Advanced
-
కశ్మీర్ ఉగ్రవాదుల చేతికి అమెరికా తుపాకులు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి 2021లో నిష్క్రమించిన సందర్భంగా అమెరికా సేనలు అక్కడే వదిలేసిన అత్యాధునిక తుపాకులు పాకిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల చేతికందాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనల్లో వీటిని విరివిరిగా వాడటంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిల్లో ముఖ్యంగా ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ప్రధానమైంది. అత్యంత తేలిగ్గా ఉంటూ, మేగజీన్‌ను సులువుగా మారుస్తూ సునాయాసంగా షూట్‌చేసే వెలుసుబాటు ఈ రైఫిల్‌లో ఉంది. దాదాపు 600 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ గురిచూసి కొట్టొచ్చు. నిమిషానికి 700–970 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఈ రైఫిల్ సొంతం. ఇంతటి వినాశకర రైఫిళ్లు కశ్మీర్ ముష్కరమూకల చేతికి రావడంతో దూరం నుంచే మెరుపు దాడులు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారని రక్షణ రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అసహనం వ్యక్తంచేశారు. 2017 నవంబర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు రషీద్‌ను సైన్యం మట్టుబెట్టినపుడు అక్కడ తొలిసారిగా ఎం4 రైఫిల్‌ను సైన్యం స్వాధీనంచేసుకుంది. 2018లో, 2022లో ఇలా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో ఈ రైఫిళ్లను భారత ఆర్మీ గుర్తించింది. జూలై 8వ తేదీన కథువాలో ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిలోనూ ఇవే రైఫిళ్లను వాడారని తెలుస్తోంది. -
నవధాన్యాలతో జవసత్వాలు
పిఠాపురం: అధునాతన వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు వాడడం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోయాయి. అలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూములను సారవంతం చేసే దిశగా అడుగులు వేయాలని, ఎరువులు.. పురుగు మందులకు చెక్ పెట్టి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారం సాధించే దిశగా నవ ధాన్యాల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చే చర్యలు తీసుకుంది. పచ్చి రొట్ట సాగుతో పచ్చని పంటలు పండే విధంగా ప్రకృతి వ్యవసాయంపై అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. నవ ధాన్యాల సాగుతో భూసారం పెంపువివిధ కారణాలతో క్రమంగా భూములు తమ బలాన్ని కోల్పోతున్నాయి. దీంతో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాక రైతులు నష్టపోతున్నారు. రానున్న రోజుల్లో భూసారం లేక ఏ పంటలు వేసినా పండని పరిస్థితులు నెలకొననున్నాయి. వాటిని అధిగమించడానికి నవ ధాన్యాల సాగు చేపట్టారు. వీటిని సాగు చేసి భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సూక్ష్మ పోషక విలువలు వృద్ధి చెంది, భూసారం పెరిగి ఏది సాగు చేసినా బాగా పండుతుంది.భూమి సారవంతంగా ఉండేందుకు దోహద పడే సూక్ష్మ జీవులు వృద్ధి చెంది నత్రజని స్థిరీకరణ జరిగి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి భూసారాన్ని మరింత పెంచుతాయి. చౌడు సమస్యను నివారించడంతో పాటు నేల నుంచి వచ్చే తెగుళ్లను సైతం ఈ పైర్లు అరికడతాయి. నవ ధాన్యాలు సాగు చేసి దున్నిన భూమిలో పండించిన ధాన్యంలో పోషకాల విలువలు పెరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారించారు. నవ ధాన్యాల సాగునవ ధాన్యాలు అంటే నవగ్రహాల పూజలకు వాడే ధాన్యాలుగానే చాలామందికి తెలుసు. కేవలం దైవ పూజలకు మాత్రమే వాడే నవ ధాన్యాలు ఇప్పుడు రైతుకు వరంగా మారాయి. గోధుమలు, వరి, కందులు, పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, ఉలవలు వంటి తొమ్మిది రకాల నవ ధాన్యాలు ఇప్పుడు భూసార పెంపులో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీటితో పాటు మరో 22 రకాల ధాన్యం రకాల విత్తనాలను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తోంది.పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు తదితర సహజంగా లభించే ఎరువులు సామాన్య రైతుకు లభ్యం కావడం భారంగా మారింది. వాటి స్థానంలో ప్రతీ రైతుకు అందుబాటులో ఉండే సహజ సిద్ధ ఎరువుల తయారీకి నవ ధాన్యాల సాగు ఒక వరంగా మారింది. జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట సాగుతో పాటు నవ ధాన్యాల సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలను రబీకి చివరిలో జల్లుకుని కోతలు పూర్తయ్యాక వాటిని కలియదున్నడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ విషయంలో అధికారుల సూచనలు, సలహాలతో రైతులు నవ ధాన్యాల సాగు చేపట్టారు.కాకినాడ జిల్లాలో నవ ధాన్యాల సాగు లక్ష్యం– 53,253 ఎకరాలుసాగు చేయడానికి నిర్ణయించిన రైతుల సంఖ్య– 49,895 ఇప్పటి వరకు సాగయిన భూములు – 26,846 ఎకరాలువిత్తనాలు తీసుకున్న రైతులు – 26,680 మందిపంపిణీ చేసిన విత్తనాలు – 26 టన్నులుసాగు చేసిన రైతులు – 26,564 మంది పంపిణీ చేస్తున్న విత్తనాలు – 31 రకాలుమంచి ఫలితాలు కనిపిస్తున్నాయిగత ఏడాది అధికారులు ఇచ్చిన విత్తనాలు చల్లి కలియ దున్నడం వల్ల చాలా వరకు ఎరువుల వాడకం తగ్గింది. పూర్వం పశువుల పెంటతో పాటు పచ్చిరొట్ట ఎరువులు వాడే వారు. రానురాను వాటిని మానేసి రసాయనిక ఎరువులు వాడడం ప్రారంభించాక పెట్టుబడులు పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు నవధాన్యాలు నాటి దున్నడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ప్రభుత్వం రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తోంది.నవ ధాన్యాల సాగు రైతులకు చాలా మంచిది. వీటి వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు రసాయనిక ఎరువులు లేని పంటలు అందుబాటులోకి వస్తాయి. నేను రెండు ఎకరాల్లో నవ ధాన్యాల సాగు చేశాను. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇవి సాగు చేయడం వల్ల భూమి సారవంతం కావడంతో ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో నాణ్యత గల పంటలు వస్తున్నాయి. – వారణాశి కామేశ్వరశర్మ, నర్శింగపురం, పిఠాపురం మండలంజిల్లాలో 53 వేల ఎకరాల్లో నవ ధాన్యాల సాగు లక్ష్యంజిల్లాలో ఈ ఏడాది సుమారు 53 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా నవ ధాన్యాల సాగుకు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటికే 26 టన్నుల విత్తనాలు పంపిణీ చేయగా 26 వేల మంది రైతులు తమ పొలాల్లో 25 వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకుని నవ ధాన్యాల సాగు చేపట్టారు. రబీ పంట చివరిలో నవ ధాన్యాలను చల్లి మొక్కలు ఏపుగా పెరిగిన తరువాత ఖరీఫ్‌కు ముందు కలియ దున్నడం వల్ల భూముల్లో పోషక విలువలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో పాటు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించగలుగుతారు.ఇలా నాలుగు సంవత్సరాలు నవ ధాన్యాలు సాగు చేసి దున్నడం వల్ల భూసారం సహజ సిద్ధంగా పెరిగి రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లోను రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా చైతన్యం తీసుకువచ్చాం. ప్రభుత్వం విత్తనాల పంపిణీ చేస్తుండడంతో రైతుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే లక్ష్యం పూర్తి చేస్తాం. ఎకరానికి 10 కేజీల చొప్పున విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నాం. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి, కాకినాడ -
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
హెయిర్ కంటింగ్ అనేది అటు పురుషులకు, ఇటు అందంగా కనిపించాలనుకునే మగువలకు తప్పనిసరి. కొందరు ఫ్యాషన్‌తో కూడిన హెయిర్ కటింగ్ కోసం పలు సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి హెయిర్ కంటింగ్ ఎక్కడైనా రూ. 10కే చేస్తున్నారని తెలిస్తే జనం క్యూ కట్టకుండా ఉండలేరు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ది హెయిర్ స్టోరీ పేరుతో ఓ నూతన సెలూన్ ప్రారంభమయ్యింది. ఇక్కడ మే నెల అంతటా పురుషులు, మహిళలు అనే బేధం లేకుండా అందరికీ అడ్వాన్స్ హెయిర్ కటింగ్ కేవలం రూ. 10కే చేస్తున్నారు.ఈ సందర్భంగా ది హెయిర్ స్టోరీ డైరెక్టర్ సన్నీ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇది కొత్త సెలూన్ అయినందున ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని, ప్రకటనలు, మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు చేయడం కంటే ఆఫర్లను అందించడం ఉత్తమమని ఆయన తెలిపారు.పురుషులకు రూ. 200, స్త్రీలకు 350 విలువైన హెయిర్ కంటింగ్ సర్వీస్‌ను రూ. 10కే అందిస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ఆఫర్ చూసి, ప్రతీరోజూ వందమందికిపైగా జనం వస్తున్నారని, మా సెలూన్లో హెయిర్ డ్రెస్సర్లుగా నలుగురు యువకులు, ఆరుగురు యువతులు పనిచేస్తున్నారని సన్నీ తెలిపారు. ఇక్కడికి వచ్చే జనం తమ హెయిర్ కటింగ్ కోసం నాలుగు గంటలకుపైగా సమయం వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. -
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంపన్న ఎకానమీపై గీతా గోపీనాథ్ వ్యాఖ్యలు
దావోస్: అభివృద్ధి చెందిన ఎకానమీలు 2024 నాటికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పురోగతి పట్టాలెక్కకపోతే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 5 శాతం దిగువనే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2022 సందర్భంగా ‘ప్రపంచ తదుపరి వృద్ధి ధోరణి’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్లో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ♦ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యాయి. నెమ్మదిగా తిరిగి కోలుకుంటున్నాయి. ఈ రికవరీకి ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మళ్లీ విఘాతంగా మారింది. ♦ యుద్ధం వల్ల ఇంధనం, ఆహారంతో సహా వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి ధోరణిపట్ల డౌన్‌గ్రేడ్ దృక్పధాన్ని కలిగి ఉన్నాము. ♦ ప్రధానంగా అధిక స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. ఈ చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే ఆయా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విభాగాలపై త్రీవ ప్రతికూల పరిణామాలకు దారితీసే వీలుంది. ♦ కోవిడ్, తదనంతరం యుద్ధ వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. ఆర్థిక వనరుల వినియోగం, వ్యాక్సినేషన్ వంటి అంశాల్లో వైరుధ్యాలు దీనికి కారణం. ♦ ఆహారం, ఇంధనం, వనరుల సంక్షోభాలు ఇప్పుడు వృద్ధి అసమతౌల్యతకు దారితీసే అవకాశాలు ఏర్పడినందున దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ పరస్పర సహకారం వంటి అంశాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
కరోనా : కీలక దశలో నాలుగు వ్యాక్సీన్లు
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. (పీఎం కేర్స్ : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై ఐదు వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ దశలో ఉండగా, 35 కు పైగా క్లినికల్ ట్రయల్స్ లో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా ప్రయోగ ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న వారిలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఒకటి. అలాగే పూణేకు చెందిన సీరం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 86,961తాజా కేసులతో సోమవారం నాటికి 54.87 లక్షల మంది వైరస్ వ్యాధి బారిన పడగా, 87,882 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ ) -
జీ షేరు ఢమాల్ : కంపెనీ వివరణ
సాక్షి, ముంబై : ఎస్సాల్ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్ప్రైజెస్ షేర్ల భారీ పతనం వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఆర్థిక నివేదికల ఆడిట్, ప్లెడ్జ్డ్ (తనఖా) షేర్లు విక్రయంపైమంగళవారం నుంచి పుకార్లు చెలరేగడంతో ఇన్వెస్లర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బుధవారం జీ కౌంటర్ ఏకంగా 12 శాతానికి పైగా పతనమైంది. మరోవైపు ఈ పుకార్లను కొట్టి పారేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్లో ప్లెడ్జ్డ్ షేర్ల విక్రయం చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే వాటా విక్రయ అంశం తుది దశకు చేరుకుందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 6-8 వారాల్లో ఈ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. అయితే వివరాలను వెల్లడి చేయలేమని, రుణాలను తీర్చడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ సీఈవో పునీత్ గోయంకా స్పష్టం చేశారు. అలాగే షేరు విలువ అనూహ్య పతనం, వదంతులపై సెబీకి ఫిర్యాదు చేయనున్నామని గోయంకా తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టాండ్‌లోన్ ఫలితాలను మే 27వ తేదీన వెల్లడించ నున్నామన్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించేందుకు జీ ఎంటర్టైన్మెంట్లో 50 శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సంస్థ ప్రమోటర్ సుభాష్ చంద్ర గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గత ఏడు నెలల కాలంగా జీ ఎంటర్ టైన్మెంట్ షేరు విలువ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. -
42% : ఇంకా ‘డౌన్’లోడింగే
ఓ పాత జోకు.. భారతీయుల మనస్తత్వాన్ని తెలిపేందుకు.. ఇంట్లో కరెంటు పోయిందట.. జపానోళ్లు అయితే ఫ్యూజ్ చెక్ చేస్తారట.. అమెరికాలో పవర్ హౌస్‌కు ఫోన్ చేస్తారట.. మరి మన దగ్గరో.. పక్కింట్లో కరెంటు ఉందో లేదో చెక్ చేస్తారట.. అదే అలవాటు ప్రకారం ఓసారి 4జీ గురించి కూడా పక్కింట్లో(పొరుగు దేశాల్లో) చెక్ చేసి వద్దాం.. ఎందుకంటే.. ఇప్పుడంతా 4జీ మయం.. ఇంత స్పీడ్ అంత స్పీడ్ అని చెప్పుకుంటున్నాం.. అందుకే ఓసారి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసి వద్దాం.. వాళ్లతో పోలిస్తే.. మన 4జీ ఎల్టీఈ(లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్) స్పీడ్ ఎంతో లెక్కేసి వద్దాం.. అయితే.. జోకులో అన్నట్లుగా పక్కింట్లోనూ కరెంటు లేదా.. అయితే ఓకే అని ఇక్కడ అనుకోవడానికి లేదు.. ఎందుకంటే.. మన పొరుగుదేశాల్లో 4జీ స్పీడు మనకంటే చాలా మెరుగ్గా ఉంది. ఎక్కడో ఉన్న అమెరికాలాంటివి వద్దు.. పక్కనున్న పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చినా కూడా అదే పరిస్థితి. అంటే.. మన అందరి వద్ద 4జీలు ఉన్నా.. స్పీడు విషయానికొస్తే.. అవన్నీ ‘స్లో’జీలే అన్నమాట.. వైర్లెస్ కవరేజీని మ్యాపింగ్ చేసే బ్రిటన్ సంస్థ ‘ఓపెన్ సిగ్నల్’ మొత్తం 88 దేశాల్లో 4జీ ఎల్టీఈ స్పీడ్‌కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం! అయితే.. చివరి నుంచి!! భారత్‌లో సగటు డౌన్లోడ్ స్పీడు 6.07 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకండ్) అట. అదే పాకిస్తాన్లో ఈ వేగం 13.56.. శ్రీలంకలో 13.95 ఎంబీపీఎస్‌గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న సింగపూర్‌లో 4జీ స్పీడు 44 ఎంబీపీఎస్‌గా ఉంది. అయితే.. స్పీడు విషయంలో ఎలాగున్నా.. 4జీ విస్తృతి.. లభ్యత విషయంలో మాత్రం మనం 14 స్థానంలో ఉన్నాం. దేశంలో 4జీ కవరేజీ 86.26 శాతంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96 శాతం 4జీ కవరేజీ పరిధిలో ఉంది. పాక్‌లో ఇది 66 శాతంగా.. శ్రీలంకలో 45 శాతంగా ఉంది. 4జీ ఎల్టీఈకి సంబంధించి అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడు విషయంలో ముందంజలో ఉన్నాయని ‘ఓపెన్ సిగ్నల్’ పేర్కొంది. అయితే.. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి చోట్ల మొబైల్ టారిఫ్ ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి తక్కువగా ఉండి.. వేగం విషయంలో స్థిరత్వం ఉందని.. భారత్ వంటి దేశాల్లో మొబైల్ నెట్ వినియోగదారులు ఎక్కువని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి ఎక్కువగా పడి.. స్పీడు తగ్గుతోందని తెలిపింది. ఎల్టీఈ అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌ను విస్తృతపరచడమొక్కటే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మన దగ్గర కూడా 4జీ డౌన్లోడ్ స్పీడు బాగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
-
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ప్రయోజనాలు ఇపుడు కనిపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. రీమానిటైజేషన్ ప్రక్రియం వేగం పుంజుకుందనీ రిజర్వ్ బ్యాంకు దగ్గర పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులో ఉందనీ పేర్కొన్నారు. ముఖ్యంగా రూ.500 నోట్ల చెలామణి పెరిగిందనీ, మరిన్ని నోట్లను అందుబాటులోకి తేనున్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో అశాంతి అలజడికి సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని జైట్లీ స్పష్టం చేశారు. విమర్శకుల అంచనాలను తలదన్ని అన్ని రంగాలు అభివృద్ధిని సాధించాయాటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ మేరకు బ్యాంకుల్లో గుర్తించదగిన ప్రభావం ఇప్పటికే కనిపిందని జైట్లీ చెప్పారు. అన్ని విభాగాలలో పరోక్ష పన్నుల వసూలు గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్ 19 నాటికి డైరెక్ట్ టాక్స్ 14.4 శాతం, కేంద్ర పరోక్ష పన్నులు వరకు 26.2 శాతం, కేంద్ర వాణిజ్య పన్ను 43.3 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే రబీ విత్తనాలు 6.3 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. -
అడ్వాన్స్ పీజీ ఎమర్జెన్సీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
నకిరేకల్ : అడ్వాన్స్ పిజి ఎమర్జెన్సీ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని 108 జీవీఎం ఈఎంఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు సూచించారు. నకిరేకల్‌లోని స్థానిక ఏవీఎం విద్యాసంస్థలో బుధవారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డిగ్రీలో బీఎస్సీ సైన్స్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం రూ.17వేల వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తామన్నారు. అనంతరం స్థానిక 108 కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 35 అంబులెన్స్‌లతో అత్యవసర సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. అనంతరం పుష్కరాల సమయంలో 14 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర సేవలు అందించిన సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బాలకృష్ణ, డివిజన్ అధికారులు ఎస్కే సలీం, దుర్గా ప్రసాద్, సిబ్బంది యాదగిరి, కిరణ్, రమేష్‌రెడ్డి, సేతుపాల్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
108లో అత్యాధునిక వైద్య సేవలు
హన్మకొండ అర్బన్ : జిల్లాలో 108 వాహనాల్లో అత్యాధునిక వైద్య సేవలు అదించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రసుత్తం తొలిదశగా మూడు వాహనాల్లో ఆ సేవలు అందుబాటులోకి తెచ్చామని జీవీకేఎంఆర్‌ఐ ఆపరేషన్స్ రాష్ట్ర చీఫ్ బ్రహ్మానందం తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మద్దూరు, జనగామ, నర్సంపేట వాహనాల్లో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్(ఏఎల్ఎస్) అందుబాటులో ఉన్నాయని తెలి పారు. ఈ సేవలందించే సిబ్బంది దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, రాష్ట్రంలో మరిన్ని అంబులెన్స్‌ల్లో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీఈకే ద్వారా పీజీ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తం గా 150 మందిని ఎంపిక చేసి వారికి పీజీలో ప్రవేశం కల్పిస్తామని, నాలుగు సెమిస్టర్ల కోర్సు ఉంటుందని అన్నారు. మొదటి సెమిస్టర్‌కు జీవీకే సంస్థ ఫీజు చెల్లిస్తుందని, తర్వాత కోర్సులకు జీవీకే ద్వారా బ్యాంకు రుణం పొందవచ్చని తెలిపారు. ప్రారంభంలో రూ.17 వేల వేతనం ఇస్తారని తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత విద్యారుణం వాయిదాలు చెల్లించవచ్చని తెలిపారు. అక్టోబర్ 22న పరీక్ష.. బీఎస్సీలో లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో పాసైనవారు అక్టోబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 22న జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పరీక్ష ఉంటుందని తెలిపారు. అర్హత సాధించిన వారికి నవంబర్ 1 నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 9177140659 నంబర్ లేదా ఠీఠీఠీ.్ఛఝటజీ.జీn వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్ భూమా నాగేందర్, బి.సామ్రాట్ ఉన్నారు. -
విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
l ఉద్యోగాలు కల్పించే దిశలో ఆలోచించాలి l నిట్ డీన్ ప్రొఫెసర్ శర్మ కేయూక్యాంపస్ : విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి చదువుకుంటే ఉన్నతస్థాయికి చేరుకుంటారని వరంగల్ నిట్ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ ఎన్ఐఎన్ఎన్ శర్మ అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యూకేషన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సేనేట్ హాల్లో ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శర్మ మాట్లాడారు. విద్యార్థులు ఇంజనీరింగ్‌లో సృజనాత్మకతతో స్వతంత్రంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా చదువుకోవాల న్నారు. విద్యార్థులు కంపెనీ స్థాపించి పలువురికి ఉద్యోగులు కల్పించేస్థాయికి ఎదగాలని, అందుకు ఇప్పటినుంచే కృషిచేయాలన్నారు. కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ మా ట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కి ల్స్ పెంపొందించుకోవాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ లేదన్నారు. కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా పెంపొందించుకోవాలన్నారు. క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. కొందరు విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాలుపొందారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఆర్.మేఘనరావు, వి.మహేందర్, పి.సంతోష్‌కుమార్, ప్రసన్నరాణి, లక్ష్మి, స్వప్న, రమ్య, శ్రీధర్, సూపరింటెం డెంట్ పి.అశోక్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్...
చార్మినార్‌కూ, మదీనాకీ మధ్య గుల్జార్ హౌజ్ అనే కొలను ఉంది. ఇక్కడ ‘హౌజ్’ అంటే ఫౌంటెయిన్ అని అర్థం. హైదరాబాద్ పాలకులు అప్పటి ఇంజనీర్ల సాయంతో ఇలాంటి ఫౌంటెయిన్లు చాలా చోట్ల కట్టించారు. దారి మధ్యలో కట్టించి మరీ నీరు ఉవ్వెత్తున అందంగా ఎగిసేలా చేశారు. అప్పటి ఇంజనీర్లు ఏదో కొన్ని చోట్ల ఇలా హౌజ్‌లు అనే ఫౌంటెయిన్లు కట్టించారేమోగానీ... తమ సంకల్పం లేకుండానే ఈ తరహా ఫౌంటెయిన్లను మన ఆధునిక ఇంజనీర్లూ ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్లు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కవర్స్‌ను ఏర్పాటు చేస్తే... అవి ఆటోమేటిగ్గా గుల్జార్ హౌజ్ లాంటి ఫౌంటెయిన్లుగా రూపుదిద్దుకున్నాయి. తేడా అల్లా ఒక్కటే. గుల్జార్ హౌజ్ ఫౌంటెయిన్ వర్షం కురిసినా, కురవకపోయినా నీళ్లు చిమ్మదు. కానీ మన ఆధునిక ఇంజనీర్లు డ్రైనేజీ కోసం కట్టించిన హౌస్‌లు... అదే ఫౌంటెయిన్లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు చిమ్ముతాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే... వాళ్ల ప్రమేయం లేకుండానే వాళ్లు ఇంకో ఘనమైన రికార్డునూ సాధించారు. అదేమిటంటే... ఈ డ్రైనేజీ ఫౌంటెయిన్‌పై ఉండే మ్యాన్‌హోల్ కవర్‌కు నాట్యం నేర్పడం! వర్షం కురిసి డ్రైనేజీ పొంగడం మొదలుపెట్టగానే మ్యాన్‌హోల్ హౌజ్ అదే ఫౌంటెయిన్‌పై నల్లటి లోహచంద్రుడి షేపులో గుండ్రంగా ఉంటే ఇనుపచక్రం కింద నుంచి ఉవ్వెత్తున పొంగి వచ్చే నీళ్ల తాకిడికి డ్యాన్స్ చేస్తుంటుంది. వర్షం వేళ మ్యాన్‌హోల్‌పై ఉండే సదరు గుండ్రని ఇనుప కవరు మూతకు ఆనకుండా చిత్తడిలో ఇత్తడి పళ్లెంలా అటూ ఇటూ కదుల్తూ డ్యాన్స్ చేస్తుంటే... డ్యాన్స్ అంటే ఆసక్తి లేనివారైనా సరే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇలా మ్యాన్‌హోల్ పైచక్రానికి మణిపురి... డ్రైనేజీపై ఉండే కవర్‌కి కూచిపూడి నేర్పడం అలనాటి ఏ ఇంజనీర్‌కు సాధ్యమైంది చెప్పండి! సాక్షాత్తూ అప్పటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైతం తాను డిజైన్ చేసిన... మ్యాన్‌హోల్ మూతకూ డ్యాన్సు నేర్పలేకపోయేవాడు. కాబట్టి అలనాటి మోక్షగుండం వంటి ఇంజనీర్ల కంటే ఇప్పటి జలగండం ఇంజనీర్లే గ్రేట్ అని నా అభిప్రాయం. అలనాటి ఇంజనీర్లు మరో అద్భుతం సాధించారట. గోల్కొండ కోట ఎంట్రన్స్‌లో చప్పట్లు కొడితే ఎక్కడో కొండపైన కోట చివర ఉండే నవాబుగారికి వినిపిస్తుందట. అదేదో గొప్ప అనుకుంటున్నారుగానీ... ఇప్పడు మనం అడ్వాన్స్డ్ అంటూ పేర్కొంటున్న వైర్లెస్ లాంటిదే కదా ఇది. పైగా వాళ్లేదో ఒక్క కోటలోనే ఈ ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనం ప్రతి బస్సులోనూ చేసుకున్న ఏర్పాటే కదా ఇది. టికెట్ల కట్టలు ఉండే హోల్డరుతో కండక్టరు ఒక్క దెబ్బ కొడితే బస్సు ఆగుతుంది. అదే రెండో మూడో దెబ్బలు కొడితే అది బయల్దేరుతుంది. ఇలా ఓ మాటా-ముచ్చటా లేకుండా కేవలం లోహపు చప్పట్లతోనే డ్రైవర్‌కూ, కండక్టర్‌కూ కమ్యూనికేషన్ నడుస్తుంటుంది. ఇది కూడా వైర్లెస్సే. మరి వైర్లతో జరిగే కమ్యూనికేషన్ కంటే వైర్‌లెస్‌లు మరింత అభివృద్ధి చెందినవైనప్పుడూ... రోజూ బస్సుల్లో జరిగే ఈ సమాచార వినిమయాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి! అందుకే... మనం రోజువారీ ఉపయోగించుకునే టెక్నాలజీ విషయం నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే నిరభ్యంతరంగా మన సిటీ మరింత అడ్వాన్స్డే. అటు డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్స్ అయినా... ఇటు టాక్లెస్ టికెట్ హోల్డర్ అయినా! -
ఐఐటీల్లో ఒత్తిడి అనేది అపోహ మాత్రమే..
దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశ ప్రక్రియ మొదలైంది. త్వరలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుంది. ఇప్పటివరకు ఐఐటీల్లో ప్రవేశానికి అవసరమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కోసం అహర్నిశలు కృషి చేసి.. లక్ష్యం చేరుకున్న విద్యార్థులు.. అసలైన కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో కొంత మానసిక ఆందోళన, మరికొంత బిడియం సహజం. అలాంటి వాటిని దూరం చేసుకోవాలని.. అందుకు ఐఐటీలు కూడా చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొంటున్నారు ఐఐటీ-చెన్నై డెరైక్టర్, భాస్కర్ రామమూర్తి. ఐఐటీ-చెన్నైలో 1980లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన.. రామమూర్తి తాను చదివిన ఇన్స్టిట్యూట్కే డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. నేటి ఇంజనీరింగ్ విద్యా విధానం.. ఐఐటీల్లో కొత్తగా అడుగుపెట్టనున్న విద్యార్థులకు సలహాలు.. ఐఐటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ముందంజలో నిలవడానికి చేపట్టాల్సిన చర్యలు.. తదితర అంశాలపై ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఐఐటీల్లో కొత్త విద్యార్థులు ఇబ్బందిగా భావించే అంశాలేవి? ఐఐటీల్లో అడుగుపెట్టే విద్యార్థుల విషయంలో ప్రధాన సమస్య.. మానసిక ఆందోళన. ఐఐటీల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో.. సీనియర్లు, ఇతర సహచరులు ఎలా ఉంటారో అనే సందేహాలతో బిడియంగా ఉంటారు. కానీ.. బయట అనుకుంటున్నట్లు ఐఐటీల్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. పైగా.. విభిన్న పరిస్థితులు, అకడెమిక్ నేపథ్యాల నుంచి వచ్చిన కొత్త విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త విద్యార్థుల విషయంలో ఐఐటీలకు ఎదురవుతున్న సవాళ్లు? ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్సడ్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. దాంతో విద్యార్థులు తాము పొందిన ర్యాంకుకు సీటు లభించిన బ్రాంచ్‌లో అడుగుపెడతారు. వాస్తవానికి వారి అభిరుచి గల బ్రాంచ్ వేరే ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏ బ్రాంచ్‌లో చేరిన విద్యార్థినైనా.. సదరు బ్రాంచ్‌కు సరితూగేలా తీర్చిదిద్దడమే ఐఐటీలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య. అందుకే.. ప్రతి ఐఐటీ మొదటి ఏడాది అకడెమిక్స్‌తోపాటు ఇలాంటి అంశాలపైనా ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఫలితంగా నాలుగేళ్ల వ్యవధిలో ఎలాంటి ఆందోళన లేకుండా విద్యార్థి కోర్సును పూర్తిచేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నేటి మన ఇంజనీరింగ్ విద్యా విధానంపై మీ అభిప్రాయం? నేటి ఇంజనీరింగ్ విద్యలో అధిక శాతం ఐటీ రంగం లక్ష్యంగా ఉండటం బాధాకరం. ఈ కారణంగా డొమైన్ నాలెడ్జ్, కోర్ స్కిల్స్‌కు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. చాలామంది ఐటీ రంగంలో కెరీర్‌నే ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది ఇన్స్టిట్యూట్లకు బోధనపరంగా కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఒకే తరగతిలో ఐటీ, నాన్-ఐటీ లక్ష్యంగా రెండు రకాల విద్యార్థులుంటున్నారు. దాంతో భవిష్యత్తులో కోర్ ఇండస్ట్రీస్‌లో రాణించాలనుకునే విద్యార్థులను గుర్తించి నైపుణ్యాలు అందించడం కష్టంగా మారుతోంది. బోధనపరంగా ఐఐటీ - చెన్నై ఎలాంటి విధానాలు అవలంబిస్తోంది? ప్రాథమిక అంశాలపై పట్టు, ఆసక్తి ఉంటే.. భవిష్యత్తులో అవి ఎన్నో ఆవిష్కరణలకు మార్గం చూపుతాయి. అందుకే ప్రతి సబ్జెక్ట్‌లోనూ విద్యార్థి సొంత ఆలోచనలను వెలికితీసేలా బేసిక్స్ బోధనకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. అన్ని కాన్సెప్ట్స్‌ను తాజా పరిణామాల కు అన్వయించేలా అప్లైడ్ టీచింగ్ మెథడాలజీని అమలు చేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే.. భవిష్యత్తులో ఉద్యోగం, పరిశోధన, ఉపాధి.. ఇలా ఏదైనా సొంతంగా ఆలోచించేలా చేయడమే! ఇందుకోసం నిరంతరం కరిక్యులంలో మార్పులు చేస్తున్నాం. క్రమం తప్పకుండా ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో పరిశోధనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. ఇంజనీరింగ్‌లో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సుల ఆవశ్యకత ఉందా? కచ్చితంగా ఉంది! నేడు మన ముందు ఆవిష్కృతమవుతున్న ఉత్పత్తులు.. మెటీరియల్ సైన్స్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్.. ఇలా ఎన్నో విభాగాల సమష్టి కృషితో సాధ్యమవుతున్నవే. కాబట్టి విద్యార్థులకు ఒక ప్రొడక్ట్ ఆవిష్కరణ వెనుక సమ్మిళితమైన వివిధ విభాగాల గురించి తెలియాలి. లేకుంటే.. విద్యార్థులు కొత్త ఆలోచనలు, కొత్త సాంకేతిక అంశాలపై పరిజ్ఞానాన్ని పొందలేరు. అదేవిధంగా హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ గురించి కూడా తెలిసుండాలి. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, సేవల అంతిమ లక్ష్యం సమాజ అవసరాలను తీర్చడమే. అందువల్ల ఒక నిర్దిష్ట ఉత్పత్తికి సంబంధించి లక్షిత ప్రజల అవసరాలపై అవగాహన తప్పనిసరి. అందుకే ఐఐటీలు కూడా హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులను బోధిస్తున్నాయి. ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరత ఉందని, అది ఆర్ అండ్ డీపైనా ప్రభావం చూపుతోందంటున్నారు? ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్న మాట వాస్తవం. ఐఐటీ క్యాంపస్‌ల సంఖ్య పెంచడంతో ఈ సమస్య కూడా పెరిగింది. దీనికి పరిష్కారం.. విదేశీ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో మాదిరిగా ఆకర్షణీయ వేతనాలు, సదుపాయాలు కల్పించడమే! తద్వారా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లభిస్తారు. ప్రస్తుతం అన్ని ఐఐటీలు బీటెక్ స్థాయిలోనే రీసెర్చ్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాయి. ఐఐటీ-చెన్నై ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఐఐటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవాలంటే? ప్రధానంగా రెండు ప్రామాణికాలు.. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్యను సర్వే మెథడాలజీ నుంచి తొలగించాలి. అలాచేస్తే ఐఐటీలు కచ్చితంగా టాప్-50కి సమీపంలో నిలవడం ఖాయం. ఇప్పటికే సబ్జెక్ట్ పరమైన ర్యాంకుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో టాప్-50 నుంచి 70 జాబితాలో నిలుస్తున్నాయి. రీసెర్చ్ అంశాలపై మరింత దృష్టిసారిస్తే రాబోయే పదేళ్లలోపే టాప్-30లో ఉంటాయి. ఐఐటీల్లో, ఇతర సంస్థల్లో చేరే కొత్త విద్యార్థులకు మీరిచ్చే సలహా? ఐఐటీలు.. విద్యార్థులకు చక్కటి అధ్యయన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. కేవలం అధ్యాపకులే కాకుండా సీనియర్లు, పూర్వ విద్యార్థులు కూడా ఫ్రెషర్స్‌కు సహకరిస్తున్నారు. వీటిని అందిపుచ్చుకోవాలి. నాలుగైదేళ్ల వ్యవధిలో తమను తాము సమాజ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి. ఐఐటీల్లో సీట్లు రాని విద్యార్థులు ఆ నిరుత్సాహాన్ని వీలైనంత త్వరగా విడనాడాలి. ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ ఉంటుంది. కానీ ఐఐటీల్లో సీట్ల పరిమితి కారణంగా అందరికీ సీటు సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. కష్టపడి చదివి అద్భుత విజయాలు సొంతం చేసుకోవాలి!! ‘‘ఇంజనీరింగ్‌లో క్రేజీ, నాన్-క్రేజీ అనే దృక్పథంతో ఆలోచించడమే పొరపాటు. ప్రతి బ్రాంచ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. నచ్చిన బ్రాంచ్‌లో సీటు లభించని విద్యార్థులు.. నిరుత్సాహపడకుండా సదరు బ్రాంచ్‌లో నిష్ణాతులయ్యేందుకు కృషి చేయాలి. అప్పుడు అవకాశాల గురించి ఆందోళన చెందాల్సిన పనిఉండదు’’ -
గ్రహణ శక్తి, తార్కిక విశ్లేషణ పరీక్ష.. అడ్వాన్స్డ్
జేఈఈ-మెయిన్ చివరి దశకు చేరుకుంది. మెయిన్‌లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ప్రతిభ చూపిన లక్షా యాభై వేల మంది విద్యార్థులకు మాత్రమేప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం దక్కుతుంది.. మే 25న నిర్వహించే అడ్వాన్స్‌డ్‌కు ఐదు వారాలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో మెయిన్ నుంచి అడ్వాన్స్డ్ దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు.. మ్యాథమెటిక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 40 రోజుల సమయాన్ని టాపిక్‌వైజ్ ప్రిపరేషన్, గ్రాండ్‌టెస్ట్ రాసే విధంగా విభజించుకోవాలి. ఇందులో మొదటి 20 రోజులు టాపిక్‌వైజ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. తర్వాతి సమయాన్ని గ్రాండ్‌టెస్ట్‌లు, మాక్‌టెస్ట్‌లు రాయడానికి వినియోగించుకోవాలి. ముందుగా సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలు, ఫార్ములాలపై దృష్టి సారించాలి. తర్వాత ఒక స్థాయి (లెవల్-1) సమస్యలను సాధించే ప్రయత్నం చేయాలి. అటుపై అప్లికేషన్ ఓరియెంటెడ్ సమస్యలను సాధించడం ప్రయోజనకరం.సిలబస్ పరంగా కూడా కొద్ది తేడా ఉంటుంది. మెయిన్‌లో ఉండే స్టాటిస్టిక్స్ (మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్), మ్యాథమెటిక్ రీజనింగ్/లాజిక్, సెట్స్ అండ్ రిలేషన్స్ చాప్టర్లు అడ్వాన్స్‌డ్‌లో ఉండవు. లాగరిథమ్, వెక్టార్ ఆల్జీబ్రా, జియోమెట్రికల్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ నెంబర్, జియోమెట్రికల్ ఇంటర్‌ప్రిటేషన్ చాప్టర్లు చాలా కీలకమైనవి. ఎంసెట్‌లో ప్రశ్నలు నేరుగా (డెరైక్ట్‌గా) ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు మాత్రం మిక్స్డ్ కాన్సెప్ట్స్ ఆధారితం. అడ్వాన్స్‌డ్‌లో భావనల (ఇౌఛ్ఛిఞ్టట)పై ఆధారపడి ప్రశ్నలు ఉంటాయి. సూత్రాలపై కాదు. అయినప్పటికీ.. ఉమ్మడి సూత్రాల (ఇౌఝఝౌ జౌటఝఠ్చ)ను గుర్తు పెట్టుకోవాలి. కొన్ని ప్రధాన సూత్రాల నిర్మాణంలోని కొంత విషయాన్ని మార్చి (ఛీజీఠ్ఛిటటజ్టీడ) ఫలితాలను అడిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ ఫలితాల అనువర్తనాలను కూడా అడగొచ్చు. సిలబస్‌లోని అంశాల మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని (ఇంటర్ రిలేషన్షిప్), వాటి ప్రాధాన్యతను అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకు కోఆర్డినేట్ జ్యామెట్రీపై అవగాహనకు, సాధనకు ఉపయోగపడే జ్ఞానం, తార్కికత.. కాంప్లెక్స్ నెంబర్ అంశంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రొబబిలిటీ సమస్యలను సాధించాలంటే పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్‌పై పట్టు సాధించాలి. ట్రిగ్నోమెట్రీ సమస్యలను సాధించడానికి ఉపయోగపడే ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతి.. దాదాపు అన్ని అంశాల్లోని సమస్యల సాధనకు ఉపయోగపడుతుంది. పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రొబబిలిటీ చాప్టర్లు చాలా క్లిష్టమైనవి. ప్రాథమిక భావనలను అవగాహన చేసుకోవడం, ఎక్కువ ప్రశ్నలను సాధన చేయ డం ద్వారా ఈ అంశాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. ఫంక్షన్స్, డిఫరెన్షియబిలిటీ, వెక్టార్ అల్జీబ్రా, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్‌పై దృష్టి సారించాలి. అదేవిధంగా ప్రతి టాపిక్కు సంబంధించిన థియరీ పార్ట్‌ను కూడా ప్రిపేర్ కావాలి. ఆయా అంశాలపై అవగాహనను షార్ట్-ఆన్సర్ కొశ్చన్స్, అసెర్షన్-రీజన్ వంటి ప్రశ్నల ద్వారా పరీక్షించుకోవాలి. సబ్జెక్ట్ టైప్ ప్రాబ్లమ్స్‌ను కూడా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ అంశం విషయావగాహనను మరింత పెంచుకోవడానికి దోహదం చేస్తుంది. సాధ్యమైనన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా వేగం, కచ్చితత్వం అలవడతాయి. ఈ సమయంలో ఏదైనా నూతన టాపిక్‌ను ప్రిపేర్ కావడం కంటే..ఇది వరకు చదివిన అంశాన్ని పునశ్చరణ చేసుకోవడం మేలు. సాధారణంగా వేగంగా చేయాలనే ఉద్దేశం, ఒత్తిడితో ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాధానాలను గుర్తించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సిలబస్‌లోని 80 శాతం చాప్టర్లను పక్కాగా ప్రిపేరైతే మెరుగైన స్కోర్ సాధించవచ్చు. రిఫరెన్స్ బుక్స్: Tata mcgrawhillBooks; Cengage Books. -ఎంఎన్ రావు, చైతన్య విద్యా సంస్థలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐఎస్బీ-ధన్‌బాద్ వంటి ప్రాముఖ్యత కలిగిన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ-అడ్వాన్స్డ్. మారిన విధానంలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులకు ఈ పరీక్షకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో.. అడ్వాన్స్డ్ పరీక్ష ప్రతిభావంతులుగా సమరంగా మారింది. దాంతో సీటు దక్కించుకోవాలంటే రెట్టింపు శ్రమించాల్సిన పరిస్థితి. రెండు పేపర్లుగా: జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను రెండు పేపర్లు.. పేపర్-1, పేపర్-2గా ఆబ్జెక్టివ్ విధానంలో ఆఫ్‌లైన్ (పేపర్-పెన్ బేస్డ్)లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. కాల వ్యవధి ప్రతి పేపర్‌కు మూడు గంటలు. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కు ఇస్తారు. ఫిజిక్స్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. మొదటి సంవత్సరం సిలబస్ నుంచి మెకానిక్స్‌కు, రెండో సంవత్సరం సిలబస్ నుంచి ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం చాప్టర్లకు ప్రాధాన్యత లభిస్తోంది. వివిధ చాప్టర్లకు సంబంధించి కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. మల్టి కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలను సాధించాలంటే.. సర్ఫేస్ టెన్షన్, ఎలాస్టిసిటీ వంటి చిన్న అంశాలను సైతం వదలకుండా అన్ని చాప్టర్లకు సంబంధించి ప్రాథమిక భావనలు, సూత్రాలపై పట్టు సాధించాలి. ఫిజిక్స్‌లో సాధారణంగా వివిధ చాప్టర్లకు మధ్య సహసంబంధం ఉండే ప్రశ్నలను ఎక్కువగా అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ తీసుకుని..దాన్ని వివిధ చాప్టర్లకు సరిపోయే విధంగా రూపొందించుకోవాలి. ఉదాహరణకు మెకానిక్స్ తీసుకుంటే ఇందులో చాలా సమస్యలు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మొమెంటమ్, న్యూటన్ రెండో సూత్రానికి సంబంధించినవై ఉంటాయి. అదేవిధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్‌కు కూడా చాలా వరకు ఇతర చాప్టర్లతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అడ్వాన్స్డ్ సిలబస్‌తో పోల్చితే ఇంటర్మీడియెట్ సిలబస్‌లో ఆర్సీ, ఆర్ఎల్ సర్క్యూట్స్ టాపిక్స్ లేవు. కాబట్టి ఈ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి సారించాలి. ఎలక్ట్రిసిటీ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్‌ను సాధించేటప్పుడు రెసిస్టర్ పాత్ర, కెపాసిటర్, ఇండక్టర్ (ఏసీ, డీసీ) వంటి అంశాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఆర్సీ, ఆర్ఎల్ సర్క్యూట్స్‌కు సంబంధించి కెపాసిటర్ ప్రాథమిక విధులు, వివిధ పరిస్థితుల్లో ఇండక్టర్ వంటి అంశాలపై అవగాహన తప్పనిసరి.థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లలో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కామన్‌గా ఉంటాయి. ఆప్టిక్స్‌లో మొదట వేవ్ ఆప్టిక్స్‌ను ప్రిపేర్ కావాలి. ఎందుకంటే దీని పరిధి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత జియోమెట్రికల్ ఆప్టిక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతర సబ్జెక్ట్లతో పోల్చితే ప్రిపరేషన్ పరంగా, రివిజన్ పరంగా ఫిజిక్స్‌ను చాలా సులువైన సబ్జెక్ట్‌గా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్ల మధ్య సహ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్‌ను బాగా ప్రిపేర్ అయితే.. ఇందులోని కాన్సెప్ట్స్‌ను కొద్దిపాటి మార్పులతో గ్రావిటేషన్, మాగ్నటిజం చాప్టర్లకు కూడా అన్వయించుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వారానికి కనీసం 3 మాక్ టెస్ట్‌లు రాయాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకుని బలహీనంగా ఉన్న చాప్టర్లపై ఎక్కువగా దృష్టి సారించాలి. మరో కీలక విషయం.. ఈ సమయంలో కొత్త అంశాలు చదవడం కంటే ఇదివరకు ప్రిపేర్ అయిన వాటిని పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం. రిఫరెన్స్ బుక్స్: Concepts of Physics (Vol. I and II) H.C.Varma. Problems in General Physics I.E. Irdov. For practice questions: Cengage Learning’s Exam Crack Series -డాక్టర్ రామకృష్ణ, ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్. జనరల్ టిప్స్ విద్యార్థి గ్రహణ శక్తి, తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ మెయిన్ ప్రిపరేషన్ సరిపోతుంది. ఆ ప్రిపరేషన్‌ను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో కొనసాగించాలి. {పతి చాప్టర్లోని సూత్రాలను, ముఖ్యమైన అంశాలను నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. వాటిని కూడా పాయింటర్ అప్రోచ్‌లో రూపొందించుకోవాలి. భావనల ఆధారంగా ప్రశ్నను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. టాపిక్ పూర్తయిన వెంటనే సంబంధిత టాపిక్‌పై రోజుకు కనీసం 50 నుంచి 100 ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయ పరిమితి విధించుకోవాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో ఒక చాప్టర్ నుంచి ఏ ప్రశ్నలు, ఏ విధంగా అడుగుతున్నారో పరిశీలించాలి. {పస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వారానికి రెండు మోడల్ టెస్ట్‌లు రాయాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. జేఈఈ-అడ్వాన్స్డ్ సమాచారం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 4, 2014 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 9, 2014 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 12, 2014 పరీక్ష తేదీ: మే 25, 2014 (ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా) వివరాలకు: http://jeeadv.iitd.ac.in కెమిస్ట్రీ ఈ విభాగంలో 60 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసినా మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు (more than one answer)ఉండే ప్రశ్నలు అడుగుతున్నా రు. దీని వల్ల విద్యార్థులు అన్ని ఆప్షన్స్ (option)చదివి సమాధానం రాయాల్సి వస్తోంది. అంతేకాకుండా రుణాత్మక (నెగిటివ్) మార్కులు ఉండటం వల్ల మార్కులు తగ్గి మంచి ర్యాంకు రాకపోవచ్చు. కెమిస్ట్రీలో అకర్బన, కర్బన, భౌతిక రసాయ శాస్త్రాలు అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. వీటిల్లో అకర్బన రసాయన శాస్త్రం నుంచి సుమారుగా 30 శాతం ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ భాగం నుంచే అడిగే ప్రశ్నల స్థాయి కూడా పెరిగింది. కాబట్టి ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేస్తూ, అందులోని అంశాలకు సంబంధించిన పట్టికలు రూపొందించుకొని ప్రిపరేషన్ సాగించాలి. అకర్బన రసాయన శాస్త్రంలో ఞ-block, d-block, Complex compounds, Metallurgy (Practical Inorganic Chemistry) Qualitative Analysis అంశాలకు సంబంధించిన ప్రశ్నలు బాగా అభ్యసనం చేయాలి. కర్బన రసాయన శాస్త్రం నుంచి సుమారుగా 35 శా తం ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో మార్కులు తెచ్చుకోవడం కూడా కొంచెం సులువే. Mechani-sm, Reagents Intermediates, Electron displacements applicationవంటి అంశాలపై బాగా దృష్టి సారించాలి. Named reactionsకు సంబంధించి Mechanism, Exceptional cases వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. Alkenes, Alcohol, Carbonyl compounds, Amines, Aromatic compoundsMýS సంబంధించి Sequence reactions బాగా నేర్చుకోవాలి. భౌతిక రసాయన శాస్త్రం నుంచి 35 నుంచి 40 శాతం ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక అంశాలతో పాటు, ఫార్ములాలు నేర్చుకోవడమే కాకుండా మల్టి కాన్సెఫ్ట్యూవల్ (కఠ్టజీ ఛిౌఛ్ఛిఞ్టఠ్చ)ప్రశ్నలను బాగా సాధన చేయాలి. పరమాణు నిర్మాణం, రసాయన బంధం, వాయుస్థితి అంశాల నుంచి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతున్నారు. Electro Chemistry, Thermody-namics, Equilibrium, Solutions, Stoichi-ometry అంశాల నుంచి మల్టి కాన్సెఫ్ట్యూవల్ (Mu-lti conceptual) ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలోని ఉంచుకుని సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి. KineticsÌZ order, Half life period, 1st order Kinetics బాగా ప్రాక్టీస్ చేయాలి. పిపరేషన్కు రోజుకు నాలుగు గంటలు కేటాయించాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేలా సన్నద్ధం కావాలి. గత ప్రశ్నపత్రాలు, వాటిలోని ముఖ్యమైన అంశాలను ఒక దగ్గర రాసుకొని సాధన చేయాలి. పరీక్షకు సుమారుగా 40 రోజులు వ్యవధి ఉంది. ఇందులో 10 రోజులు ఇనార్గానిక్ కెమిస్ట్రీ, 10 రోజులు ఫిజికల్ కెమిస్ట్రీ, 10 రోజులు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలి. మిగిలిన 10 రోజులు గత ప్రశ్నపత్రాలు బాగా సాధన చేయాలి. సాధ్యమైనన్ని మాదిరి పరీక్షలు రాస్తూ, తప్పు-ఒప్పులను విశ్లేషణ చేస్తూ అధ్యయనం చేయాలి. పిపరేషన్లో ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవాలి. అంతేకానీ ఎక్కువ పుస్తకాలను ఒకసారి చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రిఫరెన్స్ బుక్స్: 11, 12వ తరగతుల కెమిస్ట్రీ పుస్తకాలు ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ బుక్స్ -టి. కృష్ణ, డాక్టర్ ఆర్కే క్లాసెస్, హైదరాబాద్.