కరోనా : కీలక దశలో నాలుగు వ్యాక్సీన్లు   | 4 corona vaccines in advanced stages of pre-clinical trial: HarshVardhan | Sakshi
Sakshi News home page

కరోనా : కీలక దశలో నాలుగు వ్యాక్సీన్లు  

Published Mon, Sep 21 2020 10:44 AM | Last Updated on Mon, Sep 21 2020 11:10 AM

4 corona vaccines in advanced stages of pre-clinical trial: HarshVardhan - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ,  సహకారాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.  కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల  ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  (పీఎం కేర్స్ : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు)

ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై ఐదు వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ దశలో ఉండగా, 35 కు పైగా క్లినికల్ ట్రయల్స్ లో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా ప్రయోగ ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న వారిలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఒకటి. అలాగే పూణేకు చెందిన సీరం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 86,961తాజా కేసులతో సోమవారం నాటికి 54.87 లక్షల మంది వైరస్ వ్యాధి బారిన పడగా, 87,882 మంది ప్రాణాలు కోల్పోయారు.  (కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement