palvai
-
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం -
కాంగ్రెస్ గూటికి ‘పాల్వాయి’?
సాక్షి, ఆసిఫాబాద్: సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. బుధవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. అయితే ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాత్రం తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం.. సిర్పూర్ నియోజకవర్గంలో హరీశ్‌బాబు గట్టి ప ట్టుంది. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన పాల్వాయి హరీశ్‌బాబు ఆర్థోపిడిక్ సర్జన్. 2017 నవంబరులో రాజకీయ అరంగ్రేటం చేశారు. బెజ్జూర్ మండలం రెబ్బన గ్రామంలో 10 అంశాలతో రాజకీయ ఎజెండాను రూపొందించి ప్రజల్లోకి వచ్చారు. ఏడాది పాటు రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ టికెట్‌తో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికలే ధ్యేయంగా పావులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతల్ని కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. పాల్వాయి హరీశ్‌బాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాక హరీశ్‌బాబు వెంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రావడం.. ప్రజల్లో కూడా అతనిపై సానుభూతి ఉండటం అసెంబ్లీ ఎన్నికల్లో పాల్వాయికి కలిసొచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా పార్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యక్రమాలకు దూరంగా..? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌బాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం నియోజవర్గంలో తిరుగుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు తదితరాల్లో పాల్గొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐదు విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కుమురంభీం క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్‌బాబు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలవడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ‘సిర్పూర్ అభివృద్ధి కోసమే కలిశా’ కౌటాల(సిర్పూర్): సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే హరీశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఎమ్మెల్యేను సంప్రదించగా.. ముఖ్యమంత్రి కేవలం పార్టీ ప్రతినిధి కాదని.. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అని అన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పనుల కోసం సీఎంను కలుస్తున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలకు తావులేదని స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. -
హరీశ్‌బాబుకు టికెట్ ఖరారు
సాక్షి, ఆసిఫాబాద్: కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన బీజేపీ తొలి జాబితాను ఎట్టకేలకు ఆదివారం ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ఖరారయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. రెండో జాబితాలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి శనివారమే జాబితా ప్రకటించాల్సి ఉండగా.. మూడు సీట్ల ఖరారు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాత్రం అభ్యర్థిత్వాలు ఖరారైన వారికి స్వయంగా ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో శనివారమే పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం.. పాల్వాయి హరీశ్‌బాబుకు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పాల్వాయి హరీశ్‌బాబు.. ఆ తర్వాత చైన్నెలోని శ్రీరామచంద్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎస్.(ఆర్థోపిడిక్స్) చేశారు. పీడియాట్రి ఆర్థోపిడిక్ సర్జన్‌గా వైద్యవృత్తిని ప్రారంభించారు. 2017 నవంబర్‌లో రాజకీయ అరంగ్రేటం చేశారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాను రూపొందించుకుని ప్రజల్లోకి వచ్చారు. మొదట 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కోనేరు కోనప్పపై పోటీ చేసి 59,052 ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ వర్గాలకు మద్దతుగా పోరాటాలు చేయడంతోపాటు మారుమూల గ్రామాల్లో పాదయాత్ర చేసిన ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. -
ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది: పాల్వాయి స్రవంతి
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత చండూరు మండలం ఇడికుడలో సోమవారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రలోభాలతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో ధనబలం, అంగబలం చూపించి టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది. అన్ని వర్గాలను భయబ్రాంతులకు గురిచేశారు. అసత్య ప్రచారాలు, అనైతిక చర్యలతో టీఆర్ఎస్ గెలిచింది. తప్పుడు ఫోటోలతో నాపై దుష్ప్రచారం చేశారు. స్వేచ్ఛగా ఓటు వేయకుండా భయాందోళనకు గురిచేసి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారు. మద్యం ఏరులై పారింది. అబద్ధపు ప్రచారం చేసినా చివరి వరకు పోరాటం చేశాను. సీఎంని కలిశా అని తప్పుడు ఫోటోతో ప్రచారం చేశారు. భూ నిర్వాసితులను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేసింది. ఐదు వందల కోట్లు ఖర్చు చేశాయి రెండు పార్టీలు. మూడు నెలలు మత్తులో జోగేలా చేశారు.’ అని పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ఇదీ చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది! -
మిషన్‌భగీరథ అవినీతిమయం
చౌటుప్పల్: ఇంటింటికీ రక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అవినీతిమయంగా మారిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. చౌటుప్పల్‌లోని రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనుల్లో 50 శాతం అవినీతి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నీటి వసతులు లేని ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వకుండా, వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో కేటాయించి, టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం అనుచర వర్గానికి కాంట్రాక్టులను కట్టబెడుతోందన్నారు. రెండేళ్లలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయన్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కావడం లేదన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభమే కాలేదన్నారు. రుణమాఫీ ఊసే లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ, హైదరాబాద్‌లోని భూములను కొన్ని సంస్థలకు అప్పగించి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, కొండ యాదగిరి, నయీంషరీఫ్, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, చింతల వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పల్సం సత్యం, చింతపల్లి వెంకట్‌రెడ్డి, జేకే.దశరథ, రాజయ్య, రఘుపతి, జానిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలు అందించాలి
చండూరు : పేదలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆరవ పోచంపల్లి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో బ్యాంకు 100 కోట్లకు పరుగెత్తడం సంతోషకరమన్నారు. బ్యాంకు చైర్మన్ సీత శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోకల వెంకన్న, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కోఆపరేటివ్ చైర్మన్ రామమూర్తి, బ్యాంకు వ్యవస్థాపక చైర్మన్ కొంగరి భాస్కర్ , బ్యాంక్ చైర్మన్ చిట్టి పోలు శ్రీనివాస్, వైస్ చైర్మన్ సూరపల్లి రమేష్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కలిమికొండ పారిజాత, జనార్ధన్, ఎంపీటీసీలు అనిత, చందన, కర్నాటి పాండు, రఘు, వేణు, బస్వయ్య, సీఈఓ సీత శ్రీనివాస్, సంకోజు సాయన్న తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్‌లో ముసలం!
ఘోర పరాజయంపై పార్టీ నేతల పరస్పర ఆరోపణలు పొన్నాల, దిగ్విజయ్, జానారెడ్డి లక్ష్యంగా విమర్శలు దిగ్విజయ్‌సింగ్, పొన్నాలా.. పార్టీ వదిలి వెళ్లిపోండి: పాల్వాయి పొన్నాలే బాధ్యుడు: మధుయాష్కీ పొన్నాల ను తప్పించాల్సిందే: శంకర్రావు హైదరాబాద్: టీ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తెలంగాణలో ఘోర పరాజయం పాలై 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీ నేతలు రోడ్డున పడ్డా రు. ఓటమికి మీరంటే మీరే కారణమంటూ దూషణల పర్వానికి దిగుతున్నారు. తమ ఓటమికి స్థానిక నేతలే కారణమంటూ అసెంబ్లీ అభ్యర్థులు వాపోతోంటే... టీపీసీసీ నాయకత్వమే ప్రధాన కారణమంటూ ఎంపీ అభ్యర్థులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలైతే ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల వల్లే పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు. పలువురు నేతలు దీనిపై నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. పొన్నాలే లక్ష్యం.. ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్యకు విమర్శల తాకిడి ఎక్కువగా ఉంది. తక్షణమే ఆయనను టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా... ఇక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందంటే దానికి టీపీసీసీ నాయకత్వ వైఫల్యమే కారణమని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సోనియావల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించి జనాన్ని పార్టీవైపు ఆకర్షించడంలో పొన్నాల దారుణంగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించిననాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారంటే తెలంగాణ పార్టీ నాయకత్వ వైఫల్యం ఏమేరకు ఉందో అర్థమవుతోందని చెబుతున్నారు. మరికొందరు నేతలైతే ఏకంగా మాజీ మంత్రి జానారెడ్డితోపాటు తెలంగాణ సీఎం రేసులో ఉన్న నాయకులూ పార్టీ పరాభవానికి కారణమని మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఓటమికి సోనియాను బాధ్యురాలిని చేయడం ఏమాత్రం సరికాదు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి చెప్పే మాటలు, ఇచ్చే నివేదికలపైనే ఆమె ఆధారపడతారు. దీనికంతటికీ దిగ్విజయ్‌సింగ్ కారణం. పొన్నాలను టీపీసీసీ సారథిగా నియమించాలనే ఆలోచన కూడా దిగ్విజయ్‌దే. సీమాంధ్రకు చెందిన ఒక రాజ్యసభ ఎంపీ చెప్పినట్లే దిగ్విజయ్ నడిచారు. తెలంగాణలో ఈ పరిస్థితిని తెచ్చారు..’’అని వాపోయారు. పొన్నాల ఓ బేవకూఫ్: పాల్వాయి కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారన్నారు. అధికారాన్ని అనుభవించి డబ్బులు దండుకున్న మంత్రులు కూడా దీనికి ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ‘‘అసలు పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే బుద్ధి తక్కువ పని. పొన్నాల ముఖం చూస్తే ఎవరైనా ఓట్లేస్తరా? పార్టీని నడిపే శక్తి లేనోడు. సభలు నిర్వహించడం చేతకానోడు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎవడైనా 30 వేల ఓట్లతో ఓడిపోతడా? అట్లాంటోడ్ని ఏమనాలి? అసలు పొన్నాలకు పార్టీ నాయకత్వం ఎట్లా అప్పగించిండ్రు? దీనికంతటికీ దిగ్విజయ్‌సింగే ప్రధాన కారణం. ఆయన కేవీపీ చెప్పినట్లే నడిచిండు. ఎమ్మెల్యే టికెట్లను కూడా అమ్ముకున్నరు. నా దగ్గర ఆధారాలున్నయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నెహ్రూతో కలిసి పనిచేసిన నాకు షోకాజ్ ఇస్తడా? ఇట్లాంటి బేవకూఫ్గాళ్లను గాంధీభవన్‌లో కూర్చోబెడితే పార్టీ ఓడిపోక ఏం జేస్తది? పొన్నాలను వెంటనే పార్టీ నుంచి తప్పించాలి. అట్లాగే దిగ్విజయ్‌సింగ్.. నువ్వు కూడా పార్టీని వదిలి పో.. నేను సోనియాగాంధీని కలిసి ఈ విషయాలన్నీ చెబుతా’’ అని పేర్కొన్నారు. పాల్వాయికి మతి చలించింది: టీపీసీసీ ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి.. లేకుంటే బహిష్కరణే రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని, ఆయనకు మతి చలించిందని టీపీసీసీ మండిపడింది. దిగ్విజయ్, పొన్నాల లక్ష్మయ్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. శనివారం పాల్వాయి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పొన్నాల వెంటనే ప్రెస్‌మీట్ నిర్వహించాలని అధికార ప్రతినిధులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, జిట్టా సురేందర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాల్వాయి వ్యాఖ్యలను ఖండించారు. ఆయనకు మతి పూర్తిగా చలించిందని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పాల్వాయిని అధిష్టానం రాజ్యసభకు పంపించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి షోకాజ్ అందుకున్న పాల్వాయికి దిగ్విజయ్, పొన్నాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. పొన్నాలను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం హైకమాండ్ నిర్ణయమని, దాన్ని వ్యతిరేకించడమంటే హైకమాండ్‌ను ధిక్కరించినట్లేనని వ్యాఖ్యానించారు. నియామకమే ఓటమికి సంకేతం: మధుయాష్కీ ‘‘టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడమే కాంగ్రెస్ ఓటమికి తొలి మెట్టు. ఎన్నికల్లో పార్టీ నేతలెవరినీ కలుపుకొనిపోలేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ తెలంగాణ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల్లో ఓటమికి పొన్నాల బాధ్యత వహించాల్సిందే.’’ ఆయన వల్లే పార్టీ నాశనమైంది: పి.శంకర్రావు ‘‘తెలంగాణలో పార్టీ ఓటమికి పొన్నాల లక్ష్మయ్య నైతిక బాధ్యత వహించి తప్పుకోవాల్సిందే. ఆయనవల్లనే పార్టీ నాశనమైంది. ఎంతో కష్టపడి సోనియా తెలంగాణ ఇచ్చినా ప్రజలకు ఆ విషయాన్ని చెప్పలేకపోయిండు. సీనియర్లను ఏకతాటిపైకి నడిపించడంలో ఫెయిలైండు. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదన్నట్లు వ్యవహరించిండు. ఎన్నికల్లో సొంత నియోజకవర్గం దాట లేదు.’’