హైదరాబాద్: ఏపీ టెన్త్ 2016 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ హాలులో ఉదయం 10 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3046 కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు 6,57,595 మంది విద్యార్ధులు హాజరు కాగా వీరిలో బాలురు 343040 మంది, బాలికలు 314555 మంది ఉన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,21,517 మంది కాగా ప్రైవేటు విద్యార్థులు 36,078 మంది ఉన్నారు. ఓరియెంటల్ ఎస్సెస్సీ పరీక్షకు 2047 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ఏపీ ఆన్‌లైన్ సహకారంతో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లతో ఫలితాలను విడుదల చేయనున్నారు.
విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈఏపీ.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దీంతో పాటు ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్’, బింగ్ డాట్‌కామ్, నోయువర్‌రిజల్ట్సు డాట్‌కామ్, కెరీర్‌లాంజ్ డాట్‌ఇన్, విద్యాసమాచారం డాట్‌కామ్, పాస్‌ఆర్‌ఫెయిల్ డాట్‌ఇన్, ఇండియా రిజల్ట్సు డాట్‌కామ్, విద్యావిజన్ డాట్‌కామ్, గో రిజల్ట్సు డాట్‌నెట్, విద్యాటుడే డాట్‌ఇన్, జాగరణ్‌జోష్ డాట్‌కామ్ తదితర వెబ్‌సైట్ల ద్వారా కూడా విద్యార్ధులు తమ పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చని వివరించారు. వాయిస్ రికార్డర్ మోడ్ ద్వారా, ఎస్‌ఎంస్ ద్వారా కూడా విద్యార్ధులు ఫలితాలు తెలుసుకొనే ఏర్పాట్లు చేశారు. వాయిస్ రికార్డర్ మోడ్ కోసం 58888 నెంబర్‌కు లేదా స్టార్588యాష్‌కు కాల్ చేయవచ్చన్నారు. ఎస్‌ఎంఎస్‌కోసం ఏపీ10(స్పేస్)రోల్‌నెంబర్‌ను టైప్ చేసి 58888కు ఎస్‌ఎంఎస్ చేయవచ్చని ప్రసన్నకుమార్ తెలిపారు.