sold
-
ఆడ శిశువును విక్రయించిన తల్లి
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం -
Maharastra: ఐదు రోజుల శిశువు విక్రయం.. ఆరుగురు అరెస్ట్
మహారాష్ట్రలోని నాగపూర్‌లో పసికందును లక్ష రూపాయలకు విక్రయించిన ఉదంతం వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.నాగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ స్క్వాడ్ (ఎహెచ్టీఎస్) ఈ శిశువు అక్రమ విక్రయానికి సంబంధించిన కేసును ఛేదించింది. ఈ ఉదంతంలో డబ్బులు తీసుకున్నవారి, ఇచ్చినవారే కాకుండా లావాదేవీకి మధ్యవర్తిత్వం వహించిన మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఆ తల్లిదండ్రులు తమ నవజాత శిశువును సంతానం లేని దంపతులకు విక్రయించారని తెలుస్తోంది. అయితే వారు శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన ప్రక్రియను పాటించలేదు. ఈ ఉదంతంలో పోలీసులు బయలాజికల్ తల్లిదండ్రులతో పాటు, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులను, ఈ డీల్‌కు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులను కూడా అరెస్టు చేశారు.అరెస్టయిన నిందితులను సునీల్ అలియాస్ భోండు దయారామ్ గెండ్రే (31), అతని భార్య శ్వేత (27), పిల్లలు లేని దంపతులను పూర్ణిమ షెల్కే (32), ఆమె భర్త స్నేహదీప్ ధరమ్‌దాస్ షెల్కే (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా థానే జిల్లాలోని బద్లాపూర్‌కు చెందినవారు. వీరికి సహకారం అందించిన మధ్యవర్తులను కిరణ్ ఇంగ్లే (41), ఆమె భర్త ప్రమోద్ ఇంగ్లే (45)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
ఇంటి స్థలం చదరపు మీటర్‌కు 8 రూపాయలే..
భూములు, స్థలాల విలువలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కనీసం వంద గజాల ఇంటి స్థలం కొనాలన్నా.. లక్షలకు లక్షలు కావాల్సిందే. కానీ ఒక చోట మాత్రం ఇంటి స్థలాన్ని చదరపు మీటర్‌కు ఎనిమిది రూపాయల లోపు ధరకే అమ్ముతున్నారు. అంటే రూ.800 పెడితే చాలు.. ఇంటి స్థలం వచ్చేస్తుందన్న మాట. కాకపోతే అలా కొనుక్కోవడానికి మనం స్వీడన్ దాకా వెళ్లాల్సి వస్తుంది మరి. స్వీడన్‌లోని గోటెన్ నగర అధికారులు ఇలా ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌కు 321 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది. పాపులేషన్ తగ్గడం, ఆర్థిక సమస్యలతో.. స్వీడన్‌లోని రూరల్ ప్రాంతమైన గోటెన్ సిటీలో సుమారు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ పాపులేషన్ తగ్గడానికి తోడు సిటీకి కాస్త ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీనితో హౌజింగ్ మార్కెట్‌కు డిమాండ్ పెంచడం కోసం అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలా లను అమ్మకానికి పెట్టినట్టు గోటెన్ సిటీ మేయర్ జోహన్ మాన్సన్ ప్రకటించారు. ఒక చదరపు మీటరుకు ఒక క్రోనా రేటుతో.. మన కరెన్సీలో రూ.7.86 రేటుతో 29 ప్లాట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. -
ఒక్క సినిమా దెబ్బకు కార్యాలయం అమ్మేసిన స్టార్ హీరోయిన్ భర్త!
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బ్యానర్‌ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్‌కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్‌కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు. -
చార్‌ధామ్‌లో భక్తుల నిలువు దోపిడీ
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కేదార్నాథ్ యాత్రలో వ్యాపారుల నిలువు దోపిడీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు కేదార్నాథ్ మార్గంలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా పరిణమించింది.వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లోని ఆహార పదార్థాల ధరలను తెలియజేశాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వివిధ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగానే ఉంటాయి. అయితే చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం భక్తులకు భారంగా మారింది. సాధారణ రోజులలో రూ. 10కి దొరికే టీ రూ. 30కి, రూ. 20కి లభించే వాటర్ బాటిల్ రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే కాఫీ ధరను రూ. 50కి పెంచేశారు. శీతల పానీయాల ధరలను కూడా విపరీతంగా పెంచారు. ఇతర ఆహార పదార్థాల ధరలను కూడా రెట్టింపు చేశారు.ఈ వీడియోలో వ్యాపారులను వివిధ వస్తువుల ధరలను అడిగిన ఆ వ్యక్తి వాటి ధరలు ఎందుకు పెరిగాయో కూడా తెలిపాడు. ఆయా వస్తువులను కింది నుంచి పైకి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపాడు. అయితే వైష్ణోదేవి యాత్రలో ఇంత భారీ ఖర్చులు ఉండవని కూడా పేర్కొన్నాడు. -
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
రూ. 90 వేలకు పసికందు విక్రయం.. కన్నతల్లిని మభ్యపెట్టి..
ఎనిమిది నెలల బాలికను రూ.90 వేలకు విక్రయించిన కేసులో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఆ బాలికను స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్లో ఆ బాలిక తండ్రి రాహుల్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిందని, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నానని పేర్కొన్నాడు. 2023, డిసెంబర్లో తన భార్య తమ ఎనిమిది నెలల కుమార్తె అనన్యతో కలిసి హజారీబాగ్‌లోని పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే 2024, ఫిబ్రవరి 11న తన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తమ కుమార్తె అనన్య కుమారి ఆమెతో లేదని తెలిపాడు. బాలిక తండ్రి రాహుల్ సాహ్ని తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తరువాత.. ఆమెను కుమార్తె గురించి అడిగినప్పుడు.. కొన్ని రోజుల క్రితం రాహుల్ కుమార్ రామ్, రీటా దంపతులు తనను సంప్రదించారని.. వారు నీ భర్త కాలు విరిగిందని, మీ పరిస్థితి బాగోలేదని చెబుతూ , తమ కుమార్తెను వారికిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, భర్త ఆరోగ్యం కుదుటపడ్డాక, కుమార్తెను తిరిగి తీసుకువెళ్లవచ్చని చెప్పడంతో ఆమె కుమార్తెను వారికి అప్పగించిందని తెలిపాడు. తన భార్య తమ కుమార్తె అనన్య కుమారిని రామ్‌ఘర్ టేకర్ స్టాండ్ దగ్గర ఆ దంపతులకు అప్పగించినట్లు రాహుల్ సాహ్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భర్త.. భార్యను మందలించి, రాహుల్ కుమార్, రీటాదేవిలను సంప్రదించగా, వారు తాము ఆ చిన్నారిని రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్ దంపతులకు రూ.90 వేలకు విక్రయించినట్లు తెలిపారు. రాహుల్ కుమార్, రీటా దేవిలు తన భార్యను ప్రలోభపెట్టి, ఆమె వద్ద నుంచి తమ కుమార్తెను తీసుకుని.. రీనా కుమారి, గౌతమ్ కుమార్‌లకు అమ్మేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్‌లు రాహుల్ కుమార్ రామ్‌కు బంధువులు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. అయితే ఆ బాలికను ఆమె తల్లే విక్రయించిందా? లేక ఇతరులు బాలిక పెంపకం సాకు చూపి, ప్రలోభాలకు గురిచేసి విక్రయించారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): పుట్టిన నాలుగురోజులకే ఆడ శిశువును అమ్మేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా చూసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం రంగండ్ల గ్రామానికి చెందిన ఆంగోతుసేవ– జ్యోతి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జ్యోతి గత సంవత్సరం సెపె్టంబర్ 16న నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు ఆడపిల్లలను సాకే స్తోమత లేదని పుట్టిన శిశువును అమ్ముతామని ఆదే ఆస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్ ఈసం వరమ్మకు చెప్పారు. సంతానం లేక ఇబ్బంది పడుతున్న నాంపల్లి మండలం పసునూరుకు చెందిన బత్తుల సైదులు– కవిత దంపతులకు వరమ్మ ఈ విషయాన్ని చేరవేసింది. దీంతో వారు సెస్టెంబర్ 20న సేవ–జ్యోతి దంపతులకు రూ1.50 లక్షలు ఇచ్చి ఆ శిశువును తీసుకెళ్లారు. కాన్పు తర్వాత పాప కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అంగన్వాడీ టీచర్‌కు చెప్పారు. ఆమె చైల్డ్ వెల్ఫేర్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సేవ–జ్యోతి దంపతులతోపాటు, ఆడశిశువును కొన్న సైదులు–కవిత దంపతులు, స్వీపర్ వరమ్మను శుక్రవారం అరెస్టు చేశారు. ఆడశిశువును నల్లగొండలోని శిశుగృహకు తరలించారు. -
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్‌ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్‌లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్‌లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
మహాత్మా గాంధీ వీలునామా ఏ భాషలో రాశారు? ఎంతకు విక్రయమయ్యింది?
దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు? -
ఆశావర్కర్ సహకారంతో.. బిడ్డను విక్రయం..! అంతలోనే..
కామారెడ్డి: అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీ ఈ నెల 3న మగబిడ్డకు జన్మనిచ్చింది. పోషించేస్థాయి లేనందున ఆశావర్కర్ జయ సహకారంతో బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైంది. అదే ప్రాంతానికి చెందిన హుమేరా బేగం, షబానా బేగంలు మగబిడ్డ పుడితే రూ. లక్ష, ఆడబిడ్డ పుడితే రూ. 1.50లక్షలు ఇస్తామని దేవీతో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒకరికి తెలియకుండా మరొకరు రూ. ఐదు వేలు చొప్పున దేవీకి ఇచ్చారు. ఈ నెల 3న నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో షబానా బేగం రూ. 20 వేలు చెల్లించింది. దీంతో పుట్టిన బిడ్డ తనకే కావాలంటూ షబానా బేగం, హుమేరా బేగం నగరంలోని రాధాకృష్ణ థియేటర్వద్ద ఆశావర్కర్ జయతో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పీఎస్‌కు తరలించారు. బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైన తల్లి దేవీని, విక్రయానికి సహకరించిన ఆశా వర్కర్ జయను, కొనుగోలు యత్నించిన హుమేరాబేగం, షబానాబేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర సీఐ నరహరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు అప్సర్, చాందిమి, సుమలత ఉన్నారు. -
హృదయాల్ని కదిలించే ఘటన: మళ్లీ ఆడబిడ్డే! రూ.800 తీసుకుని..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రెండవసారి కూడా కూతురు పుట్టడంతో ఆ తల్లి ఆ నవజాత శిశువుకు రూ.800కు అమ్మేసింది. ఈ విషయం ఆ నవజాత శిశువు తండ్రికి తెలియగానే, అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువును విక్రయించిన ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన మయూర్భంజ్ జిల్లా ఖూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులియా గ్రామంలో చోటుచేసుకుంది. పేదరికంలో మగ్గిపోతున్న ఆ తల్లి రెండవసారి కూడా తనకు కుమార్తెనే పుట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీంతో ఆమె రూ.800కు ఆ శిశువును ఒక దంపతులకు విక్రయించింది. ఈ విషయం తమిళనాడులో ఉంటున్న ఆమె భర్తకు తొలుత తెలియలేదు. తనకు రెండవసారీ కుమార్తెనే పుట్టడంతో ఆ తల్లి ఈ విషయమై ముర్ము అనే వ్యక్తితో చర్చించింది. అతను ఆ నవజాత శిశువును రూ. 800కు విక్రయించేందుకు ఒక దంపతులతో మాట్లాడాడు. ఇంతలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. అతను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను తమిళనాడు నుంచి వచ్చే సరికి తన చిన్న కుమార్తె ఇంటిలో లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్యను ప్రశ్నించగా జరిగిన సంగతంతా తెలిపిందన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో శిశువును విక్రయించినవారు, కొనుగోలు చేసినవారు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: హనీమూన్‌లో భర్తకు షాక్.. సినిమా మధ్యలో భార్య పరార్! -
బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్‌కు రూ.3 కోట్లు!
హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్ రైడర్’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్ బైక్ బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్ బైక్స్‌పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్‌బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్‌రాయ్స్ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్ ఎస్ఎస్100’ మోడల్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ మోటర్ బైక్ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్‌బైక్. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్‌బైక్‌ను నడిపిన వాకర్స్.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్‌కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్‌బైకు మంచి కండిషన్లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్ చెప్పాడు. -
Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మానియానే కనిపిస్తుంది. ప్రభాస్-కృతిసనన్ నటించిన ఈ సినిమా (జూన్ 16) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మూడురోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ అమెరికాలో 'ఆదిపురుష్' తమిళ వెర్షన్ కోసం కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. యూఎస్‌లో 255 థియేటర్లలో మొత్తం 1009 షోలు మొదటిరోజు ప్రదర్శించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి) ఇందులో తెలుగు 552షోలు, హిందీ 436 షోలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. కానీ తమిళ్ వర్షన్‌కు 21 షోలకు గాను కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. ఈ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో కూడా 'ఆదిపురుష్'కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. అక్కడ హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. దీనిని బట్టి వారు సినిమాను వ్యతిరేకిస్తున్నారా? అన్నట్లు ఉంది. ఢిల్లీలో 'ఆదిపురుష్' రేంజ్ మామూలగా లేదు ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్లో 'ఆదిపురుష్' టికెట్ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2200. అక్కడి థియేటర్లో 9.15pm షోకి 'ఆదిపురుష్' (హిందీ) 2D వెర్షన్ చూడాలంటే రూ.2000, చెల్లించాల్సి ఉంది. ఇదే థియేటర్లో 7pm షోకి 3D వెర్షన్ టికెట్ ధర రూ.2250 ఉంది. అంతే కాకుండా బాలీవుడ్లో మొదటిరోజు టిక్కెట్లన్ని సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దీనినిబట్టే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) -
చుక్కలు తాకిన చెక్క కారు ధర - ఎంతో తెలుసా?
Wooden Citroen 2CV: వాహన ప్రపంచం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. ఇందులో భాగంగా అనేక ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ అది ఏ కారు? ఎంత ధరకు అమ్ముడైందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దాదాపు రెండు కోట్లు.. చెక్కతో తయారైన కారు పేరు 'సిట్రోయెన్ 2సీవీ' (Citroen 2CV). చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని 'మిచెల్ రాబిల్లార్డ్' అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు. చాసిస్ కోసం పియర్, యాపిల్ చెట్టును.. బోనెట్ అండ్ బూట్ కోసం చెర్రీ చెట్టుని ఉపయోగించినట్లు తెలిపాడు. ఈ వుడెన్ కారుని తయారు చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. ఈ కారుని రూపొందించడం 2011లో ప్రారంభించాడు. దాదాపు 5వేల గంటకు కృషి చేసి మొత్తానికి అనుకున్నట్లుగా కారుని తయారు చేసాడు. చెక్కతో తయారు చేసిన ఈ కారుని గత ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో 'జీన్ పాల్ ఫావాండ్' అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈయన పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియంలో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఈ కారుని తయారు చేసిన మిచెల్ రాబిల్లార్డ్ మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులున్నరాని, ఈ కారు తన కూతురు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా త్వరలోనే సిట్రోయెన్ కంపెనీకి చెందిన మరో కారు 'సిట్రోయెన్ డిఎస్'ను కూడా చెక్కతో రూపొందించాలనుకున్నట్లు చెప్పాడు. -
అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు పసిడి ప్రియుల సందడి మొదలవుతుంది. రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనేది భారతదేశంలో హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక పండుగ. కాలక్రమంలో ఇది అందరి పండుగగా మారిపోయింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే అదృష్టం వస్తుందని, భవిష్యత్తులో శ్రేయస్సు లభిస్తుందనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. రేపు (ఏప్రిల్22న) అక్షయతృతీయ) నేపథ్యంలో ఇప్పటికు చాలా ఆభరణాల సంస్థలు పలు ఆఫర్లు, కొత్త కొత్త కలక్షన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. "అక్షయ" అంటే నాశనం లేనిది. కలకలం నిలిచిఉండేది..ఎప్పటికీ తరనిది అని అర్థం. ఇది హిందూ మాసం వైశాఖ మూడవ చంద్ర రోజున వస్తుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో వస్తుంది. హిందూ పురాణాలలో, విశ్వసంరక్షకుడైన విష్ణువు పరశురాముడిగా అవతరించి, చెడును తొలగించి, లోకానికి జయం కలిగేలా ఈ మిషన్ ప్రారంభించాడనేది విశ్వాసం. అక్షయ తృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు ఇంటికి తెచ్చుకున్నా, కొత్త ఇల్లుకొన్నా మరింత శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి, అక్షయ తృతీయ నాడు పెళ్లి శుభకార్యం జరిగితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) 20 ఏళ్లలో 10 రెట్లు అయితే గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాటి పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800గా ఉంటే, రూ.62,400 దాటేసింది.. ముడిచమురు ధరలు పెరుగుదల, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58శాతం పుంజుకుంది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో కూడా బంగారం ధర 47శాతం దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21శాతం మేర లాభపడింది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) ఏడాదిలో రూ.12 వేలు 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఫెడ్ వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ విలువ క్షీణత,చమురుధలు వంటి అంశాలు పుత్తడి ధరలకు ఊతమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా. కాగా భారతదేశంలో ప్రతీ ఏడాది 25-27 టన్నుల బంగారం ఆభరణాలు లేదా బంగారు నాణేల విక్రయాలు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్ -
దేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ అమ్మకం.. కొన్నది ఎవరంటే?
గగనమే హద్దుగా రియల్ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే ముంబై మహానగరంలో లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ఖరీదైన సౌత్ ముంబై మలబార్ హిల్స్ రెసిడెన్షియల్ టవర్స్‌లోని ఫ్లాట్లను ఫ్యామీకేర్ అధినేత జేపీ తపారియా రూ.369 కోట్లకు కొనుగోలు చేశారు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సూపర్ లగర్జీ ట్రిపుల్ ఎక్స్ అపార్ట్మెంట్లోని 26, 27, 28 ఈ మూడు ఫ్లోర్లను తపారియా సొంతం చేసుకున్నారు. 1.08 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు అరేబియా సముద్రం, హాంగింగ్ గార్డెన్స్ రెండింటినీ తాకుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రిపుల్ ఎక్స్ ఏరియా 27,160స్కైర్ ఫీట్లతో ఉండగా.. ఒక్కో స్కైర్ ఫీట్‌ను రూ1.36 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక స్టాంప్ డ్యూటీ కింద తపారియా కుటుంబం రూ.19.07 కోట్లు చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నీరజ్ బజాజ్ సైతం బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్, మలబార్ హిల్ ప్రాంతంలో మూడంతస్తుల (ట్రిప్లెక్స్) అపార్ట్‌మెంట్‌ని రూ.252.5 కోట్లతో కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సొంతం చేసుకున్నారు. 31 అంతస్తులుగా నిర్మిస్తున్న లోధా మలబార్ ప్యాలెసెస్‌లో 29, 30, 31 అంతస్తుల్లో నీరజ్ బజాజ్ బుక్ చేసుకున్న ఈ ట్రిప్లెక్స్‌కు 8 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ ఇంటికి స్టాంప్ డ్యూటీగానే రూ.15.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. -
నైజాంలో రికార్డు దరకు ప్రభాస్ ప్రాజెక్ట్ - కే రైట్స్
-
165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే!
పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న ఈ జీన్స్ రేటుఎంతో తెలుసా? రూ. 94 లక్షలు!! ఎందుకింత రేటు అంటే.. ఈ జీన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. 1857లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఇవి లభించాయట. అంటే 165 ఏళ్లనాటి జీన్స్ అన్నమాట. ఇది లెవీస్ట్రాస్ కంపెనీ తయారుచేసిన జీన్స్ అని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఎవరు తయారుచేస్తేనేం.. ఇప్పటివరకూ లభించినవాటిల్లో ఇవే అత్యంత పురాతనమైనవి కనుక.. తాజాగా అమెరికాలో జరిగిన వేలంలో ఈ జీన్స్ 1,14,000 (భారతీయ కరెన్సనీలో 94 లక్షలు) డాలర్లకు అమ్ముడుపోయాయి. చదవండి: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్.. -
విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు
ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు కొంత మంది కలిసి తలా ఇంత సొమ్ము సర్దడం, ఆ మేరకు వారందరికీ వాటాలు ఉండటం కామనే. కానీ ఓ వ్యక్తి తనను తానే వాటాలు వేసి అమ్మేసుకుంటే..?డబ్బులిచ్చి వాటాలు తీసుకున్నవారు చెప్పినట్టుగా తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే..? ఇదేదో చిత్రంగా ఉంది అనిపిస్తోందా.. మరి ఈ కథేమిటో తెలుసుకుందామా.. కంపెనీ ఎందుకు.. తానే ఉండగా..! ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేం.. తన జీవితాన్ని ఓ లక్ష షేర్లుగా మార్చి, ఒక్కో షేర్‌కు ఒక డాలర్ రేటు నిర్ణయించాడు. ఈ విషయాన్ని మిత్రులకు, బంధువులకు చెప్పాడు, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశాడు. చదవండి: అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టి మరీ.. తన జీవితం షేర్లను కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ వెబ్సైట్ కూడా పెట్టాడు. కీలక విషయాల్లో తాను ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ వెబ్సైట్లోనే ప్రశ్నలు పెడతాడు. ఎక్కువ మంది షేర్ హోల్డర్లు దేనికి ఓటేస్తే.. ఆ నిర్ణయం తీసుకుంటాడన్న మాట. ఆ రోజు తాను ఏ డ్రెస్సు వేసుకోవాలన్న దగ్గరి నుంచి ఉద్యోగంలో ఉండాలా, మానేయాలా అనే దాకా చాలా నిర్ణయాలు షేర్ హోల్డర్ల అభిప్రాయం మేరకే తీసుకుంటాడు. తాను వెజిటేరియన్‌గా మారాలనుకుంటే షేర్ హోల్డర్లు ఓకే చేశారు. నిద్ర సమయాలు మార్చుకోవాలనుకుంటే ఓకే చేశారు. చిత్రంగా తాను వేసెక్టమీ చేయించుకుంటానంటే మాత్రం ‘నో’చెప్పారు. ఇష్టంలేకున్నా చేయాల్సి వస్తోంది! ‘‘నన్ను నేను షేర్లు చేసి అమ్మేసుకున్నాక.. షేర్ హోల్డర్లు చెప్పినట్టే చేయాలి. చాలాసార్లు నాకు ఇష్టం లేకున్నా.. వారు చెప్పినట్టు చేయాల్సి వస్తోంది. అయితే ప్రతిసారీ దానివల్ల మంచే జరుగుతోంది..’’అని మైక్ మెరిల్ చెప్తున్నారు. రేటు పెరుగుతూ.. తగ్గుతూ.. 2008లో మైక్ మెరిల్ ఇలా జీవితాన్ని షేర్లలా అమ్ముతున్న ప్రకటన చేసినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. మొదటి పది రోజుల్లో బంధువులు, స్నేహితులు సరదాకి షేర్లు కొన్నారు. అలా మొత్తం లక్ష షేర్లకుగాను.. 929 షేర్లు మాత్రమే అమ్మాడు. సాధారణంగా ఎక్కువ షేర్లు ఉన్నవారికి నిర్ణయాల్లో ఎక్కువ హక్కు ఉంటుంది. 99శాతం వాటా తన వద్దే ఉండటంతో మైక్ మెరిల్ పద్ధతి మార్చాడు. తన దగ్గర ఉన్న వాటాకు ఓటింగ్ హక్కులు తొలగించుకున్నాడు. బయటివారి వద్ద ఉన్న షేర్ల సంఖ్య లెక్కనే.. వారు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఇది మెల్లగా ఆ నోటా ఈ నోటా మీడియాలో పడి అప్పట్లో వైరల్‌గా మారింది. దీనితో మైక్ మెరిల్ లైఫ్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు బయటి వ్యక్తులు 14,924 షేర్లు కొన్నారు. ఒక సమయంలో షేర్ ధర 18 డాలర్లు దాటింది. అంటే మైక్ మెరిల్ విలువ ఆ రోజున 12 లక్షల డాలర్లకు చేరినట్టుగా లెక్కించారు. మన కరెన్సీలో రూ.9.94 కోట్లు అన్నమాట. ఆయన గురించిమీడియాలో వైరల్‌గా మారినప్పుడల్లా కొందరు షేర్లు కొనేందుకు ఆసక్తి చూపడంతో ధర పెరగడం.. తర్వాత అమ్మేయడంతో ధర తగ్గడం జరుగుతూ వస్తోంది. అంటే మైక్ మెరిల్ ధర పెరుగుతూ, తగ్గుతూ ఉంటోంది. ప్రస్తుతం మైక్ మెరిల్ షేర్ ధర ఐదారు డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. -
ఈ చేప చాలా కాస్ట్లీ గురూ.. రేటు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
సాక్షి, కవిటి(శ్రీకాకుళం జిల్లా): మత్స్యకారుడి వలకు చిక్కిన చేప అధిక ధరకు అమ్ముడుపోయింది. సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లారు. ఈయన వేసిన వలకు సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వ్యాపారులు రూ.55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. అరుదుగా లభించే ఈ చేపలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చదవండి: నమ్మకస్తుడిగా ఉంటూ ఒంటరిగా ఉన్న యజమాని భార్యపై.. -
అన్నంత పని చేసిన ఎలన్‌మస్క్.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?
ప్రపంచం కుబేరుడు ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతు చిక్కని వ్యూహాలు అమలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆయన మరోసారి తన శైలిలోనే ప్రవర్తించారు. టెస్లా కంపెనీలో తన షేర్లలో కొన్నింటినీ అమ్మకానికి పెట్టారు. అడిగి మరీ సెలబ్రిటీ బిలియనీర్ ఎలన్ మస్క్‌కి ట్విట్టర్లో భారీ ఫాలోయింగ్ ఉంది. సుమారు 63 మిలియన్ల మంది అతని అకౌంట్‌ని ఫాలో అవుతున్నారు. ఈ నెల మొదటి వారంలో అకస్మాత్తుగా తన కంపెనీ షేర్లలో పది శాతం అమ్మాలని అనుకుంటున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. అమ్మాలా ? వద్దా చెప్పాలంటూ తన ఫాలోవర్లు కోరాడు. సుమారు 3.5 మిలియన్ల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొనగా.. సుమారు 58 శాతం మంది యూజర్లు షేర్లు అమ్మేయాలంటూ సూచించారు. అమ్మేశాడు ట్విట్టర్ పోల్‌లో వ్యక్తమైన అభిప్రాయాన్ని అనుసరిస్తూ నిజంగానే తన షేర్లను అమ్మకానికి పెట్టారు ఎలన్ మస్క్. ఈ మేరకు అమెరికా స్టాక్ మార్కెట్లో షేర్ల అమ్మకానికి సంబంధించి ఫారమ్ 4ని దరఖాస్తు చేశారు. సుమారు 1.10 బిలియన్ డాలర్ల విలువ చేసే 9,30,000 షేర్లు నవంబర్ 8న అమ్మేశారు. అంతేకాదు మరో 2.15 షేర్లు సైతం అమ్మేందుకు రెడీ అయ్యారు. టెస్లాలో ఎలన్ మస్క్‌కి ఏకంగా 3.6 మిలియన్ షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల విలువ సుమారు 5 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలకు మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్న ఎలన్ మస్క్ సంపద ఫోర్బ్స్ జాబితా ప్రకారం 300 బిలియన్ డాలర్లుగా ఉంది. BREAKING: Tesla has filed a Form 4 for Elon Musk with the SEC. Link: https://t.co/Cbuqk59AaF pic.twitter.com/YbQW3xG8nZ — Sawyer Merritt 📈🚀 (@SawyerMerritt) November 10, 2021 కారణం అదేనా ఇటీవల వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి:పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్.. కారణం ఇదేనా? -
తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం
కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది. మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్‌లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు.. (చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క) అఫ్గనిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. (చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్) మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది. చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా -
స్విట్జర్లాండ్‌కు ‘యాక్ట్’ అమ్మేసుకుంది
ముంబై: బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్)లో నియంత్రణ వాటాలను స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పార్ట్నర్స్ గ్రూప్ దక్కించుకుంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లెక్కగట్టి, ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన ఆర్గాన్, టీఏ అసోసియేట్స్ తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఆర్గాన్ పూర్తిగా నిష్క్రమిస్తుండగా, టీఏ పాక్షికంగా వాటాలను విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. దేశంలోని 19 నగరాల్లో 20 లక్షల మంది వినియోగదారులకు యాక్ట్ సంస్థ ఇంటర్నెట్, టీవీ, డేటా, ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీలో 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా యాక్ట్ నాలుగో అతి పెద్ద వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉందని యాక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలా మల్లాది తెలిపారు. 2008 జూన్‌లో యాక్ట్‌లో ట్రూ నార్త్ ఫండ్ త్రీ నియంత్రణ వాటాలు కొనుగోలు చేసింది. అటుపైన 2016లో ఇండియం వి (మారిషస్) హోల్డింగ్స్ సంస్థ.. ఆర్గాన్, టీఏల ద్వారా ఆ వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా వాటినే స్విస్ సంస్థకి విక్రయిస్తోంది. -
కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ, కొడుకుకు తెలిసి..
లక్నో: కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోడలిని 80వేలకు అమ్మేశాడు ఓ కసాయి మామా. ఈ దారుణ ఘటన యూపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని బ్రోకర్ల ద్వారా చంద్రరామ్ తెలుసుకున్నాడు. దీంతో తన కోడలిని వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుని 80 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో 40వేలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో 20000 తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తండ్రిని అడగగా, ఏదోలా నచ్చచెప్పి.. ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న బారబంకిలో ఉంటున్న తండ్రి దగ్గరకు పంపాడు. జూన్ 5 సాయంత్రం చందరామ్ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి తెలిపాడు. అదే క్రమంలో తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపాతాడని కోడలితో నమ్మబలకడంతో ఆమె బ్రోకర్‌తో వెళ్లింది. తన సమీప బంధువు ద్వారా తండ్రి నిర్వాకం తెలుసుకున్న ప్రిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలితో కలిసి గుజరాత్‌కు వెళ్లేందుకు బారబంకి రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి