రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూప్ వార్ మొదలైంది. రాష్ట్రంలోని నేతల తీరుపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తీవ్రంగానే స్పందించారు. అంబులెన్స్ అవినీతి మరక నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం చిదంబరం వర్గం మండి పడుతోంది.
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఇదే ఆ పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. ఇది వరకు అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానదేశిక న్ నేతల్ని ఏకం చేసి ఐక్యతను చాటుకునేలా కొంత మేరకు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపుగా ఉన్న జీకే వాసన్‌తో కలిసి జ్ఞానదేశికన్ బయటకు వెళ్లడంతో కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఆదిలోనే హంసపాదు తప్పలేదు. ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గ్రూపు నేతలతో తంటాలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గంతో, ఇంకో వైపు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు వర్గంతో ఢీకొడుతూనే వస్తున్నారు.
వీరి రూపంలో తన మీద ఫిర్యాదులు అధిష్టానానికి చేరు తూ వస్తుండడం, వాటికి వివరణ ఇచ్చుకోలేక సతమ తం కావాల్సినపరిస్థితి ఈవీకేఎస్‌కు.చాప కిందనీరులా సాగుతున్న ఈ వ్యవహారాలతో విసిగి వేసారిన ఈవీకేఎస్ ఇక, గ్రూపు నేతలతో తాడో పేడుకు రెడీ అయ్యారు. అధిష్టానం అండతో ఇక పార్టీ బలోపేతం మీదే దృష్టి పెట్టి, గ్రూపు నేతల భరతం పట్టేందుకు వ్యాఖ్యాల దాడికి దిగుతుండటంతో మరో మారు గ్రూప్ వార్‌కు కాంగ్రెస్ కేంద్ర బిందువుగా మారుతున్నది. కాంగ్రెస్ నేతల మధ్య బహిరంగ వార్ బయలు దేరిన పక్షంలో ఇక, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సత్యమూర్తి భవన్ వద్ద రోజూ ఉత్కంఠే.
వ్యాఖ్యల దాడి : గత నెల తంగబాలు మద్దతు వర్గానికి చెందిన పార్టీ జిల్లాల అధ్యక్షుల్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్వాసన పలికిన ఈవీకేఎస్, తాజాగా, చిదంబరం వర్గాన్ని టార్గెట్ చేస్తూ స్వరాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు చిదంబరం వర్గీయుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. అంబులెన్స్‌ల వ్యవహారంలో తమ నేతకు సంబంధం లేని చిదంబరం వర్గీయులు వాదిస్తున్న సమయంలో ఈవీకేఎస్ అందుకు భిన్నంగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం గ్రూపుల మధ్య మరింత రచ్చ చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాను నిర్ధోషినంటూ కార్తీ చిదంబరం స్పష్టం చేస్తున్నా, ఈ కేసులో ఆయన తప్పించుకోలేడంటూ ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని చిదంబరం మద్దతు దారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
తప్పించుకోలేడు : కామరాజర్ ట్రస్టు వ్యవహారం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మదురై తల్లాకులం పోలీసు స్టేషన్‌లో సంతకం చేయడానికి ఆదివారం ఈవీకేఎస్ ఇళంగోవన్‌వచ్చారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మక్కల్ ఆయువగం సర్వేలో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాలేదని, దీన్ని బట్టి చూస్తే, ఎవరో పనిగట్టుకుని ప్రజల్ని దారి మళ్లించేందుకు ఈ సర్వే చేయించినట్టు స్పష్టం అవుతున్నదన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని పార్టీలో గ్రూపు నేతలు సాగిస్తున్న వ్యవహారాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తన మీద పడ్డ ఆరోపణల నుంచి బయట పడేందుకే ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా ప్రచారం సాగిస్తున్నారని మండి పడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఫోన్లో మాట్లాడేంతగా చనువు తనకు ఉందని, అలాంటప్పుడు ఢిల్లీకి తాను పరుగులు తీయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికకుట్రలు, కుతంత్రాలైనా చేసుకోండి, వాటిని పట్టించుకోను, అవసరం అయితే, తిప్పికొట్టేందుకు రెడీ అని వ్యాఖ్యానించారు. ఇక, అంబులెన్స్ అవినీతి ఉచ్చు నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని, ఆ కేసును ఎదుర్కొవాల్సిందేనని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. కాగా, అదే సమయంలో చిదంబరంకు వ్యతిరేక శక్తిగా శివగంగైలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సుదర్శన నాచ్చియప్పన్ తల్లాకులంలో ఈవీకేఎస్‌ను కలుసుసుకోవడం గమనార్హం.
మళ్లీ గ్రూప్ వార్
Published Mon, Aug 31 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement