రేవంత్‌ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు | Congress Seniors Played Key Role in Munugode Ticket Announcment | Sakshi
Sakshi News home page

Munugode Bypoll: రేవంత్‌ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు

Published Fri, Sep 9 2022 1:37 PM | Last Updated on Fri, Sep 9 2022 1:52 PM

Congress Seniors Played Key Role in Munugode Ticket Announcment  - Sakshi

సాక్షి, నల్లగొండ: అనేక తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు అభ్యర్థిని ప్రకటించింది. యావత్‌ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, పాల్వాయి స్రవంతికి టికెట్‌ దక్కడంలో నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కీలకంగా వ‍్యవహరించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చలమల్ల కృష్ణారెడ్డి వైపు నిలిచినా జిల్లా సీనియర్‌ నాయకులు అధిష్టానం వద్ద తమ పంతం నెగ్గించుకున్నారు. అయితే అభ్యర్థి రేసులో ఉన్న పున్న కైలాష్‌ని డీసీసీగా నియమించే అవకాశం ఉంది.

చదవండి: (మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement