rasamai balakishan
-
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ వేడుకలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Desapati Srinivas) తప్పుబట్టారు. ఇలాంటి వేదికలపై తెలంగాణ కల్చర్‌ను తప్పుగా చూపుతూ చులకనగా మాట్లాడటమేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమా వ్యాపారాన్ని మానుకోవాలని ఆయన కోరారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణయాన్ని తప్పపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయిందని రసమయి అన్నారు.ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ఈ రెండు సినిమాలలో జనవరి 14న విడుదలకానున్న కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. 'మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత వైబ్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని వెంకటేశ్‌తో దిల్ రాజు అన్నారు. ఇప్పుడు అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి: ఎమ్మెల్సీ'తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు ఎప్పుడూ కలిసిరాలేదు. ఒక్కరోజు కూడా ఇక్కడి ప్రజల కోసం ఆయన అండగా నిలబడలేదు. తన సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణను తక్కువ చేస్తూ తాజాగా దిల్ రాజు మాట్లాడారు. తెలంగాణలో సినిమాలకు వైబ్ లేదంటూ ఇక్కడి కల్చర్‌ను చులకన చేశారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమాలు చేయడం మానుకోని.. కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి. ఇక్కడ మీ సినిమాలకు టికెట్ల ధరల పెంపు కోసం సీఎం రేవంత్‌ను అడిగి ప్రత్యేకంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి కూడా మరోసారి బయట పడింది. సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల గురించి గతంలో వారు చెప్పిన మాట మీద నిలబడలేదు. ఈ విషయంలో మంత్రి కోమటి రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాట మీద నిలబడని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి. దిల్ రాజు కోసం సినిమా టికెట్స్ ధరలు పెంచారు. దిల్ రాజు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి.' అని కామెంట్ చేశారు.దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు: రసమయిసీఎం రేవంత్‌రెడ్డి, దిల్ రాజులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ,బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనక మతలబు ఏమిటి అనేది ప్రజలకు చెప్పిండి. సీఎం రేవంత్ దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు..? ఆరు గ్యారంటీలపై మాట తప్పినట్టే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై సీఎం మాట తప్పారు. దిల్ రాజు తెలంగాణ ప్రజలను తన మాటలతో అవమాన పరిచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి బెనిఫిట్ షోలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం తెలుసు కానీ, సీఎం రేవంత్‌కు పాలన చేత కావడం లేదు. ప్రతి అంశంపై సీఎం యూ టర్న్ తీసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.' అని ఆయన అన్నారు. -
నాలుగు రోజులకే నా సినిమా ఎత్తేశారు: జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్‌దాస్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని అన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సంగతి తెలిసిందే. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్‌పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి : చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు) జగపతి బాబు మాట్లాడుతూ.. 'రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని సినిమా చేశా, కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన వారిలో కనిపించలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయింది. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. నా రేంజ్ కాకపోయినా సినిమా చేశఆను. కానీ నేను సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను కూడా. అవేమీ నిర్మాత పట్టించుకోలేదు.' అని అన్నారు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు. -
TS Election 2023: గులాబీ పార్టీకి ఎదురులేదు : రసమయి బాలకిషన్
కరీంనగర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మానకొండూర్‌లో బుధవారం శంకరపట్నం మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మూడోసారి గెలిపిస్తామని సర్పంచులు, ఎంపీటీసీలు మద్దతు పలికారు. గులాబీ పార్టీకి ఎదురులేదని, కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీని వాస్‌రెడ్డి, సర్పంచులు సంజీవరెడ్డి, విజయకుమార్, రంజిత్‌రావు, çసంపత్, భద్రయ్య, రవి, రాజయ్య, కిషన్‌రావు, వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, మొయిన్, సంపత్, తిరుపతయ్య, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక.. మండలంలోని పలువురు యువకులు బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు, మహిపాల్, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
యువజన సంఘాల మహాధర్నా ఉద్రిక్తం
గన్నేరువరం (మానకొండూర్)/తిమ్మాపూర్: డబుల్ రోడ్డు నిర్మాణం కోసం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఆదివారం యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. గుండ్లపల్లి నుంచి వయా గన్నేరువరం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసులు గుండ్లపల్లికి చేరుకోవడంతో ఆందోళనకారులు రూటు మార్చి గుండ్లపల్లి దాబా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరినా.. ఆందోళనకారులు పట్టించుకోకపోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. యువజన సంఘాల నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విఫలమయ్యారని విమర్శించారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే రసమయి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసమర్థత ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై ఆందోళనకారులు చెప్పులు విసురుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కవ్వంపల్లి, శ్రీనాథ్‌రెడ్డి, యువజన సంఘాల సభ్యులను అదుపులోకి తీసుకుని తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్, అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్‌రెడ్డి, బామండ్ల రవీందర్, నాయకులు పాల్గొన్నారు. ఎల్ఎండీ ఠాణాను ముట్టడించిన టీఆర్ఎస్ రసమయి బాలకిషన్‌పై దాడికి నిరసనగా టీఆర్ఎస్ నాయకులు భారీగా ఎల్ఎండీ ఠాణాకు చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న సీపీ, పోలీస్ అధికారులు టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి ఆందోళన విరమించాలని సూచించారు. గన్నేరువరంలో తనపై జరిగిన దాడి గురించి గన్నేరువరం జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి.. రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రసమయి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. వాహనంపై దాడి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్నా అంటే దాడులు చేయడమేనా? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, 8 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాకు వచ్చిన సమయంలో రహదారులకు నిధులు ఎందుకు అడగలేదని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. -
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఊహించని షాక్
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంతసేపటికీ వారు కదలకపోవడంతో యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రాత్రి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నేతల దాడి చేశారు. తోట ఆగయ్య ఇంటిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ సందర్శించి ఆగయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక మంత్రిగా ఆగయ్యను పరామర్శించేందుకు రాలేదు, ఒక కార్యకర్తగా, ఒక కుటుంబ సభ్యునిగా పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. బీజేపీలో అసమ్మతి, పార్టీలో లుకలుకల వల్లనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, అక్కసుతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల మీద యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని నమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పిలుపునిస్తే బీజేపీ బలమెంత? అని ప్రశ్నించారు. మీరు(బీజేపీ) దాడులు చేసి మమ్మల్ని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపైన దాడులకు దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు మంది ఉన్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. -
పద్మారావు గౌడ్, రసమయి మధ్య వాగ్వాదం.. షాక్‌లో టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మైక్ ఇచ్చారు. ఇంతలో దీనిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడదాం అంటే మాట్లాడే అవకాశాలు రావు.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను ప్రశ్నలే అడుగుతున్నానని వాదించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు. -
టీఆర్ఎస్లో కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమం నాటి నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్లో ‘ఉద్యమ నేపథ్యం’ అనే మాటలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ ఉద్యోగ సం ఘ నాయకులతో మంత్రి చర్చించారనే వార్తల పై ఇటీవల హుజూరాబాద్‌లో ఘాటుగా స్పం దించిన మంత్రి ఈటల రాజేందర్‌కు మానకొం డూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన మా టలతో బాసటగా నిలవడం ఏ పరిణామాలకు దారితీస్తోందోననే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొ లుత మాట్లాడిన రసమయి బాలకిషన్ నవ్వు తూ మాట్లాడుతూనే ‘పొట్టలో ఉన్నది దాచుకోకుండా’ బహిర్గతం చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ‘19 ఏళ్ల కిందట తాను టీచర్‌గా పాఠాలు చెప్పిన సిద్దిపేట జిల్లా ఇంద్రగూడెం స్కూల్లో అప్పటికి, ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, పాఠశాల బోర్డు మాత్రం ‘ఆంధ్రప్రదేశ్’కు బదులు ‘తెలంగాణ’గా మా రిందని తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయిందని టీ ఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు గు రుకులాలల వ్యవస్థ విజయవంతమైందని, రెండు మూడు హైస్కూళ్లను ఒకటిగా చేసి మినీ రెసిడెన్సియల్ స్కూళ్లు చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని చెబుతూనే... పాఠశాలల్లో కనీ స మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సుతిమెత్తగా విమర్శించారు. ‘రాజేందరన్న నే ను ఉద్యమాల నుంచి వచ్చినోళ్లం. వాస్తవాల మీద ఉద్యమాలు నడిపినోళ్లం. తెలంగాణ రా ష్ట్రం ఎట్ల ఉండాల్నో కలలు కన్నోళ్లం. వాస్తవంగా ఒక్కోసారి చాలా బాధనిపిస్తోంది’ అని చేసి న వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలుగా విశ్లేషిస్తున్నారు. రసమయి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుం డడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్లో తాజాగా తెరపైకి వచ్చిన ‘ఉద్యమ నేపథ్యం’ మాటలు ఎటువైపునకు దారితీస్తాయోనన్న ఆసక్తిని రేపుతున్నాయి. ఆకలి, అంతరాలు దూరం కాలేదన్న ఈటల ‘మంత్రి పదవి భిక్ష కాదు... గులాబీ జెండా ఓనర్లం మేం’ అనే మాటలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన ఈటల రాజేందర్ గు రువారం కలెక్టరేట్లో మాట్లాడుతూ రాజకీయ నాయకులకు సైతం మెరిట్ ఉండాలనే కొత్తటాపిక్ తీసుకురావడం గమనార్హం. ‘సమాజంలో టీచర్‌కు మెరిట్ ఉంటది కలెక్టర్‌కు, డాక్టర్‌కు, ఇంజనీర్‌కు మెరిట్ ఉంటది. కానీ మెరిట్ లేకుం డా ఉన్న వాళ్లు కొద్ది మంది రాజకీయ నాయకులు. మెరిట్ ఉండాల్సింది వాళ్లకు ఇవ్వాల’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ‘72 సంవత్సరాల భారతదేశంలో ‘డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్’ అని రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ ఈ దేశంలో రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా ఆకలి, అంతరాలు చాలా మటుకు దూరం కాలేదు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో పాలకులు విఫలమయినరా? తప్పకుండా చర్చ జరగాలి’ అని తన ఆవేదనను ఉపాధ్యాయులు, ఉన్నతాధికారుల సమక్షంలో పంచుకోవడం గమనార్హం. నిఘా వర్గాల ఆరా! ఈటల హుజూరాబాద్‌లో చేసిన ఘాటైన వ్యా ఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరునాడే హైదరాబాద్ వెళ్లి ఈటలను కలిశారు. గురువారం కలెక్టరేట్లో ఒకే వేదికపై దేశంలో, రాష్ట్రంలోని పరిస్థితులపై ఇద్దరు నేతలు తమ ఆవేదనను ‘పంచు’కున్నారు. దీనిపై పత్రికలు, టీవీలు, సోషల్‌మీడియాల్లో రకరకాల కథనాలు వెలువడిన నేపథ్యంలో నిఘావర్గాలు ఈ విషయమై ఆరా తీస్తున్నాయి. గురువారం నాటి సమావేశానికి సంబంధించిన పూర్తి రికార్డులను ఇంటలిజెన్స్ వర్గాలు సేకరించినట్లు సమాచారం. ఏ పరిస్థితుల్లో రసమయి వ్యాఖ్యలు చేశారు? పూర్వపరాలేమైనా ఉన్నాయా? కరీంనగర్ జిల్లా నుంచే ఇద్దరు నేతలు సర్కారు వైఖరికి భిన్నంగా గొంతు విప్పడంలో గల ఆంతర్యం ఏంటనే విషయాలను ఆరా తీసిన నిఘా వర్గాలు నివేదికను సర్కారుకు పంపించినట్లు సమాచారం. ఈ సం దర్భంగా పలువురి ఫేస్బుక్ ఖాతాలు, పోస్టింగ్‌లతోపాటు సోషల్ మీడియాలో పోస్టింగులు, వాటిపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కూ డా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ కరీంనగర్ శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ యంత్రాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. -
కేసీఆర్‌తోనే అభివృద్ధికి బాట
శంకరపట్నం(మానకొండూర్): సీఎం కేసీఆర్ వేలు పట్టుకుని నడిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో బుధవారం టీఆర్ఎస్ మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి హరీశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీరు రాజీనామా చేయమంటే గడ్డిపోచల్లా భావించి మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేశామన్నారు. అయితే అప్పటి మానకొండూర్ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్ మాత్రం కిరణ్‌కుమార్‌రెడ్డితో కుమ్మక్కై రాజీనామా చేయలేదన్నారు. మానకొండూర్‌కు రసమయి రెండోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గాన్ని సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మిడ్‌మానేర్‌ను మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరంతో పాత కరీంనగర్ జిల్లా మరో కోనసీమగా మారబోతోందన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేని మహాకూటమిలోని నాయకులను ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. పోలవరం కింద మూడో పంటకు గోదావరి నీళ్లు రావని మన కాళేశ్వరాన్ని అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. రూ.500 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ మొదలు పెట్టామన్నారు. పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక అర్ధరాత్రి కరెంటే గతి అని, కరెంటుకు కష్టాలు తప్పవని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కల్యాణలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను రద్దు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులను రద్దు ..రద్దు అని అంటున్న కాంగ్రెస్ మా కొద్దని ప్రజలు అంటున్నారన్నారు. రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు, రైతుబీమా పథకాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. కాంగ్రెసోళ్లను గెలిపిస్తే చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడతారని.. మన ఓటు ఢిల్లీకో.. అమరావతికో పోనీయొద్దని కోరారు. కోదండరాం వంటి ఉద్యమకారునికి సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తప్పించుకు తిరిగినోళ్లు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి థర్మల్ప్లవర్ ప్లాంట్‌ను రద్దు చేస్తామని కోమటిరెడ్డి అంటున్నారని.. అందుకే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. కన్నుకొట్టే రాహుల్‌ను, రెండు కళ్ల సిద్ధాంతం చెప్పే చంద్రబాబును నమ్మవద్దని.. కంటి వెలుగులు పంచే కేసీఆర్ వెంట నడవాలని హరీశ్ ప్రజలను కోరారు. హుజూరాబాద్‌లో ఈటల.. సిద్దిపేటలో తాను.. సిరిసిల్లలో కేటీర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని, అలాగే రసమయిని కూడా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. -
‘రాహుల్ కన్నుకొట్టే నాయకుడు’
సాక్షి, కరీంనగర్ : ప్రజాకూటమి నేతల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని ఆపధర్మ మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు. కోడందరాంపై కాంగ్రెస్‌కి, చాడ వెంకట్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్‌కి నమ్మకం లేదని ఆయన అన్నారు. కంటి వెలుగులు అందించే నాయకుడు కేసీఆర్ అని.. కన్నుకొట్టే నాయకుడు రాహుల్ గాంధీ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజవర్గంలోని శంకరపట్నంలో మంత్రి ఈటెల రాజేందర్, ఆ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్‌తో కలిసి హరీష్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే హుజురాబాద్, సిద్దిపేటలా మానకొండూర్‌ను కూడా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ప్రజాకూటమిలో పొత్తుపెట్టుకుని కూడా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ని నమ్మెదు. ఉద్యమకారుడైన కోదండరాంను కాంగ్రెస్ మోసం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పించుకుని తిరిగిన నాయకులు కాంగ్రెస్ వాళ్లు. మిడ్ మానేర్ పూర్తయితే 50వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ నియోజకవర్గ అభివృద్దిలో నేనూ, ఈటెల పాలుపంచుకుంటాము. ఏడాదిలోపల కాళేశ్వరం పూర్తి అవుతుంది. మిడ్‌మానేర్, కాళేశ్వరం కలిపితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక నాయకుడు కేసీఆర్’’ అని హరీష్ వ్యాఖ్యానించారు. -
పాట గెలిపిస్తుందా.. జనం ఓడిస్తారా?
సాక్షి, కరీంనగర్ : ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లుంది మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిస్థితి. ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికల ప్రచారంలో రసమయి తీవ్ర నిరసనలకు గురువుతున్నారు. కాలుకు గజ్జెగట్టి ఆటపాటలతో ఉద్యమ సమయంలో జనాన్ని ఉర్రూతలూగించిన రసమయికి ఎన్నికల సమయంలో అదే జనం నుంచి నిరసన జ్వాలలు ఎదురుకావడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కళాకారుడిగా జనం మెప్పుపొందిన రసమయి, ప్రజాప్రతినిధిగా జనం అభిమానాన్ని మాత్రం చురగొనలేకపొతున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ‘గోబ్యాక్ రసమయి’ అనే ప్లేకార్డులే దర్శనమిస్తున్నాయి. ఇటీవల బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇల్లంతుకుంట మండలంలో పర్యటించిన అతనికి గ్రామస్తుల నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. సొంత పార్టీకి చెందిన మహిళలే త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వ్యతిరేక పార్టీకి చెందిన వారి నుంచి ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ రసమయి మాత్రం సొంత పార్టీ కార్యకర్యల నుంచి తీవ్ర నిరసనలు చవిచూడాల్సి వస్తోంది. దళితులకు మూడెకరాల భూమి విషయంలో ఇటీవల బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు దళితులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేపల్లి మోహాన్ ఎమ్మెల్యే తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నాలుగున్నరేళ్లు పదవిలో ఉండి నియోజకవర్గానికి కనీసం త్రాగునీరు కూడా అందించలేకపోయారని మండిపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్‌పై 46 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వరాష్ట్రంలో తొలి తెలంగాణ సాంస్కృతిక సారధిగా నియమితులైయ్యారు. ఉద్యమ నాయకుడు కావడంతో గత ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించిన రసమయి.. ఈసారి గెలవడం అంత సులువైన విషయం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా తనను విమర్శించిన ఎంతటివారిపైనైనా నోరుపారేసునే తత్వం రసమయిది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుఫున బరిలో నిలిచిన ఆరేపల్లి మోహన్ మళ్లీ టిక్కెట్ తనకే తక్కుందని ధీమాతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రత్యర్థి ఆరేపల్లి మోహన్ స్థానికుడు కావడం, రసమయి స్థానికేతరుడు కావడంతోపాటు ముక్కుసూటిగా మాట్లాడడంతోనే ముప్పువస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో నియోజకవర్గాన్ని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని చర్చించుకుంటున్నారు. -
ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అల్గునూర్: ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉ న్నానని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ పంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌లో మండల ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రా మకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని ఊరచెరువు అభివృద్ధిచేయాలని ముదిరాజ్‌లు కోరుతన్నారని తెలిపారు. ఈ విషయమై చెరువు అభివృద్ధికి మిషన్‌కాకతీయ పథంలో అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపాదనలు కూడా పంపించామని తెలిపా రు. త్వరలోనే చెరువలో పూడితతీత చేపడతామని ముదిరాజ్‌లు చేపలు పెంచుకుని ఉపాధిపొందేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ము దిరాజ్‌కు ఎల్ఎండీపైనే ఆధారపడ్డారని చెరువు అభివృద్ధితో గ్రామంలోని సంఘంసభ్యులు చేప లు పెంచుకుని ఉపాధిపొందాలని సూచించారు. ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా చేపపిల్లలు కూడా పంపిణీ చేస్తోందన్నారు. రామకృష్ణకాలనీలోని పెద్దమ ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సొంత నిధులు మం జూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ క మ్యూనిటీ భవన నిర్మాణానికి కూడా త్వరలో ని ధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ముదిరాజ్ సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఇందిరానగర్ స ర్పంచ్ మెంగని రమేశ్, నుస్తులాపూర్ సింగిల్విం డో చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్ర ణీత్రెడ్డి, వార్డుసభ్యుడు దావు సంపత్‌రెడ్డి, ముదిరాజ్ నాయకులు సిద్ద దాసు, భూమయ్య, పండు గ రాజు, కొమురయ్య, చంద్రయ్య, నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి, నాగేందర్, పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గన్నేరువరం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయ మని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని గోపాల్‌పూర్‌లో హన్మాజిపల్లె గ్రా మానికి చెందిన రజితకు రూ.10 వేలు, మైలారం గ్రామానికి చెందిన సంతోష్‌కు రూ. 6వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం వారికి అందించారు. అనంతరం గ్రామానికి చెందిన, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ ఆకుల సంతోశ్ తండ్రి ఆకుల నర్సయ్య ఇటీవల మృతిచెందగా వారి కు టుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామం లోని సమస్యలపై గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. సీసీ రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరా రు. రైతు బంధు పథకంలో చెక్కులను మరికొంత మంది రైతులకు రాలేదని వాటిని ఇప్పించాలని రై తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. రైతుల సంక్షేమానికై రైతు బంధు, రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అర్హులైన వారందరికి ఈ పథకాన్ని వర్తింపజేయడం తమ లక్ష్యమన్నా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రా వు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, మండల కోఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ న్యాత సుధాకర్, ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి, సర్పంచు గువ్వ వీరయ్య, యూత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బొడ్డు సునిల్, అటికం రవి, ఉపాధ్యక్షుడు చింతలపల్లి నర్సింహరెడ్డి, కొర్వి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్ళపల్లి అనిల్‌గౌడ్, తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, నూనే చంద్రారెడ్డి, పుల్లెల నరేందర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చచ్చిన పీనుగు..
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి జ్యోతి రావు పూలే వంటి వారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి.. ఇపుడు ప్రభుత్వంలో సుపరిపాలనను అందిస్తున్న ఈటెలపై కాంగ్రెస్ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటెల నిప్పులాంటి మనిషి.. ఆయనతో చెలగాటం కాంగ్రెస్ నేతలకు మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిన పీనుగని.. ఇక పైకిలేచే ప్రసక్తే లేదన్నారు. హుజురాబాద్‌లో ముగిసింది కాంగ్రెస్ బస్సు యాత్ర కాదని.. ఆ పార్టీకి జరిగిన అంతిమ యాత్రని విమర్శించారు. తిట్ల కోసమే అయితే బస్సు యాత్రలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ చేసిన అడ్డగోలు విమర్శలను ఖండిస్తున్నామని తెలిపారు. మరో వైపు రేవంత్ రెడ్డిపై కూడా రసమయి నిప్పులు చెరిగారు. కుక్కకు బొక్క లాగే.. రేవంత్‌కు మైకు అలాగే అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. మైకు దొరికితే చాలు రేవంత్ బండ బూతులు మాట్లాడుతున్నారని తెలిపారు. రేవంత్ కాంగ్రెస్‌లో జోకర్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో దొంగగా ఉన్న రేవంత్‌కు ఉస్మానియాలో తగిన గుణపాఠం జరిగిందని గుర్తు చేశారు. ఇతరులపై బురద చల్లి.. కడుక్కోమన్నట్టుగా రేవంత్ ధోరణి ఉందన్నారు. -
ఘనంగా తెలంగాణ సంబురాలు
వరంగల్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల అభిమానులు సంబురాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో కళాకారులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కలక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు బోనాలు, బతుకమ్మలు, డప్పులతో ధూంధాంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. మెహెందీ పోటీలు: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మహిళలకు మెహెందీ పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్: తెలంగాణ అవతరణ సంబురాలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులు డీజే ఏర్పాటు చేసి విద్యార్థులు చిందులేశారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్దకు సమూహంగా వెళ్లి మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ కాలేజీ విద్యార్థులతో పాటు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా: ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. తెలంగాణ కల సాకారం కావడానికి సోనియమ్మె కారణమని.. అలాంటి సోనియాగాంధీకి తగిన మర్యాద ఇవ్వకుండా.. ఆమె హోర్డింగ్‌లు తొలగించి తెలంగాణ సంబురాలు నిర్వహించ డాన్ని నిరసిస్తూ.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అహంకార పూరితమైన అధికారుల వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. -
ప్రజాగాయకుడు దరువు అంజన్న అదృశ్యం
హైదరాబాద్: ప్రజాగాయకుడు ,ఓయూ జేఏసీ నేత దరువు అంజన్న మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అతడే కిడ్నాప్ చేయించి ఉంటాడని అంజన్న భార్య సునీత జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రసమయికి వ్యతిరేకంగా అంజన్న "ధూంధాం" నిర్వహిస్తుండటమే ఈ కిడ్నాప్‌నకు కారణమని అతని భార్య ఆరోపించింది. -
నేను దళితుడిలాగా కనిపించటంలేదా?
-
నేను దళితుడిలాగా కనిపించటంలేదా?
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు సమున్నత స్థానం లభించలేదన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రంగా ఖండించారు. తాను దళితుడిలాగా రేవంత్ రెడ్డికి కనిపించటం లేదా అని బాలకిషన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో కులాల ప్రస్తావన తీసుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దళితులను కించపరిచేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణమే క్షమాపణ చెప్పాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. దళిత ద్రోహిగా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ...ఆపార్టీ ఎమ్మెల్యేలు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఎజెండా ఎప్పటికీ వర్కవుట్ కాదని బాలకిషన్ అన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే పార్లమెంట్ సెక్రటరీగా వి.సతీష్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్‌గా రసమయి బాలకిషన్ ఈరోజు ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. కాగా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాజయ్యపై వేటు పడిన విషయం తెలిసిందే. అనంతరం డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరిని నియమించిన విషయం తెలిసిందే.