result
-
Pulwama Assembly: పుల్వామాలో గట్టి పోటీ
పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్‌ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా పరిపాలనా కేంద్రం శ్రీనగర్‌కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి -
Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి
చండీగఢ్: హర్యానాలోని మొత్తం 90 లోక్‌సభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. నేడు(మంగళవారం) ఆయా స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా? అనేది నేడు తేలనుంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అదేవిధంగా బరిలో ఉన్న పలువురు బడా నేతల ఫలితంపై అందరి దృష్టి నిలిచింది.భూపేంద్ర సింగ్ హుడాహర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే సీఎం పదవికి ఆయనే బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.నాయబ్ సింగ్ సైనీమనోహర్ లాల్ ఖట్టర్‌ను హర్యానా నుండి ఢిల్లీకి పంపిన తరువాత, బీజేపీ నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌కు చెందిన మేవా సింగ్ పోటీనిస్తున్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్ లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు.అనిల్ విజ్హర్యానా బీజేపీలో విజ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన విజ్ అంబాలా కాంట్ అభ్యర్థి. 1967 నుంచి 2019 వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.దుష్యంత్ చౌతాలాఉచానా స్థానం నుంచి జేజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు ఆయన బీజేపీ ప్రభుత్వంతో జతకట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకంపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పొత్తు తెగిపోయింది. 2019లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్ చౌతాలా గెలుపొందారు.వినేష్ ఫోగట్పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి తిరిగి వచ్చిన తరువాత, వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. వినేష్‌పై బీజేపీ తరపున మాజీ పైలట్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు.సావిత్రి జిందాల్దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. సావిత్రి జిందాల్ హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.ఇది కూడా చదవండి: కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు -
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి ,హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్స్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చాం 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశాం మేం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం గత సర్కార్ విద్యా వ్యవస్థను నిర్విర్యం చేసింది 10ఏళ్లలో 7వేల టీచర్ పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు పోస్టుల వారీగా చూస్తే..పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. -
హిమాచల్ ఉప ఎన్నికల్లో సీఎం భార్య విజయం
దేశంలోని ఏడు రాష్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జూలై 10న ఎన్నికలు జరగగా, నేడు(శనివారం) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా ఉపఎన్నికకు సంబంధించిన ఫలితం వెలువడింది.ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థానానికి సంబంధించిన 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో డెహ్రా స్థానం ఫలితం మొదట వెలువడింది. -
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో 73.0శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.అయితే వార్షిక పరీక్షల్లో పెయిలైన ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఆ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్ని https://results.sakshieducation.com/ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
రేపే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 28న) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.ఇక ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. -
ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జూన్ 26 తేదీ (బుధవారం) రాత్రి 8:00 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారని అధికారులు తెలిపారు. ఇక విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
నీట్ పరీక్షా ఫలితాలు.. కోర్టులో విద్యార్ధినికి చుక్కెదురు
ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్‌పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్‌తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు. ఎన్టీఏ ఓఎంఆర్ చించేసిందిఅంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్‌ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్‌ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు. నకిలీ పత్రాలు సమర్పించిఅయితే, కోర్టు ఆదేశాలతో ఎన్టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్‌ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్ ఉపసంహరణఎన్టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024ప్రియాంక గాంధీ సైతంఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి కూడా తమకు మంచి మెజారిటీ వస్తుందని చెబుతోంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో స్పందించారు. రేపు రానున్న ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సవాల్ చేస్తున్నాయని అన్నారు. ఫలితాల కోసం వేచి చూడాల్సిందేనని సోనియా అన్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నామని సోనియా గాంధీ పేర్కొన్నారు.ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుంది. VIDEO | “We have to wait. Just wait and see. We are very hopeful that our results are completely the opposite to what the exit polls are showing,” says Congress leader Sonia Gandhi.Lok Sabha elections 2024 results will be declared tomorrow. #LSPolls2024WithPTI… pic.twitter.com/xIElzUjJ8P— Press Trust of India (@PTI_News) June 3, 2024 -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
పాక్ ప్రధాని పదవికి నవాజ్ రెండు ప్లాన్లు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక అంచనాకు వచ్చాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ప్రజా మద్దతు లభించింది. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 99 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ‘నూన్ లీగ్’గా పేరొందిన నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’కి చెందిన 71 మంది ఎంపీల విజయంతో ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పాక్‌లో సంకీర్ణం ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో నవాజ్ షరీఫ్ తాజాగా రెండు ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ ‘ఏ’ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సోదరుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను సహాయకునిగా నియమించారు. ఇతను ఇప్పటికే ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోతో మంతనాలు జరిపారు. వీరు లాహోర్‌లోని షరీఫ్ కుటుంబాన్ని కలుసుకోనున్నారు. దీనితోపాటు నవాజ్ షరీఫ్ మరికొన్ని పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ రాబట్టేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్లాన్ ‘బి’ మరోవైపు నవాజ్ షరీఫ్ 60 మంది స్వతంత్ర ఎంపీలతో టచ్‌లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎంపీలు తెలిపారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు నవాజ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. -
పోలింగ్ మధ్యలోనే వెలువడిన ఫలితాలు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే ఇంతలోనే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందని, ఆ తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. పోలీసు వర్గాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్మిక సంఘాలు, వివిధ రంగాలకు చెందిన నిపుణుల ఇంటర్వ్యూల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా పాక్ ఎన్నికల ఫలితాలపై ఒక నివేదిక బయటకు వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలను ఒక పాక్ అధికారి మీడియా ముందు వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎస్- ఎన్ 115 నుండి 132 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఫలితంగా నవాజ్ షరీఫ్ నూతనప్రభుత్వాన్ని సాధారణ మెజారిటీతోనే ఒంటరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పంజాబ్ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నవాజ్ షరీఫ్ పార్టీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా అవతరించనుంది. అయితే సింధ్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్నికల్లో పీపీపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని, పీటీఐ స్వతంత్ర అభ్యర్థులకు 23 నుంచి 29 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. అలాగే ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌కు 12-14 సీట్లు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్‌కు 6-8 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వైద్), ఇస్తేకామ్-ఏ-పాకిస్థాన్ పార్టీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. -
ఇంటర్‌లోనే ఇలా ఎందుకు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువగా ఉంటుందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 2024లో జరిగబోయే పరీక్షల్లో దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కువగా ఏ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు? వారికి రివిజన్ చేయడం ఎలా? అనే అంశాలపై జిల్లాల వారీగా నివేదికలు కోరారు. రెసిడెన్షియల్, గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తున్నా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోవిడ్ తర్వాత 70 శాతం రిజల్ట్ కష్టంగా ఉందని గుర్తించారు. మెరుగైన ఫలితాలు సాధించే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. కారణాలేంటి? 2023లో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ 4,33,082 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,72,280 మంది ఉత్తీర్ణులయ్యారు. 63 శాతం రిజల్ట్ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 4,19,267 మంది పరీక్ష రాస్తే, 2,65,584 (63 శాతం) పాసయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్ సెకండియర్‌లో కనీసం 50 శాతం కూడా పాసవ్వలేదు. జగిత్యాల (23శాతం), సూర్యాపేట (30శాతం), సిద్ధిపేట (34శాతం), నిర్మల్ (49శాతం) జిల్లాలు ఈ కోవలో ఉన్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌బాద్, కరీంనగర్, వనపర్తి, జనగాం, జిల్లాల్లో 48 శాతం లోపే ఫలితాలొచ్చాయి. నారాయణపేట (100శాతం) మినహా మరే ఇతర జిల్లాలోనూ 75 శాతం ఫలితాలు కనిపించలేదు. 68 శాతం ఫలితాలు ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటే, ప్రభుత్వ కాలేజీల్లో 32 శాతం మించడం లేదు. ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంటర్ అధికారులు దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. రివిజన్ ఏమాత్రం జరగడం లేదని తెలుసుకున్నారు. జనవరి రెండోవారంలో సిలబస్ పూర్తి చేసి, మిగతా రోజుల్లో రివిజన్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సీఈసీ...హెచ్‌ఈసీలోనే ఎక్కువ ► విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే చేరుతున్నారు. సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో తక్కువగా చేరినా, వారిలోనూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ► గత ఏడాది సీఈసీలో 98 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 37 వేల మంది (37 శాతం) మాత్రమే 2023లో ఉత్తీర్ణులయ్యారు. ► బైపీసీ గ్రూపులో లక్ష మంది పరీక్ష రాస్తే, 64 వేల మంది (64.14) పాసయ్యారు. ► హెచ్ఈసీలో 11,294 మంది పరీక్ష రాస్తే, 3,408 మంది (30.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ రిజల్ట్స్ ఇలా ఉంటే.. సెకండియర్‌లో ఫలితాలు మరీ తగ్గుతున్నాయి. ► ఎంపీసీలో గరిష్టంగా 72 శాతం, బైపీసీలో 67 శాతం ఫలితాలు ఉంటే, హెచ్ఈసీలో 46 శాతం సీఈసీలో 47 శాతం ఉంటోంది. హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో సరిగా బోధన జరగడం లేదని బోర్డు అధికారులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ఉంటున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాల దిశగా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్లో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 411 ఉద్యోగాల గానూ ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో 31,193 తుది పరీక్షరాశారు. అక్టోబరు 14, 15 తేదీల్లో తుది రాత పరీక్ష నిర్వహించారు. బుధవారం ఏపీ ఎస్ఎల్పీర్బీ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారీ పరాజయాలతో పాటు పలు ఆసక్తికర ఫలితాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్‌లో ఓ సీటులో భార్యను భర్త ఓడించగా, మరోచోట అల్లుడు, మామ.. ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇంకో సీటులో అన్నదమ్ములిద్దరూ ఓటమి పాలయ్యారు. రాజస్థాన్‌లోని సీకార్ జిల్లాలో గల దంతారామ్‌గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా ఆయన భార్య రీటా సింగ్ జేజేపీ నుంచి పోటీ చేశారు. వీరేంద్ర సింగ్ తన భార్యను ఓడించారు. వీరేంద్ర సింగ్ గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈయన పీసీసీ మాజీ చీఫ్ నారాయణ్ సింగ్ కుమారుడు. మార్వార్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రిచ్‌పాల్ మిర్ధా కుమారుడు విజయపాల్ మిర్ధా.. దేగానా నుంచి, మరో కుమారుడు ఖిన్వ్సర్ నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. ఇంతకంటే విచిత్రమైన ఉదంతం ధోల్పూర్లో చోటుచేసుకుంది. ధోల్పూర్లో కాంగ్రెస్‌కు చెందిన శోభారాణి కుష్వాహా.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు శివచరణ్ కుష్వాహపై విజయం సాధించారు. జైపూర్‌లోని ఫూలేరా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందిన విద్యాధర్ చౌదరి అల్లుడు శైలేష్ సింగ్, దీగ్ కుమ్హెర్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రాజస్థాన్‌లో 199 స్థానాలకు నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 70 సీట్లు వచ్చాయి. 14 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇది కూడా చదవండి: 17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్! -
చీకటి వెలుగులు
విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి. ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది? అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్ సాంటానా. అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్ సాంటానా అమెరికన్ గిటారిస్ట్. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు! ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన. సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే! జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు. కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్. ‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది. అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం. -
ఈసారయినా డిపాజిట్ దక్కించుకోవాలి సార్!
ఈసారయినా డిపాజిట్ దక్కించుకోవాలి సార్! -
ఊరూవాడా.. రిజల్ట్‌పై అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్ కనిపిస్తోంది. పందెం కాస్తావా? పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్‌లు కడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో జోరుజోరుగా.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్‌ఫామ్‌లపై, గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది. -
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్‌రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్‌కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్‌ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
నాలుగు రోజులకే నా సినిమా ఎత్తేశారు: జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్‌దాస్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని అన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సంగతి తెలిసిందే. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్‌పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి : చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు) జగపతి బాబు మాట్లాడుతూ.. 'రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని సినిమా చేశా, కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన వారిలో కనిపించలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయింది. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. నా రేంజ్ కాకపోయినా సినిమా చేశఆను. కానీ నేను సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను కూడా. అవేమీ నిర్మాత పట్టించుకోలేదు.' అని అన్నారు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు. -
సెప్టెంబర్ మూడోవారంలో ‘కానిస్టేబుల్’ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ‘కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా’ సెప్టెంబర్ మూడోవారంలో విడుదల కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్‌శాఖల్లో కలిపి మొత్తం 16,929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తుదిరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామకమండలి వెల్లడించడం తెలిసిందే. జూన్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్ నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుంది. -
ఏపీ, ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
-
పరీక్షలు ముగిశాయి.. ఫలితాలే తరువాయి..
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని వివిధ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల నిర్వహణ ఈనెల 10తో ముగిసిఇంది. నాలుగు సొసైటీల పరిధిలో అర్హత పరీక్షలన్నీ ముగియడంతో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ మినహా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎంఆర్ఈఐఎస్, టీఎస్ఆర్ఈఐఎస్లు ఐదోతరగతితో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాయి. వీటితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు సొసైటీలు వేర్వేరుగా అర్హత పరీక్షలు నిర్వహించాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సైతం ఏ సొసైటీకా సొసైటీ అర్హత పరీక్షలు ముగిశాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అగ్రికల్చర్ డిగ్రీ, ఫ్యాషన్ టెక్నాలజీ డిగ్రీ ప్రవేశాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(ఈఎంఆర్ఎస్)లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేకంగా సెట్ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలన్నీ వరుసగా విడుదల చేసేందుకు ఆయా సొసైటీలు సన్నద్ధమయ్యాయి. అర్హత పరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేసేందుకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా పాఠశాలల్లో ప్రవేశాల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఐదో తరగతి అడ్మిషన్లకు నిర్వహించిన వీటీజీసెట్–2023 ఫలితాలను వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నారు.