![Clash Between Congress And BJP Activists In Nalgonda - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/23/CAR.jpg.webp?itok=FWyl5sM3)
సాక్షి, నాంపల్లి (నల్లగొండ జిల్లా): తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
చదవండి: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్
ధర్నాలో పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం కోసం నాంపల్లికి వస్తున్న సమయంలో బీజేపీ దుండగులు తన కాన్వాయికి దారి ఇవ్వకుండా వాహనం నడిపారన్నారు. దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల్లో ఏ పారీ్టకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. నమ్మిన కాంగ్రెస్ పార్టీని ముంచి, బీజేపీలో చేరి తప్పుడు ప్రచారాలు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment