State Congress
-
అసంతృప్తి ‘దండోరా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి దండోరా’ మోగింది. టీపీసీసీ కార్యవర్గ సమావేశం వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు సీనియర్లు గళమెత్తినట్టు సమాచారం. గురువారం గాంధీభవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశానికి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్లు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టీం తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల నిర్వహణ ఏకపక్షంగా జరుగుతోం దని, తమను భాగస్వాములను చేయడం లేదని ఫిర్యాదు చేశారు. పార్టీలో వ్యక్తిగత ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఇకపై అందరితో చర్చించిన తర్వాతే ఈ సభల నిర్వహణ ప్రకటించాలని, సభల నిర్వహణలోనూ అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న గజ్వేల్‌లో జరగాల్సిన సభను వాయిదా వేయడం గమనార్హం. కాగా అదే రోజున మేడ్చల్‌లో 48 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కోవర్టులెవరు? ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పార్టీలో కోవర్టు రాజకీయాలు చేయవద్దని, అలాంటి వారు పార్టీ వదిలి వెళ్లిపోతే మంచిదని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఇంటి దొంగలున్నారనే రీతిలో రేవంత్ చేసిన కామెంట్లు ఎలాంటి సంకేతాలిచ్చాయో అర్థం చేసుకోవాలని ఒకరిద్దరు సీనియర్లు అన్నట్టు తెలిసింది. నిజంగా అలాంటి వారు పార్టీలో ఉంటే గుర్తించి చర్యలు తీసుకోవాలని, కోవర్టులున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించడం మంచిది కాదని వారు పేర్కొన్నారు. అందరితో చర్చించే నిర్ణయాలు సీనియర్లు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ టీం కూడా సమావేశంలో ధీటుగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. రేవంత్‌కు మొదటి నుంచీ తోడుగా ఉన్న సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ఇతర సీనియర్లు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో పార్టీ పరిస్థితికి, రేవంత్ వచ్చిన తర్వాత పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలన్నారు. అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామని, కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఇంకెన్నాళ్లు కుమ్ములాడుకుందామని ప్రశ్నించారు. మనం పోరాటం చేయాల్సింది టీఆర్ఎస్ పార్టీపై అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, చిన్న చిన్న సమస్యలుంటే మాట్లాడుకోవచ్చని అన్నారు. అధిష్టానానికి అన్నీ తెలుసు: మాణిక్యం సీనియర్ల అభిప్రాయాలపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ టీపీసీసీలో ఏం జరుగుతోందో, పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారో అధిష్టానానికి అంతా తెలుసునని అన్నట్టు సమాచారం. ‘ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏం లీకులిస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. క్రమశిక్షణ రాహిత్యం సహించే పరిస్థితుల్లో పార్టీ లేదు. అందరూ కలసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలి..’అని సూచించినట్లు తెలిసింది. పీఏసీ భేటీలకు సీనియర్లను పిలవండి: జగ్గారెడ్డి ప్రతి వారం జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాలకు సీనియర్లను ఆహ్వానించాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమయ్యింది. ఈ లేఖలో ఆయన ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లాంటి వారి పేర్లను ప్రస్తావించారు. పీఏసీ సమావేశాలకు వారిని కూడా పిలవాలని కోరారు. మొత్తం మీద రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన గైర్హాజరీలో జరిగిన సమావేశంలో పార్టీలో అసంతృప్తి బహిర్గతం కావడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. 24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు అమలు చేయాలని, గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష చేయనున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు సంఘీభావంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దండోరా ముగింపు సభకు రాహుల్‌గాంధీ వస్తారని తెలిపారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ప్రతి శనివారం జరిగే ముఖ్య నేతల సమావేశం యథాతథంగా కొనసాగుతుందన్నారు. -
యూత్ కాంగ్రెస్‌లో హోరాహోరీ!
రాష్ట్ర అధ్యక్ష పదవి బరిలో నేతల వారసులు * గెలుపు కోసం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తనయుల ఢీ * ఇరువర్గాలు పరస్పరం బెదిరింపులు, కిడ్నాప్‌లకు దిగుతున్న వైనం * వారసులతో పోటీ పడలేమంటున్న సాధారణ యువనేతలు * ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్నికలు, 12న ఫలితాలు సాక్షి, హైదరాబాద్ : యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో హల్చల్ సృష్టిస్తోంది. నేతల వారసులు రంగంలోకి దిగడంతో వాతావరణం వేడెక్కింది. ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంఎల్ఏ భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే గ్రామ, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ఎన్నికలు ముగిసిపోగా, 9, 10 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ కమిటీలతో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని సుమారు తొమ్మిదివేల మంది ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. తమ కుమారుల విజయం కోసం మాజీ ఎంపీ అంజన్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌లు కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల సాయం కోరుతుండటంతో పార్టీలోని ముఖ్య నాయకులంతా రెండు వర్గాలుగా చీలిపోయి వేర్వేరుగా రెండు ప్యానెల్లకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. బెదిరింపులు, అడ్డదారులు ... : ఈ ఎన్నికలను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ ఇరు ప్యానెళ్లు పరస్పరం కిడ్నాప్‌లు, భౌతిక దాడులు, బెదిరింపులకు దిగాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన న రేశ్ను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నించారన్న అభియోగంతో మాజీ ఎంపీ అంజన్ తనయుడిపై గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, ఇదే తరహాలో మహబూబ్‌నగర్, సనత్‌నగర్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. రవికుమార్సైతం తమను బెదిరించారని ఓ యువజన కాంగ్రెస్ నేత సైబరాబాద్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గం తప్పుడు ఫిర్యాదులు చేస్తోందన్నారు. ఇదే విషయంపై రవికుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మార్గదర్శకాలకు విరుద్ధంగా బెదిరింపులు, కిడ్నాప్లతో ఎన్నికలను గెలవాలని చూడటం దారుణమన్నారు. కాగా, దాడులు, బెదిరింపుల వ్యవహారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లిందని కొందరు పార్టీ నేతలు వెల్లడించారు. 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలయ్యే ఓట్లను 12వ తేదీన హైదరాబాద్‌లో లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. జిల్లాల్లోనూ నేతల వారసులు.. ఇక జిల్లాల్లో కూడా పలువురు నేతల వారసులు రంగంలో ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం స్థానం నుంచి మేఘనారెడ్డి (మాజీ మంత్రి జె.గీతారెడ్డి కుమార్తె), మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంతోష్‌రెడ్డి(మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డి దగ్గరి బంధువు) పోటీ పడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవికోసం మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనయుడు చరణ్‌రెడ్డి రంగంలో ఉన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికోసం మాజీమం త్రి డి.కె.అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయినాథ్ మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకర్గ అధ్యక్ష పదవికోసం రేసులో ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత రత్నాకర్‌రెడ్డి తనయుడు రమాకాంత్‌రెడ్డి వరంగల్ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌లో మా పరిస్థితేంటి? పార్టీకోసం అంకితభావం కలిగిన నాయకత్వాన్ని యువజన స్థాయి నుంచి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో జరుగుతున్న ఎన్నికలను సీనియర్ నేతల వారసులు తమ అధిపత్యం కోసం వాడుకుంటున్నారని సాధారణ యువజన నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి వారసత్వం, ఆర్థిక బలం లేని తాము వెనకబడిపోవాల్సి వస్తోందని, పార్టీలో ఎప్పటికీ దిగువస్థాయిలోనే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. -
మళ్లీ గ్రూప్ వార్
రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూప్ వార్ మొదలైంది. రాష్ట్రంలోని నేతల తీరుపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తీవ్రంగానే స్పందించారు. అంబులెన్స్ అవినీతి మరక నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం చిదంబరం వర్గం మండి పడుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఇదే ఆ పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. ఇది వరకు అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానదేశిక న్ నేతల్ని ఏకం చేసి ఐక్యతను చాటుకునేలా కొంత మేరకు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపుగా ఉన్న జీకే వాసన్‌తో కలిసి జ్ఞానదేశికన్ బయటకు వెళ్లడంతో కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఆదిలోనే హంసపాదు తప్పలేదు. ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గ్రూపు నేతలతో తంటాలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గంతో, ఇంకో వైపు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు వర్గంతో ఢీకొడుతూనే వస్తున్నారు. వీరి రూపంలో తన మీద ఫిర్యాదులు అధిష్టానానికి చేరు తూ వస్తుండడం, వాటికి వివరణ ఇచ్చుకోలేక సతమ తం కావాల్సినపరిస్థితి ఈవీకేఎస్‌కు.చాప కిందనీరులా సాగుతున్న ఈ వ్యవహారాలతో విసిగి వేసారిన ఈవీకేఎస్ ఇక, గ్రూపు నేతలతో తాడో పేడుకు రెడీ అయ్యారు. అధిష్టానం అండతో ఇక పార్టీ బలోపేతం మీదే దృష్టి పెట్టి, గ్రూపు నేతల భరతం పట్టేందుకు వ్యాఖ్యాల దాడికి దిగుతుండటంతో మరో మారు గ్రూప్ వార్‌కు కాంగ్రెస్ కేంద్ర బిందువుగా మారుతున్నది. కాంగ్రెస్ నేతల మధ్య బహిరంగ వార్ బయలు దేరిన పక్షంలో ఇక, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సత్యమూర్తి భవన్ వద్ద రోజూ ఉత్కంఠే. వ్యాఖ్యల దాడి : గత నెల తంగబాలు మద్దతు వర్గానికి చెందిన పార్టీ జిల్లాల అధ్యక్షుల్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్వాసన పలికిన ఈవీకేఎస్, తాజాగా, చిదంబరం వర్గాన్ని టార్గెట్ చేస్తూ స్వరాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు చిదంబరం వర్గీయుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. అంబులెన్స్‌ల వ్యవహారంలో తమ నేతకు సంబంధం లేని చిదంబరం వర్గీయులు వాదిస్తున్న సమయంలో ఈవీకేఎస్ అందుకు భిన్నంగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం గ్రూపుల మధ్య మరింత రచ్చ చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాను నిర్ధోషినంటూ కార్తీ చిదంబరం స్పష్టం చేస్తున్నా, ఈ కేసులో ఆయన తప్పించుకోలేడంటూ ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని చిదంబరం మద్దతు దారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తప్పించుకోలేడు : కామరాజర్ ట్రస్టు వ్యవహారం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మదురై తల్లాకులం పోలీసు స్టేషన్లో సంతకం చేయడానికి ఆదివారం ఈవీకేఎస్ ఇళంగోవన్వచ్చారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మక్కల్ ఆయువగం సర్వేలో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాలేదని, దీన్ని బట్టి చూస్తే, ఎవరో పనిగట్టుకుని ప్రజల్ని దారి మళ్లించేందుకు ఈ సర్వే చేయించినట్టు స్పష్టం అవుతున్నదన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని పార్టీలో గ్రూపు నేతలు సాగిస్తున్న వ్యవహారాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన మీద పడ్డ ఆరోపణల నుంచి బయట పడేందుకే ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా ప్రచారం సాగిస్తున్నారని మండి పడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఫోన్లో మాట్లాడేంతగా చనువు తనకు ఉందని, అలాంటప్పుడు ఢిల్లీకి తాను పరుగులు తీయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికకుట్రలు, కుతంత్రాలైనా చేసుకోండి, వాటిని పట్టించుకోను, అవసరం అయితే, తిప్పికొట్టేందుకు రెడీ అని వ్యాఖ్యానించారు. ఇక, అంబులెన్స్ అవినీతి ఉచ్చు నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని, ఆ కేసును ఎదుర్కొవాల్సిందేనని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. కాగా, అదే సమయంలో చిదంబరంకు వ్యతిరేక శక్తిగా శివగంగైలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సుదర్శన నాచ్చియప్పన్ తల్లాకులంలో ఈవీకేఎస్ను కలుసుసుకోవడం గమనార్హం. -
దిగ్విజయ్‌సింగ్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
-
కాబోయే సీఎం కుష్బు
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో కుష్బు సెలబ్రెటీ అయ్యారు. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను ప్రకటించిన వెంటనే నాయకులు పలాన పదవికి అంటే, పలాన పదవికి ఆమె అర్హురాలు అని ఊకదంపుడు ప్రసంగాలతో పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. నిన్న మొన్నటి పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కుష్బును మంత్రిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడ్డా కుష్బు మంత్రి కావడం తథ్యమని ప్రకటించేశారు. ఈ ప్రకటన వినడానికి బాగానే ఉన్నా, కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు మాత్రం కారాలు మిరియాలు నూరే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా అక్కడి నాయకులు కాబోయే సీఎం కుష్బు అని నినదిస్తూ, సీఎం పదవికి ఆమె అర్హు రాలిగా ప్రకటిస్తూ నినాదాలు హోరెత్తించడం గమనార్హం. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆ చట్టాన్ని మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే సర్కారు వైఖరిని ఎండగడుతూ తిరుచ్చిలోని అన్నా విగ్రహం వేదికగా సోమవా రం సాయంత్రం నిరసన సభ జరిగింది. ఈ నిరసనకు కుష్బు నేతృత్వం వహించా రు. ఇందులో ప్రసంగించిన ఆ జిల్లా పార్టీ నాయకులు ఆరోగ్య రాజ్, వేలు స్వామి తదితరులు కుష్బును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మద్దతు దారులకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. అదే సమయంలో చిదంబరానికి మద్దతు గా నినాదాలు అందుకోవడం, మరి కొం దరు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో నిరసనలో గందరగోళం చోటు చేసుకుంది. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా చిదంబరం వర్గీయులు నినాదాలు చేయడంతో తామింతే అన్నట్టుగా గ్రూపు తగదా రాజుకుంది. చివరకు పోలీ సులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. అనంతరం నిరసనను ఉద్దేశించి కుష్బు ప్రసంగిస్తూ, కేసుల నుంచి బయట పడేందుకే భూ సేకరణ చట్టానికి అన్నాడీఎంకే మద్దతు ప్రకటిం చిందని ఆరోపించారు. కేంద్రం తీరును ఎండగట్టే రీతిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనూ కుష్బు సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. తర్వాత మీడియా కుష్బు ను కదలించింది. తమరిని కాబోయే సీఎంగా పేర్కొంటున్నారే, ఆ పదవికీ తమరు అన్ని రకాల అర్హులుగా వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకు అవకాశం ఉందని, ఎవరికి వారు తమ అభిప్రాయాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారని, వాటన్నింటినీ పరిగణించాల్సిన అవసరం లేదని ముందుకు సాగారు. కుష్బుకు హోదా: ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండా తన సేవల్ని పార్టీకి అందిస్తూ వచ్చిన నటి కుష్బును కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఆమెను ఏఐసీసీలో అందలం ఎక్కించేలా చేసిందని చెప్పవచ్చు. సమస్యలపై స్పందించే విధానం, సందర్భోచితంగా వ్యాఖ్యలు చేయడం, రాజకీయ అవగాహన వెరసి కుష్బుకు ఏఐసీసీలో చోటు దక్కేలా చేశాయి. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 17 మంది ఏఐసీసీ అధికార ప్రతినిధుల జాబితాలో కుష్బుకు ఆరో స్థానం దక్కడం విశేషం. జాతీయ అధికార ప్రతినిధిగా తమిళనాడుకు చెంది న కుష్బు పేరును మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. కుష్బుకు పదవి దక్కడంతో పార్టీలో దూసుకెళ్లడం ఖాయం. ఆమెకు మద్దతు దారుల సంఖ్య పెరగడం ఖాయం. అదే సమయంలో కొత్త నినాదం మరింతగా ప్రచారంలోకి రానుండడం గమనార్హం. -
కాంగ్రెస్‌లో కార్తీ కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కల్లోలం సృష్టించాడు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించాడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజాయిషీ నోటీసు అందుకున్నాడు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంపై తగిన వివరణ ఇవ్వకుంటే అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల సత్యమూర్తి భవన్లో జరిగిన కామరాజర్ గురించి మాట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీనే లేదని ఇళంగోవన్ వెంటనే కార్తి మాటలను తిప్పికొట్టారు. కార్తీ వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. కొందరు నిరసన నినాదాలతో ఆందోళన చేశారు. ఆగ్రహించిన కార్తీ చిదంబరం బలనిరూపణగా ‘ఐ 67’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం అయిన 1967 తరువాత జన్మించిన వారిని మాత్రమే అందులో సభ్యులుగా చేర్చుకున్నారు. ఐ 67కు సంబంధించిన సమావేశాన్ని గురవారం జరిపారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున సుమారు 234 మందిని కార్తీ పిలిపించారు. లౌకికపార్టీ అనే ప్రచారానికే పరిమితమైతే ఫలితం లేదు, ప్రజాకర్షణ కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కార్తీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేగా సినిమా ప్రముఖులు వెంటపడటం మానుకోవాలని పరోక్షంగా నటి కుష్బును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేగాక రాష్ట పార్టీ కార్యకలాపాలను సైతం విమర్శించారు. కార్తీకి నోటీసు : ఇళంగోవన్ నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా సత్యమూర్తి భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఇళంగోవన్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్తీ చిదంబరం పార్టీ నియమావళికి విరుద్దంగా పోటీ సమావేశాన్ని నిర్వహించారని, అనేక విమర్శలు చేశారని మీడియాతో చెప్పారు. కామరాజనాడార్ గురించి మాట్లాడుకుంటే ప్రయోజనం లేదని వ్యాఖ్యానించాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీచేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన కార్తీని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదని పేర్కొన్నట్లు చెప్పారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తేల్చేసినట్టేనా?