ఈ రోడ్: తమిళనాడులోని ఈ రోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ముందంజలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 51 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ స్థానం 20028లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఏడుపార్లు ఎన్నికలు జరిగాయి, వాటిలో మూడు లోక్‌సభ ఎన్నికలు కాగా 2023 ఫిబ్రవరిలో ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికలన్నింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబర్‌లో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్నాడీఎంకే పరాజయాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇక
డీఎంకే విషయానికొస్తే, ఆ పార్టీ 2011, 2016లో రెండుసార్లు ఆ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి వీసీ చంద్రకుమార్ 2011లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఈరోడ్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment