
చండూరు: మునుగోడు ఉపఎన్నికలో ఆ రెండు పార్టీల ద్వారా వచ్చింది తీసుకోండి కానీ, ఆడబిడ్డ స్రవంతికి ఓటు వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చండూరు మండలం కొండాపురం, గుండ్రపల్లి, బంగారిగడ్డ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఏనాడు కూడా ఆడబిడ్డకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదు. ఈసారి సోనియాగాంధీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతికి టికెట్ ఇచ్చింది. కడుపులో పెట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మీది’అని అన్నారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మద్యం ఎవరు పోసినా తన్నండని మహిళలకు రేవంత్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, చలమళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment