Mynampally Hanmanth Rao
-
మైనంపల్లి రోహిత్ మాటలకు అర్థాలే వేరులే..!
మెదక్: కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు 48 గంటల కరెంటు ఇస్తాననడంతో ఇదేం చోద్యం రోజుకు 24 గంటలే కదా ఉన్నది.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. అలాగే, మెదక్ నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేకుండా ఆయన మాట్లాడుతుండడంతో సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తక్షణం నియోజకవర్గ ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, రోహిత్‌రావు ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని పలువురు వాపోతున్నారు. ప్రచారంలోనూ ప్రజలపై మండిపడుతూ నేను చెప్పిందే వినాలని అనే విధంగా అసహనం వ్యక్తం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎమ్మెల్యేగా ఎన్నికై తే ఇంకెలా మాట్లాడుతారో అని ప్రజలు విమర్శిస్తున్నారు. జింకలు తరలించారంటూ గగ్గోలు హవేళిఘణాపూర్ మండలం పోచారం అభయారణ్యంలో 120 ఎకరాల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం విస్తరించి ఉంది. ఇందులో జింకల సంఖ్య ఒక పరిమితి వరకు మాత్రమే ఉంచుతారు. ఆ పరిమితి దాటితే వాటిని ఇక్కడి నుంచి వివిధ అటవీ ప్రాంతాలకు తరలిస్తారు. ఒకవేళ తరలించకుంటే వాటి సంఖ్య పెరిగి ఆహారం దొరక్క చనిపోతాయి. ఇటీవల ఈ ప్రత్యుత్పత్తి కేంద్రం నుంచి కొన్ని సిద్దిపేట జిల్లాలోని ఆక్సిజన్ పార్కుకు తరలించినట్లు తెల్సింది. దీనిపై రోహిత్‌రావు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు జింకలను సైతం వదలకుండా ఇక్కడి నుంచి తరలించాడంటూ వ్యాఖ్యలు చేశాడు. పార్కులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఏంటని, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంపై ఎలా పట్టు సాధిస్తాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. -
లాభమా? నష్టమా?
-
మల్కాజ్‌గిరిలో ఇవాళే బీఆర్ఎస్ బలప్రదర్శన
సాక్షి, మేడ్చల్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించినప్పటికీ.. కొడుక్కి సీటు దక్కలేదనే కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళో, రేపే ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖరారు అయ్యింది కూడా. దీంతో.. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఇంఛార్జి అయిన మర్రి రాజశేఖర్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపించారు. ఈయన మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి అల్లుడు కూడా. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి రాజశేఖర్‌రెడ్డి ఓడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే అంశం ఆధారంగా టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. బుధవారం ఉదయం మల్కాజ్గిరి ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. -
కేసీఆర్‌కు మైనంపల్లి సంచలన లేఖ.. బీఆర్ఎస్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార బీఆర్ఎస్ మాల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు మైనంపల్లి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, లేఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై మైనంపల్లి సంచలన ఆరోపణలు చేశారు. మైనంపల్లి లేఖలో.. బీఆర్ఎస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలతో తీవ్రవిబేధాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్టీ పేరు మార్చడం కార్యకర్తలకు ఇష్టం లేదని, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ తెలంగాణలో నష్టం వాటిల్లిందన్నారు. అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికీ లొంగే ప్రసక్తే లేదు.. అంతకుముందు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. రోహిత్‌కు నో టికెట్.. ఇదిలా ఉండగా.. గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. కానీ, ఆయన కుమారుడు రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో 70 సీట్లలో వడపోత పూర్తి! -
నన్ను ఇబ్బందిపెడితే ఊరుకోను.. మైనంపల్లి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. పార్టీని తనేమీ అనలేదని.. పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని అన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే.. తాను కూడా ఇబ్బంది పెడతానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, మైనంపల్లి శనివారం తన అనుచరులతో సమావేశమయ్యారు. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం, మైనంపల్లి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టుగా పేర్కొన్నారు. నా జోలికి వస్తే ఊరుకోను.. ఈ సందర్బంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని తనేమీ అనలేదని.. పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని అన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే.. తాను కూడా ఇబ్బంది పెడతానని చెప్పారు. తనకు సత్తా ఉందని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తనను ఎవరూ ఏం అనకుంటే వారి జోలికి వెళ్లనని చెప్పారు. తాను రేపటి నుంచి వారం రోజుల పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. వారం తర్వాతనే మీడియాతో మాట్లాడతానని తెలిపారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టుగా పేర్కొన్నారు. తొందరపడొద్దని చెప్పారని.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారని కూడా తెలిపారు. మీడియాతో మాట్లాడొద్దని ఆ నాయకుడు ఒట్టు కూడా వేయించుకున్నారని చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా.. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అదే సమయంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే మైనంపల్లి కోరికకు మాత్రం తిరస్కరించింది. దీంతో, మైనంపల్లి తాజాగా ఈ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. చెన్నమనేనికి కీలక పదవి -
మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఆయనను మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, పార్టీ గీత దాటారనే కారణంతో వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌పై హన్మంతరావు తిరుమలలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మెదక్‌లో ఆయన పెత్తనం ఏమిటి..ఆయనకు బుద్ధి చెప్తా. సిద్దిపేటలో ఆయనకు అడ్రస్ లేకుండా చేస్తా. ఆయన దుకాణం బంద్ చేసేవరకు నిద్రపోను..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిపై స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టికెట్ దక్కని నేతలకు ఇతర పదవులు ‘తన కుటుంబసభ్యుడికి టికెట్ నిరాకరించడంతో మా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సహనం కోల్పోయి మంత్రి హరీశ్‌రావుపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము హరీశ్‌రావుకు సంఘీభావంగా ఉంటామని తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంతర్భాగంగా ఉంటున్న హరీశ్.. పార్టీకి ముఖ్య స్తంభంగా ఇకముందు కూడా కొనసాగుతారు..’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపికైన బీఆర్ఎస్ అభ్యర్థులకు అభినందనలు. నన్ను సిరిసిల్ల నుంచి మరోమారు అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రజా జీవితంలో కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. అన్ని అర్హతలు, సమర్ధత కలిగిన మన్నె క్రిషాంక్ వంటి నేతలకు దురదృష్టవశాత్తూ అవకాశం దక్కలేదు. క్రిషాంక్తో పాటు టికెట్ దక్కని ఇతరులకు.. ఇతర పదవులకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజా సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తాం..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. గెలుపు మాత్రమే కేసీఆర్ చిరునామా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘సుమారు 40 ఏళ్లుగా ఎక్కడ, ఎప్పుడు పోటీ చేసినా గెలుపు మాత్రమే తన చిరునామాగా మల్చుకున్న మహా నాయకుడు కేసీఆర్. ఎమ్మెల్యేగా ఓడితే రాజకీయ సన్యాసం అని శపథం చేసి నిస్సిగ్గుగా తెల్లారే తుంగలో తొక్కి వెంటనే ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కూడా కేసీఆర్ గురించి మాట్లాడడం విడ్డూరం’అంటూ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓటమి భయం అంటే అమేథీ ఎన్నిక అయిన తరువాత జరిగిన మిగతా దశల ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయడమా? (అమేథీలో రాహుల్ ఓటమి తెలిసిందే). బళ్ళారి, అమేథీలో పోటీ చేసిన వ్యక్తి గురించి ఏమంటారు? (సోనియాను ఉద్దేశించి)’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వదోదర, వారణాసిలో మోదీ పోటీ ఎందుకు చేశారో బాండ్ పేపర్ వీరుడు (ధర్మపురి అర్వింద్) చెప్పగలరా?’అని ప్రశ్నించారు. నిబద్ధత కలిగిన నాయకుడు హరీశ్ ‘తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నాయకుడు హరీశ్‌రావు చేసిన సేవలు అనిర్వచనీయం. హరీశ్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మరోవైపు..‘మైనంపల్లికి టికెట్ ఇచ్చాం. పోటీ చేస్తారా? లేదా? అనేది ఆయన ఇష్టం. మేం చేయగలిగింది ఏమీ లేదు’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మంత్రిపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా హారీష్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించారనే ఆవేశంతో మన ఎమ్మెల్యే ఒకరు హరీష్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అంతేగాక మేమంతా హరీష్ రావుకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాను. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా కొనసాగుతున్నారు.’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.‘తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత,BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్ తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu He has been an… — KTR (@KTRBRS) August 21, 2023 మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ లభించిన వారందరికీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా సిరిసిల్ల అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలని టికెట్ లభించని వారిని ఉద్ధేశిస్తూ పేర్కొన్నారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పక లభిస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో? -
‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తనకు, తన భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ప్రాణహాని ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతాశేఖర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ‘నేను కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి మాపై దాడులకు పాల్పడుతున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు నాకు సమాచారం ఇవ్వ కుండా ఓడిపోయిన కార్పొరేటర్ భర్తతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. మున్సి పల్ అధికారులు కూడా మాకు సమాచారం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. తన క్యారెక్టర్‌పై నిందలు మోపుతూ, ఎమ్మెల్యే అనుచరులతో, ఆడవాళ్లతో అసభ్యంగా తిట్టిస్తూ వీడియోలు పెట్టి సోషల్‌మీడియాలో వైరల్ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తిట్టిన మహిళలపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన అనుచ రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరా రు. మల్కాజ్గిరి పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని అందువల్లే సాటి మహిళగా తనకు న్యాయం చేస్తారని మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఇతర నేతలతో కలిసి సునీతా శేఖర్ శనివారం వినతిపత్రం అందించారు. దీంతోపాటు తన బెదిరింపులకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఇచ్చారు. గతేడా ది ఆగస్టు 15న తన సహచర కార్పొరేటర్ శ్రవణ్‌పై ఎమ్మెల్యే, అనుచరులు భౌతికదాడు లకు పాల్పడిన ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినని సునీతాశేఖర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు -
రూ.70 కోట్లతో ఎస్టీపీల అభివృద్ధి
మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని ముఖ్యమైన చెరువుల వద్ద సుమారు రూ.70 కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సఫిల్‌గూడలోని ఎస్టీపీతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న బండ చెరువు ప్రాంతాలను శనివారం ఆయన జలమండలి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సఫిల్‌గూడ లోని 0.5 ఎంఎల్డీ ప్లాంట్ సామర్థ్యాన్ని సుమారు రూ.12.45 కోట్లతో 5.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీగా మార్చుతున్నామన్నారు. బండచెరువు వద్ద సుమారు 28.15 కోట్లతో 15 ఎంఎల్డీ ఎస్టీపీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు కోసం పిల్లి నర్సింగరావు కాలనీలో సుమారు మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆల్వాల్ కొత్త చెరువు వద్ద సుమారు రూ.28.90 కోట్లతో 15.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యే వెంట జలమండలి ప్రాజెక్ట్ అధికారి నరేందర్‌కుమార్, జీఎం సునీల్‌కుమార్, డీజీఎంలు స్రవంతి రెడ్డి, భాస్కర్, జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ డీసీ జి.రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, తహసీల్దార్ వినయలత, ఉన్నారు. చెరువుల ప్రక్షాళనకు చర్యలు.. అల్వాల్: అల్వాల్‌లో చెరువుల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన అధికారులు, కార్పొరేటర్లతో కలిసి అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతున్న అల్వాల్‌లోని మోత్కుల కుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుడి చెరువులలో మురుగు నీరు కలుస్తుండటంతో నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. చెరువులలోకి వరదనీటిని మళ్లించడంతో పాటు వ్యర్థాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఇందుకోసం రూ.1 50 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, ప్రేంకుమార్, డీసీ నాగమణి, అధికారులు నాగేందర్, నిర్మల, పవన్‌కుమార్, ఈఈ రాజు, డీఈలు మహేష్ , ప్రశాంతి, ఏఈ, లక్ష్మీ, జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వసతుల కల్పన అల్వాల్: వెంకటాపురం డివిజన్లో అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రూ.1.03 కోట్ల వ్యయంతో భూదేవినగర్, సుభాష్‌నగర్, ఇందిరానగర్‌లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన కార్పొరేటర్ సబితాకిషోర్‌తో కలిసి ప్రారంభించారు. -
వీధిరౌడీలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఎల్బీనగర్/మలక్‌పేట జోన్ పరిధిలోని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి దిష్టిబొమ్మలు దహనం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. సాక్షి, పహాడీషరీఫ్( హైదరాబాద్): టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వీధి రౌడీలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని బీజేపీ జల్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు వివేకానంద (కపిల్)గౌడ్ అన్నారు. మైనంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీరాం కాలనీలో జల్పల్లి 16వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బుడుమాల యాదగిరితో కలిసి సోమవారం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీఆర్ఎస్ గుండాలు బీజేపీ కార్పొరేటర్‌పై దాడికి పాల్పడటం దారుణమన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తే తట్టుకోలేని మైనంపల్లి చెప్పలేని భాషలో దూషణకు దిగడం సిగ్గుచేటన్నారు. వెంటనే మైనంపల్లిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ► సైదాబాద్: మైనంపల్లిపై చర్యలు తీసుకునే వరకు భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి అన్నారు. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► టీఆర్ఎస్ నాయకులు గుండాయిజం చెలాయిస్తూ విపక్షపార్టీల ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తుంటే పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్‌రెడ్డి విమర్శించారు. చంచల్‌గూడ: దమ్ము ఉంటే ఎమ్మెల్యే మైనంపల్లి పాతబస్తీకి రాస్తే తమ తడాఖా చూపిస్తామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సహదేవ్‌యాదవ్ అన్నారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచినందుకు అతను పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఎల్బీనగర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై ఎమ్మెల్యే మైనంపల్లి అతడి అనుచరులు పోలీసుల సమక్షంలో దాడి చేయడంపై కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై అసభ్య పదజాలంతో దూషించిన మైనంపల్లి వెంటనే బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్కేడీనగర్ చౌరస్తాలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం..
-
ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం..
సాక్షి, కరీంనగర్‌టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌తోపాటు కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి స్టేజి వద్ద, మానకొండూరు పల్లె మీద చౌరస్తాలో, కొత్తపల్లి మండలం చింతకుంట ఎస్సారెస్పీ బ్రిడ్జిపై ఆదివా రం ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు. తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, పాదం శివరాజ్, నాగసముద్రం ప్రవీణ్, నరహరి లక్ష్మారెడ్డి, అవదుర్తి శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, సోమిడి వేణుప్రసాద్, బండారు గాయత్రి, సమీ పర్వేజ్, కొలగాని శ్రీనివాస్, కాసర్ల ఆనంద్, జితేందర్, తిరుపతి, సాయికృష్ణ , మాడిశెట్టి సంతోష్‌కుమార్, రాపాక ప్రవీణ్, మియాపూరం లక్ష్మణాచారి, మొగిలి శ్రీనివాస్, సున్నాకుల శ్రీనివాస్, వంగల ఆంజనేయులు, దుర్గం శ్రీనివాస్‌గౌడ్, ప్రదీప్‌యాదవ్, మాచర్ల కోటేశ్వర్, కొండ్ర సురేశ్, మర్రి అంజి, వరప్రసాద్, కార్యదర్శి పొన్నాల మహేశ్, అన్నమయ్య, సూర్య, మాతంగి అనిల్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ జరిగింది. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగింది. దీనిపై పోలీసులు రహాస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు 305 ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్‌లో ఎమ్మెల్యే బంధువు అమర్నాథ్ బాబు కుటుంబం కొంతకాలంగా నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. ఫ్లాట్‌లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, నారాయణగూడ సీఐ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించకుండా చోరీపై గోప్యత పాటిస్తున్నారు. పోలీసులు పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉండే క్వార్టర్ట్స్‌లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తమ డ్రైవర్ ఇంట్లో పలు వస్తువులు కూడా దొంగతనానికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు డ్రైవర్‌పై అనుమానిస్తున్నారు. ఈ క్వార్టర్స్ ఇటీవల కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే. -
రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ..
-
రోడ్డెక్కిన స్థానికులు: రోడ్డు వేస్తేనే ఓటు..
సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుతో విసిగిపోయిన స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ యాప్రాల్‌లో స్థానికులు ఆదివారం రోడ్డెక్కారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అడ్డుకుని నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ఎన్నికల తర్వాత తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. లెటర్‌ప్యాడ్‌పై ఎమ్మెల్యే సంతకం చేసి ఇవ్వగా స్థానికులు తిరస్కరించారు. మీ సొంత నిధులు మాకు అక్కర్లేదని, ప్రభుత్వాన్ని తాము ట్యాక్స్ కడుతున్నామని తెలిపారు. వారికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. (చదవండి: ఉద్రిక్తత: బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ) -
ఆంధ్రాలోనూ టీడీపీ గల్లంతే: మైనంపల్లి
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత రావు మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షాన్ని తిట్టిన తిట్టుకుండా తిట్టి, తిరిగి అదే పార్టీలో కలిసిన రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మరోసారి మాట్లాడితే తెలంగానలో తిరగలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రాలోనూ టీడీపీ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తులు పెట్టుకున్నా టీఆర్ఎస్ను ఓడించలేరని అని అన్నారు. -
ముఖేశ్ గౌడ్‌తో టీఆర్ఎస్ నేత భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్‌తో టీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు భేటీ అయ్యారు. ముఖేష్‌గౌడ్ నివాసంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మైనంపల్లి హన్మంతరావు, ముఖేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మైనంపల్లి హన్మంతరావు రహస్య చర్చలు జరిపారని తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన జాంబాగ్‌లోని ముఖేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ భవన్లో మాట్లాడుకుందాం రమ్మంటూ ఆహ్వానించి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ముఖేశ్ గౌడ్ ఇదివరకే మీడియాకు కూడా తెలిపారు. దాని తర్వాత మైనంపల్లి వచ్చి ప్రత్యేకంగా భేటీ కావడంతో ముఖేశ్ గౌడ్ పార్టీ మారతారనే చర్చ ఊపందుకుంది. కొంతకాలంగా గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా ముఖేశ్ గౌడ్, ఆయన కుమారుడు హాజరుకావడం లేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీకుమారులు గైర్హాజరు కావడంతో పార్టీ మారతారనే అనుమానం రెట్టింపైంది. -
ఎమ్మెల్సీ అవకాశం ఎవరికో?
అధికార పార్టీ అభ్యర్థిత్వాలపై కొనసాగుతున్న సస్పెన్స్ ►మూడు సీట్ల కోసం నేతల పోటాపోటీ ►పావులు కదుపుతున్న ఆశావహులు ►ఎంపికపై గులాబీ అధినేత కసరత్తు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అభ్యర్థులకు మూడు స్థానాలు దక్కే అవకాశముండగా.. ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అభ్యర్థులపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇంకా కసరత్తు కొనసాగిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో ఒకటి కలిపి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఐదు రోజులు గడువు మాత్రమే ఉన్నా.. అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న వి.గంగాధర్ గౌడ్‌కు ఈసారి కూడా అవకాశం ఇవ్వనున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. దీంతో మిగతా మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంఐఎం తమ రెండు స్థానాలను తమకు వదిలేయాలని టీఆర్ఎస్ను కోరే అవకాశం ఉందంటున్నారు. ఒక స్థానమైనా ఎంఐఎంకు ఇచ్చే అవకాశమున్నా.. ఇప్పటి దాకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. దీంతో మూడు స్థానాలపైనా టీఆర్ఎస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు, వివిధ హామీలు పొంది ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీలో ఉన్నారు. తెరపైకి పలువురి పేర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ఎర్రోల్ల శ్రీనివాస్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్నారని చెబుతున్నారు. ఇక పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావు ఈ సారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో అవకాశమివ్వాలని ఆయన కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వీరితోపాటు వరంగల్‌కు చెందిన గుడిమల్ల రవికుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు, మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా భువనగిరికి చెందిన పార్టీ సీనియర్ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. చర్చలో మహిళా అభ్యర్థి? శాసస మండలిలో అత్యధిక మంది సభ్యులున్న టీఆర్ఎస్కు మహిళా సభ్యులు మాత్రం లేరు. దీంతో ఈసారి ఒక మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా కేసీఆర్ వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత కొద్దినెలలకే సుధా రాణి రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది. ఆమె కూడా ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారని చెబుతున్నారు. -
ఉద్యమ మహావృక్షానికి చెదలు: కర్నె ప్రభాకర్
పార్టీ టికెట్ దక్కకపోవడంపై కన్నీరుపెట్టిన నేత హైదరాబాద్: ఉద్యమ మహా వృక్షానికి చెదలు పట్టాయని టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ నాయకుడు కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మునుగోడు అసెంబ్లీ టికెట్‌ను ఆయన ఆశించిన విషయం తెలిసిందే. తనకు టికెట్ రాకపోవడానికి పార్టీలోని నాయకులే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చిన ప్రభాకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 14 సంవత్సరాలుగా పార్టీకోసం, ఉద్యమం కోసం పనిచేశానని, అయితే తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయితే పార్టీలో ఉన్న లొసుగులను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మైనంపల్లికి టీఆర్ఎస్ కండువా..: మల్కాజ్గిరి లోక్‌సభ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు శనివారం కేసీఆర్ పార్టీ కండువా కప్పి లాంఛనంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయన మొన్నటి వరకు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్లోకి వచ్చారు. ఇంతకు ముందు ఫాం హౌజ్ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను కలసి ఆయన పార్టీలో చేరారు. అయితే తెలంగాణ భవన్‌కు మొదటిసారి రావడంతో.. లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
కలిసొస్తే కౌగిలి.. కాదంటే కత్తే!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వ త శత్రువులు ఉండరన్నది నానుడి. అందువల్లే ఒకప్పుడు కత్తులు దూసిన వాళ్లే కాలంతో పాటు మారి కౌగిలించుకుంటారు. పార్టీ ఏదైనా నాయకుని అంతిమ లక్ష్యం పదవి. ఆ పదవిని ఒడిసిపట్టుకునే ప్రయత్నంలోనే రాజకీయ సమీకరణలు నిమిషానికో తీరుగా మారుతుంటాయి. ఎన్నికల వేళ మెతుకు సీమలో అవే దృశ్యాలు సాక్షాత్కరించాయి. ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు 2009లో కేసీఆర్, హరీష్‌రావుపై కత్తులు దూశారు. నువ్వెంత..అంటే నువ్వెంత అనుకుంటూ వీరు గిరిగీసుకొని సవాల్ చేసుకున్నారు. వీళ్ల సవాల్‌తో అప్పట్లో మెతుకు సీమ దద్దరిల్లింది. అప్పడేం జరిగిందంటే... పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో 343-361 సర్వే నంబర్లలో 1098. 29 ఎకరాల ప్రభుత్వ భూమిని సీమాంధ్ర వాళ్లు ఆక్రమించుకున్నారని, వాళ్ల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ నేతలు రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ప్రతి సవాల్‌గా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రంగంలోకి దిగారు. సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 810, 813, 814, 815, 827, 784/1, 817 లలోని 110.26 గుంటల ఎస్సీల భూములను కేసీఆర్బంధువులు అక్రమించారని ప్రత్యారోపణలు చేశారు. అంతేకాదు రాఘవాపూర్‌కు వచ్చి సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానన్నారు. దమ్ముంటే వచ్చి నిరూపించని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సైతం మైనంపల్లికి సవాల్ విసిరారు. దీంతో 2009 నవంబర్14 ఉదయం 11 గంటలకు ప్రజా కోర్టులో నిజానిజాలు తేల్చుకుందామని ఇద్దరు నేతలు ముహుర్తం ఖరారు చేశారు. అదే రోజున ఇద్దరు ఎమ్మెల్యేలు తమ తమ అనుచరులతో రాఘవాపూర్‌కు వెళ్లడానికి సిద్ధం కావడంతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా ఎస్పీ భారీ సాయుధ బలగాలు సిద్దిపేటలో మొహరించారు. చివరకు మైనంపల్లి హన్మంతరావును రాఘవాపూర్ వైపు వెళ్లకుండా పట్టణ శివారులోనే పోలీసులు అరెస్టు చేసి రామాయంపేట పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో వివాదస్పద అంశం అప్పట్లో సద్దుమణిగింది. ఇక ఆ తర్వాత కేసీఆర్ వంట మనిషి ఆంధ్రా వ్యక్తేనంటూ, కేసీఆర్ పూర్వీకులు ఆంధ్రావారేనంటూ పాపన్నపేట మండలం లక్ష్మీనగర్, మెదక్ మండలం మాచవరం గ్రామ సెటిలర్లకు మైనంపల్లి హన్మంతరావు అండగా నిలిచారు. దీంతో వారంతా 90 శాతం తమ ఓట్లను మైనంపల్లికి, టీడీపీకి వేసేవారు. కాలచక్రం గిర్రున తిరిగితే... ఏదేళ్లు గడిచాయి. కాలం మారింది. కాలంతో పాటే వాళ్లు మారారు. అన్ని మర్చిపోయి ఇపుడు మిత్రులయ్యారు. ఇంతకాలం సేవ చేసిన టీడీపీ కాదు పొమ్మంటే 36 గంటల్లోనే మూడు పార్టీలు మార్చిన మైనంపల్లి చివరకు కేసీఆర్‌ను కౌగిలించుకున్నారు. కలసి వచ్చిన తమ్మునికి కేసీఆర్ మాల్కాజ్‌గిరి పార్లమెంటు టికెటిచ్చి సత్కరించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా...పాపం కేసీఆర్- మైనంపల్లిల నడిచిన యుద్ధంలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యదర్శి, బీసీ నాయకుడు బీరయ్య యాదవ్ బలైపోయారు. మైనంపల్లిని ఎదుర్కొనేందుకు కేసీఆర్, హరీష్‌ల తరఫున పోరాడిన ఆయన, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కూడా ఎనలేని సేవలందించారు. అయితే ఇపుడు ఎన్నికల వేళ మిత్రుత్వం బెడిసింది. దీంతో బీరయ్య యాదవ్ ఏకంగా కేసీఆర్‌కు రెబల్‌గా మెదక్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడూ, ఇప్పుడూ ఆమే ప్రత్యర్థి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా ఇన్చార్జి, డీసీసీ అధికార ప్రతినిధి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ అసెంబ్లీ బరిలో నిలిచి మైనంపల్లి హన్మంతరావు చేతిలోనే ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుని పార్టీ కోసం పని చేశారు. తీరాా రావాల్సిన సమయం వచ్చే సరికి రాములమ్మ తెరపైకి వచ్చేసింది. పోయిన ఎన్నికల్లో కేసీఆర్‌తో కలిసి మెదక్ పార్లమెంటుపై గులాబీ జెండా ఎగుర వేసిన విజయంశాంతి, ఇప్పుడు గులాబీ బాస్‌తో విరోధం పెట్టుకొని మూడు రంగుల జెండా పట్టుకుంది. అనుకోకుండా వచ్చిన అతిథిని కాంగ్రెస్ అధిష్టానం కూడా బాగానే గౌరవించింది. మెదక్ ‘అసెంబ్లీసీటు’ వేసి కూర్చోబెట్టింది. దీంతో శశిధర్‌రెడ్డి మూడు రంగుల కండువాను భుజంపైనుంచి తీసేసి రెబల్ జెండా ఎత్తుకున్నారు. -
చంద్రబాబుకు మైనంపల్లి షాక్