
ఘనంగా తెలంగాణ సంబురాలు
వరంగల్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల అభిమానులు సంబురాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో కళాకారులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కలక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు బోనాలు, బతుకమ్మలు, డప్పులతో ధూంధాంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
మెహెందీ పోటీలు: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మహిళలకు మెహెందీ పోటీలు నిర్వహించారు.
ఆదిలాబాద్: తెలంగాణ అవతరణ సంబురాలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులు డీజే ఏర్పాటు చేసి విద్యార్థులు చిందులేశారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్దకు సమూహంగా వెళ్లి మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ కాలేజీ విద్యార్థులతో పాటు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ధర్నా: ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. తెలంగాణ కల సాకారం కావడానికి సోనియమ్మె కారణమని.. అలాంటి సోనియాగాంధీకి తగిన మర్యాద ఇవ్వకుండా.. ఆమె హోర్డింగ్‌లు తొలగించి తెలంగాణ సంబురాలు నిర్వహించ డాన్ని నిరసిస్తూ.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అహంకార పూరితమైన అధికారుల వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.