మెరుగైన సేవలు అందించాలి
మెరుగైన సేవలు అందించాలి
Published Thu, Aug 4 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
చండూరు : పేదలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆరవ పోచంపల్లి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో బ్యాంకు 100 కోట్లకు పరుగెత్తడం సంతోషకరమన్నారు. బ్యాంకు చైర్మన్ సీత శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోకల వెంకన్న, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కోఆపరేటివ్ చైర్మన్ రామమూర్తి, బ్యాంకు వ్యవస్థాపక చైర్మన్ కొంగరి భాస్కర్ , బ్యాంక్ చైర్మన్ చిట్టి పోలు శ్రీనివాస్, వైస్ చైర్మన్ సూరపల్లి రమేష్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కలిమికొండ పారిజాత, జనార్ధన్, ఎంపీటీసీలు అనిత, చందన, కర్నాటి పాండు, రఘు, వేణు, బస్వయ్య, సీఈఓ సీత శ్రీనివాస్, సంకోజు సాయన్న తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement