సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత చండూరు మండలం ఇడికుడలో సోమవారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో టీఆర్‌ఎస్ ప్రలోభాలతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో ధనబలం, అంగబలం చూపించి టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ప్రలోభాలతో టీఆర్‌ఎస్ గెలిచింది. అన్ని వర్గాలను భయబ్రాంతులకు గురిచేశారు. అసత్య ప్రచారాలు, అనైతిక చర్యలతో టీఆర్‌ఎస్ గెలిచింది. తప్పుడు ఫోటోలతో నాపై దుష్ప్రచారం చేశారు. స్వేచ్ఛగా ఓటు వేయకుండా భయాందోళనకు గురిచేసి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారు. మద్యం ఏరులై పారింది. అబద్ధపు ప్రచారం చేసినా చివరి వరకు పోరాటం చేశాను. సీఎంని కలిశా అని తప్పుడు ఫోటోతో ప్రచారం చేశారు. భూ నిర్వాసితులను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేసింది. ఐదు వందల కోట్లు ఖర్చు చేశాయి రెండు పార్టీలు. మూడు నెలలు మత్తులో జోగేలా చేశారు.’ అని పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.
ఇదీ చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్‌ఎస్ గెలిచింది!
Comments
Please login to add a commentAdd a comment