
సాక్షి, కరీంనగర్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంతసేపటికీ వారు కదలకపోవడంతో యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment