ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..! | This old dime just sold for $2 million | Sakshi
Sakshi News home page

ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..!

Published Sat, Jan 9 2016 4:13 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..!

ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..!

పది సెంట్లు విలువైన అమెరికన్ 'డైమ్' (నాణెం) ఇప్పుడు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు పలికింది. నాణేల సేకరణే హాబీగా ఉన్నఓ వ్యక్తి ఆ పురాతన నాణేన్ని దక్కించుకునేందుకు ఏకంగా  రెండు మిలియన్ డాలర్లు చెల్లించాడు. అయితే అంత డబ్బు చెల్లించాడంటే అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని ఊహిస్తున్నారు కదూ... అవును మీరు ఊహించింది నిజమే. ఆ నాణెం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అమెరికాకు చెందిన 1894 ఎస్ బార్బర్ డైమ్... ప్రపంచంలోనే అరుదైన నాణెంగా గుర్తింపు కూడా పొందింది.  తంపాలోని హెరిటేజ్ ఆక్షన్స్ లో వేలానికి పెట్టిన ఆ నాణెం  1,997 డాలర్లకు అమ్ముడుపోయి వార్తల్లోకెక్కింది.

1804 డాలర్, 1913 లిబర్టీ నికెల్, 1894 ఎస్ బార్బర్ నాణేలు అమెరికన్ నాణేల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన, అరుదైనవిగా గుర్తింపు పొందాయి. అదే విషయాన్ని హెరిటేజ్ ఆక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కో మింట్ అప్పట్లో 2.5 మిలియన్ల డైమ్ లను ముద్రించిందట. అయితే అందులో సుమారు పది నాణేలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. 1893 లో ఆర్థిక సంక్షోభం  ఏర్పడటంతో కొత్త నాణేల ముద్రణకు డిమాండ్ ఏర్పడింది. దీంతో డైమ్ లను మెల్ల మెల్లగా కరిగించేశారు.

 

అమెరికాలోని ఆక్షన్ హౌస్ లో  జనవరి 6 నుంచి 11 వరకు పలు ఆమెరికన్ నాణేలను వేలానికి పెట్టారు. అయితే వీటిలో మిగిలిన అన్ని నాణేలు వందలు, వేల డాలర్లకే అమ్ముడు పోయాయి. ఇంతకు ముందు 2013 లో 1794 కు చెందిన ఓ వెండి డాలర్.. వేలంలో 10.016.875 డాలర్లు పలికి రికార్డు సృష్టించినట్లు కాలిఫోర్నియా.. ఇర్విన్ లోని వేలంపాటదారుడు స్టాక్స్ బౌవర్స్ చెప్తుండగా... ఇప్పుడు ఈ నాణెం సుమారు రెండు మిలియన్ డాలర్ల రేటు పలికి వార్తల్లో నిలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement