e road
-
ఈ రోడ్లో డీఎంకే ముందంజ
ఈ రోడ్: తమిళనాడులోని ఈ రోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ముందంజలో ఉన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 51 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ స్థానం 20028లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఏడుపార్లు ఎన్నికలు జరిగాయి, వాటిలో మూడు లోక్‌సభ ఎన్నికలు కాగా 2023 ఫిబ్రవరిలో ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలన్నింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబర్లో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్నాడీఎంకే పరాజయాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇక డీఎంకే విషయానికొస్తే, ఆ పార్టీ 2011, 2016లో రెండుసార్లు ఆ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి వీసీ చంద్రకుమార్ 2011లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఈరోడ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
కన్నతల్లి కర్కశం: ఐదేళ్లుగా కూతురిని హింసించి మరీ..
ఛీ.. ఛీ.. ఈ భూమ్మీద ఏ మహిళ కూడా ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండదేమో!. కూతురు యుక్త వయసుకు రాగానే.. దుర్మార్గానికి తెర తీసింది ఇక్కడో కన్నతల్లి. కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించడమే కాదు.. బలవంతంగా కూతురి నుంచి అండ సేకరణ చేపట్టి దొడ్డిదారిలో సరోగసీ(అద్దె గర్భం) కోసం అమ్మేసుకుంది. ఒకటికాదు.. రెండుకాదు.. ఐదేళ్లుగా ఈ ఘోరం జరుగుతూ వస్తోంది. తమిళనాడు ఈ రోడ్లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్భంధ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కన్నతల్లి తన కూతురి నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి.. అక్రమ సరోగసీ కోసం ఆస్పత్రులకు అమ్మేసుకుంది. పైగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతూ.. అతనితో కూతురిపైనే అత్యాచారం చేయిస్తూ వచ్చింది. తమిళనాడు ఈ రోడ్లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టోరేట్ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్ డైరెక్టర్ విశ్వనాథన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్ హోంలో ఉన్న బాధితురాలిని పరామర్శించి మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ రోడ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్ సరోగసీ వ్యవహారం నడిచినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ రోడ్‌కు చెందిన నిందితురాలు(33).. భర్తకు దూరంగా ఉంటోంది. బిడ్డను తనతో పాటే పెంచుకుంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కూతురు యుక్తవయస్సుకు రాగానే.. తన ప్రియుడి ద్వారానే అత్యాచారం చేయించింది. గత ఐదేళ్లుగా.. బాధితురాలిపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను బలవంతంగా సేకరించి.. ఆస్పత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులను పంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూతురి వయసును ఆధార్‌కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు. జూన్ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైంది. సేలంలోని తన స్కూల్ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్‌ను మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు అక్రమ సరోగసీకి పాల్పడిన ఆస్పత్రులపై, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వ వైద్య శాఖ. -
మళ్లీ తెరపైకి కరువు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరువు నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటనకు పట్టుబడుతూ అన్నదాతలు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం కరూర్, ఈరోడ్, మదురై, నాగపట్నం, తంజావూరుల్లో ఆందోళనలు నిర్వహించారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చి కరువు ప్రకటన చేయించుకోవడం లక్ష్యంగా రైతు సంఘాలు ముందుకెళుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ప్రతి ఏటా రాష్ట్రాన్ని వెంటాడుతూ వస్తున్నాయి. పంట చేతికి అందక కొన్నేళ్లుగా అన్నదాతలు కన్నీటి మడుగులో మునుగుతున్నారు. అనేక జిల్లాల్లో పంట పొలాలు ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. జలాశయాలను నమ్ముకున్నా, భూగర్భ జలాలను నమ్ముకున్నా చివరకు అన్నదాతలు కష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి. గత ఏడాది కరువు తాండవం మరింత తీవ్రం కావడంతో అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. చెన్నై మినహా తక్కిన అన్ని జిల్లాలను కరువు ప్రాంతంగా ప్రకటించారు. తొలుత డెల్టా రైతులకు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు నష్ట పరిహారం ప్రకటించారు. కేంద్రం ఆదుకోకపోవడంతో ఉన్నదాంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ తాండవం: గత ఏడాది నైరుతీ, ఈశాన్య రుతు పవనాలు ముఖం చాటేశాయి. ఈ ప్రభావం తాజాగా రాష్ట్రాన్ని వెంటాడుతోన్నది. వర్షా భావ పరిస్థితులు, జలాశయాల్లో అడుగంటిన నీరు వెరసి కరువు తాండవం చేస్తోంది. వరుణుడు కరుణిస్తాడని పూజలు చేసినా ఫలితం శూన్యం. నీళ్లు లేక ఓ వైపు చేతికి అందాల్సిన పంట ఎండుతుంటే, మరో వైపు పంట పొలాలు బీడు భూములుగా దర్శనం ఇస్తుండడం అన్నదాతలను తీవ్ర ఆవేదనలోకి నెట్టేస్తోంది. బోరుబావులు ఎండిపోవడంతో ఇక ఈ ఏడాది సాగుబడికి దూరంగా ఉండడం మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. తమను అదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకునే పనిలో పడ్డారు. డిమాండ్: భూగర్భ జలాలు, జలాశయాలు అడుగంటడం, పంటలు ఎండుముఖం పట్టడంతో ఈ ఏడాది కూడా కరువు ప్రకటన చేయాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల అన్నదాతలకు అండగా నిలబడే విధంగా రైతు సంఘాలన్నీ ఏకమయ్యాయి. అన్నదాతల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడికి రైతు సంఘాలు నిర్ణయించాయి. ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి లక్ష్యంగా ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఆందోళన బాట: కరువు ప్రకటన చేయూలన్న డిమాండ్‌తో అన్నదాతలు తంజావూరు, కరూర్, నాగపట్నం, మదురై, ఈరోడ్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కరువు ప్రాంతంగా రాష్ట్రాన్ని ప్రకటించాలని, కావేరి జలాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, కావేరి సంక్షేమ బోర్డు ప్రకటన, మిథైన్ పైప్ లైన్లను తొలగించాలని కోరుతూ, అన్నదాతలు, రైతు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఏఐఏడబ్యుయూ, వామపక్షాల అనుబంధ రైతు సంఘాల నేతృత్వంలో తంజావూరు కలెక్టరేట్లో భారీ నిరసన జరిగింది. కరూర్ అరవకుర్చిల్లో రాస్తారోకో, ఈరోడ్ టీఎన్ పాళయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మదురైలో, పొల్లాచ్చిలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిగాయి. వేదారణ్యం, ముసిరి, నాగపట్నం, ఆండి పట్టి, ఊత్తాంకరైలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కరువు ప్రకటన వెలువడే వరకు రోజుకో రీతిలో నిరసన తెలియజేస్తుంటామని రైతు సంఘాలు హెచ్చరించాయి. కొన్ని సంఘాలు మాత్రమే ఆందోళనబాట పట్టాయని, దశల వారీగా మిగిలిన సంఘాలన్నీ భాగస్వాములు అవుతాయని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. అన్ని సంఘాల ఏకంతో ఓ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనకు సిద్ధం అవుతామని, అంతలోపు ప్రభుత్వం స్పందించి కరువు ప్రకటన తప్పకుండా చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేయడం విశేషం.