just
-
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
హెయిర్ కంటింగ్ అనేది అటు పురుషులకు, ఇటు అందంగా కనిపించాలనుకునే మగువలకు తప్పనిసరి. కొందరు ఫ్యాషన్‌తో కూడిన హెయిర్ కటింగ్ కోసం పలు సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి హెయిర్ కంటింగ్ ఎక్కడైనా రూ. 10కే చేస్తున్నారని తెలిస్తే జనం క్యూ కట్టకుండా ఉండలేరు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ది హెయిర్ స్టోరీ పేరుతో ఓ నూతన సెలూన్ ప్రారంభమయ్యింది. ఇక్కడ మే నెల అంతటా పురుషులు, మహిళలు అనే బేధం లేకుండా అందరికీ అడ్వాన్స్ హెయిర్ కటింగ్ కేవలం రూ. 10కే చేస్తున్నారు.ఈ సందర్భంగా ది హెయిర్ స్టోరీ డైరెక్టర్ సన్నీ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇది కొత్త సెలూన్ అయినందున ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని, ప్రకటనలు, మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు చేయడం కంటే ఆఫర్లను అందించడం ఉత్తమమని ఆయన తెలిపారు.పురుషులకు రూ. 200, స్త్రీలకు 350 విలువైన హెయిర్ కంటింగ్ సర్వీస్‌ను రూ. 10కే అందిస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ఆఫర్ చూసి, ప్రతీరోజూ వందమందికిపైగా జనం వస్తున్నారని, మా సెలూన్లో హెయిర్ డ్రెస్సర్లుగా నలుగురు యువకులు, ఆరుగురు యువతులు పనిచేస్తున్నారని సన్నీ తెలిపారు. ఇక్కడికి వచ్చే జనం తమ హెయిర్ కటింగ్ కోసం నాలుగు గంటలకుపైగా సమయం వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. -
ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్: నలభైలలో ఆ మదర్స్..!
చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు.. నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్‌లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్‌కి చెందిన మోనికా లధాలు.. ముగ్గుర మదర్స్‌లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్‌లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్‌లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్‌గా కెరీర్‌ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్‌కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్. ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి. (చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!) -
నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా?
తూర్పుపాలెంలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా కానరాని జాగ్రత్త మలికిపురం (రాజోలు) : సమయం : బుధవారం ఉదయం 11 గంటలు స్థలం : తూర్పుపాలెం గ్రామం, కే డబ్ల్యూ 17 జడ్ ఓఎన్జీసీ సైట్ .. ఉన్నట్టుండి డ్రిల్లింగ్ జరిగిన బావి నుంచి అకస్మాత్తుగా భారీ గ్యాస్, ఆయిల్ పెల్లుబికింది. గ్యాస్ కిలో మీటరు మేర ఆవరించింది. సిబ్బంది, ఇంజినీర్లు కూడా తొలుత పరుగులు పెట్టారు.సమీపంలోని జీసీఎస్ ( గ్యాస్ గేదరింగ్ స్టేషన్)ల నుంచి సుమారు 200 మంది సిబ్బంది, నాలుగు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. అరగంట గడిచాక గ్యాస్ తొలగింది. కాసేపు తేరుకున్న సిబ్బంది, కంటికి సంఘటన స్థలం కనిపిస్తుండడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో సంఘటన బావి వద్దకు చేరుకున్నారు. ఒక ఓఎన్జీసీ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇక్కడ అత్యంత భయంకర వాతావరణం నెలకొంది. ఆయిల్, గ్యాస్ ఆవరించి ఉంది. ఇక్కడే మరో మూడు గ్యాస్ ఆయిల్, బావులు ఉన్నాయి. ఫొటోలు తీస్తే ఆ ఫ్లాష్ తీవ్రతకు ఫైర్ అయితే పెను ప్రమాదం సంభవిస్తుందని స్థానిక విలేకరులను, గ్రామస్తులను హెచ్చరించారు. ప్రమాద తీవ్రత ఏంటో చెప్పకనే అర్థమవుతోంది. దీనికి కారణం ఎవరు. ఇక్కడ జీవిస్తున్న ప్రజలదా? భద్రత లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయిల్ సంస్థలదా? ఇలాంటి అనేక సంఘటనలు ప్రాణాలను హరించి వేస్తున్నాయి. 1990 ప్రాంతంలో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లోఅవుట్, 1995లో కొత్త పేట మండలం దేవర పల్లి బ్లోఅవుట్, 2014లో నగరం పైప్ లైన్ పేలుడు, సహా అనేక సంఘటనలు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. మూడే ళ్ల క్రితం రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రెండేళ్ల క్రితం రాజోలు మండలంలో కాట్రేని పాడు బావి బ్లోఅవుట్ కొద్దిపాటిలో తప్పింది. కేజీ బేసిన్లోఉమారు 11 వందల బావులు, మొత్తం 900 కిలో మీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. బావులు కోనసీమలోనే అధికం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకూ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం బావులను, గెయిల్ పైప్లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కానీ కేజీ బేసిన్లో ఈ బావుల, పైప్లైన్ల నిర్వహణ సక్రమంగాలేదు. అంతా నిర్లక్ష్యం .. బావులు, గ్యాస్ పైప్‌లను తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడయి పోతున్నా వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు పెట్టుబడి పెట్టడం లేదు. నాణ్యత లోపం .. ఆయిల్ బావుల పర్యవేక్షణ, పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వీటి నిర్వహణ, నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దోపిడీయే తప్ప అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రేవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల వల్ల దెబ్బతింటున్న రోడ్లను కూడా ప్రభుత్వమే నిర్మించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సమద్రం నుంచి ఉప్పు నీరు భూబాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది. -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది. -
ఫోన్ పోయిందా? గూగుల్ లో వెతకండి!
మీ ఫోన్ పోగొట్టుకున్నారా? ఎవరైనా దొంగిలించారా? ఇకపై ఫోన్ ఆచూకీ తెలుసుకోవడానికి కష్టపడాల్సిన పని లేదంటోంది ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకోసం 'ఫైండ్ యువర్ ఫోన్' పేరున కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఈ సదుపాయంతో వినియోగదారులు కేవలం గూగుల్ సెర్స్ లో 'ఐ లాస్ట్ మై ఫోన్' అని టైప్ చేసి ప్రత్యేక సర్వీసును పొందొచ్చని సంస్థ వెల్లడించింది. గూగుల్ మై అకౌంట్ లో ఉండే ఫైండ్ యువర్ ఫోన్ ఫీచర్... ఐఫోన్ పోగొట్టుకున్నవారికి సహాయపడుతుందని, అయితే ఇంతకు ముందే 'యాపిల్ ఐ క్లౌడ్' లో ఉన్న 'ఫైండ్ మై ఐ ఫోన్' కు ఉన్న సామర్థ్యం ఈ 'ఫైండ్ యువర్ ఫోన్' లో లేదని గూగుల్ చెప్తోంది. తాము కొత్తగా ప్రవేశ పెట్టే ఫైండ్ యువర్ ఫోన్ వినియోగించుకోవాలనుకున్నవారు గూగుల్ ఖాతాలో సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ యాండ్రాయిడ్, ఐ ఫోన్, టాబ్లెట్ల జాబితా తో పాటు.. పోయిన ఫోన్ మీ సొంతం అయితే 'ఫైండ్ అండ్ లాక్' ఆప్షన్ చూపిస్తుందని దాంతో మీ ఫోన్ లాక్ చేసి అనంతరం వెతికేందుకు స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాల్సి ఉంటుందని గూగుల్ చెప్తోంది. కాగా ఈ ఫీచర్ జీ మెయిల్, గూగుల్ ఫోటో వినియోగదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే..యాండ్రాయిడ్ వినియోగదారులకు కూడ అవే ఐదు ఆప్షన్లు కనిపిస్తాయని, వారు మాత్రం లాక్ స్క్రీన్ పాస్ వర్డ్ సెట్ చేసుకున్నట్లే ముందుగానే ఫోన్లో పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చని, అలా కాని పద్ధతిలో ఫోన్ పోయిన తర్వాత కూడ ఫోన్ కు నోట్ పంపే అవకాశం ఉందని చెప్తోంది. ఫోన్ కు పేజ్ నుంచి కాల్ చేయడం వల్ల కూడ యాండ్రాయిడ్ ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉందంటోంది. దీంతోపాటు గూగుల్ మై అకౌంట్ లోకి వెళ్ళేందుకు లేటెస్ట్ వర్షన్స్ లో వాయిస్ ఆప్షన్ ను కూడ చేర్చింది. దీంతో మీకు కావలసిన ఆప్షన్ ను మాటలతోనే ఎంచుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ఆప్షన్ ను ముందుగా ఇంగ్లీష్ భాషలో మాత్రమే ప్రవేశ పెట్టామని, దీంతో ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడాల్సి వస్తుందని తెలిపింది. త్వరలో మిగిలిన భాష్లో కూడ ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది. దీంతోపాటు గూగుల్ వినియోగదారులు త్వరలో తమ పేరును చెప్పి షార్ట్ కట్ ద్వారా అకౌంట్ లోకి ప్రవేశించే సౌకర్యాన్ని కూడ అందుబాటులోకి తేనుంది. -
139 కి డయల్ చేస్తే చాలు..!
న్యూ ఢిల్లీః రైలు ప్రయాణీకులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అనుకోని పరిస్థుతుల్లో ప్రయాణం రద్దు అయినపుడు బుక్ చేసుకున్న టికెట్ ను క్యాన్సిల్ చేసుకునేందుకు చివరి నిమిషంలో పరుగులు తీయాల్సిన పని లేదు. గంటలతరబడి లైన్లో నిలబడాల్సిన అవసరమూ లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తాజాగా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు డయల్ 139 పద్ధతిని కొత్తగా ఆవిష్కరించారు. చివరి నిమిషంలో స్టేషన్ కు వెళ్ళి, క్యూలో నిలబడి ప్రయాస పడాల్సిన అవసరం లేదుకుండా... ప్రయాణీకులు ఫోన్ చేసి, వారి ట్రైన్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ వంటి వివరాలను అందిస్తే చాలు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ప్రయాణీకులు క్యాన్సిల్ చేసిన వెంటనే వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ను... 'పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' (పీఆర్ ఎస్) కౌంటర్ వద్ద సమర్పిస్తే... ప్రయాణీకులు టికెట్ కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాటు చేశారు. క్యాన్సిలేషన్ చార్జీలు భారీగా పడుతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు రైల్వే మంత్రి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు కౌంటర్ వద్దకు వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేయకపోతే భారీ జరిమానా పడే పరిస్థితికి తెరపడనుంది. డయల్ 139 సదుపాయంతో అనుకున్న క్షణంలోనే కాల్ చేస్తే సరిపోతుంది. కాస్త తీరిగ్గా వెళ్ళి ఓటీపీని రిజర్వేషన్ కౌంటర్ లో ఇచ్చి డబ్బును వాపస్ తీసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంతో ఓపక్క డబ్బు పూర్తిశాతం తిరిగి పొందడంతోపాటు... క్యాన్సిలేషన్ ప్రక్రియ కూడ సులభం అయ్యింది. -
ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..!
పది సెంట్లు విలువైన అమెరికన్ 'డైమ్' (నాణెం) ఇప్పుడు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు పలికింది. నాణేల సేకరణే హాబీగా ఉన్నఓ వ్యక్తి ఆ పురాతన నాణేన్ని దక్కించుకునేందుకు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు చెల్లించాడు. అయితే అంత డబ్బు చెల్లించాడంటే అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని ఊహిస్తున్నారు కదూ... అవును మీరు ఊహించింది నిజమే. ఆ నాణెం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అమెరికాకు చెందిన 1894 ఎస్ బార్బర్ డైమ్... ప్రపంచంలోనే అరుదైన నాణెంగా గుర్తింపు కూడా పొందింది. తంపాలోని హెరిటేజ్ ఆక్షన్స్ లో వేలానికి పెట్టిన ఆ నాణెం 1,997 డాలర్లకు అమ్ముడుపోయి వార్తల్లోకెక్కింది. 1804 డాలర్, 1913 లిబర్టీ నికెల్, 1894 ఎస్ బార్బర్ నాణేలు అమెరికన్ నాణేల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన, అరుదైనవిగా గుర్తింపు పొందాయి. అదే విషయాన్ని హెరిటేజ్ ఆక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కో మింట్ అప్పట్లో 2.5 మిలియన్ల డైమ్ లను ముద్రించిందట. అయితే అందులో సుమారు పది నాణేలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. 1893 లో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో కొత్త నాణేల ముద్రణకు డిమాండ్ ఏర్పడింది. దీంతో డైమ్ లను మెల్ల మెల్లగా కరిగించేశారు. అమెరికాలోని ఆక్షన్ హౌస్ లో జనవరి 6 నుంచి 11 వరకు పలు ఆమెరికన్ నాణేలను వేలానికి పెట్టారు. అయితే వీటిలో మిగిలిన అన్ని నాణేలు వందలు, వేల డాలర్లకే అమ్ముడు పోయాయి. ఇంతకు ముందు 2013 లో 1794 కు చెందిన ఓ వెండి డాలర్.. వేలంలో 10.016.875 డాలర్లు పలికి రికార్డు సృష్టించినట్లు కాలిఫోర్నియా.. ఇర్విన్ లోని వేలంపాటదారుడు స్టాక్స్ బౌవర్స్ చెప్తుండగా... ఇప్పుడు ఈ నాణెం సుమారు రెండు మిలియన్ డాలర్ల రేటు పలికి వార్తల్లో నిలిచింది. -
'వారి సమస్యలు న్యాయబద్ధమైనవే’