palvai sravanthi reddy
-
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి
-
రాజగోపాల్‌రెడ్డిని ఓడించి తీరాల్సిందే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో ఎందుకు చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్‌లోనే ఉంటాను అని అనేవారు. అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్‌కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఇప్పుడు ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం. నల్లగొండ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది కేసిఆర్’ అని కేటీఆర్ చెప్పారు బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ చాలా ఆలోచించి నేను బీఆర్ఎస్లో చేరాను. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు అని నా తండ్రి చెప్పిన మాట. ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇచ్చారు. నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీఆర్ఎస్తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు మీరు భవిష్యత్తు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరుకుంటున్న. అందరం కలిసి ముందుకు వెళ్దాం’ అని తెలిపారు. ఇదీ చదవండి...శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి -
కాంగ్రెస్ కు విధేయురాలైన నాకు టికెట్ ఇవ్వలేదు: స్రవంతి
-
Munugode: కాంగ్రెస్‌లో కయ్యం.. రేవంత్, జానారెడ్డి సపోర్ట్ ఆ నేతకేనా!
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైందా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పైటింగ్ స్టార్టయిందా? మళ్ళీ నేనే అంటున్న పాల్వాయి స్రవంతి. ఒప్పందం ప్రకారం తనకే ఇవ్వాలంటున్న మరో నేత. ఇద్దరి పంతంతో తలలు పట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇంతకీ మునుగోడు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. మొన్నటి ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా అధికార బీఆర్ఎస్, బీజేపీల అంగ, అర్థ బలాలకు ఎదురొడ్డి నిలబడి కూడా 24 వేల ఓట్లను సాధించింది. ఉప ఎన్నికలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న కసితో కాంగ్రెస్ కేడర్ సిద్ధమవుతోంది. అయితే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య మొదలైన టికెట్ పోరు కార్యకర్తల్ని కన్ఫూజన్‌కు గురి చేస్తోందట. టికెట్ తనదంటే తనదని ఇద్దరు నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం మునుగోడు కాంగ్రెస్‌లో కలవరం రేగుతోంది. మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతికి సీనియర్ల మద్దతు ఉంది. ఉప ఎన్నికలో టిక్కట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చలమల్ల కృష్ఱారెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు. ఉప ఎన్నికలో ఓడిపోయినా పార్టీ పరువు కాపాడాను కాబట్టి తనకు మరో అవకాశం ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారట. చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది? పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి మరోవైపు గతంలోనే టికెట్ వచ్చినట్లు వచ్చి చేజారిందని, దీనికి తోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట చల్లమల్ల కృష్ణారెడ్డి. ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తే సాధారణ ఎన్నికల్లో తనకు సహకరిస్తానని స్రవంతి మాట ఇవ్వడం నిజం కాదా అని కృష్ణారెడ్డి గుర్తు చేస్తున్నారట. రేవంత్ ఆశీస్సులు కృష్ణారెడ్డికి పుష్కలంగాఉండటంతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈసారి కృష్ణారెడ్డికే మద్దతుగా నిలుస్తున్నారట. దీంతో తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో చలమల్ల కృష్ణారెడ్డి నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ కమిటీలను ప్రకటించేలా రేవంత్‌పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు చల్లమల్ల. ఈ పరిణామాలతో పాల్వాయి స్రవంతి అలెర్ట్ అయ్యారు. నేరుగా గాంధీభవవ్ను వెళ్లి మునుగోడు తాజా పరిణామాలను సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లారట. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా కమిటీలను ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారట. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే జిల్లాలోని నకిరేకల్‌లోని మండల కమిటీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యంతో నిలిచిపోయాయి. దీంతో స్రవంతి ఒత్తిడితో మునుగోడులో మండల కమిటీలు ఆగిపోయాయి. పార్టీ కోసం పనిచేసిన వారికే మండలాధ్యక్ష పదవులు ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారు. అయితే తన అనుచరుడు కృష్ణారెడ్డి మాటను కాదని స్రవంతి సూచించిన వారికి రేవంత్ పదవులు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇద్దరి నేతల మధ్య నెలకొన్న వర్గపోరు మునుగోడు కాంగ్రెస్ రాజకీయాలను రసవత్తరంగా మార్చాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. చదవండి: కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది? -
ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది: పాల్వాయి స్రవంతి
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత చండూరు మండలం ఇడికుడలో సోమవారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రలోభాలతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో ధనబలం, అంగబలం చూపించి టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది. అన్ని వర్గాలను భయబ్రాంతులకు గురిచేశారు. అసత్య ప్రచారాలు, అనైతిక చర్యలతో టీఆర్ఎస్ గెలిచింది. తప్పుడు ఫోటోలతో నాపై దుష్ప్రచారం చేశారు. స్వేచ్ఛగా ఓటు వేయకుండా భయాందోళనకు గురిచేసి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారు. మద్యం ఏరులై పారింది. అబద్ధపు ప్రచారం చేసినా చివరి వరకు పోరాటం చేశాను. సీఎంని కలిశా అని తప్పుడు ఫోటోతో ప్రచారం చేశారు. భూ నిర్వాసితులను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేసింది. ఐదు వందల కోట్లు ఖర్చు చేశాయి రెండు పార్టీలు. మూడు నెలలు మత్తులో జోగేలా చేశారు.’ అని పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ఇదీ చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది! -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్‌కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్‌లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్‌నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం -
మునుగోడు ఫలితాలు: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న పాల్వాయి స్రవంతి
-
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్‌ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్‌లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Munugode Bypoll 2022: ఉప ఎన్నికల వేళ.. ఫేక్ ప్రచారాల గోల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. పోలింగ్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంతో పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా పార్టీలు ఫేక్ పోస్టుల యుద్ధానికి దిగాయి. ఫలానా నేత తమ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. స్రవంతిపై బోగస్ ప్రచారం: కాంగ్రెస్ గతంలో దుబ్బాక లో చేసిన విధంగా నేడు మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని అధికార పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను స్రవంతి కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకై తమ అభ్యర్థి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బోగస్ వీడియో సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు పోరిక బలరాం, పొన్నం ప్రభాకర్, మధుసూదన్‌రెడ్డి ట్విటర్ ద్వారా కోరారు. నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు: స్రవంతి తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లతామని పాల్వాయి స్రవంతి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి బోగస్ ప్రచారాలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్రవంతి స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం లేదు: కర్నె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని, మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్ వివరణయిచ్చారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో బీజేపీ గెలవాలనుకుంటే వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. మునుగోడులో కచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కేసీఆర్‌ను కలిసినట్లు స్రవంతి ఫేక్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు పోలింగ్ వేళ ప్రత్యర్థులపై పార్టీలు ఫేక్ ప్రచారానికి తెరలేపాయి. నిన్నటి నుంచి అన్ని పార్టీల మీద ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్‌ను కేసీఆర్‌ను కలిశారంటూ నకిలీ వీడియో ప్రచారం అయ్యింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం మునుగోడు ఉపఎన్నికల్లో తోడుదొంగలు, మాయా మారీచులు, తెరాస బీజేపీ కలిసి విడుదల చేసిన ఫేక్ న్యూస్ పై విరుచుకు పడ్డ పాల్వాయి స్రవంతి గారు @PalvaiINC ఫేక్ న్యూస్ చేసి విడుదల చేసిన వారి పై లీగల్ యాక్షణ్! సిగ్గు విడిచిన కేసీఆర్, బీజేపీలు! గెలవలేక దొంగ నాటకలు! pic.twitter.com/Xpo2Rz01Jk — Telangana Congress (@INCTelangana) November 3, 2022 -
ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి
-
సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం! కంటతడి పెట్టనీయకండి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో... సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు. ఆడబిడ్డను కంటతడి పెట్టనీయకండి. నిండు మనసుతో ఆడబిడ్డను ఆశీర్వదించి ఉప ఎన్నికల్లో గెలిపించండి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చనిపోయాక ఆయన భార్య బయటికి రాలేదని, ఇప్పుడు వారి బిడ్డ స్రవంతిని ప్రజల చేతుల్లో పెట్టడానికి ఆమె ఇక్కడికి వచ్చారన్నారు. ఇప్పటి నుంచి స్రవంతి నియోజకవర్గ ప్రజల బిడ్డ అని చెప్పారు. మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో రేవంత్ మాట్లాడారు. ఇప్పుడు స్రవంతిని గెలిపిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది మహిళలకు టికెట్లు ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు. ఆ నలుగురిలో స్రవంతి కూడా ఉంటుందని చెప్పారు. స్రవంతిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతోందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిన మోసం, కేసీఆర్ చేసిన ధోకాపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. కేసీఆర్‌ను పాతిపెట్టండి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరికీ రాని అవకాశం ఇక్కడి ప్రజలకు వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులను మోసం చేసి నట్టేట ముంచి ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కేసీఆర్‌ను 100 మీటర్ల లోతులో పాతిపెట్టే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. గుజరాత్, ఢిల్లీ నుంచి తెచ్చిన సీసాలు, నోట్ల కట్టలతో ఓట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ.1,100 ఎందుకు అయిందని బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని 2014లో ఎమ్మెల్యేగా గెలిíపించినా మునుగోడుకు జూనియర్ కాలేజీ కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. కిష్టరాయినిపల్లె, చర్లగూడెం, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొత్తవారేం కాదని, వారి రంగు ఏంటో అందరికీ తెలుసని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వండి: స్రవంతి ప్రజలందరి ఆదరాభిమానాలతోనే ఈ ఎన్నికల్లో పోటీకి దిగానని, అడుగడుగునా ఒక ఆడబిడ్డను టీఆర్ఎస్, బీజేపీ ఇబ్బంది పెడుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ‘మా తండ్రి సహకారంతోనే రాజకీయంగా ఎదిగిన వారు నన్ను మోసం చేసి ఇతర పార్టీలకు అమ్ముడుపోయారు. నాకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు. కేవలం నా తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే పోటీచేస్తున్నా’ అని చెప్పారు. ఒక్కోసారి తాను అలిసిపోయానని అనిపిస్తుందంటూ స్రవంతి కంటతడి పెట్టారు. ఇది స్రవంతి ఎన్నిక కాదని, బడుగు బలహీన వర్గాల ఎన్నికని, ఒక్క అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రంజితా రంజన్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి మహిళలు తమ శక్తిని చాటాలన్నారు. ఈ సభలో తమిళనాడు ఎంపీ జ్యోతిమణి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
Telidevara Bhanumurthy: సిత్రాలు సూడరో శివుడో శివుడా!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు ఎప్పటిలెక్కనే మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగటాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ‘‘నువ్వు ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. బల్రు అడ్డం రావొచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతె నీకు తిక్కలెవ్వొచ్చు. నువ్వు బేచైన్ గాకుంట ఉండెతంద్కు మునుగోడు ముచ్చట జెప్త ఇను’’ అన్నడు. ‘‘ఊకూకె మునుగోడు, మునుగోడు అంట వేంది?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘ఎందుకంటె అందర్కి ఒక్క దినమే దివిలె. ఎలచ్చన్ల జాత్ర జెయ్యబట్కె మునుగోడు జెనంకు దినాం దివిలెనే. దినాం దావత్లే. దినాం మందుల తేలకుంట మున్గుడే. అన్ని పార్టిల లీడర్లు ఒక్క తీర్గ చక్కర్లు గొడ్తున్నరు.’’ ‘‘కల్లమున్న కాడ బిచ్చగాల్లు. ఓట్లున్న కాడ లీడర్లు’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి నిలవడ్డ పాల్వాయి స్రవంతి ప్రచారం జేస్కుంట బోతుంటె బీజేపోల్లు అడ్డమొచ్చి శేర్ పటాకులు గాల్సిండ్రు. కాల్లల్ల కట్టె పెట్టినట్లు జేసిండ్రు.’’ ‘‘కాంగ్రెసోల్లు ఊకున్నరా?’’ ‘‘ఎందుకూకుంటరు. తమ్ల పాకుతోని గీల్లంటె తల్పు చెక్కతోని గాల్లన్నరు. బీజేపీ దిక్కుకెల్లి పోటీ జేస్తున్న రాజగోపాల్‌రెడ్డి జీపు ముంగట కాంగ్రె సోల్లు ఒక్క తీర్గ భూచెక్రాలు గాల్సి అడ్డం బడ్డరు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మందు బోస్తున్నయి. పైసలిస్తున్నయి. నరకాసురుని మీద్కి బానాలిడ్సిన సత్యభామ అసువంటిది మా స్రవంతి అని రేవంత్ రెడ్డి అన్కుంట గామెతోని బీజేపీ, టీఆర్ఎస్ల దిక్కు రొండు రాకిట్లు ఇడిపిచ్చిండు’’. ‘‘టీఆర్‌ఎసోల్లు పటాకులు గాల్వలేదా?’’ ‘‘గాల్సిండ్రు. సంస్థాన్ నారాయన్పురంల 18 వేల కోట్ల స్టిక్కర్ తోని తయారు జేసిన పటాకులను మంత్రి గంగుల కమలాకర్ గాల్సిండు. రాజ గోపాల్‌రెడ్డి బోతుంటె టీఆర్‌ఎసోల్లు అడ్డం దల్గి బాంబులు గాల్సిండ్రు. నాకే అడ్డం దల్గుతరా? మీ తోడ్కల్ దీస్త అన్కుంట గాయిన కప్పగంతులు ముట్టిచ్చిండు. ఇగ టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేస్తున్న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి లక్ష్మిబాంబు బత్తి ముట్టిచ్చిండు. గది ధన్మనకుంట తుస్సు మన్నది’’. ‘‘గీ మూడు పార్టీలే గాకుంట కడ్మోల్ల ప్రచారం సంగతేంది?’’ ‘‘కడ్మోల్లు అంటె ఇండిపెండెట్గ నిలవడ్డ కె.ఎ.పాల్ ప్రచారం గురించి రొండు ముచ్చట్లు జెప్త. గాయిన గుర్తు ఉంగ్రం. ఏలుకున్న ఉంగ్రం సూబెట్టుకుంట ఓట్లడ్గుతుంటె మాకు బంగారి ఉంగ్రం జేపిచ్చిస్తవా అని కొందరడిగిండ్రు. నన్ను గెలిపిస్తె మునుగోడును అమెరిక జేస్త. గాలి మోటర్ అడ్డ బెట్టిపిస్త అని పాల్ అన్నడు. రాంగ్ సైడ్ల కొస్తున్నవని ఒక పోలీసాయిన మోటరాపితె నేనంటె ఎవ్వరనుకుంటున్నావు, కాబోయె తెలం గాన ముక్యమంత్రి ననుకుంట పాల్ బెదిరిచ్చిండు. అందరు సూస్తుండంగ ఇంకోతాన చెంగడ బింగడ డ్యాన్సు జేసిండు.’’ ‘‘మునుగోడు ఎలచ్చన్ల ప్రచారంల కొత్త సంగతేమన్న ఉన్నదా?’’ ‘‘ఇంతకుముందు ఎన్నడు లేని తీర్గ గీ బై ఎలచ్చన్ల పోస్టర్ల జంగ్ నడుస్తున్నది. మీ అభిమాన సత్యం థియేటర్లో నేడే బ్రహ్మాండమైన విడుదల. మునుగోడు కాంతి స్రవంతి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ నీతి నిజాయితీల అడ్డ. దర్శకత్వం: విరాట్ కొహ్లీ అసుంటి రేవత్ రెడ్డి అని కాంగ్రెస్ పోస్టర్ ఏసింది. నేడే విడు దల. అమిత్ షా ప్రొడక్షన్స్ వారి పద్దెన్మిది వేల కోట్ల రూపాయలు. దర్శకత్వం: కోవర్టు రెడ్డి. నర్తకి 70 ఎం.ఎం. థియేటర్ అని టీఆర్ఎస్ పోస్టర్ అంటిచ్చింది. బండి సంజయ్ దర్శకత్వంలో నేడే విడు దల రాజన్న రాజినామా. ముక్యమంత్రి, మంత్రుల బ్యాంకు కాతాలల్ల బడ్డ నిర్వాసితుల బకాయిలు. గొల్రు కొనెతంద్కు గొల్ల కురుమలకు రూపా యలు. కడ్మ సిన్మ ఎండి పర్ద మీద సూడుండ్రి అని బీజేపీ ఏసింది. కానీ గీ ఎలచ్చన్ల ఎవలు గెల్సినా పరకేం బడదు. జెనం బత్కులేం మారయి. పెట్రోలు, గ్యాస్ బండ దరలు మొగులు మీద్కి బోతనే ఉంటయి. రూపాయి బక్కగైతనే ఉంటది. ఎన్కట రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు గదే రూపాయి బిల్ల మీద బొటనేలు బొమ్మ ఎందుకున్నది. గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటే నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఎన్కట అందర్కి బువ్వ దొర్కుతుండె బట్కె రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు బువ్వ దొర్కకుండ బట్కె బొటనేలు చీక్కుంట బత్కుండ్రి అని గిప్పటి రూపాయి బిల్ల మీద బొమ్మ జెప్తున్నది’’ అని విక్రమార్కుడు అన్నడు. ఇంతల బొందల గడ్డొచ్చింది. విక్రమార్కుడు మోటరాపిండు. బేతాలుడు మోటర్ల కెల్లి దిగి బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : పాల్వాయి స్రవంతి
-
ఆ పార్టీలిచ్చింది తీసుకోండి.. ఆడబిడ్డకు ఓటేయండి: రేవంత్ రెడ్డి
చండూరు: మునుగోడు ఉపఎన్నికలో ఆ రెండు పార్టీల ద్వారా వచ్చింది తీసుకోండి కానీ, ఆడబిడ్డ స్రవంతికి ఓటు వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చండూరు మండలం కొండాపురం, గుండ్రపల్లి, బంగారిగడ్డ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏనాడు కూడా ఆడబిడ్డకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదు. ఈసారి సోనియాగాంధీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతికి టికెట్ ఇచ్చింది. కడుపులో పెట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మీది’అని అన్నారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మద్యం ఎవరు పోసినా తన్నండని మహిళలకు రేవంత్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, చలమళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలతో తెలంగాణలో పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు వెళ్లాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య దూరం స్పష్టం బహిర్గతం అవుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌వాదులు మునుగోడుకు కదిలిరండి. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేము. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్లు పార్టీలు అడుగడునా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పవిత్రమైన యాదాద్రిని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడమే దీనికి పరాకాష్ట. మునుగోడు ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్టులుగా ఉందామా?. తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలిరండి. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు. -
ప్రచారంలో టెన్షన్ టెన్షన్
-
కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ.. పాల్వాయి స్రవంతి ధర్నా
సాక్షి, నాంపల్లి (నల్లగొండ జిల్లా): తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చదవండి: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్ ధర్నాలో పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం కోసం నాంపల్లికి వస్తున్న సమయంలో బీజేపీ దుండగులు తన కాన్వాయికి దారి ఇవ్వకుండా వాహనం నడిపారన్నారు. దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల్లో ఏ పారీ్టకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. నమ్మిన కాంగ్రెస్ పార్టీని ముంచి, బీజేపీలో చేరి తప్పుడు ప్రచారాలు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదని హితవు పలికారు. -
స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు: పాల్వాయి స్రవంతి
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ కార్యకర్తలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బెదిరించడంపై మనుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి సహనాన్ని కోల్పోయి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడకతప్పదని హెచ్చరించారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డా అని ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని విమర్షిస్తున్న వారికి ఆయన పేరు ఉచ్చరించే అర్హత లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. తాను స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తి కాదని, ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికలకు పోదామని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వద్ద ప్రమాణం చేద్దామా అని టీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. చదవండి: Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు -
ఒక్కసారి ప్రచారానికి రండి అన్నా
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి సోమవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఆ సమయంలో పార్టీ నేతలు ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రాజనర్సింహ అక్కడే ఉన్నారు. స్రవంతి.. ఎంపీ కోమటిరెడ్డి వద్దకు వెళ్లి ‘అన్నా... ఒక్కసారి ప్రచారానికి రండన్నా’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ ‘నీకెందుకమ్మా. నేను చెప్పాను కదా.. నేనున్నాను’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. నాకన్నా ఎక్కువ అవమానాలు జరిగాయా.. ఓటేసేందుకు క్యూలో నిలబడిన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డితో మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ మునుగోడులో ప్రచారానికి వెళ్లాలని కోరారు. దుబ్బాకలో ప్రచారం చేసి మునుగోడుకు వెళ్లకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఇందుకు స్పందించిన కోమటిరెడ్డి అవమానాల సంగతేంటి అని ప్రశ్నించగా.. తనకు అంతకంటే ఎక్కువే అవమానాలు ఎదురైనా పార్టీ కోసం పనిచేస్తున్నానని వీహెచ్ అన్నట్టు సమాచారం. -
Munugode Bypoll: కొంగుచాచి అడుగుతున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎమోషనల్
సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతిని మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే, ఆ ఆడబిడ్డను ఓడించాలని మోదీ, అమిత్‌షా, కేసీఆర్, కేటీఆర్, మంత్రులు చూస్తున్నారని టీపీసీసీ అధ్య్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించడానికి ఇంతమందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్‌రెడ్డిని ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. స్వార్ధం కోసం దుష్మన్ చెంత చేరి కన్న తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని చంపాలని బొడ్డులో కత్తి పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ఆ వ్యక్తి అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. చేతులెత్తి అడుగుతున్నా.. ఎన్నికల్లో స్రవంతిని గెలిపించి, ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. ముగ్గురూ మాయగాళ్లే.. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మద్యం, డబ్బు పంచి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నా యని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఇప్పుడు మునుగోడు దత్తత అంటున్నారని, 2018 ఎన్నికల్లో ఇతర జిల్లాలతో పాటు తనను ఓడించాలని కొడంగల్‌ను కూడా దత్తత తీసుకుంటామని ప్రకటించారని, కానీ అక్కడ గెలిచినా రోడ్లపై పడిన గుంతల్లో తట్ట మట్టి పోయలేదని విమర్శించారు. ఇక సీఎం కేసీఆర్ వచ్చి అభివృద్ధి చేస్తా.. కుర్చీ వేసుకొని కూర్చుంటా.. మీ దగ్గరికే సముద్రం తెస్తా అంటూ హామీ ఇస్తారని, ఎన్నికల తర్వాత ఫాంహౌస్‌లో పడుకుంటారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ కట్టుకథలు నిజమని చెప్పేందుకు హరీశ్‌రావు వస్తున్నారని, ముగ్గురూ మాయగాళ్లేనని విమర్శించారు. స్రవంతక్కను గెలిపిస్తే సమ్మక్క సారలక్కలాగా ములుగు సీతక్కతో కలిసి మునుగోడు ప్రజల గొంతుకై అసెంబ్లీలో కొట్లాడుతుందని రేవంత్ చెప్పారు. స్రవంతిని గెలిపించండి: ఉప ఎన్నికల్లో స్రవంతిని గెలిపించి, మును గోడు ప్రజలు అమ్మకానికి సిద్ధంగా లేరని నిరూపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రజలను అన్నింటా మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు డబ్బు, లిక్కర్‌తో ఓట్ల కోసం వస్తోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని జోష్‌లో చెప్పడం కాదని, బూత్‌లో స్రవంతికి ఓటు వేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులను, సేవలను ఒకసారి గుర్తు చేసుకు ని స్రవంతిని గెలిపించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కోరారు. తండ్రిని తలచుకొని కంటతడి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్రవంతి, తండ్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని తలచుకొని కంటతడి పెట్టారు. పేద ప్రజల కోసం ఆయన పడిన తపన, చేసిన కృషిని వివరిస్తూ తన తండ్రి ఆశయాల సాధన కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. సభలో మాట్లాడే సమయంలోనూ స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది క్షణాలు మౌనంగా దుఖించిన ఆమె ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొంగుచాచి అడుగుతున్నా ఓట్లేయండి: స్రవంతి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని స్రవంతి విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను మోసం చేయడం వల్లే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ధర్మ యుద్ధంలో ఒంటరి పోరాటం చేస్తున్న తాను కొంగుచాచి అడుగుతున్నానని, ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సభలో మాజీ మంత్రి జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం : పాల్వాయి స్రవంతి
-
మునుగోడు కాంగ్రెస్‌లో ట్విస్ట్.. ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్లాన్స్ రచిస్తున్నారు. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార పోరులో బిజీగా ఉన్నాయి. మూడు జాతీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్టుగా తెలుస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. తాజాగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారు. కేసీఆర్ ఒక ఆర్ధిక ఉగ్రవాది. గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం నలమూలలా వందలాది కోట్లు వసూలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం. ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పార్టీ చందాలు వసూలు చేశారని కేసును క్లోజ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘ నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు. 20వేల కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు. దీనిపై నేను ఎన్నికల సంఘాన్నీ కలిసి చర్యలు తీసుకోవాలని కోరాను. కేసీఆర్‌పై కేంద్రం కూడా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు’ అని కామెంట్స్ చేశారు. -
మునుగోడులో కాంగ్రెస్‌కు బూస్ట్.. ఆయన ఎంట్రీతో సీన్ మారుతుందా?
సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడులో విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సమీక్ష కోసం ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వస్తారని స్రవంతి రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశముంది. మునుగోడులో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. రెండు రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, ఉప ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14న తాను నామినేషన్ వేస్తున్నట్లు స్రవంతి ప్రకటించారు. మరోవైపు.. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి.. మునుగోడు సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. -
‘మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా.. వారికి ఓట్లు ఎందుకెయ్యాలి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పొలిటికల్ నేతల మధ్య మాటల వార్ మొదలైంది. మునుగోడులో రంగంలోకి దిగిన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు పొలిటికల్ విమర్శలు చేసుకుంటున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాల్వాయి స్రవంతి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా. అధికార బలం, ధన బలం ఉన్నా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు. మా నాన్న హయంలోనే మునుగోడులో అభివృద్ధి జరిగింది. ఏం చేసారని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేయాలి?. టీఆర్ఎస్ పాలనలో మునుగోడు అభివృద్ధి కుంటుపడింది. మునుగోడు నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్ అని మొదలుపెట్టాము. 5 మండలాలలు పూర్తి అయ్యాయి. షెడ్యూల్ వచ్చిన తరువాత ప్రచారంలో పాల్గొంటాను అని.. నేను కలిసిన రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం మునుగోడు ఎన్నికలపై ఉంటుంది. రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తారని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.