
శ్రావణ్ దాడిలో గాయపడ్డ వ్యక్తులు
సాక్షి, మేడ్చల్ : ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన విక్కీ అలియాస్ చిన్నారెడ్డి, కృష్ణ, జోసఫ్, వికాస్ కుమార్‌లకు అదేప్రాంతానికి చెందిన శ్రావణ్ అనే వ్యక్తికి మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రావణ్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న ఆ నలుగురు పక్కాగా ప్లాన్ వేసుకుని దాడి చేయటానికి శ్రావణ్ ఇంటికి వెళ్లారు.
ప్లాన్ ప్రకారం కత్తులతో అతడిపై దాడికి దిగారు దీంతో తిరగబడ్డ శ్రావణ్ తిరిగి కత్తితో వారిపై ప్రతిదాడికి దిగాడు. ఈ దాడిలో విక్కీ అక్కడిక్కడే మృతిచెందగా వికాస్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వికాస్‌తో పాటు దాడిలో గాయపడ్డ మిగిలిన ఇద్దరు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ గొడవకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment