yapral
-
పూల కుండీల్లో గంజాయి మొక్కలు
-
రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ..
-
రోడ్డెక్కిన స్థానికులు: రోడ్డు వేస్తేనే ఓటు..
సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుతో విసిగిపోయిన స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ యాప్రాల్‌లో స్థానికులు ఆదివారం రోడ్డెక్కారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అడ్డుకుని నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ఎన్నికల తర్వాత తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. లెటర్‌ప్యాడ్‌పై ఎమ్మెల్యే సంతకం చేసి ఇవ్వగా స్థానికులు తిరస్కరించారు. మీ సొంత నిధులు మాకు అక్కర్లేదని, ప్రభుత్వాన్ని తాము ట్యాక్స్ కడుతున్నామని తెలిపారు. వారికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. (చదవండి: ఉద్రిక్తత: బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ) -
పక్కాప్లాన్ ఫేయిల్.. ప్రత్యర్థి చేతిలో ప్రాణాలు..
సాక్షి, మేడ్చల్ : ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన విక్కీ అలియాస్ చిన్నారెడ్డి, కృష్ణ, జోసఫ్, వికాస్ కుమార్‌లకు అదేప్రాంతానికి చెందిన శ్రావణ్ అనే వ్యక్తికి మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రావణ్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న ఆ నలుగురు పక్కాగా ప్లాన్ వేసుకుని దాడి చేయటానికి శ్రావణ్ ఇంటికి వెళ్లారు. ప్లాన్ ప్రకారం కత్తులతో అతడిపై దాడికి దిగారు దీంతో తిరగబడ్డ శ్రావణ్ తిరిగి కత్తితో వారిపై ప్రతిదాడికి దిగాడు. ఈ దాడిలో విక్కీ అక్కడిక్కడే మృతిచెందగా వికాస్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వికాస్‌తో పాటు దాడిలో గాయపడ్డ మిగిలిన ఇద్దరు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ గొడవకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్: అన్ లైన్ ద్వారా వ్యభిచారం నడిపిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు అయింది. ఈ సంఘటనకు సంబంధించి యాప్రాల్‌లో ముగ్గురు యువతులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పరారయ్యాడు. పట్టుబడిన యువతులను జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మేడ్చల్ యాప్రాల్‌లో మావోల అంత్యక్రియలు
-
అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీయువకులు అరెస్ట్
హైదరాబాద్ : నగర శివారులోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన నగరం శివారులోని జవహర్‌నగర్ యాప్రాల్ రిజిస్ట్రేషన్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో ముగ్గురు యువతులు, ఆరుగురు యువకులు ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే కార్లను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. యువతీయువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన ముగ్గురు యువతులు పక్క రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. -
ఏనుగు వచ్చిందోచ్!
యాప్రాల్: వినాయకుడి ఊరేగింపులో పాల్గొనేందుకు గజేంద్రుడిని తీసుకు వస్తున్న లారీ దారితప్పి నేరేడ్మెట్లో ఆగిపోవడంతో సుమారు ఆరు గంటల పాటు ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. వివరాల్లోకి వెళితే... శంషాబాద్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన వేడుకలలో పాల్గొనేందుకు గుల్బర్గా నుంచిలారీలో ఏనుగును తీసుకువచ్చారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఆ వాహనం దారి తప్పి నేరేడ్మెట్ చేరుకుంది. ఇంతలో లారీ మరమ్మతులకు గురవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్డుపైనే లారీ నిలిచిపోయింది. దీంతో లారీలో ఉన్న గజేంద్రుడిని చూడడానికి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గుమిగూడారు. పండ్లు, ఎలక్కాయలు ఆహారంగా వేస్తూ చిన్నారులు ఆనందంగా గడిపారు. కొందరు తమ సెల్ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారు.