క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం | Three Member Committee To Probe Clinical Trials In Niloufer | Sakshi
Sakshi News home page

క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం

Published Sat, Sep 28 2019 3:35 AM | Last Updated on Sat, Sep 28 2019 8:18 AM

Three Member Committee To Probe Clinical Trials In Niloufer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/వరంగల్‌: నిలోఫర్‌ ఆసుపత్రిలో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం చెలరేగింది. అక్కడ జరుగుతున్న ట్రయల్స్‌పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారానికి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఫార్మా కంపెనీలు తయారుచేసిన కొత్త మందులతో హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో పిల్లలపై ప్రయోగం చేస్తున్నారని చర్చ జరుగుతున్న నేప థ్యంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ను సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు.

క్లినికల్‌ ట్రయల్స్‌ను బాలల హక్కుల సంఘం ఖండించింది. నిలోఫర్‌ ఆసుపత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతుండ టాన్ని తప్పుబట్టింది. ప్రైవేటు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొందరు డాక్టర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. బాధ్యులైన డాక్టర్లను సస్పెం డ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రయల్స్‌ నిర్వహిస్తున్న కంపెనీలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కోరారు. 

రోగులకు తెలియకుండానే.. 
నిలోఫర్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని, అయితే అవి అనుమతి మేరకే జరుగుతున్నట్లు కొందరు వైద్యులు ప్రకటించారు. ఎథికల్‌ కమిటీ అనుమతి మేరకే చేస్తున్నామని తెలిపారు. కొత్త మందు బయటకు రావాలంటే ఇలాంటివి తప్పద ని కొందరు సమర్థిస్తున్నారు.అయితే క్లినికల్‌ ట్రయల్స్‌లో పేదలు, పేద పిల్లలనే లక్ష్యంగా చేసుకుంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  క్లినికల్‌ ట్రయిల్స్‌పై పేదలు, పెద్దగా చదువు, అవగాహన లేకపోవడంతో ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడుతున్న పరిస్థితి ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయమే తల్లిదండ్రులకు తెలియట్లేదు. క్లినికల్‌ ట్రయల్స్‌ను వీడియో రికార్డింగ్‌ చేయాలన్న నిబంధన ఉందని, ఆ ప్రకారం జరగట్లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అనధికారిక క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో డబ్బు వంటి ప్రలోభాలకు గురవుతారని ఐసీఎంఆర్‌ తెలిపింది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో జరిగిన సమీక్షకు హాజరైన వెద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి క్లినికల్‌ ట్రయల్స్‌ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మీడియాకు తెలిపారు.  

‘నిలోఫర్‌’ ఘటనపై గందరగోళం వద్దు: ఈటల 
నిలోఫర్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో ఎవరూ గందరగోళం చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో ఎవరైనా సరే నిబంధనలకు లోబడే వ్యవహరించాలని సూచించారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో శుక్రవారం డాక్టర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారంలో ఇప్పటికే డీఎంఈ చర్యలు చేపట్టారని తెలిపారు. నిజానిజాలను తేల్చేందుకు కమిటీ వేశా మని చెప్పారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై కారి్మక శాఖ చూసుకుంటోందని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, డీఎంఈ డాక్టర్‌ కె.రమేశ్‌రెడ్డి
పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement