టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్‌దాస్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని అన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సంగతి తెలిసిందే. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్‌పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇది చదవండి : చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు)
జగపతి బాబు మాట్లాడుతూ.. 'రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని సినిమా చేశా, కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన వారిలో కనిపించలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయింది. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. నా రేంజ్ కాకపోయినా సినిమా చేశఆను. కానీ నేను సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను కూడా. అవేమీ నిర్మాత పట్టించుకోలేదు.' అని అన్నారు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment