సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుతో విసిగిపోయిన స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ యాప్రాల్‌లో స్థానికులు ఆదివారం రోడ్డెక్కారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అడ్డుకుని నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ఎన్నికల తర్వాత తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. లెటర్‌ప్యాడ్‌పై ఎమ్మెల్యే సంతకం చేసి ఇవ్వగా స్థానికులు తిరస్కరించారు. మీ సొంత నిధులు మాకు అక్కర్లేదని, ప్రభుత్వాన్ని తాము ట్యాక్స్ కడుతున్నామని తెలిపారు. వారికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. (చదవండి: ఉద్రిక్తత: బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ)
Comments
Please login to add a commentAdd a comment