
నాగ్‌పూర్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవిడ్–19 టీకా ‘కోవాక్జిన్’రెండోదశ మానవ ప్రయోగాలు నాగ్‌పూర్‌లో బుధవారం మొదలయ్యాయి. కోవాక్జిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌లోని నిమ్స్, వైజాగ్‌లోని కేజీహెచ్ కూడా ఉన్నాయి. వలంటీర్ల నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు పంపి... సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని నిర్ధారణ జరిగిన తర్వాత వారికి టీకాను ఇస్తున్నారు. నాగ్‌పూర్‌లోని గిల్లూర్కర్ ఆస్పత్రిలో బుధవారం రెండో దశ ప్రయోగం ప్రారంభమయ్యింది. టీకా సమర్థత, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్న తీరు, సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిస్తారు. వందల మంది వలంటీర్లపై ఈ ప్రయోగం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment