
సాక్షి,కరీంనగర్ జిల్లా : కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక డ్రైవర్ డ్యూటీ ఎక్కే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతడు మద్యం తాగినట్లు వచ్చింది.
అయితే తాను ఎలాంటి మద్యం సేవించలేదని, అసలు తనకు మద్యం తాగే అలవాటే లేదని డ్రైవర్ చెబుతున్నాడు. దీంతో అద్దె బస్సుల డ్రైవర్‌లు అంతా కలిసి బస్సులు తీయకుండా బస్‌స్టాండ్‌లో ఆందోళనకు దిగారు. దీంతో బస్‌స్టాండ్‌లోనే బస్సులు నిలిచిపోయాయి. ప్రైవేటు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.