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిం చారు. సురేశ్‌ను కలిసిన ఐదుగురు వ్యక్తులు ఎవరనేది మిస్టరీగా మారింది.