సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.
భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు.
ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం
Comments
Please login to add a commentAdd a comment