Munugode By Elections: Congress Leader Palvai Sravanthi Reddy Audio Call Leak, Viral - Sakshi
Sakshi News home page

Munugode Politics: కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో

Published Wed, Aug 10 2022 1:13 PM | Last Updated on Wed, Aug 10 2022 4:24 PM

Group War Munugodu Congress: Palvai Sravanthi Audio Call Leak - Sakshi

సాక్షి, నల్గొండ/హైదరాబాద్‌: మునుగోడు కాంగ్రెస్‌ పార్టీలో గ్రూప్‌ వార్‌ మొదలైంది. రేవంత్‌రెడ్డి వైఖరిపై సీనియర్‌ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. బుధవారం.. ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు ఆధ్వర్యంలో మనుగోడు అభ్యర్థి ఎంపికపై గాంధీ భవన్‌లో సమావేశం జరగనుంది. సమావేశానికి ముందే సీనియర్‌ నేత  పాల్వాయి స్రవంతి కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో లీక్‌ గాంధీభవన్‌లో చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీలో ఈ ఆడియో కలకలం రేపుతోంది.
చదవండి: మునుగోడులో టీఆర్‌ఎస్‌ దిద్దుబాటు

చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్‌ ప్రతిపాదనను పాల్వాయి స్రవంతి వ్యతిరేకిస్తున్నారు. ‘‘చండూరు సభ నా వల్లే సక్సెస్‌ అయ్యింది. కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే హుజురాబాద్‌ సీన్‌ రిపీట్‌ ఖాయం. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే ఊరుకోను’’ అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్‌ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్‌ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement