సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పొలిటికల్ నేతల మధ్య మాటల వార్ మొదలైంది. మునుగోడులో రంగంలోకి దిగిన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు పొలిటికల్ విమర్శలు చేసుకుంటున్నారు.
కాగా, మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాల్వాయి స్రవంతి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా. అధికార బలం, ధన బలం ఉన్నా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు. మా నాన్న హయంలోనే మునుగోడులో అభివృద్ధి జరిగింది. ఏం చేసారని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేయాలి?. టీఆర్ఎస్ పాలనలో మునుగోడు అభివృద్ధి కుంటుపడింది.
మునుగోడు నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్ అని మొదలుపెట్టాము. 5 మండలాలలు పూర్తి అయ్యాయి. షెడ్యూల్ వచ్చిన తరువాత ప్రచారంలో పాల్గొంటాను అని.. నేను కలిసిన రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం మునుగోడు ఎన్నికలపై ఉంటుంది. రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తారని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment