
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీజేపీ నాయకులు
సాక్షి, కరీంనగర్‌టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌తోపాటు కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి స్టేజి వద్ద, మానకొండూరు పల్లె మీద చౌరస్తాలో, కొత్తపల్లి మండలం చింతకుంట ఎస్సారెస్పీ బ్రిడ్జిపై ఆదివా రం ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు.
తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, పాదం శివరాజ్, నాగసముద్రం ప్రవీణ్, నరహరి లక్ష్మారెడ్డి, అవదుర్తి శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, సోమిడి వేణుప్రసాద్, బండారు గాయత్రి, సమీ పర్వేజ్, కొలగాని శ్రీనివాస్, కాసర్ల ఆనంద్, జితేందర్, తిరుపతి, సాయికృష్ణ , మాడిశెట్టి సంతోష్‌కుమార్, రాపాక ప్రవీణ్, మియాపూరం లక్ష్మణాచారి, మొగిలి శ్రీనివాస్, సున్నాకుల శ్రీనివాస్, వంగల ఆంజనేయులు, దుర్గం శ్రీనివాస్‌గౌడ్, ప్రదీప్‌యాదవ్, మాచర్ల కోటేశ్వర్, కొండ్ర సురేశ్, మర్రి అంజి, వరప్రసాద్, కార్యదర్శి పొన్నాల మహేశ్, అన్నమయ్య, సూర్య, మాతంగి అనిల్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment