
పాల్వాయి స్రవంతి
హైదరాబాద్: నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ టికెట్ తనకు దక్కకపోవడంపై కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో స్రవంతి విలేకరులతో మాట్లాడుతూ.. తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లు సేవ చేశారని గుర్తు చేశారు. చివరి వరకు మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలు అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తాను 20 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నానని చెప్పారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనకే ఇలా జరిగింది అంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
కార్యకర్తలకు తానేం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాహుల్ గాంధీ కూడా వ్యక్తిగతంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. చివరి సారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచానని తెలిపారు. మునుగోడు టికెట్ పాల్వాయి స్రవంతిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అదిష్టానం కేటాయించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment