group war
-
జనసేనలో జగడం
సాక్షి, విశాఖపట్నం: జనసేనలో అభ్యర్థి ప్రకటన ఇంకా వెలువడక ముందే గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విశాఖ జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వంశీ యాదవ్‌ను విశాఖ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో.. జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంశీకి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని.. తామేం మేకలం కాదంటూ సింబాలిక్‌గా మేకలతో నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో వంశీ వర్గీయులు మహిళలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీ యాదవ్ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లామని.. టికెట్ ఇస్తే మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంటామని పవన్‌ను పలువురు మహిళలు హెచ్చరిస్తున్నారు. -
బెజవాడ టీడీపీలో మంటలు.. కొత్త చిచ్చు రగులుకుంది..
సాక్షి, విజయవాడ: ఆ జిల్లా ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. క్రమంగా అక్కడి కోటలన్నీ బీటలు వారాయి. పైకి వీర విధేయులమనే చెప్పుకుంటున్నారు కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఝలక్ ఇస్తుంటారు. ఇదీ బెజవాడలో సైకిల్ పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం మీరంటే.. మీరంటూ పచ్చ పార్టీ నాయకుల మధ్య కొట్లాట మొదలైంది. ఈ తగాదాలతో నేతల మధ్య మొదలైన గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఫలితంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా అనేలా పరిస్థితులు మారాయి. కొంతకాలం క్రితం తనకు సరైన గౌరవం దక్కడం లేదని కేశినేని నాని అలకబూనారు. చదవండి: అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా? దీంతో చంద్రబాబే ఒక మెట్టు దిగి వచ్చి కేశినేని నానిని బుజ్జగించడంతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. ఐతే ఈ నిర్ణయాన్ని అప్పట్లో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక అప్పట్నుంచి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి పరిస్థితులు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కేశినేని నాని తమ్ముడు కేశినేని శివనాధ్ ఆలియాస్ చిన్ని బెజవాడ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉండటంతో పార్టీలో కొత్త చిచ్చు రగులుకుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం కేశినేని నానికి ఇబ్బందిగా మారింది. ఇదంతా తనను పార్టీలోంచి పొమ్మనలేక పొగబెట్టడానికే అని కేశినేని నాని బలంగా నమ్మడంతో చంద్రబాబుతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సైతం కేశినేని నాని దూరంగా ఉన్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇక తన అసహనాన్ని, అసంతృప్తినంతా సోషల్ మీడియా వేదికగా పంచుకుని పార్టీలో తీవ్ర చర్చకు తెర తీశారు కేశినేని నాని. ఇలా వరుస పరిణామాలతో పార్టీ అధినేతకే తలబొప్పి కట్టేట్లు చేశారు నాని. చంద్రబాబుకు ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడే ఉన్న కేశినేని నాని బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించి అటు అధినేతను.. ఇటు పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశారు. ఇలా తరచూ అలిగే నానితోనే వేగలేకపోతున్న చంద్రబాబుకు తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయట. ఈ సారి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి తీరుతామని పదే పదే చెప్పే కేశినేని నాని ఈ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక హాజరైన నేతల్లో కొందరికి సరైన గౌరవం దక్కక పోవడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన బుద్ధా వెంకన్న స్టేజ్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడం చూసి షాక్ తిన్నారు. తన ఫోటో పెట్టకపోవడంతో స్టేజ్ మీదకు పిలిచినా వెళ్లలేదు. కొల్లు రవీంద్ర స్వయంగా వచ్చి ఆహ్వానించినా బుద్ధా వెంకన్న ససేమిరా కుదరదని తేల్చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని ఇక అక్కడ ఉండలేక వైజాగ్ లో పనుందంటూ సమావేశం నుంచి బయటికి వచ్చేశాడు బుద్ధా. అక్కడి పరిస్థితులు చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. చంద్రబాబు కోసం ప్రాణం ఇచ్చే నాలాంటి వారికే ఇలా జరిగితే ఎలా అనుకుంటూ నాగుల్ మీరాతో కలిసి సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయాడు బుద్ధా వెంకన్న. ఈ పరిణామాలను ఊహించని నేతలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. బుద్ధా వెంకన్నకు జరిగిన అవమానంతో పశ్చిమ నియోజవర్గ టీడీపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. నాగుల్ మీరా సైతం ఈసారి తనకు టిక్కెట్ ఇస్తే సరేసరి లేకపోతే పార్టీ మారిపోవడానికైనా నేను సిద్ధం అంటూ తెగేసి చెప్పేశారట. -
కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ మొదలైంది. రేవంత్‌రెడ్డి వైఖరిపై సీనియర్ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. బుధవారం.. ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు ఆధ్వర్యంలో మనుగోడు అభ్యర్థి ఎంపికపై గాంధీ భవన్లో సమావేశం జరగనుంది. సమావేశానికి ముందే సీనియర్ నేత పాల్వాయి స్రవంతి కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో లీక్ గాంధీభవన్‌లో చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ ఆడియో కలకలం రేపుతోంది. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ దిద్దుబాటు చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ప్రతిపాదనను పాల్వాయి స్రవంతి వ్యతిరేకిస్తున్నారు. ‘‘చండూరు సభ నా వల్లే సక్సెస్ అయ్యింది. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే హుజురాబాద్ సీన్ రిపీట్ ఖాయం. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకోను’’ అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది. -
మేడ్చల్‌జిల్లాలో కత్తిపోట్లకు ఒకరు బలి
-
పక్కాప్లాన్ ఫేయిల్.. ప్రత్యర్థి చేతిలో ప్రాణాలు..
సాక్షి, మేడ్చల్ : ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన విక్కీ అలియాస్ చిన్నారెడ్డి, కృష్ణ, జోసఫ్, వికాస్ కుమార్‌లకు అదేప్రాంతానికి చెందిన శ్రావణ్ అనే వ్యక్తికి మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రావణ్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న ఆ నలుగురు పక్కాగా ప్లాన్ వేసుకుని దాడి చేయటానికి శ్రావణ్ ఇంటికి వెళ్లారు. ప్లాన్ ప్రకారం కత్తులతో అతడిపై దాడికి దిగారు దీంతో తిరగబడ్డ శ్రావణ్ తిరిగి కత్తితో వారిపై ప్రతిదాడికి దిగాడు. ఈ దాడిలో విక్కీ అక్కడిక్కడే మృతిచెందగా వికాస్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వికాస్‌తో పాటు దాడిలో గాయపడ్డ మిగిలిన ఇద్దరు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ గొడవకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. -
బిగ్‌బాస్2 : తనీష్ వర్సెస్ నూతన్ నాయుడు
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 రెండో వారం ఆసక్తికరంగా సాగుతోంది. తొలివారం వరకూ బాగానే ఉన్న హౌస్మేట్స్ రెండో వారాంతానికి గ్రూపులుగా విడిపోయారు. అంతేకాకుండా కంటెస్టెంట్ల మద్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. హోస్ట్ నానీ చెప్పినట్లుగానే ఏమైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా అన్నట్లుగానే సాగుతోంది. వీటన్నింటిని వివరిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శుక్రవారం విడుదల చేసిన ప్రోమో అందరినీ అలరించింది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. సామాన్యుల కోటా నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగిపెట్టిన నూతన్ నాయుడు, సామ్రాట్ల మద్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటిలోని వస్తువులను సక్రమంగా ఉంచట్లేదనే విషయంలో ఇద్దరు వాగ్వాదానికి తెలుస్తోంది. అంతేకాకుండా నూతన్‌నాయుడు, తనీష్‌ల మద్య కూడా గొడవ జరిగింది. ఇందులో నూతన్ నాయుడు ఎక్కువగా మాట్లాడకు అనగా.. స్పందించిన తనీష్ ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ దూసుకువచ్చారు. పక్కనే ఉన్న గణేష్, కౌషల్‌లు తనీష్‌ను ఆపే ప్రయత్నం చేశారు. వీటితో పాటు మేమేమి చేతులకు గాజులేసుకు కూర్చోలేదు అంటూ నూతన్ నాయుడు పేల్చిన మాటల తూటాలు నేటి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. వీరితో పాటు తేజస్వి, కౌషల్ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. -
కడపలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు
-
విష్ణు చక్రం!
జెడ్పీ పీఠం చుట్టూ రాజకీయం - చైర్మన్ మార్పునకు అధికార పార్టీలోనే పోరు - మంత్రాంగం మొదలుపెట్టిన కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి విష్ణు? - తన మనిషికి పదవి కట్టబెట్టే ప్రయత్నం - ఒప్పందం మేరకు తనకే ఇవ్వాలని పుష్పావతి పట్టు - తాజాగా తెరపైకి వాల్మీకులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్‌ను గద్దె దించేందుకు మంత్రాంగం మొదలయ్యింది. ఇందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్దన్ రెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. తన వర్గానికి చెందిన జెడ్పీటీసీని చైర్మన్ చేయించుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. మరోవైపు ఒప్పందం మేరకు తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని పుష్పావతి తీవ్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పాటు ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌లను కలుస్తున్నారు. తనకే అవకాశం ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో తమకు అవకాశం కల్పించాలంటూ వాల్మీకి వర్గానికి చెందిన జెడ్పీటీసీలు కూడా పావులు కదుపుతున్నట్టు సమాచారం. గతంలో తమ వర్గానికి చెందిన వెంకటప్పనాయుడుకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తప్పించారని.. ఇప్పుడైనా ఆ తప్పిదాన్ని సరిచేసుకోవాలని అధికార పార్టీని కోరుతున్నారు. ఈ విధంగా ఎవరికి వారు జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రంగంలోకి విష్ణు జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంలో విష్ణువర్దన్ రెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్టు తెలిసింది. చైర్మన్ మార్పు వ్యవహారం నిజమేనని.. ఇదే సందర్భంలో కోడుమూరు నియోజకవర్గానికి చెందిన తమకే పదవి వచ్చేలా చేసుకుందామని పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాకుండా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మనస్ఫూర్తిగా సహకరించారని విష్ణువర్దన్ రెడ్డి గురించి.. నేరుగా సీఎం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గం నుంచి ఎవరో ఒకరు చైర్మన్ పీఠాన్ని చేపడితే బాగుంటుందని.. ఇందుకు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా సహకరించే వీలుందని విష్ణు అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు దీనినే తమకు అవకాశంగా మలచుకునేందుకు మరికొందరు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ లాలుస్వామి.. గతంలో చైర్మన్ పీఠం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీపడ్డారు. ఈ సందర్భంలో మళ్లీ అవకాశం కోసం ఆయన కూడా ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, తన పీఠానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చైర్మన్ రాజశేఖర్ ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. నాకంటే.. నాకే! జెడ్పీ చైర్మన్ పీఠం కోసం వైస్–చైర్మన్‌గా ఉన్న పుష్పావతి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పైగా గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు తనకే అవకాశం వస్తుందని ఆమె ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఎక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇప్పటి వరకు ఈమెకు ఇంకా లైన్ క్లియర్ కాలేదని సమాచారం. అయినప్పటికీ చైర్మన్ పీఠం తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు వాల్మీకి వర్గానికి చెందిన జెడ్పీటీసీలు కూడా రంగంలోకి దిగారు. గతంలో వాల్మీకి వర్గానికి చెందిన వెంకటప్పనాయుడుకు చేసిన మోసాన్ని సవరించుకోవాలంటే తమ వర్గానికే చైర్మన్ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటప్పనాయుడు కూతురు పేరును కొంత మంది తెరమీదకు తెస్తున్నారు. మొత్తం మీద చైర్మన్ పీఠం వ్యవహారంతో అధికారపార్టీలో ఆశావాహులకు అంతేలేకుండా పోతోంది. చివరకు పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఇరువర్గాల దాడులు: ఇద్దరి పరిస్థితి విషమం
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంగారెడ్డి గూడెంలోని ముత్రాస్పేటలో రెండు వర్గాలు గురువారం కత్తులు దూసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుప్రత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలయ్య ఇలాకాలో తమ్ముళ్ల వర్గపోరు
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, సీనీ నటుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్ల వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైరివర్గాలతో విబేధాలు ముదరడంతో నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న లేపాక్షి మాజీ ఎంపీపీ మల్లికార్జున్ వెయ్యిమంది కార్యకర్తలతోసహా పార్టీ నుంచి బయటికి వచ్చేయనున్నట్లు సమాచారం. ఆ మేరకు నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం హిందూపురంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మల్లికార్జున్. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ ఆ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో మల్లికార్జున్ వర్గీయులు మరింత అసహనానికి గురయ్యారు. మరోవైపు అసంతృప్తనేతలను బుజ్జగించేందుకు టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగారు. -
మళ్లీ గ్రూప్ వార్
రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూప్ వార్ మొదలైంది. రాష్ట్రంలోని నేతల తీరుపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తీవ్రంగానే స్పందించారు. అంబులెన్స్ అవినీతి మరక నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం చిదంబరం వర్గం మండి పడుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఇదే ఆ పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. ఇది వరకు అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానదేశిక న్ నేతల్ని ఏకం చేసి ఐక్యతను చాటుకునేలా కొంత మేరకు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపుగా ఉన్న జీకే వాసన్‌తో కలిసి జ్ఞానదేశికన్ బయటకు వెళ్లడంతో కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఆదిలోనే హంసపాదు తప్పలేదు. ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గ్రూపు నేతలతో తంటాలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గంతో, ఇంకో వైపు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు వర్గంతో ఢీకొడుతూనే వస్తున్నారు. వీరి రూపంలో తన మీద ఫిర్యాదులు అధిష్టానానికి చేరు తూ వస్తుండడం, వాటికి వివరణ ఇచ్చుకోలేక సతమ తం కావాల్సినపరిస్థితి ఈవీకేఎస్‌కు.చాప కిందనీరులా సాగుతున్న ఈ వ్యవహారాలతో విసిగి వేసారిన ఈవీకేఎస్ ఇక, గ్రూపు నేతలతో తాడో పేడుకు రెడీ అయ్యారు. అధిష్టానం అండతో ఇక పార్టీ బలోపేతం మీదే దృష్టి పెట్టి, గ్రూపు నేతల భరతం పట్టేందుకు వ్యాఖ్యాల దాడికి దిగుతుండటంతో మరో మారు గ్రూప్ వార్‌కు కాంగ్రెస్ కేంద్ర బిందువుగా మారుతున్నది. కాంగ్రెస్ నేతల మధ్య బహిరంగ వార్ బయలు దేరిన పక్షంలో ఇక, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సత్యమూర్తి భవన్ వద్ద రోజూ ఉత్కంఠే. వ్యాఖ్యల దాడి : గత నెల తంగబాలు మద్దతు వర్గానికి చెందిన పార్టీ జిల్లాల అధ్యక్షుల్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్వాసన పలికిన ఈవీకేఎస్, తాజాగా, చిదంబరం వర్గాన్ని టార్గెట్ చేస్తూ స్వరాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు చిదంబరం వర్గీయుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. అంబులెన్స్‌ల వ్యవహారంలో తమ నేతకు సంబంధం లేని చిదంబరం వర్గీయులు వాదిస్తున్న సమయంలో ఈవీకేఎస్ అందుకు భిన్నంగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం గ్రూపుల మధ్య మరింత రచ్చ చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాను నిర్ధోషినంటూ కార్తీ చిదంబరం స్పష్టం చేస్తున్నా, ఈ కేసులో ఆయన తప్పించుకోలేడంటూ ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని చిదంబరం మద్దతు దారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తప్పించుకోలేడు : కామరాజర్ ట్రస్టు వ్యవహారం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మదురై తల్లాకులం పోలీసు స్టేషన్లో సంతకం చేయడానికి ఆదివారం ఈవీకేఎస్ ఇళంగోవన్వచ్చారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మక్కల్ ఆయువగం సర్వేలో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాలేదని, దీన్ని బట్టి చూస్తే, ఎవరో పనిగట్టుకుని ప్రజల్ని దారి మళ్లించేందుకు ఈ సర్వే చేయించినట్టు స్పష్టం అవుతున్నదన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని పార్టీలో గ్రూపు నేతలు సాగిస్తున్న వ్యవహారాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన మీద పడ్డ ఆరోపణల నుంచి బయట పడేందుకే ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా ప్రచారం సాగిస్తున్నారని మండి పడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఫోన్లో మాట్లాడేంతగా చనువు తనకు ఉందని, అలాంటప్పుడు ఢిల్లీకి తాను పరుగులు తీయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికకుట్రలు, కుతంత్రాలైనా చేసుకోండి, వాటిని పట్టించుకోను, అవసరం అయితే, తిప్పికొట్టేందుకు రెడీ అని వ్యాఖ్యానించారు. ఇక, అంబులెన్స్ అవినీతి ఉచ్చు నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని, ఆ కేసును ఎదుర్కొవాల్సిందేనని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. కాగా, అదే సమయంలో చిదంబరంకు వ్యతిరేక శక్తిగా శివగంగైలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సుదర్శన నాచ్చియప్పన్ తల్లాకులంలో ఈవీకేఎస్ను కలుసుసుకోవడం గమనార్హం. -
తారాస్థాయికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కలహాలు
-
దిగిరాని అయ్యన్న
బుజ్జగింపునకు దేశం సకలయత్నాలు వెలగపూడి రాయభారం విఫలం తాజాగా యనమల రంగప్రవేశం బాబు వద్దకు తప్పని పంచాయతీ సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశంపార్టీలో గంటా-అయ్యన్న గ్రూప్ వార్ ముదిరిపాకానపడుతోంది. పార్టీకి పరిష్కరించలేని తలనొప్పిగా మారుతోంది. గంటా పార్టీలో చేరికపై అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న అయ్యన్నను బుజ్జగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కరకు రావడంలేదు. చివరకు ఈపంచాయతీ త్వరలో చంద్రబాబువద్దకు చేరబోతోంది. అయ్యన్న వర్గంగా ముద్రపడ్డ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి గంటా ఆదేశం మేరకు శుక్రవారం నర్సీపట్నం రాయబారానికి వెళ్లారు. అయినా అయ్యన్న నుంచి స్పందన లేదు. చేసేది లేక వెలగపూడి రాయబారం నుంచి తప్పుకున్నారు. ఇదే విషయాన్ని శనివారం విలేకరులతో అన్నారు. సమస్య పరి ష్కారం బాబు వలనే అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ వివాదం పార్టీ పరువు బజారుకీడుస్తుందేమోనని అధినాయకత్వం గుబులు చెందుతోంది. పంచాయతీ తన వద్దకు రాకముందే రాజీ చేయాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఎంవీవీఎస్ మూర్తి రాజీ యత్నాలు కూడా బెడిసికొట్టడంతో వివాదాన్ని తేలికచేసే పనిని ఇప్పుడు యనమలకు అప్పగించారు. అయ్యన్నతో యనమల శనివారం ఫోన్లో సంప్రదించినట్లు తెలిసింది. ఈనెల 12న ప్రజాగర్జన తర్వాత మాట్లాడుకుందామని యనమల సూచిస్తున్నా అయ్యన్న పట్టు వీడడంలేదని తెలుస్తోంది. అవసరమైతే వివాదం సద్దుమణిగించేందుకు అయ్యన్న అడుగుతోన్న సీట్ల విషయమై తర్వాత నిర్ణయం తీసుకుందామని బుజ్జగిస్తున్నా ఆయన వినడంలేదు. ఇదేవిషయమై ‘సాక్షి’ యనమలతో ఫోన్లో మాట్లాడగా ఈవివాదంపై తాను అయ్యన్నతో ఫోన్లో మాట్లాడతానని చెప్పారు. గర్జన ఏర్పాట్లకు ఎలాగూ రావలసి ఉన్నందున వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలని ప్రస్తుతం ఈయన యోచిస్తున్నారు. బండారు, గంటా కలిసి అయ్యన్న వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిస్తే వివాదం సమసిపోతుందని పార్టీ సీనియర్‌నేత గద్దె రామ్మోహన్ ఇటీవల సూచించారు. దీనికి గంటా ఇష్టపడడంలేదని సమాచారం. ప్రస్తుత వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక పార్టీ అధిష్ఠానం తలబద్దలుకొట్టుకుంటోంది. ఎంవీవీఎస్ మూర్తి బాబును కలిసి మాట్లాడే అవకాశముంది. అయ్యన్న తనను గజదొంగల చేరికతో పోల్చిన విషయాన్ని గంటా వద్ద ప్రస్తావిస్తే నో కామెంట్ అన్నారు. దీన్నిబట్టి గంటా రాజీకి సిద్ధంగా ఉన్నా, అయ్యన్న వైఖరే అంతుబట్టాల్సి ఉంది.