May 7th: ఏపీ ఎన్నికల సమాచారం | AP Assembly Elections 2024: Political News Updates In Telugu On May 7th, 2024 | Sakshi
Sakshi News home page

May 7th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌.. ఎప్పటికప్పటి సమాచారం

Published Tue, May 7 2024 7:26 AM | Last Updated on Tue, May 7 2024 9:20 PM

AP Elections 2024: May 7th Politics Latest News Updates Telugu

AP Political And Elections News Updates In Telugu

09:00 PM, May 7th, 2024

పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులు

  • మీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్‌కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులు
  • పిఠాపురం కూటమిలో కుంపట్లు
  • టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్‌ వర్గానికి మధ్య విభేదాలు

06:20 PM, May 7th, 2024

గాజువాక  రోడ్‌షోలో సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యం
  • ప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్‌ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాం
  • గతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది
    13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డది
  • విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయడమే కాక జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..
  • ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, 
    చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డ
  • లంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్ది
  • ఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి
  • సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నా
  • రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారు
  • నాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,
  • ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ
    వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*
  • బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండి
  • మీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి

04:51 PM, May 7th, 2024

తాడేపల్లి :

  • మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారు
  • ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్‌ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?
  • ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.
  • మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు.
     - సీఎం వైఎస్ జగన్

04:10 PM, May 7th, 2024

కాకినాడ:

సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబు

  • ఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే  మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్‌పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?
  • పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయింది
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడు
  • పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడు
  • చంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదు
  • పెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడు
  • ఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాడు
  • అధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడు
  • దీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారు
  • ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు
     

03:56 PM, May 7th, 2024

తిరుపతి: 

మమ్మల్ని తిట్టేందుకే  చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమన

  • ఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారు
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయి
  • టీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారు
  • దార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది
  • అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారు
  • కానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోంది‌‌
  • పవన్ కల్యాణ్‌కి  ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడు
  • ఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడో
  • ఆరణి శ్రీనివాసులు గత  కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడు
  • ఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్  బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు

02:49 PM, May 7th, 2024

విజయవాడ: 

సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆగని  బోండా ఉమా కుమారుల అరాచకాలు

  • వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడు
  • సింగ్‌నగర్‌, నందమూరి నగర్‌లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీను
  • ఆటోలో పెన్‌డ్రైవ్‌ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీను
  • విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులు
  • ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు
  • అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

02:02 PM, May 7th, 2024
మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా

  • ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదు
  • కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
  • పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపు
  • కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది
  • ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చు
  • సెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశం
  • అలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చు
  • వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టం
  • ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాం
  • కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
  • కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు
  • ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాం
  • కొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారు
  • దీనిపై విచారణ చేపడుతున్నాం
  • తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
  • పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాం
  • లీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాం
  • పల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
  • పల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం

01:54 PM, May 7th, 2024
ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్

  • బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స 
  • కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్స
  • మోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్స
  • రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్స
  • టీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్స
  • ఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్స
  • మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్స
  • ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్స
  • నా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్స
  • మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్స
  • మోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్స
  • రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స

01:32 PM, May 7th, 2024
కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స

  • 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదు
  • కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలి
  • టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయి
  • ఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి
  • కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారు
  • చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయి
  • ఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబు
  • బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు
  • చంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?
  • చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది
  • ఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదు
  • ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలి
  • రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?
  • రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?
  • వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలి
  • పింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి
  • 15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు
  • భవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాం
  • చంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..
  • బాబు ఉద్యోగస్తులను మోసం చేశారు
  • ఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది

 

01:11 PM, May 7th, 2024
మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా  

  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం 
  • పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.
  • హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.
  • అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాం
  • పోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.
  • 3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారు
  • పలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాం
  • ఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చు
  • పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చింది
  • ఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణం
  • పశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం

01:08 PM, May 7th, 2024
ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషు

  • డీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారు
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.
  • ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది
  • కల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.
  • పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదు
  • పథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.
  • ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.
  • పవన్‌ కల్యాణ్‌  చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో  బలిపశువు అయ్యారు.
  • కాపులు ఎదగడం పవన్‌ కల్యాణ్‌ , చంద్రబాబులకు ఇష్టం లేదు.
  • కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.
  • ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.
  • ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారు
  • పేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.

01:04 PM, May 7th, 2024
ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?:  MLC లేళ్ల అప్పిరెడ్డి

  • ఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోంది
  • ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు
  • ఇంకొక‌పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు
  • ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?
  • అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది
  • అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది
  • కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది
  • ఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?
  • విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు
  • చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు
  • వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు
  • చంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాం
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?

12:48 PM, May 7th, 2024
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్

  • టీడీపీ వీడి వైస్సార్‌సీపీలో  చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలు
  • పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్

12:43 PM, May 7th, 2024
రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌

•    క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్‌కు ఇప్పుడే ఇబ్బందులు..
•    మీ బిడ్డ జగన్‌ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?
•    ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..
•    వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..
•    జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..

12:36 PM, May 7th, 2024
రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌

•    చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..
•    జగన్‌ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..
•    జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..
•    ఆన్‌గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..
•    అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..
•    జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి


రాజానగరంలో సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం కోసం క్లిక్‌ చేయండి

 

12:28 PM, May 7th, 2024
రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌

•    2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్‌ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు
•    ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు
•    రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు
•    దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్‌పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు
•    ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపారు
•    ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు
•    సైకిల్‌కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు
•    ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు
•    చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు
•    చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో

 

11:49 AM, May 7th, 2024
బోండా ఉమా కొడుకి దౌర్జన్యం

  • YSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి  
  • ప్రచారం చేస్తున్న వైస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.
  • నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
  • బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లా
  • తన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావు
  • గెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులు
  • ప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీ
  • సెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడి
  • టీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లు
  • వైస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.
  • దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు

 

11:37 AM, May 7th, 2024
జననేత కోసం జనం

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్
  • సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలు
  • మరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్
  • హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షో
  • సీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు

11:11 AM, May 7th, 2024
పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్‌

  • అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
  • విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులు
  • చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్
  • లంచ్‌ మోషన్‌ కింద విచారించనున్న ఏపీ హైకోర్టు
  • చంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు

11:02 AM, May 7th, 2024
షర్మిలపై కేసు నమోదు

  • ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పై కేసు నమోదైంది. 
  • కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ 
  • ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన 
  • కేసు నమోదు చేసిన వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు 
  • ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన  కడప కోర్టు

10:32 AM, May 7th, 2024
నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపు

  • బనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులు
  • వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు  
  • బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుం
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డి
  • అదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి
  • వైఎస్సార్‌సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవ
  • గాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు

10:29 AM, May 7th, 2024
మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!

  • ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.
  • ఇప్పటివరకూ కొనసాగుతున్న‌ సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు ఈసీ బ్రేక్‌
  • మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.
  • పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!
  • పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!
  • పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?

10:19 AM, May 7th, 2024
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. TDPకి ఏపీ బీజేపీ షాక్‌

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్
  • దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదు
  • ఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలి
  • కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుంది

ఎక్స్ లో ట్వీట్ చేసిన‌ బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు

10:00 AM, May 7th, 2024
మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబు

  • చంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..
  • రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. 
  • ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..
  • ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..
  • కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420..  అయన చేయని అక్రమాలు లేవు..
  • ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడు

తెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్

9:49 AM, May 7th, 2024
ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్‌సీపీ ఆగ్రహం

  • కొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలె
  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నో
  • ఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCP
  • తెలంగాణలో సబ్సిడీ ఇన్‌ఫుట్‌కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్న
  • ఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది

9:39 AM, May 7th, 2024
అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బ

  • అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...
  • టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన వంద కుటుంబాలు
  • తెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డి
  • జగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్‌సీపీలో చేరామన్న స్థానికులు

9:23 AM, May 7th, 2024
డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేత

  • పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేత
  • టీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు  
  • ⁠ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!
  • జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • ⁠తనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత

8:50 AM, May 7th, 2024
జనంలోకి జగన్‌

  • ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
  • నేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీ
  • రాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్‌లో ప్రచారం
  • మధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో ప్రచారం
  • విశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్‌లో ప్రచారం

8:23 AM, May 7th, 2024
నేడు పవన్‌  ప్రచారం ఇలా..

  • ప్రకాశం దర్శిలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం
  • సాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌

8:01 AM, May 7th, 2024
హవ్వా.. ఇదేంది బాబూ!

  • తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణం
  • పూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబు
  • తనను ప్రజలు నమ్మట్లేదని  ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేత
  • సీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబు
  • ఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలు
  • బాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీ
  • చంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్

7:25 AM, May 7th, 2024
తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలు

  • సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్‌ 
  • కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ
  • మహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.
  • అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలి
  • నిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక.

 

6:59 AM, May 7th, 2024
చిలకటూరిపేట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఈసీ సీరియస్‌ 

  • చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా  వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.
  • ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.
  • అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.
  • వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.
  • సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు

6:45 AM, May 7th, 2024
చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

  • సీఎం  జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహం
  • ఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్
  • బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్
  • ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు

6:37 AM, May 7th, 2024

భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..

  • భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!
  • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.
  • ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడ
  • సర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.
  • చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులు
  • ఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!

6:30 AM, May 7th, 2024
అబద్దం.. వాస్తవం

  • ఎన్నికల వేళ కూటమి కుట్రలు

  • ఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలు

  • వాస్తవాలతో వివరించే యత్నం 

  • వీడియో పోస్ట్‌ చేసిన వైస్సార్‌సీపీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement