రూ. 10కే హెయిర్‌ కటింగ్‌.. 4 గంటలు వేచి ఉంటున్న జనం! | Advanced Hair Cut for Just RS 10 | Sakshi
Sakshi News home page

రూ. 10కే హెయిర్‌ కటింగ్‌.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!

Published Sun, May 5 2024 9:56 AM | Last Updated on Sun, May 5 2024 11:07 AM

Advanced Hair Cut for Just RS 10

హెయిర్‌ కంటింగ్‌ అనేది అటు పురుషులకు, ఇటు అందంగా కనిపించాలనుకునే మగువలకు తప్పనిసరి. కొందరు ఫ్యాషన్‌తో కూడిన హెయిర్‌ కటింగ్‌ కోసం పలు సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి హెయిర్‌ కంటింగ్‌ ఎక్కడైనా రూ. 10కే చేస్తున్నారని తెలిస్తే జనం క్యూ కట్టకుండా ఉండలేరు.  

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ది హెయిర్ స్టోరీ పేరుతో ఓ నూతన సెలూన్‌ ప్రారంభమయ్యింది. ఇక్కడ మే నెల అంతటా పురుషులు, మహిళలు అనే బేధం లేకుండా అందరికీ అడ్వాన్స్ హెయిర్ కటింగ్ కేవలం రూ. 10కే చేస్తున్నారు.

ఈ సందర్భంగా ది హెయిర్ స్టోరీ డైరెక్టర్ సన్నీ జైస్వాల్  మీడియాతో మాట్లాడుతూ ఇది కొత్త సెలూన్  అయినందున ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని, ప్రకటనలు, మార్కెటింగ్‌ కోసం లక్షలు ఖర్చు చేయడం కంటే  ఆఫర్‌లను అందించడం ఉత్తమమని ఆయన తెలిపారు.

పురుషులకు రూ. 200, స్త్రీలకు 350 విలువైన హెయిర్‌ కంటింగ్‌ సర్వీస్‌ను రూ. 10కే అందిస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ఆఫర్‌ చూసి, ప్రతీరోజూ వందమందికిపైగా జనం వస్తున్నారని, మా సెలూన్‌లో హెయిర్‌ డ్రెస్సర్లుగా నలుగురు యువకులు, ఆరుగురు యువతులు పనిచేస్తున్నారని సన్నీ తెలిపారు.  ఇక్కడికి వచ్చే జనం తమ హెయిర్‌ కటింగ్‌ కోసం నాలుగు గంటలకుపైగా సమయం వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement