పాల్వాయి స్రవంతిని ఆశీర్వదిస్తున్న కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి సోమవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఆ సమయంలో పార్టీ నేతలు ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రాజనర్సింహ అక్కడే ఉన్నారు. స్రవంతి.. ఎంపీ కోమటిరెడ్డి వద్దకు వెళ్లి ‘అన్నా... ఒక్కసారి ప్రచారానికి రండన్నా’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ ‘నీకెందుకమ్మా. నేను చెప్పాను కదా.. నేనున్నాను’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
నాకన్నా ఎక్కువ అవమానాలు జరిగాయా..
ఓటేసేందుకు క్యూలో నిలబడిన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డితో మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ మునుగోడులో ప్రచారానికి వెళ్లాలని కోరారు. దుబ్బాకలో ప్రచారం చేసి మునుగోడుకు వెళ్లకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఇందుకు స్పందించిన కోమటిరెడ్డి అవమానాల సంగతేంటి అని ప్రశ్నించగా.. తనకు అంతకంటే ఎక్కువే అవమానాలు ఎదురైనా పార్టీ కోసం పనిచేస్తున్నానని వీహెచ్ అన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment