
నాలుగురోజుల్లో 5,300 కేజీల బంగారం కొనేశారు
ధర తగ్గడంతో ఎగబడిన వినియోగదారులు
భారీ వర్షంలోనూ రూ.4,800 కోట్ల బాణ సంచా విక్రయం
ఈ పండుగ ‘బంగారం’ గానూ!
చెన్నై: రికార్డు స్థాయిలో షాపింగ్ చేయడం ద్వారా దీపావళి పండుగా...మజాకా అని పించారు రాష్ట్ర ప్రజలు. నాలుగే రోజుల్లో 5,300 కిలోల బంగారు నగలను కొనుగోలు చేశారు. రూ.4,800 కోట్ల విలువైన బాణ సంచాతో దీపావళి సందడి చేశారు. దేశంలోనే బంగారు నగల ధారణలో తమిళనాడు ముందంజలో ఉన్నట్లు అనేక సర్వేల్లో తేలింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే త మిళనాడులో నగల తయారీ కూలి తక్కువ.
దుకాణాల సంఖ్య ఎక్కువ కావడంతో రాయితీలు ఇవ్వడంలో వ్యాపారస్తులు పోటీపడుతుంటారు. వ్యాపారుల మ ద్య పోటీతో వినియోగదారుడు లాభపడుతున్నాడు. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో నే సగటున 1,200 కిలోల బంగారు నగలు అమ్ముడవుతుంటాయి. అదే దీపావళి వం టి ముఖ్యమైన పండుగ రోజుల్లోనైతే 20 నుంచి 25 శాతం అమ్మకాలు పెరుగుతా యి.
రాష్ట్రంలో 2013లో దీపావళి రోజైన నవంబరు 3వ తేదీన ఒక గ్రాము బం గారు రూ.2,851లు, సవర రూ.22,808 పలికింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఒక గ్రాము రూ.2,450, ఒక సవర రూ.19,600కు తగ్గింది. వారం రోజులుగా చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవేమీ బంగారు అమ్మకాలపై ప్రభావం చూపలేదు.
ఈనెల 7వ తేదీన 1,250 కిలోలు, 8వ తేదీన 1,200, 9వ తేదీన 1,350, 10వ తేదీన 1,500 కిలోలు మొత్తం 5,300 కిలోల బంగారు నగలు అమ్ముడుపోయాయి. గత ఏడాది దీపావళి రోజున 1,250 కిలో బంగారు నగలు అమ్ముడుపోగా ఈ ఏడాది 1,500కిలోలు అమ్మకాలు సాగడం విశేషం. ఇలా రికార్డు స్థాయి అమ్మకాలపై చెన్నై బంగారు, రత్నాల నగల వ్యాపారుల సంఘం అధ్యక్షులు జయంతీలాల్ సలానీ మాట్లాడుతూ బంగారు ధర తగ్గడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగిందని అన్నారు.
రూ.4,800 కోట్ల బాణ సంచా అమ్మకాలు..
దీపావళి పండుగ సందర్భంగా బాణ సంచా అవసరాలను శివకాశిలోని అనేక సంస్థలే తీరుస్తున్నాయి. నిషేధాజ్ఞలను దిక్కరించి రాష్ట్రంలో చైనా టపాసులు చెలామణి అయిపోయాయి. దీపావళికి సహజంగా శివకాశిలోని బాణ సంచా తయారీదారులకు రూ.6వేల కోట్ల ఆర్డర్లు రావాల్సి ఉండగా కేవలం రూ.4వేల కోట్లకు లభించాయి. బాణ సంచా వ్యాపారంపై తయారీదారులు విరక్తి పెంచుకున్నారు. దీనికితోడు కుండపోతగా కురుస్తున్న వర్షాలు తయారీదారులను నిరుత్సాహంలోకి నెట్టివేశాయి.
అయినా దీపావళి పండుగ చేరువైన తరుణంలో అక స్మాత్తుగా అమ్మకాలు ఊపందుకుని రూ.4,800 కోట్లకు చేరుకున్నాయి. దీనిపై తమిళనాడు బాణ సంచా తయారీదారుల సంఘం నేతలు మాట్లాడుతూ చైనా టపాసుల ప్రవేశం వల్ల తమ అమ్మకాలు పడిపోతాయని ఆందోళన చెందామని అన్నారు. చైనా టపాసులపై నిషేధాజ్ఞలు రావడంతో ఓ మోస్తరుగా గట్టెక్కామని తెలిపారు.