జనసేనలో జగడం | Jana Sena Party Group War In Visakhapatnam South | Sakshi
Sakshi News home page

జనసేనలో జగడం

Published Wed, Mar 20 2024 1:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

Jana Sena Party Group War Visakhapatnam South - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జనసేనలో అభ్యర్థి ప్రకటన ఇంకా వెలువడక ముందే గ్రూప్‌ తగాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విశాఖ జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వంశీ యాదవ్‌ను విశాఖ వెస్ట్‌ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వర్గం ఆందోళనకు దిగింది.

ఈ క్రమంలో.. జనసేన కార్పొరేటర్‌ సాధిక్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంశీకి టికెట్‌ ఇస్తే ఊరుకునేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని.. తామేం మేకలం కాదంటూ సింబాలిక్‌గా మేకలతో నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో వంశీ వర్గీయులు మహిళలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీ యాదవ్‌ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లామని.. టికెట్‌ ఇస్తే మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంటామని పవన్‌ను పలువురు మహిళలు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement